“వెల్. ఇనఫ్ ఆఫ్ షోయింగ్ ది ఆర్గనైజేషన్ ఆన్ ది ఛార్ట్. లెట్ మి టేక్ యు అరౌండ్ అండ్ షో యు ది ఫెసిలిటీస్. దిసీజ్ ది గ్రౌండ్ ఫ్లోర్. దే మేక్ ది బేసిక్ మాడ్యూల్స్. సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ సెట్స్. మోటార్ స్కిల్స్ లాంటివి. ఇక్కడ పెద్దగా ఛాలెంజెస్ ఏవీ వుండవు. ఈ ఫ్లోర్‌లో పనిచెయ్యడం అన్నం వండడం లాంటిదన్నమాట. అంటే, వెరీ సింపుల్. బియ్యంలో నీళ్ళు పొయ్యడం, పొయ్యిమీద కాసేపుంచడం. అంతే.”
“అది కూడా అంత తేలిక కాదంటారు అన్నాన్ని మాడబెట్టిన వాళ్ళూ, మరీ నీళ్ళెక్కువ పోసి గుజ్జయ్యేదాకా వుడికించేవాళ్ళూ.”
“కరెక్ట్. పూర్తిగా ఉడకక పోవడం వల్ల పలుకుగా వుండే అవకాశం కూడా వుందందులో. సింప్లిసిటీలో కూడా కాంప్లెక్సిటీ ఈ లెవెల్లో స్పెషాల్టీ. లెట్స్ గో టూ ది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ తయారయ్యే మాడ్యూల్స్‌లో కాంప్లెక్సిటీ కొద్దిగా ఎక్కువ. దీజ్ అడ్రస్ మోర్ ఆఫ్ ఎబిలిటీ ఐటమ్స్. దటీజ్, ది ఎబిలిటీ టు డూ థింగ్స్. ది ఎబిలిటీ టు మేక్ ఎ టేబుల్, టు బ్లో గ్లాస్, టు మేక్ ఎ గోల్ఫ్ క్లబ్, టు ప్లే ఎ గేమ్, ఎట్సెటెరా. మాథమటిక్స్, సైన్స్, ఆర్ట్స్ కూడా ఇందులోకే వస్తాయి. ఇందాకటి ఉదాహరణతో పోలిస్తే, ఇది పప్పు వండడం లాంటిది. తయారయ్యేది ఉత్త పప్పయినా కావచ్చు, లేక మామిడికాయ పప్పయినా కావచ్చు. పప్పు సరిగ్గా వుడకడంతో పాటు అందులో పులుపు, ఉప్పు, కారం, అన్నీ సరిగ్గా కుదిరాయా, తిరగమోత సరిగ్గా అమిరిందా, చివరికది చిక్కటి ఘనపదార్థం లాగా వచ్చిందా లేక పల్చటి ద్రవపదార్థం లాగ తయారయిందా లాంటివి కాంప్లెక్సిటీ క్రియేట్ చేసే అంశాలు గదా!”
“మీ ఉదాహరణకి నా అనుభవాన్ని జోడించి కొద్దిగా లాగితే, ఇక్కడ పని చేసేవాళ్ళు తయారు చేసే ఏ పప్పూ ఒకే రకంగా వుండదు. పైగా, ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఆ పప్పు చెయ్యలేరు.”
“గుడ్ కంక్లూషన్!”
“వీళ్ళకి పేర్లూ అవీ…”
“పేర్లెందుకు? మహా అయితే నంబర్లు చాలవూ?”
“ఇందాకటి ఫ్లోర్‌లో చాలామంది కనిపించారు గదా, వాళ్ళ సంఖ్య ఎంతుండచ్చు?”
“నాకూ పెద్దగా అయిడియా లేదు గానీ, ఈ ఫ్లోర్‌లో వాళ్ళ సంఖ్య ఆ ఫ్లోర్‌లో వుండే వాళ్ళల్లో పది శాతం మించదనిపిస్తుంది.”
“ఏ ఫ్లోర్‌లో పనిచేసే వాళ్ళ సంఖ్య అయినా ఎప్పుడూ పెరుగుతూనే పోతుంటే ఇబ్బంది అనుకుంటా?”
“వాట్ ఆర్యూ థింకింగ్?”
“యూ ఆర్ ఆన్ ఫ్లోర్ వన్. నాకు మీరు టూర్ ఇస్తున్నారు గనుక నేను చేరబోయేది మీ ఫ్లోర్‌లో అయినా అయ్యుండాలి, లేకపోతే దాని క్రింది ఫ్లోర్ అయినా అయ్యుండాలి. అలాగే మీరు టూర్ ఇస్తున్న వాళ్ళల్లో నేను మొదటి వాడినయ్యే అవకాశం చాలా తక్కువ – ఇప్పటికే అసంఖ్యాకులకి మీరీ టూర్లని ఇచ్చి వుంటారనిపిస్తోంది. ఇలా అన్ని ఫ్లోర్‌ల లోనూ కొత్తవాళ్ళు చేరుతుంటే, పాతవాళ్ళతో కలిసి ప్రాడక్టులని తయారు చేస్తూ పోతుంటే సమస్యలు రావా అని?”
“వెల్, మై ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ టు గివ్ యు దిస్ టూర్. తరువాత నీకు అసైన్ చేసిన ఫ్లోర్‌లో నిన్ను వదిలిపెట్టడం. తరువాత నా పని నేను చేసుకోవడం.”
“ఇప్పుడు పై ఫ్లోర్‌కి వెడుతున్నట్టున్నామే?”
“ఓ! యా. యువర్ డెస్టినేషన్ ఈజ్ నాట్ దిస్ ఫ్లోర్.”
“ఈ ఫ్లోర్ సింపుల్ మీల్స్ సెక్షన్ లాంటిది. ఎందుకలా నవ్వుతున్నావ్?”
“మీ ఉపమానాలన్నీ ఆహారపదార్థాల చుట్టూ తిరుగుతున్నాయని!”
“ఆ సంగతి నీకు అర్థమవుతున్నది గనుకనే రెండు ఫ్లోర్లని దాటగలిగావు. ఇక్కడి మాడ్యూల్స్‌లో కాంప్లెక్సిటీ గూర్చి నువ్వే చెప్పు మరి.”
“ఓ కూరా, పప్పూ, అన్నమూ, పచ్చడీ, సాంబారూ, ఒక అప్పడమూ, మజ్జిగా లేక పెరుగూ — ఈ మెన్యూలో ఏ ఐటమూ బాగా కుదరకపోనూ వచ్చు, అన్నీ బ్రహ్మాండంగా కుదరనూ వచ్చు. అయితే, ఈ రెండూ కూడా ఎక్స్ట్రీమ్స్ అవడం వల్ల చాలా అరుదుగా జరిగే విషయాలు. సాధారణంగా అటు గొప్పగానూ ఇటు చెత్తగానూ లేకపోవడమే ఎక్కువగా జరుగుతూంటుంది. ఏదో ఒక ఆధరువు అద్భుతంగా వుండడమూ, ఒకటి అతి చెత్తగా వుండడమూ కూడా అంత అరుదైన విషయం కాదు.”
“నాట్ బాడ్. ఎనాలజీ ఎసైడ్ – హియర్, వన్ కెన్ ఆల్సో డిజైన్ ఎ గేమ్, ఇన్వెంట్ ఎ మెడిసిన్, క్రియేట్ ఎ ప్రొఫెషన్, ఆల్‌దో ఇటీజ్ మోర్ కామన్ ఆన్ ది నెక్స్ట్ ఫ్లోర్. దిసీజ్ ది ఫస్ట్ టైమ్ ఐ యామ్ డీలింగ్ విత్ ఏన్ ఐఐటీ గ్రాడ్యుయేట్. ఐ విల్ కాల్యూ ఐఐటి – ఇంకొకడు వచ్చేదాకా. అప్పుడు వాడికి ఐఐటి-1 అని పేరు పెడతా.”
“ఆర్యూ ఫ్రం ఎంఐటి? మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ? అక్కడ చూసినట్టనిపిస్తోంది.”
“నో. ఉస్మానియా.”
“ఈ ఫ్లోర్‌లో మళ్ళీ ఎక్కువమంది కనిపిస్తున్నారు.”
“యస్. దిసీజ్ ది సిస్టమ్స్ ఫ్లోర్. దిసీజ్ వేర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాడక్ట్ గెట్స్ సింథసైజ్‌డ్.”
“నాకొక సందేహం. ఈ ఫ్లోర్‌లో వుండేవాళ్ళు క్రింద ఫ్లోర్‌ల వాళ్ళ ప్రాడక్టులని వాడుకోవచ్చా లేక అన్నీ స్వంతంగా తయారుచేసుకోవాలా?”
“దట్స్ అప్ టు ది డిజైనర్.”
“అయితే, క్రింది ఫ్లోర్‌లల్లో తయారయిన ప్రాడక్టుల్లో మంచి వాటిని ఎన్నుకోవడానికి వీలుంటుందా?”
“పాజిబుల్. అయితే, ఆ మంచి వాటిని వెదుకుతూ కూర్చుంటే కాలం మనకోసం ఆగదు.”
“మీరు డిజైన్ చేసినవాటిల్లో అలా వెదకడానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిన సంఘటనలున్నాయా?”
“కొన్ని మాడ్యూల్స్‌కి మాత్రమే. సిస్టం మొత్తమూ అలాంటి బెస్ట్ కాంపొనెంట్లతో చేసింది లేదు. అలా ఎవరూ చెయ్యగా చూడలేదు గూడా.”
“హౌ అబౌట్ యు? మీరు ఎప్పుడయినా మీరు తయారు చేసిన కాంపొనెంట్లతోనే సిస్టమ్‌ని ఎప్పుడయినా డిజైన్ చేశారా?”
“అప్పుడప్పుడూ ఒకటో రెండో కాంపొనెంట్లని స్వంతంగా తయారుచేసుకున్నాను తప్పితే… నో. మొత్తాన్ని ఎప్పుడూ చేసింది లేదు.”
“ఎందుకని అలా?”
“ఏమో, ఒకటి రెండు బెస్ట్ కాంపొనెంట్లని వెదికి పట్టుకునేసరికో తయారు చేసుకునేసరికో కలిగిన అలసట వల్ల కావచ్చు.”
“క్రింద రెండు ఫ్లోర్‌ల లాజిక్‌నే ఇక్కడకూడా అప్లయ్ చేస్తే – మీరే తయారు చేసుకున్నా ఏ మాడ్యూలూ పర్ఫెక్టుగా వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఇది సిస్టమ్స్ సింథసిస్ జరిగే ఫ్లోర్ కాబట్టి ఒకళ్ళు డిజైన్ చేసే ప్రాడక్టు వేరేవాళ్ళు తయారు చేసే ప్రాడక్టు మీద ఆధారపడడం జరుగుతుందా?”
“లేకుండా వుండే అవకాశమే లేదు.”
“మీ ప్రాడక్టు పర్ఫార్మెన్స్‌ని మానిటర్ చేసే అవకాశ మేమయినా వున్నదా?”
“తప్పకుండా. ఉదాహరణకి, నిన్ను చూసి ఆనందించడమేగాక నిన్నిప్పుడు కలవడానికి కూడా మిస్టర్ నలందా వెయిట్ చేస్తున్నాడు.”
“ఓ ప్రాడక్టుని తయారుచెయ్యడానికి టైమ్ లిమిట్ వున్నదా?”
“దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ది ఇన్‌స్ట్రక్షన్స్.”
“మీరింతకు ముందునించీ ఇక్కడ వున్నారు కాబట్టి – ఎన్ని ప్రాడక్టులని తయారు చేసుంటారు?”
“లెక్కపెట్టమని నా ఇన్‌స్ట్రక్షన్స్ ఎప్పుడూ చెప్పలేదు.”
“పోనీ మీ ఫ్లోర్‌లో వున్న మిగతా వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌లో?”
“నాకా ఆలోచనే రాలేదు. అయినా, అక్కడికే వెడుతున్నాం గనక అడుగుదాం.”
“ఓ. మీరూ, నేనూ ఒకే ఫ్లోర్‌లో నన్నమాట పనిచేసేది!”
“వై డజ్ దట్ మాటర్?”
“మీరు నన్ను ఏ ఫ్లోర్‌లో వదిలేసి వెళ్ళినా నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు గదా, అందుకు.”
“స్టిల్. వై డజ్ దట్ మాటర్?”
“సలహాలడగడానికో, సందేహాలని తీర్చుకోవడానికో…”
“దే ఆల్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఇన్‌స్ట్రక్షన్స్.”
“ఆ ఫ్లోర్ ఎలాంటిదో గెస్ చెయ్యనా? అది డిసర్ట్‌తో కూడిన ఫుల్ మీల్ లాంటిది! మీరు పనిచేసే ఫ్లోర్ పైన ఇంకా ఫ్లోర్స్ వున్నాయా?”
“అయాం ష్యూర్ దేరీజ్ ఎట్ లీస్ట్ వన్ ఫ్లోర్. బట్, ఆ ఫ్లోర్ గురించి ఊహాగానాలే తప్ప దీన్ని దాటి ఎవరూ పైకెళ్ళగా ఎవరూ చూసింది లేదు.”
విడవబడ్డదే తడవుగా మిలియన్ల సంఖ్యలో వాళ్ళు తమ గమ్యస్థానం వైపు పరుగెత్తడం మొదలు పెడతారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వాళ్ళ వేగాన్ని నిరోధించదు. అదృశ్య శక్తేదో వాళ్ళని ఆ గమ్యం వైపు నడుపుతూంటుంది. గమ్యం దొరక్క శక్తి ఉడిగిన తరువాత రాలిపోవడం వాళ్ళల్లో కొంతమందికి జరిగేదే. గమ్యం దొరికిన వాళ్ళకి కూడా అదొక దుర్భేద్యమైన కోట. దాన్ని ముట్టడించిన వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం ఆ కోట రక్షణ కవచాలని ఛేదించి లోపలికి ప్రవేశించ గలుగుతారు. అయితే, ప్రవేశించిన తరువాత తమ అస్థిత్వాన్ని కోల్పోతారు.
ఇన్‌స్ట్రక్షన్స్! ఇన్‌స్ట్రక్షన్స్! సో… మెనీ! కొన్నింటి మధ్యలో కొంతన్నా వ్యవధి వుంటుంది. కొన్నింటి కయితే ఊపిరి తీసుకునే అవకాశం కూడా వుండదు. అన్నింటికీ ఎటామిక్ క్లాక్ ప్రిసిషన్. అన్నింటికీ ఎలక్ట్రాన్ స్పిన్ స్పీడ్‌తో సంబంధం.
అసంఖ్యాకంగా స్టోరేజ్ బిన్లు చేతికందుతున్నయ్. వాటిల్లోంచి చాలా సార్లు చెయ్యి అసంకల్పితంగా ఓ మాడ్యూల్ దొరక పుచ్చుకుని ఎగరేసే నిచ్చెననో, ఎక్కుతూండగానే మారే మెట్ల వరసనో, లేక పడవేసే పామునో పేరుస్తోంది. టైమ్ లేదని అతనికి చెమట్లు పడుతున్నయ్ గానీ అతను చేస్తున్న ప్రోగ్రామ్‌కి మాత్రం బోల్డంత టైమ్. అతని ప్రాడక్ట్ తన పేరు ధేనువకొండ గంగాధరం అని గ్రహించింది. ఇక మిగిలినవి వివరాలు…