ఒకేపేరు పెట్టుకున్న వ్యక్తులెందరో ఉన్నా, వారందరిలో ఏ రకంగా ఒకే లక్షణాలు కనిపించవో అలాగే, ఈ కథనాలన్నింటికి రామాయణమని పేరు ఉన్నా వాటి లక్షణ స్వభావాలు వేరువేరని చెప్పవచ్చు.
Category Archive: అనువాదాలు
అతను సంచీ లోంచి ఒక పులి తోలును తీశాడు. అప్పుడే అతని గుడ్డ సంచీని మేము గమనించింది. దానిని ఒక్క క్షణంలో తన తల మీదుగా తొడుక్కొని, గడ్డం క్రింద పులి ముసుగుని లాక్కున్నాడు. తన సొంత కళ్ళతో చిరుత పులి ముఖం లోనుంచి గదిని ఒక్క క్షణం అటూ ఇటూ చూసుకున్నాడు.
రాజప్ప ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అతని తమ్ముడు బెంచి మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పేపర్. పక్కనే పొగలు చిమ్మే కాఫీ. పేపరు మీద ఉన్న చూపును తిప్పి ఒక్క నిమిషం అన్నని పరిశీలనగా చూశాడు. పొద్దున్న లేవగానే కాఫీ తాగక పోతే అన్నయ్యకి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి తెలియని విషయం కాదు.
కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. అప్పుడు తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.
వ్యాన్ని సేఠ్జీకి అప్పగించేసి ఎక్కడైనా కూర్చుని ఒంటరిగా తాగితే బాగుంటుందని అనిపించింది. టైం ఇంకా మూడే అయింది.
సెక్రటరీ మెట్లు దిగి తన కొత్త కారు కేసి దర్జాగా నడవడం వాచ్‌మాన్ చూసాడు. తన వాదనని మరోసారి వినిపించాలా లేక క్షమించమని బ్రతిమాలాలా?
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే!…” గుసగుసగా చెప్పింది అక్క.
పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ.
ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా
జడివానలా
అంతెందుకు గాలీ వానా వొస్తే
ఉంటుందని హామీ ఏమీ లేదు –
కాని ఇది నీ ఇల్లు.
ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. …”
అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.
ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.
అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.
పర్ల్ హార్బర్ దగ్ధమయ్యింది
బర్కిలీలో, మా కొట్లో
మాంసపు ముద్దల పక్కన
మేమూ తలకిందలయ్యాం
రెండవ ప్రకరణం మన ఆగంతకుడు వచ్చి వారం రోజులకు పైగా అయింది. అతనికి బండీ ఎక్కి సాయంకాలపు పార్టీలకు వెళ్ళటంతోనూ, విందులు కుడవటంతోనూ కాలం […]
(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. ) కవిత కాలజల సమన్వితమైన […]