ప్రముఖ రచయిత సాదత్ హసన్ మంటో పై నందితా దాస్ తీస్తున్న చిత్రం నుంచి ఒక చిన్న సన్నివేశం షార్ట్‌ఫిల్మ్‌గా ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మొదటిసారి ప్రదర్శింపబడినప్పటినుంచి ఎందరో అభిమానులను మూటకట్టుకుంది. నవాజుద్దీన్ సిద్దీకీ మంటోగా నటించిన ఈ సినిమా టీజర్‌లో మంటో భావప్రకటనా స్వేచ్ఛ గురించి, తన రచనల గురించి మాట్లాడతాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ తోపాటు పాఠకుల కోసం మంటో ప్రసంగానికి తెలుగు అనువాదం కూడా జతచేశాం.

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు.

తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, శ్రీపతి, గౌరి కృపానందన్‌ల ప్రసంగాల వీడియోలు.

శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చేసిన ప్రసంగపు వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం