కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండు చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు.
Category Archive: వ్యాసాలు
శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు.
క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం.
మీనాక్షిసుందరం మత పరమైన ఆచారాలనూ సంప్రదాయాలనూ పాటించకపోయినప్పటికీ వాటి సారాన్ని చదివి తెలుసుకున్న వ్యక్తి. ఆయనతో ఆపెన్ హైమర్, హెర్మన్ వైల్ భారతీయ తత్త్వ విషయాలను ఆయనతో చర్చించే వారు. ఆపెన్ హైమర్ అమెరికా ఆటం బాంబ్ ప్రాజెక్టుకు నాయకుడు. మొట్ట మొదటి సారిగా విస్ఫోటనం జరిగినప్పుడు ఆ కాంతిని చూసి భగవద్గీత పదకొండవ అధ్యాయం లోని ‘వేయి సూర్యుల కాంతి’ శ్లోకాన్ని చదివిన వాడు.
కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు.
తెలుగుని మన పిల్లల మనస్సుల్లో నిలబెట్టమని ఆడిగేది ఎందుకూ అంటే మీ స్వార్థం కోసం అడుగుతున్నాను. ప్రజాస్వామిక దేశాలలో అధికసంఖ్యాకుల కన్నా సంస్థాగతంగా కూడి ఉన్న తక్కువమందికి ఎక్కువ బలముంటుంది. ఈ సంగతి సాధారణంగా తెలీదు మనకి. మనం organized minority గా అవగలమా?
బ్రౌన్‌తో చాలా సమస్యలు ఉన్నాయి. మనకి పొగడ్తలు వ్యక్తి గౌరవాలే ప్రధానమయి సవిమర్శకంగా ఎవరి పనినీ అంచనా వేసే అలవాటు ఇప్పటికీ ఏర్పడలేదు. క్లుప్తంగా చెప్పాలంటే అతన్ని ఇప్పటికి సవిమర్శకంగా ఎవరూ చూడలేదు. అతనికి తెలుగు గొప్పగా వచ్చని, అతను ఇంద్రుడని చంద్రుడని పొగుడుతాం.
మచాడో తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో చూశాడు. అందులో రంగుల్ని చూశాడు. అవి స్పష్టంగా స్పెయిన్ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
త్రిపుర వెతుకులాట — ప్రతీ ప్రశ్ననీ మరో పెద్ద ప్రశ్నతో రద్దు చేసి చివరికి మిగిలిన ఒకే ఒక్క ప్రశ్నను చూసి తనపై తాను జాలితో నవ్వుకుని నలుపు తెలుపుల్ని నిండుగా కలిపేసి చివరికి అసలు నేనెవరని? నేను, ఎవరు? నుదుటిపై పుట్టుమచ్చనా? కోటేరుగా ఉన్న ముక్కునా, కోటానుకోట్ల కణాల్లోంచి ప్రమాదాల్ని తప్పించుకు పుట్టేసిన ఒక…
చిన్నప్పుడు మనమంతా ఋతువులు ఆరు అని రెండేసి నెలల చొప్పున వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అని సంవత్సరకాలాన్ని ఆరు ఋతువులుగా విభజించవచ్చని మనమంతా మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం. అయితే, భారతీయ దేశంలో — ముఖ్యంగా దక్షిణ భారతంలో — ప్రధానంగా మనకు అనుభవమయ్యేవి ఎండకాలం, వానకాలం, చలికాలం అన్న మూడు కాలాలు మాత్రమే.
మన సౌర మండలంలో జరిగే ప్రతి మార్పుకు కారణభూతుడు సూర్యుడే. గ్రహాల గమనమైనా, వాటి ఉపగ్రహాల గమనమైనా, గ్రహాల చుట్టూ ఉండే వాతావరణం, అందులోని మార్పులూ, గ్రహణాలూ – వీటన్నిటికీ మూల కారణం సూర్యుడు. భూమి పైన జనించే సకల సృష్టికి కారణం సూర్యుడు. ఈ సృష్టిలో చేతనాచేతనమైన జీవాలకి ప్రత్యక్ష సాక్షి – సృష్టికర్త సూర్యభగవానుడు.
త్రిపుర ఏనాడూ పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇలాక్కాదు అలాగ! ఆని నొక్కి చెప్పడం చూళ్ళేదు నేను. అవేళ మాత్రం మాకిద్దరికీ ఒక టకాఫోర్ వచ్చింది. మాటల్లోన బాలగోపాల్ గారి ప్రసక్తి వచ్చింది. నేను ఆయన “సాహిత్యం జీవితంలో ఖాళీల్ని పూరించాలి” అని అన్నారని అభ్యంతరం చెపుతున్నాను.
ఇంటర్నెట్ ద్వారా రాత, రాతతో ముడిపడ్డ సమాచార వ్యవస్థ ఎంతగా మార్పు చెందాయో, ఆ మార్పులు మన సమాజంలో ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నాయో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. ఇది కనీవినీ ఎరుగని ఒక పెనుమార్పుగా మనం అనుకుంటున్నాం. అయితే, అంతకంటే మౌలికమైన మార్పు రాత వల్ల మానవ సమాజాల్లో వచ్చింది.
అందుచేత ఆధునిక కవి, లౌకిక వ్యక్తిలో ఒక పొర. ఒక అంతరార్థ భాగం. ఒక్కొక్కప్పుడు, స్ప్లిట్ పర్సనాలిటీ అని మానసిక శాస్త్రజ్ఞులు చెప్పేటట్టు చూస్తే లౌకిక వ్యక్తిలో ఒక ఖండం, ఒక ముక్క. ఇంతకీ కవి అంటే ఎవరూ మనకు కవిత్వం ద్వారా తెలిసే కథ మాత్రమే. అందుచేత కవులందరూ కథలే.
త్రిపదల వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉన్నదన్న సంగతి చాల మందికి తెలియక పోయినను, అందఱికి హైకూలను గుఱించి తెలిసి ఉంటుంది. హైకూ ఒక త్రిపద – మొదటి మూడవ పంక్తులలో ఐదు అక్షరములు, రెండవ పంక్తిలో ఏడు అక్షరాలు ఉంటాయి యిందులో. పదములకన్న ఆ పదములు సృష్టించిన చిత్రములు హైకూ ప్రత్యేకాకర్షణ.
అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని సంస్కృత సాహిత్యం కాని ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు.
సాలూరి రా.రా భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పువుంది. నిరాడంబరజీవి.