నవంబర్ 2024 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
11/05/2024 6:28 am
మీరు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది – పుస్తక సమీక్షలు, విమర్శలు ప్రచురించడం – మీ ధ్యేయాలు, ఆశయాలు ఇప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసివచ్చాయి – ఇక కావలిసినదల్లా కార్యాచరణ; అమెరికాలో తెలుగును ఉద్ధరించడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ అర్థం కాని చిన్న విషయం – భాషను, సాహిత్యాన్ని సజీవంగా ఉంచుకోవాలి అంటే సమీక్షలను, విమర్శలను విరివిగా వచ్చేలా ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థను ఏర్పరచుకోవడం. కవిత్వంలో ఒక కవి స్థానాన్ని నిర్ణయించే, సాహిత్యంలో కథ స్థాయిని నిరూపించే, అనువాదాల గుణదోషాలను విచారించే -విమర్శ ద్వారానే అది సాధ్యం. గతంలో ఈ మార్గంలో నేను కొంత ప్రయత్నం చేసి ఉన్నాను – ఆ అనుభవంతో చెప్పగలను – తొలినాళ్ళలో అందరూ మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేరు – సదరు కవి కీర్తికి కళంకం తెస్తున్నారనో, సదరు అనువాదకుడి కంచుఢక్కను పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారనో వారి అనుచరశ్వానగణం దాడి చేయవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇతరులకు భుజకీర్తులుగా, భజంత్రీలుగా మారే ‘సృజనకారుల’ సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకరం. ఎవరూ విమర్శలకు అతీతులు కారు. పుఠం పెట్టవలసిందే. వయసు, పదవి, ప్రచురించిన పుస్తకాల సంఖ్యా, తెచ్చుకొన్న లెక్కలేని అవార్డులు -ఇవేవి నహి నహి రక్షతి డుకృఞ్కరణే. మీరు కార్యాచరణ మొదలు పెట్టడం మంచిది. ఒంటి చేత్తో ఒకరు చేయగల పని కూడా పెద్ద పెద్ద పత్రికలు చేయలేక పోవడం క్షమార్హం కాదు. అట్టే సమయం లేదు – ఇరవై ఏళ్ళుగా చూస్తున్నా – ఈమాట ఈ విషయంలో ముందడుగు వేయలేదు అని చెప్పడానికి విచారిస్తున్నాను.
[పుస్తకాలు, కథలు చదివినవారు వాటిగురించి వ్రాయాలి. అలా సమీక్షలు, విమర్శలు, చర్చలతో నిండిన సాహిత్యవాతావరణం కావాలి. తెలుసు. ఈ చింత మాకూ ఉంది. ఈలోటు ఎలా పూడ్చాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. తరచుగా రచయితలను, విమర్శకులను సంప్రదిస్తూనే ఉన్నాం. సమీక్షలు, విమర్శావ్యాసాలు వ్రాయమని అభ్యర్ధిస్తూనే ఉన్నాం. ఇది అందరు రచయితలు, పాఠకులు కలిసి చేయవలసిన పని. విరివిగా చదివి సమీక్షలు ప్రతినెలా వ్రాయగల వారికోసం వెతుకుతూనే ఉన్నాం. – సం.]
నో ఎగ్జిట్ .1 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
11/05/2024 5:59 am
కథలోంచి బయటపడలేరు – గమ్మత్తయిన కథ. Alice’s Adventures in Wonderland అందరూ చదివే ఉంటారు కదా. కుందేలు కంతలో దూరిన అమ్మాయి వింత లోకంలోకి అడుగుపెడుతుంది. వింత పాత్రలతో నిండిన లోకం. ఎన్నిసార్లు చదివినా – బయట పడలేము, దానికి కారణం అందులోని వాతావరణ కల్పన. కథ ఒక వాతావరణం ద్వారా వ్యక్తమవుతోంది – కవిత్వానికి రూపం లాంటిది కథకు వాతావరణం. అంతరంగం, ఆకాశం కలిస్తే గాని మంచి కథ పుట్టదు. కథకుడు కన్నెగంటి చంద్రకు అభినందనలు.
భాషపట్ల అవ్యాజమైన అనురాగం ఉన్నవారు తప్ప ఇటువంటి కవిత, దానికి తగిన ఆముఖము వ్రాయలేరు.
“కన్నుల మాటలాడుచున్,’
‘రసన పత్రాంజనమ్ము లేని ముద్రణశాల,’
‘చరమంపు చప్పరింపు,’
‘తనదు జాతి జాలువార్చినట్టి సంస్కృతి తుది వారికణము;
ఆతడొక భావనాలతికాంత్యసుమము.’
ఇవి గుండెలోతులలోనుండి వచ్చినవని స్పష్టంగా తెలుస్తోంది.
ఒక సామాన్య పాఠకురాలిగా కథ చదివినప్పుడు నాకు ఏమనిపించిందో అదే రాసాను. కథనే ప్రామాణికంగా తీసుకోవాలని అనిపించింది. అందుకే రచయిత తర్వాత వెలిబుచ్చిన అభిప్రాయాల జోలికి పోలేదు. అంతేకాకుండా ఆస్పత్రిలో కుముదం పరిస్థితి కథకుడికి చాలా బాధ కలిగించింది. శరీరం వణికి పోతుండగా, ఏదో చెప్పాలన్న తపనతో ఆమె మీద చెయ్యి వెయ్యబోయాడు. అది వాంఛతో కూడిన స్పర్శ కాదు. ఆమె కోసం ఎంతో ఫీలవుతూ చేసిన చర్య. చెయ్యి వెనుక్కు తోసుకోవడానికి కుముదానికి ఉండే కారణాలు కుముదానికి ఉండొచ్చు! తర్వాత కుముదం మాట విని కథకుడు పరి పరి విధాలుగా ఆలోచించాడనుకోండి! అది వేరే విషయం.
ఏడవ పద్యం అద్భుతం. నా మనస్సనే చీకటి కొట్టులో బంధించాను అని చెప్పడం. ఎనిమిదోది కూడా (ఎలా పారిపోతావో చూస్తాను అనడం). ఆయన ఆ కొట్టులోకి వస్తే ఇంకేముంది, నారాయణీయంలో భట్టాత్తిరి గారు చెప్పినట్టూ ‘కాంతం కాంతి నిధానతోపి, మధురం మాధుర్యధుర్యాదపి’
శ్యామలగారు, అసంపూర్తిగా ఉన్న పూతన ఖండ కావ్యం ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా. ఇదే సరైన సమయం.
అందరికీ ధన్యవాదాలండి చదివి అభిప్రాయం చెప్పినందుకు.
ఈ కధ పెద్ద నవలకి స్కెచ్ అన్నారు. నిజమే, కానీ రాయడం అంత సులభం కాదు. నెలల సమయం పడుతుంది.
>> పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు అన్నారు. పొరపాటు.
కధలో ఎక్కడా పెద్దన్నయ్య కర్మయోగిలా ఉన్నాడని నేను చెప్పలేదు అనుకుంటున్నా. అయితే కొంతమంది నోరు మెదపకుండా పనిచేసుకుపోతారు. మనసులో ఏవుందో ఎవరికీ తెలియదు. అటువంటివాడిని కర్మ యోగి అనగలమా? ఈ కధలో పెద్దన్నయ్య అనే ఆయన తనకి ఉన్న దారిలో సర్దుకుంటూ వెళ్ళాడు. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడి కధ. ఎక్కువగా కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది బుర్ర పాడుచేసుకుని అరుస్తారు కొంతమంది సరే ఇలా అయింది ఏం చేస్తాం అనుకుంటూ జీవించే వారు. వాళ్ళని కర్మయోగులనడం సరైనది కాకపోవచ్చు. స్థితప్రజ్ఞత అనేది మరో పెద్ద మాట. మనసులో ఏవుందో పైకి చెప్పలేదంటే స్థితప్రజ్ఞుడైనట్టేనా? కాదేమో. సర్దుకుపోయి బతికిన మనిషి, అయితే తన మీద ఆధారపడిన స్వంత కుటుంబీకులంటే అభిమానం. కారణాలు ఏవైనా మనసులో ఏవుందో పైకి చెప్ప(లే)ని మనిషి. బాపిరాజుగారి నారాయణరావు నవల్లో ఎవరైనా నారాయణరావు ని తిట్టినా కించపర్చినా ‘ఆయన ఇలా అన్నాడు నేను అలాంటివాడినా, కాదు కదా?’ అని బేరీజు వేసుకుని నోరుమెదపకుండా సమాధానపడడం మనకి కనిపిస్తుంది. అయితే నారాయణరావు స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ అయిపోడు కదా?
>> ఓ డెబ్భై ఎనభై ఏళ్ల క్రితం ఇలాంటి త్యాగబ్రహ్మలు ఉండేవారు
ఇది నిజం కాదు అనుకుంటున్నా. ముగ్గుర్ని ఇండియాలో ఒకర్ని అమెరికాలో (ఇండియన్, ఏషియన్, ఆఫ్రికన్ లు కాదు) చూసాను, అదీ ఈ మధ్యనే. కానీ మరీ ఇంత పెళ్ళి కాకుండా కాదు. వాళ్లలో కొంతమందికి పెళ్లైంది సరైన సమయానికి, కొంచెం ఆలశ్యంగా; అయినా మిగతావార్ని ఆదుకున్నారు, ఏమీ అనుకోకుండా. ఇందులో పెద్దన్నయ్య చేసినది త్యాగం అనేది ఎలా ధ్వనించిందో నాకు అర్ధం కాలేదు. పెద్దన్నయ్య ని ఎవరూ అడగలేదు పెళ్ళి చేసుకో అని. ఇంటికి పెద్ద అయినవాడు మరో ఎనిమిది మంది తనమీద ఆధారపడినప్పుడు పెళ్ళి గురించి ఆలోచించే వ్యవధి, తీరికా ఉంటుందా? ఉన్నా ‘నేను కూడా పెళ్ళిచేసుకుంటాను పిల్లని వెతకండి’ అని ఎవరితో అంటాడు? పోనీ ఎవరో వచ్చి పెళ్ళి చేసుకుంటారా అంటే, పెద్దన్నయ్య లాంటి ప్రాక్టికల్ మనిషి ఎవరూ కూడా, తన ఎదురుగా ఉన్న ఛాలెంజెస్ ని పక్కకి పెట్టి, సరే చేసుకుంటాను అనలేడు అని నేను ఆలోచించాను. అది త్యాగమా? ఒకే ఒక త్యాగం ఏమిటంటే (త్యాగం అనొచ్చు అనుకుంటే, ఎందుకంటే పెద్దన్నయ్య కి పెళ్ళికూతురు నచ్చిందా లేదా అనేది అతను నోరు విప్పి చెప్పేలోపులే జరగాల్సిన దారుణం జరిగిపోయింది) తమ్ముడికి ముందు పెళ్ళి చేయమనడం. నిజానికి ఆవిడ నచ్చలేదేమో? తర్వాత అతని పెళ్ళి గురించి ఆలోచించడానికి ఎవరికి తీరింది? అదే చెప్పాను కూడా కధలో – మాలో ఎవరికీ పెద్దన్నయ్య గురించి ఆలోచించే తీరికా కోరికా ఓపికా లేవు అని. ఒకసారి ఆలోచించండి. పెద్ద కుటుంబానికి ఇటువంటి కష్టం వస్తే ఈ కధలో ఉన్న ఏ కేరక్టర్ కి పెద్దన్నయ్య దగ్గిరకి వెళ్ళి ‘నువ్వు కూడా పెళ్ళిచేసుకో’ అనే స్వతంత్రం ఉంటుంది? వదినకా? ఆవిడ నాన్నగారికా? వాళ్లకి కూడా ఏదో అనాలని ఉన్నా మూడు చావులు జరిగాక అనే సమయం వచ్చేసరికి పెద్దన్నయ్య కి నలభై దాటవూ? అప్పుడు ఆయన నిజంగా పెళ్ళిచేసుకోవాలనుకుంటాడా? మరింత పరిణితితో మెలగడూ?
సమాజం మారినా చేతిలోకి లాప్ టాప్, ఫోన్ వచ్చినా తన కుటుంబీకులంటే అభిమానం, తనకి ఉన్న భాధ్యత తెల్సినవాడు ఈ రోజుకీ ఇలా సహాయం చేస్తాడని అనుకుని రాసాను. తాను ఏ సహాయం చేయకపోతే మిగతా కుటుంబం అంతా రోడ్డుమీద పడితే చూస్తూ ఊరుకునే పెద్దలు కొంతమంది ఉంటారేమో, అలా చూస్తూ ఊరుకోకుండా సహాయం చేసినవాడి కధ ఇది. ఎప్పుడో దశాబ్దాల కిందటి కధ కాదని చెప్పడానికి ఒకరు అమెరికా రావడం, బెంగళూరు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేవి చేర్చాను. 🙂 కధలో పెద్దన్నయ్య కేరక్టర్ ముఖ్యం. కధంతా దాని చుట్టూరానే. అందువల్ల మిగతా చిన్నచిన్న విషయాలు పట్టించుకోలేదు. ఔను కొన్ని వయసు తప్పులు కనపడి ఉండొచ్చు కానీ అవి అంత ముఖ్యం కాదనుకున్నాను.

పూలతావుల కథాపరిమళాలు గురించి శీలా సుభద్రాదేవి గారి అభిప్రాయం:
11/04/2024 9:20 am
నా వ్యాససంపుటిని చాలా శ్రద్ధగా చదవటమే కాకుండా సమగ్రమైన పరిచయాన్ని అందించిన ఎమ్వీ రామిరెడ్డిగారికీ ప్రచురించిన ఈ మాట నిర్వాహకులకు ధన్యవాదాలు.
అంతిమ లతాంతము గురించి NS Murty గారి అభిప్రాయం:
11/03/2024 11:38 pm
శ్రీరామనాథ్ గారూ,
భాషపట్ల అవ్యాజమైన అనురాగం ఉన్నవారు తప్ప ఇటువంటి కవిత, దానికి తగిన ఆముఖము వ్రాయలేరు.
“కన్నుల మాటలాడుచున్,’
‘రసన పత్రాంజనమ్ము లేని ముద్రణశాల,’
‘చరమంపు చప్పరింపు,’
‘తనదు జాతి జాలువార్చినట్టి సంస్కృతి తుది వారికణము;
ఆతడొక భావనాలతికాంత్యసుమము.’
ఇవి గుండెలోతులలోనుండి వచ్చినవని స్పష్టంగా తెలుస్తోంది.
ఏ భాష అయినా మనిషి నాలుక మీదనే చిరంజీవి.
హృదయపూర్వక అభినందనలు.
నన్ను గురించి కథ వ్రాయవూ? – నాకు అర్థమయినట్లుగా… గురించి శాంతిశ్రీ బెనర్జీ గారి అభిప్రాయం:
11/03/2024 11:33 pm
ఒక సామాన్య పాఠకురాలిగా కథ చదివినప్పుడు నాకు ఏమనిపించిందో అదే రాసాను. కథనే ప్రామాణికంగా తీసుకోవాలని అనిపించింది. అందుకే రచయిత తర్వాత వెలిబుచ్చిన అభిప్రాయాల జోలికి పోలేదు. అంతేకాకుండా ఆస్పత్రిలో కుముదం పరిస్థితి కథకుడికి చాలా బాధ కలిగించింది. శరీరం వణికి పోతుండగా, ఏదో చెప్పాలన్న తపనతో ఆమె మీద చెయ్యి వెయ్యబోయాడు. అది వాంఛతో కూడిన స్పర్శ కాదు. ఆమె కోసం ఎంతో ఫీలవుతూ చేసిన చర్య. చెయ్యి వెనుక్కు తోసుకోవడానికి కుముదానికి ఉండే కారణాలు కుముదానికి ఉండొచ్చు! తర్వాత కుముదం మాట విని కథకుడు పరి పరి విధాలుగా ఆలోచించాడనుకోండి! అది వేరే విషయం.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
11/03/2024 9:59 am
ఏడవ పద్యం అద్భుతం. నా మనస్సనే చీకటి కొట్టులో బంధించాను అని చెప్పడం. ఎనిమిదోది కూడా (ఎలా పారిపోతావో చూస్తాను అనడం). ఆయన ఆ కొట్టులోకి వస్తే ఇంకేముంది, నారాయణీయంలో భట్టాత్తిరి గారు చెప్పినట్టూ ‘కాంతం కాంతి నిధానతోపి, మధురం మాధుర్యధుర్యాదపి’
శ్యామలగారు, అసంపూర్తిగా ఉన్న పూతన ఖండ కావ్యం ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా. ఇదే సరైన సమయం.
పెద్దన్నయ్య, ప్రపంచం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
11/03/2024 9:54 am
అందరికీ ధన్యవాదాలండి చదివి అభిప్రాయం చెప్పినందుకు.
ఈ కధ పెద్ద నవలకి స్కెచ్ అన్నారు. నిజమే, కానీ రాయడం అంత సులభం కాదు. నెలల సమయం పడుతుంది.
>> పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు అన్నారు. పొరపాటు.
కధలో ఎక్కడా పెద్దన్నయ్య కర్మయోగిలా ఉన్నాడని నేను చెప్పలేదు అనుకుంటున్నా. అయితే కొంతమంది నోరు మెదపకుండా పనిచేసుకుపోతారు. మనసులో ఏవుందో ఎవరికీ తెలియదు. అటువంటివాడిని కర్మ యోగి అనగలమా? ఈ కధలో పెద్దన్నయ్య అనే ఆయన తనకి ఉన్న దారిలో సర్దుకుంటూ వెళ్ళాడు. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడి కధ. ఎక్కువగా కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది బుర్ర పాడుచేసుకుని అరుస్తారు కొంతమంది సరే ఇలా అయింది ఏం చేస్తాం అనుకుంటూ జీవించే వారు. వాళ్ళని కర్మయోగులనడం సరైనది కాకపోవచ్చు. స్థితప్రజ్ఞత అనేది మరో పెద్ద మాట. మనసులో ఏవుందో పైకి చెప్పలేదంటే స్థితప్రజ్ఞుడైనట్టేనా? కాదేమో. సర్దుకుపోయి బతికిన మనిషి, అయితే తన మీద ఆధారపడిన స్వంత కుటుంబీకులంటే అభిమానం. కారణాలు ఏవైనా మనసులో ఏవుందో పైకి చెప్ప(లే)ని మనిషి. బాపిరాజుగారి నారాయణరావు నవల్లో ఎవరైనా నారాయణరావు ని తిట్టినా కించపర్చినా ‘ఆయన ఇలా అన్నాడు నేను అలాంటివాడినా, కాదు కదా?’ అని బేరీజు వేసుకుని నోరుమెదపకుండా సమాధానపడడం మనకి కనిపిస్తుంది. అయితే నారాయణరావు స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ అయిపోడు కదా?
>> ఓ డెబ్భై ఎనభై ఏళ్ల క్రితం ఇలాంటి త్యాగబ్రహ్మలు ఉండేవారు
ఇది నిజం కాదు అనుకుంటున్నా. ముగ్గుర్ని ఇండియాలో ఒకర్ని అమెరికాలో (ఇండియన్, ఏషియన్, ఆఫ్రికన్ లు కాదు) చూసాను, అదీ ఈ మధ్యనే. కానీ మరీ ఇంత పెళ్ళి కాకుండా కాదు. వాళ్లలో కొంతమందికి పెళ్లైంది సరైన సమయానికి, కొంచెం ఆలశ్యంగా; అయినా మిగతావార్ని ఆదుకున్నారు, ఏమీ అనుకోకుండా. ఇందులో పెద్దన్నయ్య చేసినది త్యాగం అనేది ఎలా ధ్వనించిందో నాకు అర్ధం కాలేదు. పెద్దన్నయ్య ని ఎవరూ అడగలేదు పెళ్ళి చేసుకో అని. ఇంటికి పెద్ద అయినవాడు మరో ఎనిమిది మంది తనమీద ఆధారపడినప్పుడు పెళ్ళి గురించి ఆలోచించే వ్యవధి, తీరికా ఉంటుందా? ఉన్నా ‘నేను కూడా పెళ్ళిచేసుకుంటాను పిల్లని వెతకండి’ అని ఎవరితో అంటాడు? పోనీ ఎవరో వచ్చి పెళ్ళి చేసుకుంటారా అంటే, పెద్దన్నయ్య లాంటి ప్రాక్టికల్ మనిషి ఎవరూ కూడా, తన ఎదురుగా ఉన్న ఛాలెంజెస్ ని పక్కకి పెట్టి, సరే చేసుకుంటాను అనలేడు అని నేను ఆలోచించాను. అది త్యాగమా? ఒకే ఒక త్యాగం ఏమిటంటే (త్యాగం అనొచ్చు అనుకుంటే, ఎందుకంటే పెద్దన్నయ్య కి పెళ్ళికూతురు నచ్చిందా లేదా అనేది అతను నోరు విప్పి చెప్పేలోపులే జరగాల్సిన దారుణం జరిగిపోయింది) తమ్ముడికి ముందు పెళ్ళి చేయమనడం. నిజానికి ఆవిడ నచ్చలేదేమో? తర్వాత అతని పెళ్ళి గురించి ఆలోచించడానికి ఎవరికి తీరింది? అదే చెప్పాను కూడా కధలో – మాలో ఎవరికీ పెద్దన్నయ్య గురించి ఆలోచించే తీరికా కోరికా ఓపికా లేవు అని. ఒకసారి ఆలోచించండి. పెద్ద కుటుంబానికి ఇటువంటి కష్టం వస్తే ఈ కధలో ఉన్న ఏ కేరక్టర్ కి పెద్దన్నయ్య దగ్గిరకి వెళ్ళి ‘నువ్వు కూడా పెళ్ళిచేసుకో’ అనే స్వతంత్రం ఉంటుంది? వదినకా? ఆవిడ నాన్నగారికా? వాళ్లకి కూడా ఏదో అనాలని ఉన్నా మూడు చావులు జరిగాక అనే సమయం వచ్చేసరికి పెద్దన్నయ్య కి నలభై దాటవూ? అప్పుడు ఆయన నిజంగా పెళ్ళిచేసుకోవాలనుకుంటాడా? మరింత పరిణితితో మెలగడూ?
సమాజం మారినా చేతిలోకి లాప్ టాప్, ఫోన్ వచ్చినా తన కుటుంబీకులంటే అభిమానం, తనకి ఉన్న భాధ్యత తెల్సినవాడు ఈ రోజుకీ ఇలా సహాయం చేస్తాడని అనుకుని రాసాను. తాను ఏ సహాయం చేయకపోతే మిగతా కుటుంబం అంతా రోడ్డుమీద పడితే చూస్తూ ఊరుకునే పెద్దలు కొంతమంది ఉంటారేమో, అలా చూస్తూ ఊరుకోకుండా సహాయం చేసినవాడి కధ ఇది. ఎప్పుడో దశాబ్దాల కిందటి కధ కాదని చెప్పడానికి ఒకరు అమెరికా రావడం, బెంగళూరు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేవి చేర్చాను. 🙂 కధలో పెద్దన్నయ్య కేరక్టర్ ముఖ్యం. కధంతా దాని చుట్టూరానే. అందువల్ల మిగతా చిన్నచిన్న విషయాలు పట్టించుకోలేదు. ఔను కొన్ని వయసు తప్పులు కనపడి ఉండొచ్చు కానీ అవి అంత ముఖ్యం కాదనుకున్నాను.
మరోసారి ధన్యవాదాలు.
సోల్జర్ చెప్పిన కథలు: నేరము-శిక్ష గురించి annapurna appadwedula గారి అభిప్రాయం:
11/03/2024 6:55 am
ఆర్మీ కథలు చదవదం ఇదే మొదటిసారి. చాలా బాగున్నై రచయితకు అభినందనలు.
మన తరం – మహాకవి గురించి Vasu గారి అభిప్రాయం:
11/02/2024 8:22 pm
ఇంతకు మించీ ఏ సమీక్షుకుడూ ఏమీ ఆశించడు, చినవీరభద్రుడూ, ధన్యోస్మి.
మన తరం – మహాకవి గురించి Vasu గారి అభిప్రాయం:
11/02/2024 8:21 pm
ధన్యవాదాలు, చంద్రశేఖర్గారూ.