సంస్కృతంలో గద్యప్రబంధనిర్మాణానికి ప్రాతిపదికమైన కృషిచేసిన మహాత్ములలో సుబంధుడొక స్వప్రకాశచైతన్యోపలక్షణుడు. కాళిదాసానంతరయుగీనులలో ఆయన వాక్పరిస్పందనైపుణ్యానికి వశంవదులు కాని మహాకవులు లేరంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుశకం 150 నాటి రుద్రదాముడు తన గిర్నార్ శాసనంలో ఉదాత్తమైన కవిత్వరచనకు లక్షణాదర్శప్రాయంగా నిర్వర్ణించిన గద్య శైలికి సాహిత్యశాస్త్రంలో మనఃస్ఫూర్తిగా పేర్కొనదగినవాడు ఆయనే.
రచయిత వివరాలు
పూర్తిపేరు: ఏల్చూరి మురళీధరరావుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: ఢిల్లీ
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.
ఏల్చూరి మురళీధరరావు రచనలు
ఆంధ్ర మహాకవులు సంస్కృతం నుంచి తెలుగులోకి కావ్యాన్ని పరివర్తించేటప్పుడు భాషాంతరీకరణంలో వారు అనుసరించిన శాస్త్రీయమార్గాలేమిటి? వారు చేసిన ప్రాతిపదిక కృషిస్వరూపం ఏమిటి? అందుకు మార్గదర్శకసూత్రాలు ఏమున్నాయి? అని వివరించినవారు లేరు. తెలుగులో ఆ ప్రకారం తన అనువాదసరణిని సవిస్తరంగా పేర్కొన్న ఒకే ఒక్క మహాకవి శ్రీనాథుడని ప్రసిద్ధి.
ఆంధ్రకవి అన్నది రాయల దృష్టిలో ఒక అపురూపమైన గౌరవం. పుట్టినప్పటి నుంచి నేర్చుకొన్న అమరభాషను, తరతరాలుగా ఇంటిలో వెలిసిన తుళు వాక్తతిని, కమనీయమైన కన్నడ కస్తూరిని, విష్ణుచిత్తీయ తమిళాన్ని కాదని, తనకెంతో ఆభిమానికమైన ఆంధ్రభాషకు పట్టాభిషేకం చేసి, ఆ భాషలో ఆముక్తమాల్యద విరచించిన రాయల నోట వెలువడిన అనర్ఘమైన గౌరవవాచకం అది.
పోతనగారు శ్రీమహాభాగవతంలో మూలాతిరిక్తంగా కనీసం ముప్ఫై – నలభై గ్రంథాల నుంచి డెబ్భై దాకా అనువాదాలను చేశారు. అమోఘమైన ఈ పద్యానికి మూలం సంస్కృత భాగవతంలో లేదు. రుయ్యకుని అలంకారసర్వస్వానికి జయరథుడు కూర్చిన విమర్శినీ వ్యాఖ్యలో సారాలంకార వివరణ వద్ద ఉదాహృతమై ఉన్నది. పోతనగారి బహుగ్రంథశీలితకు, విశాలమైన వైదుష్యానికి, విపులపాండిత్యానికి నిదర్శకమైన మహాద్భుతఘట్టం ఇది.
ఇది భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, ఇటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. ఆంధ్రభాషలో పాండిత్యం కోసం కావ్యనాటకసాహిత్యాలలోని వ్యాకరణ ఛందోలంకార శాస్త్రాధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు, పాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం!
ప్రబంధరాజంలో వేంకటకవి కావించిన సంస్కృత శ్లోకానువాదాలను గురించి ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది. వేంకటకవి ఆ పద్యాన్ని ఏదో సంస్కృతశ్లోకానికి అనువాదంగా కాక, తన ముందున్న ఏదో తెలుగు పద్యాన్నే పర్యాయపదాలతో మార్చి చెప్పివుంటాడనే నమ్మకం వల్ల అలా గుర్తుపట్టిన కొన్నింటిలో ముఖ్యమైనవాటిని ఈ 2వ ప్రకరణంలో వివరిస్తాను.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఇంతవరకు లభింపలేదు. అందులోనివని కొన్ని కొన్ని పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణములో ఒకటి, దామరాజు సోమన పేరుమీద ఒకటి పద్యాలు కనబడుతున్నాయి. ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు పేర్కొన్నవి మరికొన్ని ఉన్నాయి. వాటి తథ్యమిథ్యావివేచన కోసం ఈ పరిశీలనమంతా ఉద్దేశింపబడుతున్నది.
కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ఈమాటలో ప్రతిపాదించాను. ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే అని, ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.
గంగనార్యుడు, పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా పద్యాన్ని కదనుతొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువుతీరింది. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.
ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో –-
కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.
— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట.
రదము అంటే దంతము. నాయిక పలువరుసతో అప్పుడు ‘కోరకము’ పోటీకి దిగింది. కోరకము అంటే పూవుమొగ్గ. ఆ కోరకము రదముతో సాటి కాలేకపోయింది. ఓటమి మూలాన ‘అరగతి’ని పొందింది. అరగతి అంటే ఛిన్నాభిన్నమైన దన్నమాట. అరగతి అంటే అ’ర’గతి. ర అన్న అక్షరం లేకుండా పోయిందన్నమాట. రేఫలోపం వల్ల ‘కోరకము’ అప్పుడు ‘కోకము’ అయింది.
క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు.
కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు.
ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట.
ఇంతకీ జరిగిందేమిటంటే; అంబుధరం వేనలికి సాటి రాలేక ఇరువ్రయ్యలైనపుడు ఆ దేవతలూ, ఆ విద్వాంసులూ, తదంశముల్ పూని అంటే, ఆ పదాల అర్థాంతరాలను గ్రహించి, సమతఁ బోల్చిరి తత్సతి దృక్కుచంబులన్. వాటిని ఆమె చూపులతోనూ, ఆమె వక్షోజములతోనూ సాటి చేసి, ఎంతో కొంత ఊరటను కల్పించారు.
శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని గుర్తుంచుకోవటానికి ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది విద్యార్థులకు రాగస్వరూపాన్ని సులభంగా నేర్పాలని చేసిన ప్రయత్నం. వెంటనే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, విశ్వనాథన్, వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.