Comment navigation


15534

« 1 ... 8 9 10 11 12 ... 1554 »

  1. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి నాగేస్రావ్ గారి అభిప్రాయం:

    10/18/2024 9:30 pm

    అమరేంద్ర గారూ, శేషగిరి గారు రాసిన ఈ వ్యాసాలు ఇంగ్లీష్ లో దొరుకుతాయా? మా అమ్మాయికి యాత్రలంటే చాలా ఇష్టం, కానీ తెలుగు చదవలేదు, అందుకని.

  2. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    10/17/2024 10:14 pm

    నెనర్లు !🙏

  3. చదువు అనే ఆరోవేలు గురించి Pv seshssaina Reddy గారి అభిప్రాయం:

    10/17/2024 8:54 am

    పుస్తకం చదవడం అనే అలవాటు కోసం దొంగగా మారాను అని రాశావే చాలా సూపర్ రా! నిజమే మన చిన్నప్పుడు మంగళ షాపులలో ఉండే బుక్కులే మనకు దిక్కు, అలానే ప్రతాప్ టాకీస్ దగ్గర గ్రామచావిడిలో అమ్మే బుక్కులు చూసేవాళ్లం. నేషనల్ టాకీస్ ఎదురుగా ఒక శాపతను వీక్లీలు అమ్మేవాడు అవి కూడా మనం బాగానే వెంటపడి చదివే వాళ్ళం. మన చార్ మధు పుస్తకాలు అయితే ఇంకోపంతా వాడు వాడి తమ్ముడు ఇద్దరు కలిసి అదే బుక్ చదువుకునేవారు నీకు తెలుసు కదా… ఇప్పటికి కూడా పుస్తకాలు చూస్తే షాపులో ఊరికే తిరిగే బుద్ధి అవుతూనే ఉంటుంది. విశాలాంధ్ర బుక్ హౌస్ మన శ్రీనిధి హోటల్ దగ్గర ఆపుతుంటారు ఖచ్చితంగా వెళుతూ ఉంటాం. హైదరాబాదులో అయితే నీకు బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి. అందుబాటులో ఉంటాయి అనుభవించే అవకాశం ఉంది. మాకు అంత లేదురా అబ్బీ, ఉంటా..

  4. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    10/17/2024 2:09 am

    మీరు చెప్పింది నిజమే. పాము విషము (venom) ప్రోటీనులు లేదా పాలీ పెప్‌టైడ్ నిర్మితాలు. వివిధరకాల గ్లైకోలైజేషన్స్ ఆ ప్రోటీనుల మీద ఉండటం వల్ల ఒకే రకమైన విరుగుడు తయారు చేయడం కుదరదు. ఫాస్పోలైపేజెస్ జీవకణాలలోకి కేవలం ప్రవేశించడానికి పనికొస్తాయి మరియూ అవి ప్రాథమిక విరుగు కారకాలుగా పనికొస్తాయి కానీ ఖర్చుతో కూడుకున్నది మరియూ పంటపొలాలలో, అడవుల్లో తిరిగే మనుషులకు అందుబాటులో ఉండవు. ప్రథమ చికిత్సగా గాయాన్ని వెంటనే నీటితో కడిగి, ప్రోటీన్ డీనెచురేటింగ్ ఏజంట్స్ మరియు క్షారకారకాలు, అంటే యాంటిసెప్టిక్ సబ్బు, డిటర్జంట్ లాంటివి పనికొస్తాయి. మిగతావన్నీ మీరు చెప్పేశారు, ఏఐ, మెషీన్ లెర్నింగ్, హ్యూమన్ జీనోం ప్రాజెక్టులలో పని చేసిన మీకు జీవరసాయన శాస్త్రం పైన ఇంత అవగాహన ఎలా వచ్చిందో ఆశ్చర్యం.

  5. అజ్ఞాతవాసి గురించి శివకుమార శర్మ గారి అభిప్రాయం:

    10/16/2024 10:46 pm

    “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది.”

    అన్న ఒక రచయిత చుట్టూ అల్లిన కథ. అహంలేని, కీర్తికాంక్షకి దూరంగా ఉండే రచయిత గూర్చి. అలాంటి వాళ్లు ఉండరని కాదు గానీ, వెబ్ పత్రికలు లేని కాలంలో కూడా శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర వంటి మహామహులకి బ్రహ్మరథం పట్టారు. వాళ్లని ప్రసంగాలకోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆహ్వానించాయి. రెండు మహారచయితల/కవుల బృందాలు పత్రికా ముఖంగా చేసుకున్న యుద్ధాలగూర్చి విన్నాను కానీ, అది కనీసం అయిదు దశాబ్దాలకి పైగా వెనుక. ఎంత నిష్కర్షగా సంపాదకులకి సామాన్య పాఠకులు ఉత్తరాలు రాశారో గానీ, నేను పత్రికలు చదవడం మొదలయిన దగ్గర్నించి అచ్చులో పేరు చూసుకోవాలన్న తపనలే ఎక్కువ కనిపించాయి. అందుకే ఆ వారధి పోలిక అసమంజసం అనిపించింది. కానీ, అదే ఈ కథకి కీలకం.

  6. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 5 గురించి సాయికిరణ్ పామంజి గారి అభిప్రాయం:

    10/15/2024 3:21 pm

    మీ దక్షిణ అమెరికా అనుభవాలు కేవలం ట్రావెలాగ్స్ మాత్రమే కాదు. పాఠ్యపుస్తకాల స్థాయికి చేరాయి. మన రచయితలు ఇలాంటి ఆకర్షణీయమైన శైలిలో సైన్స్ పుస్తకాలు రాయరెందుకో… గొప్ప సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

  7. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి జగన్ మోహన్ రాజు గారి అభిప్రాయం:

    10/11/2024 4:05 pm

    History is always a mystery.

  8. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి VSTSayee గారి అభిప్రాయం:

    10/11/2024 1:29 pm

    తన తిండి కొరకు టోపిలు కుట్టేవారని, వాటి యొక్క అమ్మకపు సొమ్ముతో తన ఆహారం సమకూర్చుకునే వారని చరిత్ర తెలిపింది.

    ఒక్కోటోపీకి ఎంతపుచ్చుకొన్నాడో చరిత్రేమన్నా తెలిపిందా?

    నిప్పప్పలస్వామి స్కిల్‍గేమ్స్ గుర్తొచ్చాయి!

  9. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి SAI KRISHNA గారి అభిప్రాయం:

    10/11/2024 10:50 am

    నిజానికా ఔరంగజేబు నిబద్ధత కలిగిన వారు. తను ఒక చక్రవర్తి ఐననూ, తన తిండి కొరకు టోపిలు కుట్టేవారని, వాటి యొక్క అమ్మకపు సొమ్ముతో తన ఆహారం సమకూర్చుకునే వారని చరిత్ర తెలిపింది. ఇప్పటి సందర్భంలో కూడా తన బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పని గురువును తిరస్కార ధోరణితో తప్పు ఎత్తి చూపారు. చక్రవర్తి అన్నాక, తెలివి తక్కువ వారుగా తేలితే అవమానము కదా? అందులో తాను, జ్ఞానము సంపార్జించని కోణములు ఆయన ఎరిగి, అందుకు కారణమైన గురువును, తన అధికార అవకాశంతో తిరస్కరించారు. సహజము!

  10. సంపాదకునికి ఉత్తరం గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:

    10/10/2024 4:06 am

    సంపాదక మహాశయులకు దసరా శుభాకాంక్షలతో:

    ఈమాటలో గడినుడి చూడక అర్ధసంవత్సరం అవవస్తోంది. కారణాలు ఏవైనా, నా మిత్రులు నేను వ్రాసిన సలహానే కారణం అని అంటున్నారు. త్వరలో ప్రారంభం అవుతుంది అని ఆశిస్తున్నాను.

« 1 ... 8 9 10 11 12 ... 1554 »