రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)

రచన: ఈమాట సంపాదకులు
సెప్టెంబర్ 2012

రోహిణీప్రసాద్‌ కిమ్స్‌లో తనకు జరగాల్సిన సర్జరీ కొంతకాలం వాయిదా వేశారనీ, ఏడాది తిరగకముందే న్యూ ఆర్లియన్స్‌కి వచ్చేసి సెటిల్ అవుతాననీ చెప్పి నెల కూడా కాలేదు. ఇంతలో ఈ దుర్వార్త. ఆయనను వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో రోహిణీప్రసాద్ తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ ఇది పెద్ద పిడుగుపాటు. ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.

రోహిణీప్రసాద్‌గారి రచనల విస్తృతి, శైలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్‌ని సామాన్యులకు అందించడానికి, ఆయన వ్రాసిన ప్రతీ పుస్తకమూ ఆయన హేతువాద దృష్టిని తేటతెల్లం చేసింది. హిందూస్తానీ సంగీతంపై ఆయన ఈమాటలో వ్రాసిన వ్యాసాలకు సాటి లేదు. హిందూస్తానీ సంగీతాన్నిసరళమైన భాషలో వివరించడం; హిందూస్తానీ సంగీత విద్వాంసుల గురించి తనకున్న వ్యక్తిగత అనుబంధాలను ప్రస్తావిస్తూ ఇంకెవరూ ఇవ్వలేని ఒక పరిచిత ధోరణితో వ్రాయడం ద్వారా ఆ విద్వాంసులని పాఠకులకు దగ్గర చేయడం; హిందూస్తానీ సంగీతశాస్త్రాన్ని జనసామాన్యమైన ఉదాహరణలతో అర్థమయేలా వివరించి చెప్పడం – ఇలా ఈ మూడూ రకాల వ్యాసాలతో హిందూస్తానీ సంగీతాన్ని ఈమాట పాఠకులకు దగ్గర చేశారు రోహిణీప్రసాద్. హిందూస్తానీ సంగీతంలో పద్ధతులని వివరిస్తూ ఈమాటలో వరుసగా వ్యాసాలు వ్రాయించాలని ఆయనతో మేము చేస్తున్న చర్చ ఇంకా పూర్తి కాలేదు. ఇంక కాలేదు.

We miss him dearly!

వేలూరి వేంకటేశ్వర రావు
శంఖవరం పాణిని
మాౘవరం మాధవ్

    
   

10అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    నాగరాజు రవీందర్ September 9, 2012 9:42 pm

    నేను నా బ్లాగులో “సవాయి గంధర్వ సంగీత మహోత్సవం” గురించి వ్రాస్తే , శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు స్పందించి ఇలా వ్రాశారు. 

    Rohiniprasad said:

    మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.
    January 6, 2010 8:07 PM  

    ఇది నేనెప్పుడూ మరచిపోలేను. దీనిని నేను ఒక అపురూపమైన వ్యాఖ్యగా భావిస్తాను ఎప్పటికీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ … 

  2. 2
    ravikiran timmireddy September 10, 2012 6:37 pm

    పోయిన ఏడే రోహిణీ ప్రసాద్ గారు న్యూయార్క్ కి వచ్చినప్పుడు కలవడం జరిగింది. ఆరోగ్యం గా ఉషారుగా ఉన్నేరు. ఇక్కడ హిందుస్తాన్నీ సంగీతం, సినిమా సంగీతం గురించి ఒక చిన్న సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒక కీ బోర్డు ముందర పెట్టుకుని పాడుతూ, మాట్లాడుతూ, విపులీకరిస్తూ దాదాపు మూడు గంటల సేపు శ్రోతలని అలరించారు. మళ్ళా ఇండియా కి తిరిగిపోయేప్పుడు వస్తానన్నారు, కానీ రాలేకపోయేరు. ఇప్పుడిక ఎప్పటికీ రారు.

    ఒక గొప్ప వ్యక్తికి కొడుకుగా వుండటం లో ఒక పెద్ద సమస్య వుంది. నాన నీడలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. అది కూడా కుటుంబరావంత గొప్ప మనిషి నీడ నుంచి బయటపడి, తనకు తనుగా తన పేరు నిలబెట్టుకోవటం ఒక గొప్ప విషయం. సైంటిస్టుగా, సితార విధ్వాంసుడిగా, ఒక హేతువాదిగా, రచయితగా, సంగీతాన్ని, సైన్సు ని పామర లోకానికి పరిచయం చేసిన ఒక గొప్ప మనీషి శ్రీ రోహిణీ ప్రసాద్ గారు.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  3. 3
    తః తః September 11, 2012 2:24 am

    రొహిణీ ప్రసాద్ గురించి మొన్ననే అనుకున్నాను ఆయన రచనలూ అభిప్రాయలూ కనిపించడం లెదేమని. ఆయన లేరన్నది పెద్ద వెలితి. ఇంత చిన్నతనం లో యెందుకు వెళ్ళిపొయారాయన ఆయన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లొ విద్యార్ధిగా హాస్టల్ గది లొ సితారు వాదన గుర్తొస్తొంది. అవును “ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.”
    తః తః

  4. 4
    కె.రాజశేఖర రాజు September 12, 2012 5:08 am

    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.

    “ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ ఇది పెద్ద పిడుగుపాటు. ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.”

    ఒక్క మాటలో ఆయనను కోల్పోయిన లోటు, నష్టం తీవ్రతగురించి చెప్పేశారు.

    ఆయన రాసిన సైన్స్ వ్యాసాలు కొన్ని పుస్తకాల రూపంలో అందుతున్నాయి. భారతీయ సంగీతరీతులు, సంగీతజ్ఞులు, లలిత, చిత్ర సంగీతంపై ఆయన ఈమాట.కామ్‌లో ప్రచురించిన వెలకట్టలేని రచనలను ఒక పుస్తకం రూపంలోకి తెచ్చే విషయాన్ని మీరు ఆలోచించగలరా?

    నెట్‌లో ఆయన రచనలు చూడడానికి, చదవటానికీ నేటికీ అనేక పరిమితులున్నాయి. మరింతమందికి ఆయన ఆలోచనలు అందాలంటే ఈ సైట్‌లో ఉన్న రచనలు ముద్రణ రూపం దాల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  5. 5
    Vaidehi Sasidhar September 13, 2012 9:45 pm

    చాలా విషాదకరమైన వార్త.
    రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు ఈమాట లో ఇక కనిపించవంటే నమ్మలేకపోతున్నాను .
    వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి .

  6. 6
    srinivasaraov,khammam September 14, 2012 12:37 pm

    చాలా బాథ గా వుంది.

  7. 7
    narayana September 14, 2012 9:51 pm

    సైన్స్ కు సంబంధించి డాక్టర్ రోహిణి ప్రసాద్ గారు వ్రాసిన వ్యాసాలు చదివాక, ఆయన మీద ఎనలేని గౌరవం ఏర్పడి పోయింది. ఆ వ్యాసాలన్నీ ఒక మితృడో, శ్రేయోభిలాషో ఎంతో ఓపికతో చెబుతున్నట్టు ఉంటాయి. ఎప్పటినుండో ఆయనలో నిక్షిప్తమైన ఆలోచనల నుండి అవలా Spontaneous గా జాలువారిపోతుంటాయి. వాటి అమరికని బట్టే ఆ సంగతి చెప్పవచ్చును.

    మానవాళికి అర్ధవంతమైన తెలివితో కూడుకున్న జ్ఞానం ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎప్పుడూ పరిపూర్ణ నిస్వార్దపరులై ఉంటారు. ఆయన లేని లోటు తీరేది కాదు. చాలా కాలం తరువాత ఒక మనిషి పోవటం గురించి ఈ రకంగా బాధ పడ్డాను.

    నారాయణ గరిమెళ్ళ.

  8. 8
    T.Raja gopal September 18, 2012 11:46 pm

    Sri Rohiniprasad gari sudden demise is a great loss to all Music lovers.
    He is a great Human being with Multiple Talents.
    We used have musical meets at his residence at hyd and learn many interesting thing on Music.
    We all miss him a lot.
    Rarely such great persons take birth.
    May his soul rest in Peace.

  9. 9
    ప్రయాగ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి September 19, 2012 6:53 am

    రోహిణీ ప్రసాద్ గారి అకాల మరణం నాకు చాల విచారం కలిగించింది. ‘ఈమాట’ లో మన భారతీయ సాంప్రదాయ మరియు సినిమా సంగీతం మీద వారి వ్యాసాలు ఎంతో విలువైనవిగా నేను భావిస్తాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగజేయాలని కోరుకొంటున్నాను.

    శాస్త్రి

  10. 10
    Siddineni Bhava Narayaan November 11, 2012 1:09 am

    You had been expecting an article, interpreting a set of nuances of a niche in classical music or focusing on a given aspect of a musical trait. To be awed at new piece of information, freshly unearthed And you had been bracing to differ on a particular shade of appraisal offered with a tone of finality..

    It is cruel irony that you are proffered,, in place of an a article by Rohoni Prasad garu with news of his untimely demise.

    Siddineni Bhava Narayana.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)
  • పుస్తక పరిచయాలు
  • పుస్తక పరిచయాలు
  • పుస్తక పరిచయాలు
  • పుస్తక పరిచయాలు

ఇటువంటివే…

  1. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా?
  2. కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం
  3. ఈమాట మే 2012 సంచికకు స్వాగతం!
  4. ఈమాట జనవరి 2012 సంచికకు స్వాగతం
  5. ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం!

సెప్టెంబర్ 2012 సంచికలో ...

  • ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం!
  • ఒక సరళ నిర్వచనం
  • కాల్వీనో కథల నుంచి – 5
  • కిటికీ
  • కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)
  • గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి
  • చెట్టు కింది మనుషులు
  • ఛందస్సులో గణితాంశములు
  • జానపద చిత్రకళాకారుడు జామినీ రాయ్
  • జీవిత నవల – 2
  • తథాస్తు
  • నా కోరిక, నా ప్రార్థన
  • నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన
  • నువ్వే నేననీ…
  • మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి
  • వర్ష రచన
  • విలువలు: కథ నచ్చిన కారణం
  • విశ్వనాథగారితో వేదాంత చర్చ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి
విలువలు: కథ నచ్చిన కారణం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.