దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్ళలోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మధుర మీనాక్షీ దేవాలయంలో ప్రతీ ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీమూర్తులు కనిపిస్తాయి.
Category Archive: వ్యాసాలు
రీమాన్ ఒక అమూల్య అభిప్రాయం వెలిబుచ్చేడు, రుజువు చెయ్యకుండా! ఈ అభిప్రాయం నిజమే అని రుజువు చేసిన వారికి మిలియను డాలర్లు బహుమానం ఇచ్చేస్తారు. ఏదో పెద్ద విశ్వవిద్యాలయం వారు ఆచార్య పదవి అంటగడతారు. ఏ హా(బా)లివుడ్ తారో పెళ్ళి ప్రతిపాదిస్తే, డాలర్లతో పాటు స్వర్గ ద్వారాలు కూడ తెరుచుకోవచ్చు!
ప్రపంచంలోని నూటా తొంభయ్యారు దేశాల్లోన ఒక్క పాతిక దేశాలే బాగా డబ్బున్న దేశాలు. గొప్ప దేశాల్లోన గొప్ప సంస్థలు, వ్యవస్థలూ ఉంటాయి. తమ తమ ఇష్టాలు, ఆశలు, కష్టం సుఖం ప్రకారం వాటిలో చేరి జనం తమ బుర్రల్ని, బతుకుల్ని ఓదార్చుకుంటారు; తమ సంఘాల్నీ, దేశాల్నీ బావు చేసుకుంటారు. ఇలాంటి వ్యవస్థలు లేనివి, ఉన్నా ఖరాబు చేసుకుని ధ్వంసం చేసుకున్నవీ బీద దేశాలుగా మిగిలిపోతాయి.
నాకు ఊహ తెలిశాకా బాపు బొమ్మలు మొదటి సారి చూసింది వారపత్రికల్లోనే. పత్రికల ముఖ చిత్రాలకీ, కథలకి, కవితలకీ వేసిన బొమ్మలు చూశాకనే బాపు గురించి తెలిసింది. చిన్నతనంలో నాకూ చిత్రకళలో ప్రవేశం ఉండడం వలన, బాపు బొమ్మలు శ్రద్ధగా గమనించేవాణ్ణి.
గణితంలో ప్రావీణ్యం లేని వారు కూడ, గణితపు లోతులని తరచి చూసే సామర్ధ్యం లేని వారు కూడ, ఈ ప్రధాన సంఖ్యల అందచందాలని చవి చూడకపోతే జీవితంలో ఒక వెలితి మిగిలిపోయినట్లే. అదృష్టవశాత్తు ఈ ప్రధాన సంఖ్యలలోని అందచందాలని చవి చూసి ఆనందించడానికి గణితం లోతుల్లోకి అతిగా వెళ్ళనక్కరలేదు.
ఇది భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, ఇటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. ఆంధ్రభాషలో పాండిత్యం కోసం కావ్యనాటకసాహిత్యాలలోని వ్యాకరణ ఛందోలంకార శాస్త్రాధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు, పాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం!
ప్రబంధరాజంలో వేంకటకవి కావించిన సంస్కృత శ్లోకానువాదాలను గురించి ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది. వేంకటకవి ఆ పద్యాన్ని ఏదో సంస్కృతశ్లోకానికి అనువాదంగా కాక, తన ముందున్న ఏదో తెలుగు పద్యాన్నే పర్యాయపదాలతో మార్చి చెప్పివుంటాడనే నమ్మకం వల్ల అలా గుర్తుపట్టిన కొన్నింటిలో ముఖ్యమైనవాటిని ఈ 2వ ప్రకరణంలో వివరిస్తాను.
దిగ్గజాల గండస్థలాల మీద తుమ్మెదలు తచ్చాడుతూ తమ రెక్కలకి మదం అంటించుకుంటున్నాయి. వాటితో రెక్కలు బరువెక్కి ఎగరడానికి ప్రయాస పడుతున్నాయి. ఇంతలో రావణుణ్ణి శ్రీరాముడు యుద్ధంలో నేలకూల్చాడు. ఒక్కసారిగా దేవతలు పువ్వుల్ని పెద్దవానగా కురిపించారు. తుమ్మెదలు ఆ పువ్వుల వెనక పడ్డాయి. భూమి వైపుగా పోతున్న వాటి వెనక ప్రయాణించడం తుమ్మెదలకి సులువుగా ఉంది.
చతుర్మాత్రలతో పాటలు అన్ని భాషలలో నున్నవి. చతుర్మాత్రలతో అష్టమాత్రలను చేర్చి వ్రాసినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన అందము కలుగుతుంది, నడకలో వైవిధ్యము పుట్టుతంది. ఇట్టి అమరికలు ఈ వ్యాసములో వివరించినట్లు ఛందశ్శాస్త్రములో గలవు. కాని వాటిని వెలికి ఇంతవఱకు ఎవ్వరు తీసికొని రాలేదు. ఈ నా ప్రయత్నము గానయోగ్యమైన ఛందస్సులను కల్పించుటకు సహాయకారిగా నుంటుందని భావిస్తాను.
మాండిల్‌స్టామ్ గురించి సోవియట్ రచయితల సంఘం ఎందుకు తన దగ్గిరకి రాయబారానికి రాలేదు? అని స్టాలిన్ అడిగితే, 1927 నుంచీ రచయితల సంఘం ఇటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోవటల్లేదని పాస్టర్నాక్ చెప్పాడు. ఈ విషయమై, నేను ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని ఉన్నది అని పాస్టర్నాక్ అనంగానే, స్టాలిన్ టెలిఫోను పెట్టేశాడట!
యుద్ధాల గురించి సాహిత్యంలో సాధారణంగా ప్రస్తావనలు వీరత్వాలు, భుజబలాల ప్రస్తావనల కేసి, లేదంటే కలిగే రక్తపాతం గురించి వుంటాయి. యుద్ధ ధర్మాలు, వీరారాధనలు వంటివి తప్ప యుద్ధ నిర్వహణలో హృదయం పెట్టి పని చేయగల నాయకుల ఆలోచనలు తూనిక వేసే అలవాటు మన సాహిత్యకారులకు చాలా అరుదు.
అమెరికా ఆదాయపుపన్ను గురించి ఈమాట పత్రికలో ఇంత వివరంగా చెప్పవలసిన అవసరం నిజంగా ఉన్నదా అన్నది (మీ) అసలు ప్రశ్న. ఎందుకంటే, ఈమాట శ్రద్ధగానో, అశ్రద్ధగానో చదివే పాఠకులు అమెరికాలో కన్నా తెలుగు భాష (ఏ యాస భాష అయితేనేం!) మాట్లాడే రాష్ట్రాలలోనే ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళకెందుకీ గోల?
శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఇంతవరకు లభింపలేదు. అందులోనివని కొన్ని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణములో ఒకటి, దామరాజు సోమన పేరుమీద ఒకటి పద్యాలు కనబడుతున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు పేర్కొన్నవి మరికొన్ని ఉన్నాయి. వాటి తథ్యమిథ్యావివేచన కోసం ఈ పరిశీలనమంతా ఉద్దేశింపబడుతున్నది.
ప్రతి అడుగుకీ చెయ్యవలసిన పని కేవలం ఓ గుర్తుని చదవడం, అవసరమైతే దాని స్థానంలో వేరే గుర్తుని రాసి, స్థితి మారి అటో ఇటో కదలడం. అంతే. ఈ మాత్రం చెయ్యడానికి మనిషి ఎందుకు, ఓ యంత్రాన్ని పెడితే సరిపోతుంది గదా. అదీ ట్యూరింగ్ ఆలోచన. మనిషి మనఃస్థితులని ఈ యంత్రం యాంత్రికస్థితులుగా అనుసరించాలి. ఇది కారు లాంటి యంత్రమా? గేర్లు ఉంటాయా? కరెంటు మీద నడుస్తుందా? ఇవేవీ ముఖ్యం కాదు. ఇది కేవలం గణిత భావానికి ఆకారం ఇవ్వడం. పోయి నిర్మించాలని లేదు. కాని ముఖ్యంగా గ్రహించాల్సింది – ఎలాంటి ఆల్గరిదమ్ అయినా సరే ఇలాంటి యంత్రంతో చేసెయ్యవచ్చు. మీకది నమశక్యం కాదంటే నేనర్థం చేసుకోగలను. మీకు నమ్మకం కలగాలంటే యంత్రాలతో కొన్ని లెక్కలు చేయించాలి.
గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే.
సాహిత్యంలో పూర్తి మాతృక అన్నది నిజం కాదని గుర్తిస్తే చాలు. నమ్రత ఉన్న ప్రతి కథకుడికీ ఈ విషయం తెలుసు. మంచి రచయిత అయితే, వాడి చేతిలో ఆ పాత కథే, కొత్త కొత్త ప్రతిధ్వనులని వినిపిస్తుంది. కథలో రకరకాల అందమైన లోతులు కనిపిస్తాయి. విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి.
ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!
నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.
కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ఈమాటలో ప్రతిపాదించాను. ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే అని, ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.