తేనెటీగలు లేచిపోతాయి…
కబోదికళ్ళతో మైనం తుట్టె మిగిలిపోతుంది
విందు ముగిసిపోతుంది…
ఖాళీగాజు గ్లాసు స్వగతం వినిపిస్తుంది
బస్సూ బయలుదేరి వెళ్ళిపోతుంది…
అరటితొక్క కాలుజారి పడే వారి కోసం ఎదురు చూస్తుంది
లైటార్పి..తలుపుకు తాళం వేసి..నేనూ బయట పడతానా!
గదిలో చీకటి గప్‌చిప్‌గా తన పనిలో తాను మునిగిపోతుంది
చివరికి నేనూ వెళిపోతానా…
చిరునామా రాయని పోస్ట్‌చేయని ఉత్తరం..నిశ్చలంగా నిలిచిపోతుంది.