Comment navigation


15542

« 1 ... 60 61 62 63 64 ... 1555 »

  1. గోరంత బొమ్మ – కొండంత బాపు గురించి రవికుమార్ పరస గారి అభిప్రాయం:

    12/02/2023 10:48 pm

    సమ్మోహనాస్త్రం అన్వర్ మీది.

  2. పోస్టుమాస్టరు గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:

    12/02/2023 9:04 pm

    తాత్వికతతో కూడిన మంచి కథ. చదువుతుంటే కథలో లీనమై కళ్ళు తడిసాయి.

  3. ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    12/02/2023 11:10 am

    తాటిపాములగారు,

    మీ అభినందనలకు వినయ నమస్సులు!

    1. నగరము అన్న అర్థంలో ఉండే పుర- (పురం) అన్నది నపుంసక లింగంలో ఉంటుంది. పురః/పురస్ అన్న అవ్యయ శబ్దానికి ముందు-, ప్రథమ- అన్న అర్థాలే తప్ప నగరము అన్న అర్థం లేదు. పురానికి హితము కలిగించేవాడు అన్న అర్థంలో పురహితుడు అన్న సమాసమే అవుతుంది తప్ప పురోహితుడు (పురః + హిత) అన్నదానికి ఆ అర్థం రాదు.

    2. మీరు చెప్పింది నిజమే. రత్నరాశులనిచ్చు అన్నది మూలంలో లేదు. కానీ ఈ సూక్తంలోనే అగ్ని ధనాన్ని, యశస్సును, వీరవంతులైన సంతానాన్ని ఇస్తాడని తరువాతి శ్లోకాలలో ఉంది కదా. అలాగే ఇతర అగ్ని సూక్తాలలో కూడా అగ్ని సంపదలను, తురగ ధేనువులను ఇస్తాడని ఉంది కాబట్టి కొంత స్వతంత్రించి రత్నరాశులనిచ్చు అని రాసాను. కనీసం మొదటి రెండు శ్లోకాలతో సీసపద్యం పూర్తి చేయాలని ఆ రకంగా చేసాను. “హోత యితడు రత్న ధాతృడితడు” అంటే మూలంతో పూర్తిగా సరిపోయేదేమో.

  4. ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి M J Thatipamala గారి అభిప్రాయం:

    12/02/2023 10:43 am

    మంచి ప్రయత్నం. మొదటిసారిగా పురోహితుడంటే ‘పురానికి హితము కలిగించేవాడు ‘ అన్న లౌకిక అర్థం కాకుండా (పురః = ముందు; హితం = నడుచువాడు. ప్రథమహితుడు) అన్న అసలైన అర్థం తెలుసుకొన్నాను. ధన్యవాదాలు!

    వేదాలను అపౌరుషేయాలు అంటారనే మాట ప్రసిద్ధి. అరిషడ్వర్గాలనుండి బయటపడలేని మనం మన భావాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉంటే చాలా నయం.

    ఉదాహరణకు, మొదటి పద్యంలో ‘రత్నరాశులనిచ్చు’. ఈ పదం ‘మోహం’, ‘లోభం’ సూచిస్తుంది. శ్లోకంలో ఈ అర్థం వచ్చే పదం లేదు. మీరు ఛందస్సు నడక కొరకు వాడారని అనుకొంటాను.

    మీరు చేస్తున్న పని ఎంతో కఠినతరమైంది. అందుకోండి, అభినందనలు!

    నా మాటల్లో ఏవైనా తప్పులుంటె అవి పూర్తిగా నావే!

  5. బ్లూ ఫిన్ గురించి కిరణ్ గారి అభిప్రాయం:

    12/02/2023 10:19 am

    పైన రమణి గారు “తప్పు” అని చెప్తున్న పద్ధతి– థర్డు పెర్సనులో మొదలుపెట్టి ఫస్టు పెర్సనులోకి జంప్ చేయటం– రచయిత ఉద్దేశపూర్వకంగా చేశారని స్పష్టంగా తెలుస్తున్నది (ఆ జంప్ చేసిన చోట చుక్కగుర్తుతో భాగం మారిందని చెప్పారు కూడా). ఉద్దేశపూర్వకంగా చేసినంతవరకు కథలు చెప్పే పద్ధతుల్లో తప్పొప్పులకు చోటు లేదు.

  6. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి అభిప్రాయం:

    12/02/2023 9:54 am

    చక్కని అనువాదం కవితలో ‘శాంత్యోదయ’ వ్యాకరణం ప్రకారం సరికాదు. దానిని కూడా సరి చేస్తే మొత్తం బాగుంది.

    [ సరిచేసాం. దోషం చూపినందుకు ధన్యవాదాలు. – సం. ]

  7. ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి తుమ్మూరి గారి అభిప్రాయం:

    12/02/2023 8:40 am

    చాలా మంచి ప్రయత్నం. నాకు ఎప్పటి నుంచో కుతూహలంగా ఉంది. వేదార్థం తెలిస్తే బాగుండునని. చాలా వివరంగా ఉంది.

  8. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి Kiran Kumari.B గారి అభిప్రాయం:

    12/02/2023 8:19 am

    మంచి సందేశము. అనువదించి అందజేసినందుకు అనేక కృతజ్ఞతలు!

  9. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి తుమ్మూరి రాంమోహనా రావు గారి అభిప్రాయం:

    12/02/2023 6:21 am

    ఒక గొప్ప వ్యాసానికి చక్కని అనువాదం. ఈ ప్రసంగంలో పంచతంత్రం ప్రస్తావన ముందు చెప్పబోతే విషయానికి శ్రోత/పాఠకుడిని తను చెప్పబోయే విషయానికి ఉన్ముఖీకరణగా ఉంది. ఇతఃపూర్వం శాంతి గురించిన విశ్లేషణ ఈ విధంగా ఎప్పుడూ చదివిన అనుభవం నాకు లేదు. కాని చదువుతుంటే రుష్దీ ఎంతగా దాని గురించి ఆలోచించారో అవగతమౌతుంది. తాను పురస్కారానంతరం ఒకవేళ రాస్తానేమో అంటూ చెప్పిన కథలో నేటి సమాజం ప్రతిబింబిచింది. ఇక స్వేచ్ఛ గురించి చెప్పిన మాటలు మనసును ఆకట్టుకున్నాయి. అన్యాపదేశంగా కవులు కళాకారులకు ఆయన ఇచ్చిన సూచన కూడా మనసును అలరించింది. మానవీయతతో అమానవీయతకో జవాబు ఇవ్వటం అన్నమాట చాలా సంయమనంతో చెప్పిన మాట. ఈ ప్రసంగం చదివిన తరువాత ఆ పురస్కారానికి ఎంతటి అర్హత కలిగి ఉన్నాడో కూడా తెలుస్తున్నది.ఇంత మంచి వ్యాసాన్ని అనువదించి అక్షరాక్షరం మనసుకు హత్తుకునేలా అందించిన మీకు ధన్యవాదాలు. మీ అనువాద పటిమకు జోహార్లు.

  10. వాక్యం పాదాల దగ్గర గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:

    12/02/2023 4:07 am

    ఈ కవిత చాలా భావుకతతో కూడిఉంది.

    “మత్తిలిన నిదురరాత్రి” పద ప్రయోగం అద్బుత మనిపినిచ్చింది. రచయితకు అభినందనలు, ధన్యవాదాలు.

« 1 ... 60 61 62 63 64 ... 1555 »