రచయిత వివరాలు

తాడికొండ కె. శివకుమార శర్మ

పూర్తిపేరు: తాడికొండ కె. శివకుమార శర్మ
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

మార్నింగ్ వాక్‌లో ఎదురు వచ్చేవాళ్ళకు విషెస్ చెప్పేటప్పుడు అందరిలాగానే అతను కూడా కళ్ళల్లోకి చూస్తాడు గానీ అతనితో కొన్ని రోజులుగా ఆ అలవాటు కొనసాగుతూండడం గూర్చి ఆమె కొద్దిగా సంకోచించి తల దించుకున్న రోజే ఎదురుగా వచ్చిన అతని మాటలు తనని దాటిన తరువాతే చెవిని చేరాయని గ్రహించి తల తిప్పి చూసేసరికి అతను వేగంగా పరుగెత్తుతూ కనిపించాడు. “పోటీలకి తయారయే వయసు మించిపోలేదా?” అనుకుని ఆశ్చర్యపోయింది.

ఏప్రిల్ 2024 ఈమాట లోని మూడు రచనలపై నా స్పందన ఇది. నా ఈ విమర్శ అవసరమా అని ఎవరయినా ప్రశ్నిస్తే దానికి తిరుగు ప్రశ్న, ఆ వ్యాసాలు ప్రచురించడం ఎందుకు అవసరం? అని. సంపాదకీయంలో ప్రస్తావించబడ్డాయి గనుక – అని జవాబు. ఆ సంపాదకీయానికి అవసరం? ఒక గాయకుడికి ప్రకటించిన పురస్కారం లేపిన దుమారం. కారణం, త్యాగయ్య మీద ఆ గాయకుడి వ్యాఖ్యలని కొందరు అనుచితాలనడం.

వీడెవడో డబ్బా కారు పెట్టుకుని లెఫ్ట్ లేన్లో! ఈ కార్లో కనక అది వుండుంటే ఈ పాటికి దాన్ని చీమని విదిలించినటట్లు పక్కకు తోసేవాణ్ణి. గింగిరాలు తిరుగుతూ ఆ కారు పక్కకు దొర్లి ఏ చెట్టుకు గుద్దుకునో ఆగేది. అది విండ్‌షీల్డ్ లోంచి ముందుకు విసిరేయబడేది. అదృష్టం వుంటే తగలబడేది కూడా. ఆ కార్లో అది ఉన్నది అనుకున్నప్పుడల్లా పాదం ఆక్సిలరేటర్ని బలంగా నొక్కుతోంది. గుద్దుతుందేమో అనిపించినప్పుడు కాలు వెనక్కు లాగుతోంది.

టెస్ట్ స్ట్రిప్ మీద రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ కేరీ-ఆన్‌ లోంచి విడిచిన బట్టలని తీసి బాత్‌రూమ్‌లో ఒక మూల పడేసింది. మేకప్ తుడుచుకుని, మొహం కడుక్కుని, నైట్‌డ్రెస్‌లోకి మారి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పటికే మోగన్ నించి రెండు మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టడంవల్ల ఆమెకి తెలియలేదు. హబ్బీ అని, మోహన్ అనీ కాక ఆ పేరుతో భర్తనంబర్ లిస్ట్ చెయ్యడం తప్పితే, అతని ఇష్టానికి విరుధ్ధంగా చేసిన పని ఏదీ ఆమెకు గుర్తుకురాదు.

చుట్టుపక్కల పిల్లల్లాగే అతను పెరిగి పెద్దవాడయ్యాడు. చేతిలోకి పుస్తకం చేరింది. కాలేజీ డిగ్రీని చేతపుచ్చుకుని ఉద్యోగస్తుడయ్యాడు. పెళ్ళి చేసుకున్నాడు. అమెరికా చేరి ఇల్లు కొనుక్కున్నాడు. అతని చేతిలో పుస్తకం అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉండేది; అప్పుడప్పుడూ మాత్రం వంట చేస్తున్నప్పుడు వంటల పుస్తకం, పడకగదిలో శృంగార పుస్తకం. పుత్రులకి కారకుడయ్యాడు, పౌత్రులతో ఆడుకున్నాడు. రోజులో మిగిలిన సమయంలో పుస్తకాన్ని వదలలేదు.

ఈమాట డిసెంబర్ 2021 ముందుమాట పుస్తకావిష్కరణల పోలిక అన్న ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఈనాటి తెలుగు పుస్తకావిష్కరణల పద్ధతి ఒక ప్రహసనమే కావచ్చు. దానికి మార్పు కూడా అవసరమే కావచ్చు కానీ ‘పాశ్చాత్య పద్ధతి నవలంబించండి’ అన్న సూచన మాత్రం ఈనాటి తెలుగు రచయితల, ప్రచురణకర్తల, పుస్తకశాలల పరిస్థితిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని అనిపించడానికి కారణాలు చాలా వున్నాయి.

రివరీ లోంచి బయటపడి వాచ్ వైపు చూస్తే ఇప్పుడందులో ముళ్ళే లేవు. ఇంతలోకే ఎక్కడికి పోయాయి అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని రిపేర్ షాపువాడికి చూపించి ముళ్ళు మాయమయ్యాయంటే వాడు నమ్ముతాడా అసలు? అనుకుంటూ ముందు విడియో మానిటర్ని చూశాడు. ఇంకా సేఫ్టీ విడియో వస్తూనే వుంది. రివైండ్ అండ్ ప్లే లాగా అందులోని వ్యక్తి సీట్ బెల్ట్ పెడుతూ, తీస్తూ, పెడుతూ, తీస్తూనే వున్నాడు. డ్రింక్ కార్ట్ కోసమని వెనక్కు చూస్తే కొన్ని పసుపు పచ్చని ఆక్సిజన్ మాస్కులు వేళ్ళాడుతూ కనిపించాయి.

రాజు తన జీవితం గురించి చెప్పిన తరువాత నాకు కూడా అదే పద్యం గుర్తొచ్చి వాణ్ణడిగాను. ‘ఇండియన్లు అమెరికా జేరడమంటే ఆకాశాన్నందుకోవడమేనని నిర్ధారిస్తే, నువ్వేమిటి ఇలా ఆకాశాన్నుంచీ మెట్లు దిగుతూ వచ్చి ఇక్కడ అడవుల్లో చేరావ్? ఒక యూనివర్సిటీ వాళ్ళు కాదంటే నీకున్న పేరుతో ఇంకో యూనివర్సిటీకి వెళ్ళచ్చు. అలాగే, ఒక కాలేజీ వాళ్ళు కాదంటే ఇంకొక కాలేజీకీ, ఒక హైస్కూల్ నచ్చకపోతే ఇంకొక హైస్కూల్ వెళ్ళి వుండచ్చు గదా?’

కేవలం దుఃఖాలకీ ఆనందాలకీ తప్ప అసలైన కళా ప్రదర్శనలకి వేటికీ నిన్ను స్టేజీ ముందర కూర్చోబెట్టలేకపోయానని నాకు విచారంగా వున్నది – ఇప్పుడే కాదు, ఎప్పటినించో! నవ్వకు – నా ఖర్మ కాలి ఇలా మంచానికి బందీ నయి కళ్ళు మూతలు పడినప్పుడే నాకు సంగీతమూ, నృత్యమూ ఏవీ రావు అని గుర్తుకొచ్చి బాగవగానే ఈసారి తప్పకుండా నేర్చుకోవాలని అనిపించేది. తరువాత లేస్తానా, అదేమిటో, వాటి విషయమే పూర్తిగా మర్చిపోతాను. పోనీ, ఫాతిమాకి అవేమైనా వచ్చా?

విడవబడ్డదే తడవుగా మిలియన్ల సంఖ్యలో వాళ్ళు తమ గమ్యస్థానం వైపు పరుగెత్తడం మొదలు పెడతారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వాళ్ళ వేగాన్ని నిరోధించదు. అదృశ్య శక్తేదో వాళ్ళని ఆ గమ్యం వైపు నడుపుతూంటుంది. గమ్యం దొరక్క శక్తి ఉడిగిన తరువాత రాలిపోవడం వాళ్ళల్లో కొంతమందికి జరిగేదే. గమ్యం దొరికిన వాళ్ళకి కూడా అదొక దుర్భేద్యమైన కోట. దాన్ని ముట్టడించిన వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం ఆ కోట రక్షణ కవచాలని ఛేదించి లోపలికి ప్రవేశించ గలుగుతారు. అయితే, ప్రవేశించిన తరువాత తమ అస్థిత్వాన్ని కోల్పోతారు.

నెలరోజులిట్టే గడిచిపోయి, బంగార్రాజు కుటుంబసమేతంగా అమెరికా వెళ్ళే ఘడియ రానే వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మిగ్రేషన్ అయిపోయి, విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో కలకలం వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఒక ప్రయాణీకుణ్ణి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని గదమాయిస్తున్నారు, ఇక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదంటూ. బంగార్రాజు అతణ్ణి వెంటనే గుర్తు పట్టాడు.

భాస్కర్ భార్య అందంగా వుంటుంది. వయసు ఆమె అందాన్ని ఇనుమడింప జేసిందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎదురుగా వస్తుంటే చూపులు తిప్పుకోవడం కొంచెం కష్టం – నా వయసు వాడిక్కూడా. పధ్ధెనిమిదేళ్ళ కూతురు పక్కన ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళనుకుంటారు తెలియని వాళ్ళు.

శివయ్య పార్టీ కొత్తది కాబట్టి అప్పటికే దశాబ్దాల చరిత్ర వున్న రాజకీయ పార్టీలన్నీ కుమ్మక్కై ఆ సవాళ్ళకి జవాబులు చెప్పకూడదని నిర్ణయించుకున్నాయి. వాళ్ళ నిర్ణయాలకి కారణం, అలాంటి సవాళ్ళు విసిరింది తామెంత అవినీతిపరులో నిర్ధారించడానికి శివయ్య వేసిన ఎత్తు కావచ్చనీ, సవాళ్ళని తాము స్వీకరించగానే శివయ్య తన పనయిందని పెద్దగా నవ్వేసి ఈల వేసి గోల చేస్తాడేమోననీను.