నేను అతిశయోక్తిగా చెప్పడం కాదిది. కానీ మేధావులు పుట్టడమే ప్రత్యేకంగా పుడతారు. ఎంతో దూరం నుంచి చూస్తున్న నాకు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యావరణంలో ముగ్గురంటే ముగ్గురే అందరికంటే ఉన్నతంగా కనిపిస్తారు. వారు గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, వెల్చేరు నారాయణ రావు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: డేవిడ్ షూల్మన్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
డేవిడ్ షూల్మన్ రచనలు
శైలీలక్షణం అనేది కేవలం పదాలు, వాక్యాల అర్థం తెలుసుకున్నంత మాత్రాన బోధపడదు. ఒక రచనని పుట్టించిన సాహిత్య సంప్రదాయంతో సహజమైన సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యం. అలా అని, ఇది అర్థం చేసుకోలేని అమూర్త భావన కాదు.
ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ కుమార రాముని కథ. ఈ కథ ఎప్పటిదో మనకు తెలియదు. ఈ కథ కుమార రాముడనే వీరుడు, అతన్ని ముమ్మూర్తులా పోలివున్న పోలిక రాముడనే అతని సోదరుడి, పరాక్రమాల గురించిన కథ.
చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు.
చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.
అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్ళకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది.
దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం.
ఆధునిక చరిత్రకారులు నాయకరాజ్యాల సంగతి పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలలో భారత చరిత్ర రాసిన వారు 1565 నుంచి, 1761 వరకు ఉన్న కాలాన్ని దక్షిణభారత చరిత్రలో ఒక అంధకారయుగంలా పరిగణించారు. ఈమధ్యనే ఈ అలక్ష్యానికి బదులుగా నాయకులు, వారి కాలమంటే ఒక కొత్త ఆసక్తి కనబడుతున్నది.
ఈ పుస్తకంలో విశదీకరించినట్టుగా, నాయకరాజులు దక్షిణ భారతీయ సమాజపు భావనలోనూ, సంస్థాగత నిర్మాణంలోనూ మౌలికమైన పెద్ద మార్పుకు సాక్షులు గానూ, కొంతలో కొంతవరకూ కారణభూతులుగానూ ఉన్నారని మా వాదం.