సాలూరి రా.రా భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పువుంది. నిరాడంబరజీవి.
రచయిత వివరాలు
పూర్తిపేరు: పి. బి. శ్రీనివాస్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
పి. బి. శ్రీనివాస్ రచనలు
ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్, కం నియర్ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది.
సంగీత సాహిత్యాలు రెండిటికీ సమ పాళ్ళలో ప్రాధాన్యత ఇస్తూ వరుసలు కూర్చి పాడితే లభించే మధురానుభూతి నిస్సందేహంగా అపరిమితమని నా వినీతాభిప్రాయమూ, మధురానుభవమూనూ.