కథలో అంశం బాగుంది. అయితే విషయాన్ని ఇంకా బాగా చెప్పొచ్చు అనిపించింది నాకు. అక్కడక్కడ sentence formation కొంచెం ఇబ్బంది పెట్టింది. ఒక చిన్న విషయాన్ని తీసుకుని అల్లిన ఇలాటి కథల్లో చాలా పట్టు ఉండడం అవసరం. రచయిత్రి ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టడం అవసరమేమో! మొత్తానికి మంచి ప్రయత్నమే.
ఏ కార్యక్రమమైనా ముందుకు సాగాలంటే మొదలు పెట్టిన కొన్నాళ్ళకు కాస్త ఉత్సాహ పరిచే వాళ్ళుండాలి. అది లేక పోతే ముందుకు సాగడం కష్టం. మన సంస్కృతి ఉనికి కోసం ఎందరో పాటుపడుతున్నారు. వాళ్ళ లో కొంత మంది కొంత కాలం ఆయ్యాక ఎన్నో కారణాంతాల వల్ల ఆపేసుంటారు. ఆ కారణాలు ప్రొత్సాహం లేక పోవడం వల్ల కావచ్చు. లేక ఆర్థిక కారణాలు అయ్యుండచ్చు. లేక వాళ్ళ దైనందిన కార్యక్రమాలు మారడం వల్ల కావచ్చు. విదేశీ గడ్డ మీద ఇలాంటి ప్రయత్నాలకు చాలా పరిమితులుంటాయి.
ఈ మధ్య మాధ్యమాలు(ఇంటర్నెట్, టి.వి.) లస్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే వేలుంది. అవి అందరి ప్రయత్నాలకు కాస్త సహాయ కారిగా వుంటున్నాయి.
ఒక్కటి మాత్రం నిజం మన వాళ్ళలో మళయాళీయులకు, తమిళులకు ఉన్న బాషాభి మానంలో ఓ పది శాతం ఉండి వుంటే ఇలాంటి చర్చ కూడ వచ్చేది కాదేమో. ఇది నా అనుభవంలో కొచ్చిన వాటిద్వారా చెబుతోంది.
అయ్యా,
మట్టి పిసుక్కోని, ఎద్దు తోక తిప్పుకొనేవాడ్నే కానీ, యెప్పుడో సిన్నప్పుడు, మా ఊరయ్యొరు పున్నెవా అని ఏదో రెండు ముక్కలొంట బట్టినాయ్ కాబట్టి, నేనీ రెండు ముక్కలు రాస్తుండా. నాకు సంస్కృతవెంత తెలుసో, సంస్కృతి, సంస్కారాల గురించికూడా అంతే తెలుసు. అందుకని వాటి గురించి నేను మాట్లాడితే బాగుండదు. కాకపోతే ఇన్నేళ్ళు తెలుగు గడ్డమీద బతికేను కాబట్టి, తెలుగు బతుగ్గురించి కొంచెంతెలుసు. అదిగిదిగో దాన్ని గురించే చెప్తున్నా. దాన్నే మీరు సంస్కృతి, సంస్కారవనో, మట్టీ మశానవనో ఏదో అంటారు. మందలేందంటే అయ్యా, మన తెలుగోళ్ళలో మూడూముక్కాలు మందికి సదవటవే రాదు. నాలుగచ్చరాలు వొచ్చినోల్లు ఒందకి నలగరకన్నా ఎక్కువుండరు. అట్టాటోల్లకి బాపూలు, సినారేలు ఏందెలస్తారయ్యా? వాళ్ళకి నన్నయ, మావూర్లోపుట్టిన తిక్కన గురించే తెలీదు. ఇంకమాకు బంధ కవిత్వాలు, అష్టావధానాల గురించేంతెలస్తదయ్యా. సరే మేవేదో యెగసాయం కేసుకునేవాళ్ళం అనుకుంటే, దురద్రృష్టం కొద్దీ మిగతావాళ్ళు మాకన్నా అన్నేయం. ఈ నాలుగు ముక్కలు నేర్చే అవకాశం, తీరికా కుడాలేఓళ్లకి. ఇంతకీ మందలేందంటే, ఏవీ తెలీకపోయినా, భాస కుడా సరిగా రాకపోయినా, మీరనే ఆ సంస్కృతి మా బతుకుల సారవే. మేవే కదా తెలుగు నేలంతా, తెలుగుతనవంతా మాదే కదా. బాపూది, సినారేది, నన్నయ్యది, తిక్కనది, లేకపోతే మావూరి తెలుగయ్యోరిది, మా వూరి భజనసంగానిదీ మాత్రవే కాదుకద తెలుగుతనం. భజన సంఘవంటే గుర్తుకొచ్చింది, మీ తానాలూ, ఆటాలు అట్టటియే కదా. కాకపోతే మీది కోచం ఐటెక్కు అంతేకదా. మా భజనసంఘం మా తెలుగుతనాన్ని రచ్చించదు. మా తెలుగుతనవే లేకపోతే మీరనేటటువంటి మా సంస్కృతే భజన సంఘాన్ని రచ్చిస్తది, పోసిస్తది. సంస్కృతంటే మాపోలేరమ్మ ఇగ్రహంకాదు, రాతిలో పోతపోసినట్టు, నిన్నా, ఈరోజు, రేపు కూడా శిలకొట్టినట్టు మార్పు లేకుండా అట్టె వుండడానికి. మంచికానీ, చెడుకానీ అది మారేది మారేదే. బాపూలూ, సినారేలు, అష్టావదానాలు, శథావదానాలు, ఎమ. ఎ తెలుగులు, చంధస్సులో డాక్టరేట్లూ, త్యాగరాజు కీర్తనలు, సరసవైన ప్రార్థనలు, భజన సంఘాలు, తానాలు, ఆటాలు ఇయ్యన్నీ సంస్కృతిలో భాగవే, ఈటితోపాటు, జజ్జనక జనారేలు, లబ్జు లబుకు సినిమా పాటలు, రికార్డీంగు డేన్సులూ కూడా ఈరోజు తెలుగు సంస్కృతిలో భాగవే. అందుకని మీరేం దిగులు పడకండి, సినిమా వాళ్ళని పిలిసినందుకు, పిలకాయలు త్యాగరాజ కీర్తనలకి డాన్సులేయనందుకు. మరీ భాదపడిపోకండి, తనాలు ఆటాలు లేకపోయినా అమెరికాలో తెలుగు సంస్కృతికేం డోకా రాదు. బాపూలూ, సినారేలూ లేకపోయినా, తెలియకపోయినా తెలుగు సంస్కృతికేం పరవాలేదు, తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవికదశకి చేరుతాయని మీరు మనేద పడబల్లే. సంస్కృతికి ఏ వొక్కరి రక్షా అక్కరలేదు, తెలుగు మాట్లాడే మనుశులుంటే చాలు. మీ లాగా, నా లాగా, ఇంకా రకరకాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళుంటే సాలు.
నేను నా వైపు ప్రయత్నంగా పిల్లల కోసం తెలుగు (నా బ్లాగు లింకు) మొదలు పెట్టాను. మెచ్చుకోళ్ళు బాగానే వస్తున్నాయి. అవి నాకు ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. నిజంగా ఎంతమంది ఎంత తరచుగా అందులోని అంశాలు గాని దాని వల్ల స్ఫూర్తినందుకొని ఇతరం ఏవైనా గాని తమ పిల్లలకు తరచుగా పరిచయం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంటుంది. కాని నేను సందేహంతో ఆగదల్చుకోలేదు. ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూనే ఉంటాను. నా పిల్లలకైతే ఉపయోగపడుతోంది. ఇంకొంచెం విస్త్రుతంగా పరిచయమైతే చేసుకుంటూనే ఉంటాను. ఒకే లాంటి అభిరుచులూ, ఆశయాలూ ఉన్న వాళ్ళు కొందరు తప్పని సరిగా ఉంటారు. వారు కొందరూ కలిసినా చాలు. ఇది నా వైపునుంచి నా ప్రయత్నం.
ఇక, రచ్చబండ లో చాలా మంది చాలా advanced భాషా విషయాలు చర్చిస్తారు, మంచి అనువాదాలు, కవితలూ రాస్తూ ఉంటారు. ఎవరైనా పూనుకుని వాటిని compile చేసి ఒక బ్లాగులో కాని వెబ్సైటు లో కాని పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకెప్పుడూ.
ఈ రోజున internet లో తెలుగులో రాయ గలుగుతున్నాము, చాలా మంచి బ్లాగుల్లో మంచి తెలుగు ఉపయోగింప బడుతోంది. తెలుగు భాషకు సంబంధించిన విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ రాస్తున్న వారిలో చాలా మంది యువకులు కూడ ఉన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన విషయాలు అనిపిస్తుంది నాకు. ఏమి లేకున్నా, పిల్లలకు తెలుగుని పరిచయం చెయ్యాలన్నా, వాళ్ళకు కుతూహలం కలిగించాలన్నా, వాళ్ళని తెలుగుతో “touch” లో ఉంచాలన్నా, ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉన్న మంచిని పెంచుకుంటూ ముందుకి సాగుతూ ఉందాము.
చిన భూషయ్య రాజుఅయ్యాక ఆ ఊళ్ళో కుక్కలకీ నక్కలకీ కే కాదు, ప్రతీ జీవికి మహారాజులా పాలించాలనిపించింది. నాలుగు ముక్కలు రాని భూషయ్యే పాలించగాలేనిది, నాలుగు ముక్కలు ముక్కున పట్టిన మేం పనికి రావా? అన్న ప్రశ్న అందరిలోనూ బయల్దేరింది. పరిపాలించడానికి కావల్సింది బుర్ర కాదని మన చిన భూషయ్య ని చూసేక ఆవగింజంత బుర్రున్న ఏ మడిసికైనా అనిపించడం సహజమే ! అందరూ ఈ విషయం పైనే చెవులు కొరుక్కున్నారు. ఆ అందరిలో మన బుల్లి కిష్టయ్య భార్య వల్లరి కూడా ఉంది. బుల్లి కిష్టయ్య ఇంతకుముందు రెండు తడవల రాజుగా ఎన్నుకోబడ్డాడు. బాగానే పాలించాడులే అన్న పేరు తెచ్చుకున్నా, కాస్త ఆడ వ్యసనం తో తెచ్చుకున్న మంచిపేరు కాస్తా చెడగోట్టు కున్నాడు. అప్పుడు వల్లరి బుల్లి కిష్ట య్యకి రాణిలా ఉన్నా, కిష్టయ్య వేషాలు చూసేక మాట్లాడడం మానేసింది. బుల్లి కిష్టయ్య మీద పీకలవరకూ కోపంతో ఊగిపోయింది. ఇంట్లో ఒకసారి పీక నొక్కే ప్రయత్నం కూడా చేయబోయి తమాయించుకొంది. బుల్లి కిష్ట్యయ్య వల్లరి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేడు. ఏదైనా వరం కోరుకోమని తను తీరుస్తానని ప్రమాణం చేసాడు. రామాయణం బాగా చదివి వంట బట్టించుకున్న వల్లరి, సరే ఇప్పుడొద్దు కానీ, కావల్సివచ్చిన ప్పుడు నేనే అడుగుతాను అని క్షమించినట్లుగా నటించింది. అంతే ప్రజల దృష్టిలో బుల్లి కిష్టయ్య కాస్తా లోల్లి కిష్ట్యయ్య గా మారిపోయాడు. మన వల్లరి ప్రజల మనసు దోచుకొంది. సీత, సావిత్రి పక్కన వల్లరిని చేర్చేసారు ప్రజలు. ఇదగో ఈ మధ్య చిన భూషయ్య ని చూసేక వల్లరి కీ రాజులా పాలించాలన్న కోరిక బయల్దేరింది. రాణీ హోదా కన్నా రాజు లా పాలించడం గొప్ప కాదా?, అసలే పురుషాధిక్య ప్రపంచంలో త నూ ఒక బ్రిటీషు యువరాణిలా రాజ్యమేలచ్చుకదా అన్న ఆలోచన బయల్దేరిందే తడవుగా మన బుల్లి కిష్ట్యయ్య కి చెప్పింది. బుల్లి కి ష్టయ్యకి ఆ లోచన కంపరంగా తోచింది. ఇన్నాళ్ళ్ళూ తనని అందరూ మంచిగా పాలించానని పొగిడారు, తన కెన్ని ఆడ పరిచయాలు ఉన్నా!ఇప్పుడు వల్లరి కనక రాజు లా ఎన్నికయితే తన పేరు పోతుంది. అంతే కాదు, తను, పాతూరి బుల్లి వెంకమ్మ మొగుడుగా తయారవుతాడు. ఎలాగైనా వల్లరి ప్రయ్తత్నాన్ని ఆపాలని నిశ్చయించుకున్నాడు. వల్లరి తక్కువ తిందా? ఎప్పుడో ఇచ్చిన వరాల మూట విప్పింది. బుల్లి కిష్ట్యయ్య నోటికి తాళ వేసింది. తానూ మహారాజు ( మహారాణి కాదు ) పోటీలో ఉన్నట్లుగా ప్రకటించింది. పైకి మన బుల్లి కిష్టయ్య మద్దత్తు ప్రకటించినా, వెనకాల చక్రం తిప్పడం మొదలు పెట్టాడు….
( సశేషం … ముగింపు వచ్చే సంచికలో … వేలూరి గారికి క్షమాపణలతో…)
సుమారు పది సంవత్సరాలుగా ఛందస్సులో శాస్త్రీయముగా
పరిశోధన చేస్తున్నాను. దాని ఫలితాలను ఛందస్సు, రచ్చబండల
మూలముగా అందరికీ తెలియజేస్తున్నాను. సుమారు 300
పద్యాలను గర్భ, బంధ తదితర చిత్రకవితలను వ్రాసియున్నాను.
కాని ఇందులో జనులకు అంతగా ఆసక్తి లేదండీ. దేనికీ ఫీడ్ బ్యాక్
ఉండదు. కొన్నిటికి పవర్ పాయింట్ ప్రెసెంటషన్లు కూడ ఉన్నాయి.
నా ఉద్దేశములో ఇంటర్నెట్ ద్వార తెలుగు నేర్చే ప్రయత్నాలను
ఎక్కువగా చేయాలి. విశ్వవిద్యాలయాల ద్వారా నేర్చుకోవడం
కొద్దిగా కష్టమేమో? కాని ఈ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్
డిస్కషన్లకు వినియోగిస్తే బాగుంటుందేమో?
ఆలోచనలకు ఆసక్తికరమయిన మాటను శ్రీ వేలూరి గారు
అందజేసినందులకు వారికి హార్దిక వందనములు.
ది బీచ్ గురించి Phanindra అభిప్రాయం:
03/03/2007 5:35 am
కథలో అంశం బాగుంది. అయితే విషయాన్ని ఇంకా బాగా చెప్పొచ్చు అనిపించింది నాకు. అక్కడక్కడ sentence formation కొంచెం ఇబ్బంది పెట్టింది. ఒక చిన్న విషయాన్ని తీసుకుని అల్లిన ఇలాటి కథల్లో చాలా పట్టు ఉండడం అవసరం. రచయిత్రి ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టడం అవసరమేమో! మొత్తానికి మంచి ప్రయత్నమే.
పునశ్చరణం గురించి Tulasimohan అభిప్రాయం:
03/03/2007 2:15 am
నిజమే కదూ…!
good one
ఒక చలిపొద్దు గురించి Tulasimohan అభిప్రాయం:
03/03/2007 2:12 am
….అచ్చంగా చలిపొద్దులాగానే వుంది…..చాలా బాగుందండి
4వ ఖండిక నిజంగా నేననుభవించిన ఎన్నో చలిపొద్దుల మాదిరే వుంది
యథార్థ చక్రం -6 గురించి madhusoodana rao అభిప్రాయం:
03/02/2007 8:51 pm
చాలా మంచి రచన ! ఈ కథ గురించి ఇంతకు ముందెప్పుడూ చదవ లేదు.
గాంధీకి ప్రేరణ కలిగించిన కథ అన్న కొత్త విషయం తెలిసింది.
నామాట గురించి విహారి. అభిప్రాయం:
03/02/2007 8:03 pm
ఏ కార్యక్రమమైనా ముందుకు సాగాలంటే మొదలు పెట్టిన కొన్నాళ్ళకు కాస్త ఉత్సాహ పరిచే వాళ్ళుండాలి. అది లేక పోతే ముందుకు సాగడం కష్టం. మన సంస్కృతి ఉనికి కోసం ఎందరో పాటుపడుతున్నారు. వాళ్ళ లో కొంత మంది కొంత కాలం ఆయ్యాక ఎన్నో కారణాంతాల వల్ల ఆపేసుంటారు. ఆ కారణాలు ప్రొత్సాహం లేక పోవడం వల్ల కావచ్చు. లేక ఆర్థిక కారణాలు అయ్యుండచ్చు. లేక వాళ్ళ దైనందిన కార్యక్రమాలు మారడం వల్ల కావచ్చు. విదేశీ గడ్డ మీద ఇలాంటి ప్రయత్నాలకు చాలా పరిమితులుంటాయి.
ఈ మధ్య మాధ్యమాలు(ఇంటర్నెట్, టి.వి.) లస్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే వేలుంది. అవి అందరి ప్రయత్నాలకు కాస్త సహాయ కారిగా వుంటున్నాయి.
ఒక్కటి మాత్రం నిజం మన వాళ్ళలో మళయాళీయులకు, తమిళులకు ఉన్న బాషాభి మానంలో ఓ పది శాతం ఉండి వుంటే ఇలాంటి చర్చ కూడ వచ్చేది కాదేమో. ఇది నా అనుభవంలో కొచ్చిన వాటిద్వారా చెబుతోంది.
విహారి.
నామాట గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:
03/02/2007 8:01 pm
అయ్యా,
మట్టి పిసుక్కోని, ఎద్దు తోక తిప్పుకొనేవాడ్నే కానీ, యెప్పుడో సిన్నప్పుడు, మా ఊరయ్యొరు పున్నెవా అని ఏదో రెండు ముక్కలొంట బట్టినాయ్ కాబట్టి, నేనీ రెండు ముక్కలు రాస్తుండా. నాకు సంస్కృతవెంత తెలుసో, సంస్కృతి, సంస్కారాల గురించికూడా అంతే తెలుసు. అందుకని వాటి గురించి నేను మాట్లాడితే బాగుండదు. కాకపోతే ఇన్నేళ్ళు తెలుగు గడ్డమీద బతికేను కాబట్టి, తెలుగు బతుగ్గురించి కొంచెంతెలుసు. అదిగిదిగో దాన్ని గురించే చెప్తున్నా. దాన్నే మీరు సంస్కృతి, సంస్కారవనో, మట్టీ మశానవనో ఏదో అంటారు. మందలేందంటే అయ్యా, మన తెలుగోళ్ళలో మూడూముక్కాలు మందికి సదవటవే రాదు. నాలుగచ్చరాలు వొచ్చినోల్లు ఒందకి నలగరకన్నా ఎక్కువుండరు. అట్టాటోల్లకి బాపూలు, సినారేలు ఏందెలస్తారయ్యా? వాళ్ళకి నన్నయ, మావూర్లోపుట్టిన తిక్కన గురించే తెలీదు. ఇంకమాకు బంధ కవిత్వాలు, అష్టావధానాల గురించేంతెలస్తదయ్యా. సరే మేవేదో యెగసాయం కేసుకునేవాళ్ళం అనుకుంటే, దురద్రృష్టం కొద్దీ మిగతావాళ్ళు మాకన్నా అన్నేయం. ఈ నాలుగు ముక్కలు నేర్చే అవకాశం, తీరికా కుడాలేఓళ్లకి. ఇంతకీ మందలేందంటే, ఏవీ తెలీకపోయినా, భాస కుడా సరిగా రాకపోయినా, మీరనే ఆ సంస్కృతి మా బతుకుల సారవే. మేవే కదా తెలుగు నేలంతా, తెలుగుతనవంతా మాదే కదా. బాపూది, సినారేది, నన్నయ్యది, తిక్కనది, లేకపోతే మావూరి తెలుగయ్యోరిది, మా వూరి భజనసంగానిదీ మాత్రవే కాదుకద తెలుగుతనం. భజన సంఘవంటే గుర్తుకొచ్చింది, మీ తానాలూ, ఆటాలు అట్టటియే కదా. కాకపోతే మీది కోచం ఐటెక్కు అంతేకదా. మా భజనసంఘం మా తెలుగుతనాన్ని రచ్చించదు. మా తెలుగుతనవే లేకపోతే మీరనేటటువంటి మా సంస్కృతే భజన సంఘాన్ని రచ్చిస్తది, పోసిస్తది. సంస్కృతంటే మాపోలేరమ్మ ఇగ్రహంకాదు, రాతిలో పోతపోసినట్టు, నిన్నా, ఈరోజు, రేపు కూడా శిలకొట్టినట్టు మార్పు లేకుండా అట్టె వుండడానికి. మంచికానీ, చెడుకానీ అది మారేది మారేదే. బాపూలూ, సినారేలు, అష్టావదానాలు, శథావదానాలు, ఎమ. ఎ తెలుగులు, చంధస్సులో డాక్టరేట్లూ, త్యాగరాజు కీర్తనలు, సరసవైన ప్రార్థనలు, భజన సంఘాలు, తానాలు, ఆటాలు ఇయ్యన్నీ సంస్కృతిలో భాగవే, ఈటితోపాటు, జజ్జనక జనారేలు, లబ్జు లబుకు సినిమా పాటలు, రికార్డీంగు డేన్సులూ కూడా ఈరోజు తెలుగు సంస్కృతిలో భాగవే. అందుకని మీరేం దిగులు పడకండి, సినిమా వాళ్ళని పిలిసినందుకు, పిలకాయలు త్యాగరాజ కీర్తనలకి డాన్సులేయనందుకు. మరీ భాదపడిపోకండి, తనాలు ఆటాలు లేకపోయినా అమెరికాలో తెలుగు సంస్కృతికేం డోకా రాదు. బాపూలూ, సినారేలూ లేకపోయినా, తెలియకపోయినా తెలుగు సంస్కృతికేం పరవాలేదు, తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవికదశకి చేరుతాయని మీరు మనేద పడబల్లే. సంస్కృతికి ఏ వొక్కరి రక్షా అక్కరలేదు, తెలుగు మాట్లాడే మనుశులుంటే చాలు. మీ లాగా, నా లాగా, ఇంకా రకరకాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళుంటే సాలు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం గురించి డా.ఇస్మాయిల్ పెనుకొండ అభిప్రాయం:
03/02/2007 7:37 pm
మంచి వ్యాసం పునర్ప్రచురణ కావించి తెలుగు వికీపీడియాకు ‘ఈ-మాట’ చేస్తున్న ఈ సాయం తెలుగు భాషకు నీరాజనంగా భావిస్తూ…
నామాట గురించి lalitha అభిప్రాయం:
03/02/2007 5:44 pm
నేను నా వైపు ప్రయత్నంగా పిల్లల కోసం తెలుగు (నా బ్లాగు లింకు) మొదలు పెట్టాను. మెచ్చుకోళ్ళు బాగానే వస్తున్నాయి. అవి నాకు ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. నిజంగా ఎంతమంది ఎంత తరచుగా అందులోని అంశాలు గాని దాని వల్ల స్ఫూర్తినందుకొని ఇతరం ఏవైనా గాని తమ పిల్లలకు తరచుగా పరిచయం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంటుంది. కాని నేను సందేహంతో ఆగదల్చుకోలేదు. ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూనే ఉంటాను. నా పిల్లలకైతే ఉపయోగపడుతోంది. ఇంకొంచెం విస్త్రుతంగా పరిచయమైతే చేసుకుంటూనే ఉంటాను. ఒకే లాంటి అభిరుచులూ, ఆశయాలూ ఉన్న వాళ్ళు కొందరు తప్పని సరిగా ఉంటారు. వారు కొందరూ కలిసినా చాలు. ఇది నా వైపునుంచి నా ప్రయత్నం.
ఇక, రచ్చబండ లో చాలా మంది చాలా advanced భాషా విషయాలు చర్చిస్తారు, మంచి అనువాదాలు, కవితలూ రాస్తూ ఉంటారు. ఎవరైనా పూనుకుని వాటిని compile చేసి ఒక బ్లాగులో కాని వెబ్సైటు లో కాని పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకెప్పుడూ.
ఈ రోజున internet లో తెలుగులో రాయ గలుగుతున్నాము, చాలా మంచి బ్లాగుల్లో మంచి తెలుగు ఉపయోగింప బడుతోంది. తెలుగు భాషకు సంబంధించిన విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ రాస్తున్న వారిలో చాలా మంది యువకులు కూడ ఉన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన విషయాలు అనిపిస్తుంది నాకు. ఏమి లేకున్నా, పిల్లలకు తెలుగుని పరిచయం చెయ్యాలన్నా, వాళ్ళకు కుతూహలం కలిగించాలన్నా, వాళ్ళని తెలుగుతో “touch” లో ఉంచాలన్నా, ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉన్న మంచిని పెంచుకుంటూ ముందుకి సాగుతూ ఉందాము.
ఇది నా అభిప్రాయం.
లలిత.
మహరాజవ్వాలంటే… గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
03/02/2007 4:09 pm
మీ కథకి కొనసాగింపు :
చిన భూషయ్య రాజుఅయ్యాక ఆ ఊళ్ళో కుక్కలకీ నక్కలకీ కే కాదు, ప్రతీ జీవికి మహారాజులా పాలించాలనిపించింది. నాలుగు ముక్కలు రాని భూషయ్యే పాలించగాలేనిది, నాలుగు ముక్కలు ముక్కున పట్టిన మేం పనికి రావా? అన్న ప్రశ్న అందరిలోనూ బయల్దేరింది. పరిపాలించడానికి కావల్సింది బుర్ర కాదని మన చిన భూషయ్య ని చూసేక ఆవగింజంత బుర్రున్న ఏ మడిసికైనా అనిపించడం సహజమే ! అందరూ ఈ విషయం పైనే చెవులు కొరుక్కున్నారు. ఆ అందరిలో మన బుల్లి కిష్టయ్య భార్య వల్లరి కూడా ఉంది. బుల్లి కిష్టయ్య ఇంతకుముందు రెండు తడవల రాజుగా ఎన్నుకోబడ్డాడు. బాగానే పాలించాడులే అన్న పేరు తెచ్చుకున్నా, కాస్త ఆడ వ్యసనం తో తెచ్చుకున్న మంచిపేరు కాస్తా చెడగోట్టు కున్నాడు. అప్పుడు వల్లరి బుల్లి కిష్ట య్యకి రాణిలా ఉన్నా, కిష్టయ్య వేషాలు చూసేక మాట్లాడడం మానేసింది. బుల్లి కిష్టయ్య మీద పీకలవరకూ కోపంతో ఊగిపోయింది. ఇంట్లో ఒకసారి పీక నొక్కే ప్రయత్నం కూడా చేయబోయి తమాయించుకొంది. బుల్లి కిష్ట్యయ్య వల్లరి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేడు. ఏదైనా వరం కోరుకోమని తను తీరుస్తానని ప్రమాణం చేసాడు. రామాయణం బాగా చదివి వంట బట్టించుకున్న వల్లరి, సరే ఇప్పుడొద్దు కానీ, కావల్సివచ్చిన ప్పుడు నేనే అడుగుతాను అని క్షమించినట్లుగా నటించింది. అంతే ప్రజల దృష్టిలో బుల్లి కిష్టయ్య కాస్తా లోల్లి కిష్ట్యయ్య గా మారిపోయాడు. మన వల్లరి ప్రజల మనసు దోచుకొంది. సీత, సావిత్రి పక్కన వల్లరిని చేర్చేసారు ప్రజలు. ఇదగో ఈ మధ్య చిన భూషయ్య ని చూసేక వల్లరి కీ రాజులా పాలించాలన్న కోరిక బయల్దేరింది. రాణీ హోదా కన్నా రాజు లా పాలించడం గొప్ప కాదా?, అసలే పురుషాధిక్య ప్రపంచంలో త నూ ఒక బ్రిటీషు యువరాణిలా రాజ్యమేలచ్చుకదా అన్న ఆలోచన బయల్దేరిందే తడవుగా మన బుల్లి కిష్ట్యయ్య కి చెప్పింది. బుల్లి కి ష్టయ్యకి ఆ లోచన కంపరంగా తోచింది. ఇన్నాళ్ళ్ళూ తనని అందరూ మంచిగా పాలించానని పొగిడారు, తన కెన్ని ఆడ పరిచయాలు ఉన్నా!ఇప్పుడు వల్లరి కనక రాజు లా ఎన్నికయితే తన పేరు పోతుంది. అంతే కాదు, తను, పాతూరి బుల్లి వెంకమ్మ మొగుడుగా తయారవుతాడు. ఎలాగైనా వల్లరి ప్రయ్తత్నాన్ని ఆపాలని నిశ్చయించుకున్నాడు. వల్లరి తక్కువ తిందా? ఎప్పుడో ఇచ్చిన వరాల మూట విప్పింది. బుల్లి కిష్ట్యయ్య నోటికి తాళ వేసింది. తానూ మహారాజు ( మహారాణి కాదు ) పోటీలో ఉన్నట్లుగా ప్రకటించింది. పైకి మన బుల్లి కిష్టయ్య మద్దత్తు ప్రకటించినా, వెనకాల చక్రం తిప్పడం మొదలు పెట్టాడు….
( సశేషం … ముగింపు వచ్చే సంచికలో … వేలూరి గారికి క్షమాపణలతో…)
నామాట గురించి J K Mohana Rao అభిప్రాయం:
03/02/2007 1:17 pm
రోహిణీప్రసాద్ గారూ:

– మోహన