రచయిత వివరాలు

పూర్తిపేరు: సంజయ్ సుబ్రహ్మణ్యం
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

ఇంతటి విజ్ఞానాన్ని పదిమందికీ తెలియపరచటం ఎంతో కష్టమైన పని. వీఎన్నార్‌ను కేవలం తెలుగు భాషలో ఒక మూల పడున్న సాహిత్యాన్ని తర్జుమా చేసేవాడుగా తీసిపారేయడం, ప్రత్యేకించి పాశ్చాత్య విద్యాసంస్థలలో, ఎంతో సులభంగా జరిగే పని.

శైలీలక్షణం అనేది కేవలం పదాలు, వాక్యాల అర్థం తెలుసుకున్నంత మాత్రాన బోధపడదు. ఒక రచనని పుట్టించిన సాహిత్య సంప్రదాయంతో సహజమైన సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యం. అలా అని, ఇది అర్థం చేసుకోలేని అమూర్త భావన కాదు.

ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ కుమార రాముని కథ. ఈ కథ ఎప్పటిదో మనకు తెలియదు. ఈ కథ కుమార రాముడనే వీరుడు, అతన్ని ముమ్మూర్తులా పోలివున్న పోలిక రాముడనే అతని సోదరుడి, పరాక్రమాల గురించిన కథ.

చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు.

చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.

ఆధునిక చరిత్రకారులు నాయకరాజ్యాల సంగతి పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలలో భారత చరిత్ర రాసిన వారు 1565 నుంచి, 1761 వరకు ఉన్న కాలాన్ని దక్షిణభారత చరిత్రలో ఒక అంధకారయుగంలా పరిగణించారు. ఈమధ్యనే ఈ అలక్ష్యానికి బదులుగా నాయకులు, వారి కాలమంటే ఒక కొత్త ఆసక్తి కనబడుతున్నది.

ఈ పుస్తకంలో విశదీకరించినట్టుగా, నాయకరాజులు దక్షిణ భారతీయ సమాజపు భావనలోనూ, సంస్థాగత నిర్మాణంలోనూ మౌలికమైన పెద్ద మార్పుకు సాక్షులు గానూ, కొంతలో కొంతవరకూ కారణభూతులుగానూ ఉన్నారని మా వాదం.

దక్షిణ భారతీయ సాహిత్య చరిత్రలో మొదటిసారిగా రాజు యొక్క వ్యక్తిగత ధర్మాలకు, రాజ్యపాలనా ధర్మాలకు మధ్య భేదాన్ని విస్పష్టం చేసింది ఆముక్తమాల్యద.