అనిత్యం

ఒక్క రాత్రిలో

పర్వతాలను కదిలించకు

మహావృక్షాలను పెకలించకు

నిశాగానం విను

అరమూసిన కన్నులతో

నడిరేయి నల్లని సంగీతాన్ని గ్రోలు

నురగల అంతరంగం..అలల సద్దు

మెరిసే గవ్వలు..మోగే శంఖాలు

తడిచిన ఇసుక మీద..

బుడగలతో అంతర్దానమవుతున్న

పాదాల ముద్రలు..

నిమీలిత నేత్రాలతో

నిశ్శబ్దంగా వీక్షించు

నిద్రించు

స్వప్నవ్యూహాల అభిమన్యూ..

రేపు..జలతారు మబ్బు!

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...