సెక్రటరీ మెట్లు దిగి తన కొత్త కారు కేసి దర్జాగా నడవడం వాచ్‌మాన్‌ చూసాడు. తన వాదనని మరోసారి వినిపించాలా లేక క్షమించమని బ్రతిమాలాలా?

ఈ కబాయి, కుళ్ళాయిలని విజయనగర రాజులు స్వాగతించి ధరించటం, అప్పటిదాకా ఉన్న నియమాలకు విరుద్ధంగా తీసుకున్న ఒక విప్లవాత్మక చర్యగా చెప్పక తప్పదు.

వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే!…” గుసగుసగా చెప్పింది అక్క.

పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ.

ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. …”

ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.

అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.

పర్ల్ హార్బర్ దగ్ధమయ్యింది
బర్కిలీలో, మా కొట్లో
మాంసపు ముద్దల పక్కన
మేమూ తలకిందలయ్యాం

(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. ) కవిత కాలజల సమన్వితమైన […]

ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.

చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!

తాను కలుసుకున్న ప్రముఖులతో సంభాషించేటప్పుడతను ఎంతో నేర్పుగా వారిని ఉబ్బవేశాడు. అతను గవర్నరుగారితో మాట్లాడేటప్పుడు, మాటల సందర్బాన అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయాణిస్తుంటే స్వర్గంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నదనీ, ఎక్కడ చూసినా రోడ్లు పట్టుపరిచినట్టుగా ఉన్నాయని, సమర్థులైన పాలకులను నియోగించిన ప్రభుత్వం ప్రశంసనీయమైనదనీ అన్నాడు.

ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు “లెటర్స్ టు ఎయంగ్ పోయెట్” అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య చరిత్రకి ఎక్కించాయి.

కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము.

“Brahma” by Ralph Waldo Emerson రక్తతర్పణమొనరించు రాజులైన రక్తధారలు చిందించు ప్రాణులైన పుడమి జేసిన కర్మలు, పొందు బాధ దలచిరేని వారజ్ఞానధనులగుదురు నా […]