Comment navigation


15534

« 1 ... 6 7 8 9 10 ... 1554 »

  1. కాలుష్యాష్టకం గురించి sarma గారి అభిప్రాయం:

    11/02/2024 12:21 am

    కాలుష్యం,కల్తీ నిత్యం.తల్లిపాలు కూడా కల్తి.కాలం కాదు సార్! కాలానికేం అంటదు.

  2. పెద్దన్నయ్య, ప్రపంచం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/01/2024 3:01 pm

    పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు అన్నారు. పొరపాటు. ఆయన ప్రవర్తన స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ ఐన వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో అలాగే ఉంది అక్షరాలా.

    రమేష్ గారు అద్భుతమైన కథ అన్నారు కాని నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అద్భుతమైన నవలకు స్కెచ్. శర్క గారికి తీరికా ఓపికా ఉంటే పెద్దన్నయ్య అనో కర్మయోగి అనో పేరు పెట్టి ఈకథనానికి నవలారూపం ఇవ్వవచ్చును.

    శర్మగారు దీనిని నవలారూపంలో వెలువరించితే చదువరులకు చాలామందికి భుజాలు తడుముకోవలసిన సంగతులు అనేకం తప్పక కనిపిస్తాయి.

    ఇలా ఒక స్కెచ్ రూపంలోనే ఆలోచనలను రేకెత్తించే దీనికి నవలారూపం మరెంతగా ఆలోచనీయం అవుతుందో వేరే చెప్పనవసరం లేదు.

    శర్మ గారికి అభినందనలు.

  3. ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1 గురించి Hanu గారి అభిప్రాయం:

    11/01/2024 2:25 pm

    మీ అనుభవాన్ని చాలా బాగా వివరించారు. తర్వాత భాగాలకోసం ఎదురుచూస్తు ఉంటాము.

  4. పూలతావుల కథాపరిమళాలు గురించి BHrao గారి అభిప్రాయం:

    11/01/2024 1:36 pm

    గొప్పగా పరిచయం చేశారు. సుభద్రా దేవిగారి కృషిని సరిగ్గా వ్యక్తీకరించారు. ధన్యవాదాలు.

  5. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి మథు చిత్తర్వు గారి అభిప్రాయం:

    11/01/2024 10:34 am

    వ్యాసం చాలా బావుంది. న్యూరల్ నెట్వర్క్‌లు, ప్రోటీన్ ఫోల్డింగ్‌లు గురించి పరిశోధన చేసిన వారికి నోబెల్ బహుమతులు రావడం సంతోషంగా వుంది. వీటికి భవిష్యత్తులో మందుల తయారీలో, టీకాల తయారీలో చాలా వేగంగా తయారు చేయగలగడం సాధ్యం అవుతుంది. వివరణకి తెలుగు పదాలు వాడటం కొంచెం క్లిష్టంగా వుంది. అయినా ఈ విషయాలమీద గత కొద్ది సంవత్సరాలుగా చదువుతూ వున్నందున నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. రచయిత చాలా అనుభవం వున్న కంప్యూటర్ శాస్త్రవేత్త, సైన్స్ రచయిత కూడా కాబట్టి ఈ వ్యాసానికి మరింత సాధికారత వచ్చింది. యంత్రాలకి చేతన రావడం అంటే స్వంత వ్యక్తిత్వం రావడం సాధ్యమా కాదా అని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 2041కి యంత్రాలు మానవ సమాజాన్ని నియంత్రణ చేసే సమయం వస్తుంది అని కొందరు అంటున్నారు. ఇదే సింగ్యులారిటీ. లార్జ్ లాంగ్వేజ్ మోడల్, సింగ్యులారిటీ, కాన్షస్‌నెస్ వీటన్నిటికీ తెలుగు పదాలు వాడటం కష్టం కానీ ఒక ప్రామాణికమైన అందరూ ఒప్పుకునే పదజాలం అవసరం అని నా అభిప్రాయం. ఈవిషయంపై కథలు రాయడం కోసం చదవడం వల్ల, నేను వైద్యవృత్తిలో వుండటం వల్ల ఈ పరిణామాల అద్భుతమైన ప్రయోజనాలు అర్థం చేసుకోగలిగాను‌. అన్ని రంగాల్లో ఈ ప్రగతి కలిసిపోయి బహుశా కొత్త యంత్రమానవుడిని తయారుచేసే మహా వ్యవస్థ అవతరించవచ్చునేమో అని నాకు అనిపిస్తోంది. అయితే నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తను కాదు. ఊహాగానం చేసే సైన్స్ ఫిక్షన్ రచయితని, దీని శక్తిని అర్థం చేసుకున్న వైద్య వృత్తిలో వున్నవాడిని మాత్రమే. మంచి వ్యాసానికి శ్రీ వేమూరి వేంకటేశ్వరరావుగారికి ధన్యవాదాలు.

  6. అడుగడుగూ తిరుగుబాటైన గీత గురించి Satyavati గారి అభిప్రాయం:

    11/01/2024 10:12 am

    అడుగడుగున తిరుగుబాటు పుస్తకం భూమికలో సీరియల్ గా వస్తోంది.

  7. పెద్దన్నయ్య, ప్రపంచం గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/01/2024 8:44 am

    చాలా చిన్న వస్తువుతో అద్భుతమైన కథ చెప్పారు, ధన్యవాదాలు, శుభమస్తు.

  8. వాసన గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    10/31/2024 12:12 pm

    తాడిగడప శ్యామల రావు గారికి
    ధన్యవాదాలు.
    “ఇలా శాస్త్రవిషయకమైన రచనలు విరివిగా తెలుగులో వస్తే ఎంతో బాగుంటుంది.”
    ఇటువంటి వ్యాసాలు ఈమాటలో చాలా వ్రాసేను . పాత సంచికలు చూడండి .

  9. వాసన గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    10/31/2024 10:37 am

    “నా చిన్నతనంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ అనే సెంటు రాసి అమ్మేవారు” అన్నారు.

    నాకు ఆంధ్రపత్రిక ప్రత్యేకసంచికల గురించి తెలియదు కాని ఆంధ్రప్రభ ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ పరిమళం అద్దేవారని చక్కగా గుర్తుంది. ఐతే ఆంధ్రప్రభ ప్రత్యేక సంచిక ఆగష్టు పదిహేనుకు వచ్చేది జన్మదిన ప్రత్యేకసంచిక అన్న పేరుతో అని చాలాబాగా గుర్తు. ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచిక అంటూ ఒకటి వెలువరించేదా అని నాసందేహం. ఆంధ్రప్రభ వారు నవలల పోటీని ఉగాది సందర్భంగా ప్రకటించేవారనీ గుర్తు.

    మీవ్యాసంలో మీరు శాస్త్రసాంకేతిక పదాలకు చేసిన తెలుగుసేత ఆకట్టుకుంది. మీ నిఘంటువును తప్పక పరిశీలించవలసిందే.

    తెలుగులో శాస్త్రీయమైన అంశాలమీద వచ్చే రచనలు ఎప్పుడూ చాలా స్వల్పసంఖ్యలోనే ఉంటూ వస్తున్నాయి. నాచిన్నప్పుడు వేమరాజు భానుమూర్తి గారు వెలుగు ధ్వని అంటూ వ్రాసిన పుస్తకాలను చదివి చాలా చాలా ఆనందించే వాడిని. సృష్టికథ అనే పుస్తకం నాకు అప్పట్లో బహుమతిగా వచ్చింది. అదొకటీ మెదడు గురించి వ్రాసిన పుస్తకం ఒకటీ పడీపడీ చదివేవాడిని.

    ఇలా శాస్త్రవిషయకమైన రచనలు విరివిగా తెలుగులో వస్తే ఎంతో బాగుంటుంది.

  10. అజ్ఞాతవాసి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    10/29/2024 1:00 pm

    A multi-point focus painting. No one is made big of; everyone gets their fair share of the canvas.
    The gentleman who opens the story is an aspiring poet. He is a nice guy. He is fond of his wife. And I like that.
    As I read the story, it does not come across as though he would have ever said before marriage, something like this to her,

    “ఆప్ జైసా కోయీ మేరీ జిందగీ మె ఆయే
    తో బాత్ బన్ జాయే, ఆహా! బాత్ బన్ జాయే!
    గుల్ కో బహార్, బహార్ కొ చమన్
    దిల్ కొ దిల్, బదన్ కొ బదన్
    హర్ కిసీ కొ చాహియే తన్ మన్ కా మిలన్
    కాష్ ముజ్ పే ఐసా, దిల్ ఆప్ కో భీ ఆయే
    తో బాత్ బన్ జాయే! ఆహా..”

    That is what I call poetry. It does not matter if it is sung in a nightclub, to disco music by Jeenat Aman, or if you read it embedded in a short story. The Hindi words are red hot coals. They just burn holes in the romantic souls. Man! The Hindi and Urdu poets are so good!

    The aspiring Telugu poet’s shown poetry is tepid, సంసార సాధక బాధక సర్దుకు పోయే kind of కవిత్వం and has no fireworks at all. Look at the couple’s parting scene in the train station in this story. One on either side of a train window. Such a middle class married Telugu goodbyes.
    Even afterwards, in private also, the budding poet has to run and grab his notebook to read his own poetry to his wife. He cannot recite it from his memory. If the poet cannot, who can afterwards!
    And the wife’s reaction – she acts as a sort of poetry critic, one who humors her husband like a child. Not as the recipient of his love poetry. Too bad.
    Ojala! How I wish she herself is a love poet like Elizabeth Browning. Elizabeth wrote better poetry than Robert Browning. How I wish, in their separation, the lady of the house could think romantic and invite her husband as in the old-style Telugu song below.

    వెన్నెల సౌధము నాది
    విడిది చేయ రారా మురారీ!
    మారుతముతో నా మరుల లేఖ నంపేను
    తేలివచ్చేవని చంద్రవంక తేరు నంపేను
    మేడంత మేఘాలె, గాఢంపు ధూపాలె
    చక్రవాకాల గానాలె, చక్రి రావటరా!
    వన్నె వాకిళ్లు తెరిచేను, తెలతెల్లని పూలు పరిచేను
    నడచిరారా! నాథ!
    చేతులకు చేతులల్లి, హృదయానికి హృదయమొత్తి
    అధరానికి అధరమిత్తు;
    సౌందర్యపు సౌరభాల సనాతనపు ప్రణయాలకు
    నూత్న నూత్న అర్ధమిత్తు
    వెన్నెల సౌధము నాది విడిది చేయ రారా, ప్రియా!

    The celebrity poet in the story is a dullard, who withdrew into a shell like a snail, he is half dead, and it is a fine decision they all made (even if for assumed wrong reasons.) He should be left to his own vanity, grandiosity and persecution mania. Nothing good will come out of meeting with that chap. We never heard one bit of his hotshot poetry in the story, anyway.

    So on and so forth.
    Happy Diwali and all other jazzy sizzling festivals! Dearies!
    -Lyla

« 1 ... 6 7 8 9 10 ... 1554 »