ఎమర్జన్సీ సడలించిన తరువాత 1977లో గౌతమరావు లోక్‌సభకి జనతా పార్టీ నుండి పాత మిత్రుల ప్రోద్బలంతో బలవంతంగా పోటీ చేశారు. రాజకీయంగా ఆయనని ప్రభావితం చేసింది జయప్రకాశ్ నారాయణ్. ఆ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం హృదయాన్ని కదిలించి వేసిందని ఎంతో మంది ఎన్నో ఏళ్ళు చెప్పుకోగా నేను విన్నాను.
Category Archive: వ్యాసాలు
ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప.
దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రుని గమనాన్ని మానవుడు అర్థం చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలున్నాయి. ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్య పరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.
వ్యవహార భాషావాదం పుట్టి నలభై యేళ్ళ పైచిలుకైనా ఆ వ్యవహారభాషంటో ఏమిటో, దాని సమగ్ర స్వరూపమేమిటో నిర్ణయించినవారెవరూ ఇంతవరకు లేరు. ఆంధ్ర కావ్యభాషకే సరి అయిన వ్యాకరణం మనకు ఇంతవరకూ లేదు. భాష యొక్క సమగ్రస్వరూపం నిర్ణయించడమనేది సుఖసుఖాల మీద తేలేపని కాదు. కావ్యభాష సంగతే ఇట్లా వుంటే దారీ తెన్నూ లేని వ్యావహారిక భాషను వ్యాకరించ బూనుకోవటం సంగతి వేరే చెప్పనక్కఱ లేదు.
ఈ తెలుగు దేశములో అసలు గ్రంథము చదువకనే, చక్కగా అధ్యయనము చేయకనే దానిని గూర్చి స్వేచ్ఛగా వ్రాయుటయో, మాట్లాడుటయో మిక్కిలిగా అలవాటు అయినది. ఈ రామాయణ కల్పవృక్షము సంస్కృత కావ్యమున కనువాదమనుట అటువంటి వానిలో నొకటి. అయినను దోషము లేదు. కాదు కనకనే కాదని చెప్పుట. కథారంభములోనే ఇది స్వతంత్ర్య కావ్యమని స్పష్టముగా దెలియును.
పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు.
చరిత్రకారులు నవలారచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరేట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే?
తన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్న కొద్ది ధరలు పెంచటానికి బదులు తగ్గించాడు. దానితో మధ్య తరగతి ప్రజలు సహితం కొనడం ప్రారంభించారు. బహుశా ప్రజల అందుబాటులోకి తన చిత్రాలు రావడం రాయ్‌కి ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చి వుండవచ్చు.
మంగలి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఫేషన్ పేరుతొ గుండు కొట్టించుకొని, మీసాలూ, గెడ్డాలూ తీసేయమని ఏ విద్యార్థికయినా చెప్పే ధైర్యం మనకుందా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరపులోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే, మర్నాడే కనాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని ఘంట వాయించి మరీ చెప్పగలను.
ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం – లేదూ ఏది దొరికితే అదీ తింటాము.
బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయ్యసూరి తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి.
రామారావు లండన్‌కి కనీసం కుంచెలు కూడా తీసుకొని పోకుండా ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. పాశ్చాత్య చిత్రకళారీతులను అక్కడి గురువుల నుండి మళ్ళీ కొత్తగా మొదటినుండీ నేర్చుకోడానికే నిర్ణయించుకోడమే ఇందుకు కారణం. అతని ప్రయత్నమంతా అక్కడ ఒక ఆధునిక చిత్రకారుడిగా ఎదగడమే.
పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలెనే వివరిస్తారు. గాలిబ్ వ్రాసిన సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్ ఈ లయలోనిదే.
రామారావుగారి కధ మంచి ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలా ఉంటుంది. కానీ మంచి చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉండదు. రచయిత దృక్పధాన్ని కధను మధించి పట్టుకోవటానికి వీలుగా ఉండాలి. ఈ కధ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కధ సాగుతుంది.
చారిత్రక నవలకుండవలసిన మొదటి లక్షణం చారిత్రకత. సాధారణంగా సాంఘిక నవలలన్నీ సమకాలిక సమాజాన్ని వాస్తవికంగానే చిత్రిస్తాయి. కానీ సామాజిక పరిస్థితులు యెంత వాస్తవికంగా, యెంత విపులంగా, యెంత కళాత్మకంగా చిత్రించినా, ఆ దేశకాల పరిస్థితులు అలా యెందుకున్నాయనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నంకాదు (ప్రశ్నే లేదు గనక సమాధానమూ లేదు).
చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.
ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?
కారడివిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు.
ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత. దెబ్బ తాకితే అమ్మో! అంటాము. జాలి చూపడానికి అయ్యయ్యో! అంటాము. అలాగే ఆశ్చర్యానికి అబ్బో! అంటాము. పని పూర్తి కాగానే అమ్మయ్య! అని నిట్టూరుస్తాము.