పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16578

  1. బేలా టార్ చనిపోయిన రోజు గురించి Mani Vadlmani అభిప్రాయం:

    08/01/2026 1:42 am

    అతను లోయ చివరి రహస్యం కథా వార్షిక పుస్తకంలో చదివాను.

    అప్పుడే భగవంతము గారితో పరిచయం.

    తరువాత భగవంతం గారి కథలు కొన్ని చదివాను. లోయ చివరి రహస్యం కథా సంకలనం కూడా చదివాను. చప్పుడు చేయని నిశ్శబ్దం ఇంకా బావుంటుంది. ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాను.

    గోధుమ రంగు ఆట, అదొక మాస్టర్ పీస్, ఈ పుస్తకం లో మిగిలిన కథలు .ఒక్క పదం చాలు కథ కూడ నచ్చింది.
    ఆ కథలన్నీ కూడ వేరే స్థాయి.. అంతే.

    ఇప్పుడు ఈ కథ ఆ కోవలోకే.

    ఇది మానవ ఒంటరితనం, మరణ భయం, జీవితంలోని అర్థరహితతను అద్భుతంగా ఆవిష్కరించిన కథ.

    ఒక సినిమా ఇంత లోతుగా ఓ వ్యక్తి మనసును ఎలా ప్రభావితం చేస్తుందో చాలా సహజంగా రాసారు.

    ద టూరిన్ హార్స్ సినిమా, వోడ్కా-ఆలుగడ్డ భోజనం, రావిచెట్టు దృశ్యం — ఇవన్నీ కథలో భాగమై ఒక తాత్విక మూడ్ క్రియేట్ చేశాయి.

    ఒంటరితనం నుంచి “ఆకుల్లేని చెట్టు” నేర్పిన ధైర్యం వరకు అనే మలుపు చాలా ప్రభావశీలం.

    మల్లికార్జున్ పాత్ర చిత్రణ సజీవంగా ఉంది — అతని గతపు గాయాలు, అలవాట్లు, ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తాయి. బేలా టార్ మరణ వార్తతో కథ మొదలైంది కానీ, ఆయన పట్ల మల్లికార్జున్‌కి ఉన్న అభిమానం ఇంకా లోతుగా రాయొచ్చేమో అనిపించింది.

    “ఆకుల్లేని చెట్టు” ఒక మెటాఫర్

    నా అనుభూతి కథ చదివాక:
    సినిమా ప్రేమికుడి మనస్తత్త్వాన్ని, జీవిత తత్త్వాన్ని రెండు పేటల తో చక్కగా పేనారు.

    చాలా హృద్యంగా చెప్పిన కథ.

    ఓదార్పు, దిగులు, ఆత్మవిశ్వాసం — అన్నీ కలగలిపిన అనుభూతిని ఇస్తుంది.

    బేలా టార్‌కి ఇది సముచిత నివాళి.

  2. ఆగస్టు 2026 గురించి శివరామకృష్ణ వంకాయల అభిప్రాయం:

    08/01/2026 12:27 am

    మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. అనేక సంస్కృత పదాలకు తమిళులు, మలయాళీలు వారి భాషల్లోనే సమానపదాలను కనుగొని వాడుతుండగా తెలుగువాళ్ళం మాత్రం సంస్కృతపదాలనే యథాతథంగానో కొంచెం ఆంధ్రీకరించో వాడుతున్నాం కాని తెలుగు మాటలనే వాడలేము. శుభోదయం అనడానికి మేలుపొద్దు అనిరాస్తే నా మిత్రులు నవ్వారు. వారిలో కవులూ పండితులూ కూడా ఉన్నారు. పొత్తపుగుడి (గ్రంథాలయం) కూడా ఇలాంటిదే. మందులకొండ అని అన్నమయ్య సంజీవని పర్వతానికి తెలుగుమాట వాడారు. చనవుతగవు అని ప్రణయకలహానికి వాడారు. ఇలాంటి ప్రజ్ఞ నేటివారిమైన మనకు లేకపోయింది.

  3. ముద్దుపళనిని ఎలా చదవాలి? రాధికాసాంత్వనంలోని అంతర్లీన కావ్యదృష్టి గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:

    07/31/2026 8:26 pm

    రామారావు గారు,
    కృత్రిమమేధా సాయం తీసుకుని రాసిన ప్రయోగాత్మకమైన మీ ఈ రచనకు ముందుగా అభినందనలు.

    ముద్దుపళనిని ఎలా చదవాలి, రాధికాసాంత్వనంలోని వివిధ అంశాలను ఏ దృష్టితో చూడాలి అని నేటి తరానికే కాదు రాబోయే తరాలకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా వివరించారు. కేవలం స్త్రీ రాసింది, అందునా శృంగారాన్ని రాసిందన్న ఒక్క కారణంతోనే పూర్వులు ఈ కావ్యాన్ని బహిష్కరించాలనుకున్నారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా 18వ శతాబ్దపు కవి అయిన కూచిమంచి జగ్గకవివంటి వారి ప్రబంధ కావ్యాల్లోని శృంగార పోకడలతో ముద్దు పళినిని పోల్చి చూసి రాధికాసాంత్వనానికి బహిష్కరించి ఉంటారు అని నాకు అనిపిస్తుంది.

    ఏదేమైనాప్పటికీ, రాధికాసాంత్వనాన్ని ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో స్వయంగా ముద్దుపళనే ప్రస్తావించిన వాటిని మరింత వివరంగా రాసిన ఈ వ్యాసం మాత్రం ఓ మంచి గైడ్ లాగా పనికొస్తుంది. నెనర్లు.

  4. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/31/2026 2:39 pm

    జగన్నాథరావు గారు,

    నేను ముందుగా ఇలా రాశాను:

    “మార్చి 1843లో, విలియం థామ్‌సన్‌ (William Thomson, 1824–1907), ఫారడే Experimental Researches in Electricity చదివి, దాంట్లో కేవలం ప్రయోగాలు తప్ప, సిద్ధాంతం లేదని విసుక్కున్నాడు. కాని తన గణిత ప్రావీణ్యతతో ఫారడే భావాలకి గణిత రూపం ఇచ్చి, ఫారడే భావాల ప్రాముఖ్యతని గుర్తించాడు. ఆగస్టు 6, 1845న అతను ఫారడేకి విద్యుత్తు, అయస్కాంతం, కాంతిని ప్రభావితం చెయ్యవచ్చని సూచించాడు.”

    ఇందులో మధ్య వాక్యంలో స్పష్టత కొరవడటమే కాక, “ఫారడే భావాలకి గణిత రూపం ఇచ్చి” అని థామ్‌సన్ పాత్రను ఎక్కువ చేశాను. అలా పూర్తి గణిత రూపం ఇచ్చింది తరువాత మాక్స్‌వెల్. కాబట్టి ఇలా సవరిస్తాను:

    “మార్చి 1843లో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణితం చదువుకుంటున్న విలియం థామ్‌సన్‌ ఫారడే రాసిన Experimental Researches in Electricity చదివాడు. ప్రయోగాత్మక వర్ణనలతో నిండివున్న ఆ రచనల్లో గణిత సూత్రాలు దాదాపు లేకపోవడంతో మొదట కొంత నిరాశపడ్డాడు. కానీ ఉష్ణ ప్రసార గణితంలో తనకు ఉన్న పరిచయంతో ఆలోచించగా, ఫారడే ఊహించిన ‘బలరేఖలు’ కేవలం ఊహాగానాలు కావని, వాటిని ఉష్ణ ప్రసార సూత్రాలతో పోల్చి చూడవచ్చని థామ్‌సన్ గ్రహించాడు. ఫారడే భౌతిక భావనలకు, అప్పటి గణిత భౌతికశాస్త్రానికి మధ్య ఇలాంటి పోలికను తొందరగా గుర్తించి వినియోగించినవారిలో థామ్‌సన్‌ ముఖ్యుడు.

    “ఈ ఆలోచనతోనే, 1845 ఆగస్టు 6న థామ్‌సన్ ఫారడేకి ఒక ఉత్తరం రాశాడు. ఒకవేళ బలరేఖలు గాజు వంటి మాధ్యమంలో భౌతిక మార్పులు తెస్తుంటే, బలమైన అయస్కాంత క్షేత్రం ఆ గాజు గుండా వెళ్ళే ధ్రువిత కాంతిని ప్రభావితం చేయవచ్చని సూచించాడు.”

    జాగ్రత్తగా చదివి ప్రశ్నించినందుకు కృతజ్ఞతలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

    [మీరు సూచించినట్టుగా మార్పులు చేసినాము – సం.]

  5. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/31/2026 2:08 pm

    Dharmaraju garu,

    Thank you for your appreciation and offer. I am well aware of the excellent work BREAD Society has been doing. Dr. Ravi Sarada, who is on the society’s governing body, helped us establish a library in my village, Ravinuthala, AP, in 2009.

    I’ll be happy to take your help in making these essays available to school children after consulting with the eemaata editors. But first, I need to complete them. With the essay on Planck in July’s issue—the fifteenth in the series—we entered the twentieth century. I will need at least another six essays to complete the story.

    Kodavalla Hanumantha Rao

  6. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి జగన్నాథరావు అభిప్రాయం:

    07/31/2026 6:55 am

    కాని తన గణిత ప్రావీణ్యతతో ఫారడే భావాలకి గణిత రూపం ఇచ్చి, ఫారడే భావాల ప్రాముఖ్యతని గుర్తించాడు – సర్, ఈ వాక్యం అర్థం కావడం లేదు

  7. పొలి గురించి Prasad అభిప్రాయం:

    07/30/2026 9:43 am

    కథ చాలా బాగుంది. రాయసీమ మంచితనాన్ని ప్రమీల మీద, పౌరుషాన్ని దేశ రక్షణకు మళ్ళించారు. చాలా కొత్త పదాలు పరిచయమయ్యాయి.

  8. విరామస్థానాల వాడుక గురించి పల్లె దేవప్రియం అభిప్రాయం:

    07/30/2026 3:23 am

    వేమూరి గారికి ధన్యవాదాలు. తెలుగులో ఇలాంటి సమాచారం నేను ఎప్పుడూ చదవలేదు. నాకున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. మీ కీబోర్డు ద్వారా (apple పరికరాల్లో ‘ద’ కు వత్తు ఇవ్వడం చాలా శ్రమతో కూడినది) ఇలాంటి మరిన్ని ఉపయోగకర వ్యాసాల కోసం ఎదురు చూస్తూ…

  9. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Dharmaraju అభిప్రాయం:

    07/30/2026 2:31 am

    Hanumantha Rao Garu,

    I was directed to your article by a board member. Your writings have impressed them. We would like to engage with you to know if we could compile and publish these in printed book form for distributing them to the BREAD Society libraries established in AP and Telangana. You can know more about our work on our website (breadsocietyindia.org)

    If this interests you, can you please write back to me at secretary@breadsocietyindia.org.

    warm regards
    Dharmaraju

  10. ఓడిస్సీ – చివరిమాట గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/26/2026 4:01 pm

    అద్భుతంగా రాసేరు వేమూరి వారు. ఇప్పుడు తెలుగుగద్యం ఇంత చక్కగా రాయగలిగిన వారు నాకు తెలిసి ఇంకెవరూ లేరు. వారు ఇంకా విరివిగా రాయాలని నా కోరిక.

    నేనెప్పుడూ ఒడిస్సీ చదవలేదు, దాని గురించి వినటమే కాని. క్రిస్టఫర్ నోలన్ సినిమా బాగుందని విన్నాను. ఇంకా చూడలేదు. చూశాక అది మూలకథని ఎలా మలిచిందో తెలుసుకోవటం తేలికచేశారు వేమూరి వారు.

    దీనికీ, దండి దశకుమారచరితం కి కొన్ని ముఖ్యవిషయాల్లో పోలికలు కనిపిస్తున్నయ్. ఐతే ఒడిస్సీ ఎక్కువభాగం సముద్రసాహసాల గురించైతే దశకుమారచరితం ఎక్కువభాగం పట్టణప్రాంతాల్లో జరిగేకథ.