మానవ జీవితం వన్ వే ట్రాఫిక్. ఒకవైపుకే మన ప్రయాణం. మనం అందరం చివరగా వెళ్ళేది ఒక చోటుకే. దార్లో ఎంతోమంది స్నేహితులూ మిత్రులూ కలుస్తారు, వస్తారు, మధ్యమార్గంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ‘జీవితం అంటే ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వదిలిపోయే స్నేహాలు, సహచరులు, మారిపోయే ప్రాధాన్యతలు, అనుబంధాలు… ఇదే జీవితమేమో అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ఒంటరిగా మనం.
రచయిత వివరాలు
పూర్తిపేరు: డా. చిర్రావూరి శ్యామ్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: టెక్సస్.
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: డా. చిర్రావూరి శ్యామ్ ఎం.బి.బి.ఎస్. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలోను, ఎం.డి. (మెడిసిన్) ఢిల్లీ ఎ.ఐ.ఐ.ఎం.ఎలోనూ చేశారు. డాక్టర్‍గా పలు హోదాల్లో ఢిల్లీలో మూడు దశాబ్దాలు పనిచేశారు. యు.ఎస్.లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎపిడమియాలజీ) మరియు హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ చేశారు. కథా రచయిత. ‘శ్యామ్ యానా’, ‘సరాగమాల’ మెడికో శ్యామ్ కథలుగా వెలువడ్డాయి. కొన్ని కథలు ఇతర భాషల్లోకి (ఇంగ్లీషు, హిందీ) అనువదించబడ్డాయి. ప్రస్తుతం యు.ఎస్.లో వుంటున్నారు.
మెడికో శ్యామ్ రచనలు
శాస్త్రిగారు మాకు బంధువు, చుట్టం అని మా మేనమామ పిలకా రామకృష్ణారావు పదే పదే నాకు గుర్తు చేస్తూ వుండేవాడు. అయినా నేను ఎప్పుడూ కలవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. నేను విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి కోర్టులో ఆయన్ని చూసేను. మరి నేనేమి ఆశించేనో గాని, ఆయన వాదన ఆరోజు నాకు నచ్చలేదు.
‘నడిచిన పుస్తకం మా నాన్నగారు’ అన్నాను ఒకసారి. ‘చదవడం కాక ఇంకేవైనా చేసేవారా అన్పిస్తుంది’ అన్నాను ఒకసారి. జీవితం అత్యంత విలువైనదా? సాహిత్యం జీవితంకన్నా విలువైనదా? దానిమీద నా వుద్దేశాలు చాలాసార్లు మారేయి. మారుతూనే వున్నాయి. కానీ మా నాన్నగారు సాహిత్యాన్ని జీవితంకన్నా విలువైనదిగా భావించినట్లు తోస్తుంది.