రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

చంద్రికాపరిణయము (వ్యాఖ్యానసహితము)

రచన: సురభి మాధవరాయలు

ఆంధ్రసాహిత్యములో గల అఖండపాండితీమండితము, అత్యంతకఠినమైన గ్రంథములలో ప్రథమగణ్యమైనది మా పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన జటప్రోలు (కొల్లాపురం) సంస్థానమున కధీశుడైన శ్రీ సురభి మాధవరాయలవారి చంద్రికాపరిణయ మహాప్రబంధము. కవిత్వములోను, శ్లేషలోను ఇది రామరాజభూషణుని వసుచరిత్రమునకు ప్రతిబింబమువలె ఉంటుంది. కాని ఇందులో వ్యాకరణసాధ్యమైన విచిత్రపదప్రయోగములు తఱచుగా నుండుటచే దీని శైలి వసుచరిత్రమునకంటె కఠినమై పండితులకు కూడ దుర్భేద్యముగా నున్నది. మాధవరాయలు 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానము నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు. ఇట్లితడు రామరాజభూషణునకు సమకాలికు డగుచున్నాడు. నేను 15 నెలల క్రిందట ఈ మహా కావ్యాన్ని చదువుకొన సంకల్పించితిని. ఈ గ్రంథ మిప్పుడు ముద్రణలో లేకపోవుటచే, దీనిని పోతనలిపిలో వ్రాసికొని చదువుకొన్నచో విషయమును జాగ్రత్తగా చదువుకొన్నట్లగునను తలంపుతో దీనిని పూర్తిగా పునర్లిఖించి అందరికిని అందుబాటులో నుంచుటకై ఈమాట గ్రంథాలయములో చేర్చుతున్నాను.

ఈగ్రంథానికి వ్యాఖ్యానం వ్యాఖ్యానము వ్రాసినది కొల్లాపురసంస్థానపండితులైన బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులవారు. ఉద్దండపండితులైన వారి వ్యాఖ్యానంతో గూడిన చంద్రికాపరిణయం 1904లో అచ్చై, మరల 1928లో పునర్ముద్రణ పొందింది. కేశవపంతుల నరసింహశాస్త్రిగారు వారు 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన వ్యాఖ్యానరహిత మూలప్రతికి సంపాదకులుగా వర్తించి, ఆప్రతికి తమ ఉపోద్ఘాతమును వ్రాసినారు. ఈరెండవప్రతిని తెలుగు యూనివర్శిటీవారు శ్రీరంగాచార్యులవారి ఉపోద్ఘాతంతో యథాతథంగా ఫోటోకాపీ ముద్రణ చేసినారు. కాని అదియు ఇప్పుడు దొరుకుట లేదు. నేను గ్రహించిన విషయం ఈరెండుప్రతులనుండే. కేశవపంతులవారి యొక్కయు, శ్రీరంగాచార్యులయొక్కయు ఉపోద్ఘాతములను కూడ ఇందులో చేర్చినాను.– తిరుమల కృష్ణదేశికాచారి.

View Fullscreen
Skip to PDF content
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చంద్రికాపరిణయము – 5. తృతీయాశ్వాసము
  • చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము
  • చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము
  • చంద్రికాపరిణయము – 8. షష్ఠాశ్వాసము
  • చంద్రికాపరిణయము

ఇటువంటివే…

  1. చంద్రికాపరిణయము
  2. చంద్రికాపరిణయము – 2. సమాలోకనము
  3. చంద్రికాపరిణయము – 1. ఉపోద్ఘాతము
  4. చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము
  5. చంద్రికాపరిణయము – 3. ప్రథమాశ్వాసము

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జులై 2024
యూట్యూబ్‍లో ఈమాట: జూలై 2024

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.