ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం!

తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాల తెలుగు స్త్రీల పాటల్లో అంతర్భాగమైపోయిన రామాయణ కథల పరిశీలనలో, మరొక స్త్రీల పాట ‘సీత గడియ‘పై వెల్చేరు నారాయణరావు వ్యాసం; ఈ శీర్షికా సంప్రదాయంలో భాగంగా కోలవెన్ను మలయవాసిని 2000 ఆగస్ట్, షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద, సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వీడియో; ఒకే గీతాన్ని ఇద్దరు గాయకులు, చిదంబరం, పద్మావతి వేర్వేరు రాగమాలికలుగా పాడిన కనకప్రసాద్ శబ్ద రచన త్రిపురాంతకేశ్వరా!; టంగుటూరి సూర్యకుమారి పాడిన నిర్వాణ షట్కం అపురూపమైన ఆడియో, ఈ సంచికలో ప్రత్యేకతలు.


ఈ సంచికలో: