పెళ్ళాడటానికి ప్రేమ ఒక్కటే అర్హతగా నిలిస్తే బాగుంటుంది కాని, మానవ సహజమైన కుతూహలం అవతలి వ్యక్తిలోని ప్రత్యేకతలు తెలుసుకోనిదే, ఎందెందులో అతడు/ఆమె తనకు సరిజోడో తెలుసుకోనిదే అంత త్వరగా శాంతించదు. తృప్తి చెందదు. ఈ కథానాయకుడు అలాంటి కుతూహలపరుడు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: ఈమాట సంపాదకులుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
ఈమాట సంపాదకులు రచనలు
రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!
ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే నవల
ఇస్మాయిల్‍గారు టాగూర్‌ను సదాబాలకులు అన్నారని మనకు తెలుసు. అయితే మంచి కవులందరూ సదాబాలకులే. వాళ్ళలో పసితనపు సమ్మోహనత్వమేదో నిలిచే ఉంటుంది. ఆ పసితనపు స్వచ్ఛత సూదంటురాయిలా ఆకర్షించినట్టు, వీళ్ళ కవిత్వం కూడా పాఠకులను లాగుతూ ఉంటుంది. ఈ సంపుటిలో కూడా ఇదే ప్రధాన ఆకర్షణ.
ఇది తన అమాయకపుకళ్ళతో చుట్టూ జరిగే జీవితాన్ని సునిశితంగా గమనించిన పిల్ల కథ. ఆ అమ్మాయి ఎక్కడా ఎవ్వరినీ నిలదీసినట్టు కనపడకపోవచ్చు; ఎదురుతిరిగి ఎవ్వరితోనూ పోట్లాడినట్టు కనపడకపోవచ్చు. కానీ తన ఎరుకలో ఒక మనిషిని మరో మనిషి గాయపరిచిన ప్రతిసారీ, అది తిరస్కారంగా పుస్తకంలో కనపడుతూనే ఉంది.
ఇవి ప్రయత్నం మీదనైనా అందరూ రాయగలిగిన కథలు కావు. ఇందులో ఉన్నదేమీ వెక్కిరింపో దూషణో కాదు. మొదట్లోనే చెప్పినట్టు చాలా అరుదైన, కథ చెప్పే ధోరణికి అద్దంపట్టే కథలు. హాయిగా, మిత్రుడితో సాగే ఆత్మీయ సంభాషణలా, లేనిపోని మర్యాదలూ నటనలూ పక్కన పెట్టి, దాపరికం లేకుండా కులాసాగా మాట్లాడుకున్న ముచ్చట్లు.
చిత్రంగా వినిపించినా, ఈ సంకలనం కవిత్వ పాఠకుల కన్నా కవులకే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తెలుగులో కవిత్వం రాస్తున్నవాళ్ళందరూ వాదాలకతీతంగా చదివి చూడాల్సిన పుస్తకమిది. ఈ కొత్త పోకడల కవిత్వ రీతులను అధ్యయనం చెయ్యాలి. మూసలు బద్దలు కొట్టిన తీరును గమనించాలి. వస్తువుతో కవి ఎంత నిజాయితీగా మమేకమైతే కొత్త అభివ్యక్తి వస్తుందో అర్థంచేసుకోవాలి.
కవితలో వడి ఒకేలా ఉన్నా పోలికల్లో తేలిగ్గా కొరుకుడుపడని సంబంధం, సామ్యం కొన్ని చోట్ల ఇబ్బందిపెడతాయి. వినూత్నమైన, పూర్తిగా తనకు సొంతమైన కల్పనాశక్తితో రాసిన పాదాలు కవితల్లో స్పష్టంగా కనపడుతాయి. ఈ కాలపు మానసికావస్థలకు తగ్గట్టుగా తిప్పుకున్నవా అనిపించే అబ్‌స్ట్రాక్ట్ భావనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఈ సంపుటిలోని కథలన్నీ ఆధునిక జీవితపు సంక్లిష్టతనూ, ఈ కాలపు స్వేచ్ఛతో ముడిపడి ఉన్న సందిగ్ధావస్థనూ చిరపరిచితమనిపించే కథాంశాలతోనూ, సన్నివేశాలతోనూ నేర్పుగా అల్లుకున్నవి. సమతుల్యం లేని ఆలోచనల పునాదుల మీద నిర్మించుకున్న జీవనసౌధం కుదురుగా నిలబడదని చెప్పే ఈ కాలపు కథల అవసరం ఇప్పుడు మరీ కనపడుతోంది.
ఆత్మనొక దివ్వెగా యే సౌందర్యం పాదాల చెంత ఉంచాలో వెదుక్కుంటూ వెళ్ళిన అన్వేషకుడి కథ, మూలా సుబ్రహ్మణ్యం నవల ఆత్మనొక దివ్వెగా; తెలుగు మాండలీకాల అందానికి అద్దం పట్టే కథలు ఎండపల్లి భారతి ఎదారి బ్రతుకులు; అమెరికా మ్యూజియంలలో ఏం చూడాలో తెలీనివారికి, కరదీపిక రొంపిచెర్ల భార్గవిగారి ఒక భార్గవి-రెండు ప్రయాణాలు.
సృజనలో అసందర్భంగానైనా, అసంబద్ధంగానైనా తాము చెప్పదల్చుకున్నది చొప్పించే కళాకారులు చుట్టూ ఉన్న ప్రస్తుత కాలంలో, కళ కళ కోసమే అన్న భావనను ఇంత బలంగా చిత్రించిన నవల రావడమే ఆశ్చర్యం. ఒకసారి సృజన నీ నుండి వేరు పడ్డాక, అదిక నీది కాబోదన్న మాటలను, రచయిత పండించుకున్న విధానమిది.
నిజానికి ప్రతి మనిషి మనసూ ఒక యుద్ధ రంగమే. ప్రత్యర్థులూ, పరిష్కారాలూ, కొండొకచో ఒప్పంద మార్గాలూ మారుతూ ఉంటాయంతే. నేరుగా వస్తున్న కథల్లోనైనా, అనువాదాల్లోనైనా, అరిగిపోయిన వస్తువుగా కనపడుతోన్న స్త్రీ పురుష సంబంధాలను దాటి, విభిన్నమైన వస్తువులతో ముడిపడ్డ కథల ఎంపిక పాఠకులకు తెరిపినిస్తుంది.
తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.
ప్రముఖ రచయిత సాదత్ హసన్ మంటో పై నందితా దాస్ తీస్తున్న చిత్రం నుంచి ఒక చిన్న సన్నివేశం షార్ట్‌ఫిల్మ్‌గా ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మొదటిసారి ప్రదర్శింపబడినప్పటినుంచి ఎందరో అభిమానులను మూటకట్టుకుంది. నవాజుద్దీన్ సిద్దీకీ మంటోగా నటించిన ఈ సినిమా టీజర్‌లో మంటో భావప్రకటనా స్వేచ్ఛ గురించి, తన రచనల గురించి మాట్లాడతాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ తోపాటు పాఠకుల కోసం మంటో ప్రసంగానికి తెలుగు అనువాదం కూడా జతచేశాం.
వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం ఒక పిడుగుపాటు. ఈమాటకు రోహిణీప్రసాద్ లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.