రచయిత వివరాలు

పూర్తిపేరు: రాణి శివశంకర శర్మ
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రాణి శివశంకరశర్మ 'ది లాస్ట్ బ్రాహ్మిణ్' ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్' ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. 'ది లాస్ట్ బ్రాహ్మిణ్' వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన 'గ్రహాంతరవాసి' నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన 'గ్రహాంతరవాసి' కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన 'అమెరికనిజం' ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ'గా, మలిసంపుటి 'పూజారి 2040'గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు 'హిందుత్వ', 'ధర్మోరక్షతి రక్షితః'ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన 'శకుంతల' అందరి మన్ననలు పొందింది.

 
  1. భారతీయతను ఎలా నిర్వచించాలి?
  2. డిసెంబర్ 2024 » వ్యాసాలు