పూరకం

ఇంకిపోయిన నదిని లేచిరమ్మని కోరకు

రాలిపోయిన నవ్వులను తిరిగి జీవించమని కోరకు

ఏదో చప్పరిస్తూ..ఏ తీపి మిఠాయినో గుర్తుచేసుకోకు..

బావిలో కదిలే ప్రతిబింబాలను చిత్రించకు

పాత ఉత్తరాలు..చెరిగిన పాదముద్రలు..స్పర్శించకు

తుఫాను గాలికి కూలిన పక్షిగూళ్ళు..చితికిన గుడ్లు

బాధను పాటగా అనువదించకు..

జారేనేల మీద మోపిన పాదం..వారించకు

వేణువులో వాయువు..ఏకాంతం ..భంగం చేయకు

మూసుకొనే సాయంత్ర నేత్రం..తెరువకు

పరచుకొన్న ఛాయలు తవ్వి పెకలించకు

వాయిద్యం కోసం వెదుకకు

నీలో నీవు నర్తించకు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...