పిల్లలకే కాదు, రిటైర్మెంట్ తరువాత పెద్దల కోసం కూడా ఇలాంటి శిబిరాలు అవసరం అనిపించింది అనురాధగారు. Afterall అరవయ్యో ఏటి దాకా ఒకొప్పుడు ఆ తరువాత కూడా బాధ్యతలతో సతమతవుతున్న వారికి మీరు చెప్పినటువంటి శిబిరాలు ఉంటే వయోవృద్దులకి మంచి కాలక్షేపం. మీ కథ మంచి స్పందన ఆలోచనలు కలిగిస్తుంది. అభనందనలు.
మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ పర్సన్. ఒక పెగ్ తాగి ఆయన సర్వీస్‌లో జరిగిన అనుభవాలు కధలు కధలుగా చెబుతుంటే విన్నప్పుడు కలిగే అనుభూతి ఆయన పోయాకా మిస్ అయ్యాం. మీ కధలు చదువుతుంటే ఆరోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఆయన కూడా పాడేవారు, మౌత్ఆర్గన్ వాయించేవారు.
సగం వాన గురించి జూలూరి శైలజ, హైదరాబాద్. గారి అభిప్రాయం:
09/01/2023 11:04 pm
కాలం వేళ్ళ సందుల్లోంచి జీవితాలు జారుతున్నట్టు* ప్రారంభమే అద్భుతంగా ఉంది. మొత్తంగా మీ కవిత భావస్ఫోరకంగా అందంగా ఉంది👏👏👌👌
శ్రీరామనాథ్‌గారూ,
మంచి కవి, భావుకుడూ అయిన కవిని పరిచయం చేశారు. ధన్యవాదాలు. చల్లా సీతారామాంజనేయులుగారు, గురుమిత్రులు శ్రీ యెరికలపూడి సుబ్రహ్మణ్యశర్మగారు దగ్గర దగ్గర ఇళ్ళలో ఉండేవారు. వారు హిందీ పండిట్. ఒకప్పటి సత్యనారాయణపురం రైల్వేస్టేషను దగ్గర నల్లగేటు నుండి బాబూరావు మేడ దగ్గరికి వెళ్ళే దారిలో ఒక ట్యుటోరియల్ కాలేజీ కొంత కాలం నడిపేరు. తర్వాత ఆయనకి ఉద్యోగం రావటంతో దానిని మూసేసి వెళ్ళిపోయారు. 1975లో కాకతాళీయంగా వారితో శ్రీ శర్మగారి ద్వారా పరిచయం అయింది. మాటల సందర్భంలో ఒకసారి ఆయన చెప్పిన ఈ పద్యం ఇప్పటికీ గుర్తుండిపోయింది:
అనాదిగా గురించి డాక్టర్ కె.జి. వేణు గారి అభిప్రాయం:
09/02/2023 2:36 am
కవిత చాలా బాగుంది. అద్భుతమైన భావవ్యక్తీకరణ. కవికి అభినందనలు.
నిండు వేసవి గురించి Akshara గారి అభిప్రాయం:
09/02/2023 2:25 am
పిల్లలకే కాదు, రిటైర్మెంట్ తరువాత పెద్దల కోసం కూడా ఇలాంటి శిబిరాలు అవసరం అనిపించింది అనురాధగారు. Afterall అరవయ్యో ఏటి దాకా ఒకొప్పుడు ఆ తరువాత కూడా బాధ్యతలతో సతమతవుతున్న వారికి మీరు చెప్పినటువంటి శిబిరాలు ఉంటే వయోవృద్దులకి మంచి కాలక్షేపం. మీ కథ మంచి స్పందన ఆలోచనలు కలిగిస్తుంది. అభనందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: ఒంటరి పాట గురించి హైమ గారి అభిప్రాయం:
09/01/2023 11:40 pm
మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ పర్సన్. ఒక పెగ్ తాగి ఆయన సర్వీస్‌లో జరిగిన అనుభవాలు కధలు కధలుగా చెబుతుంటే విన్నప్పుడు కలిగే అనుభూతి ఆయన పోయాకా మిస్ అయ్యాం. మీ కధలు చదువుతుంటే ఆరోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఆయన కూడా పాడేవారు, మౌత్ఆర్గన్ వాయించేవారు.
సగం వాన గురించి జూలూరి శైలజ, హైదరాబాద్. గారి అభిప్రాయం:
09/01/2023 11:04 pm
కాలం వేళ్ళ సందుల్లోంచి జీవితాలు జారుతున్నట్టు* ప్రారంభమే అద్భుతంగా ఉంది. మొత్తంగా మీ కవిత భావస్ఫోరకంగా అందంగా ఉంది👏👏👌👌
సగం వాన గురించి Lahari గారి అభిప్రాయం:
09/01/2023 7:38 pm
Super anna kavitha.
సగం వాన గురించి Poojitha charan గారి అభిప్రాయం:
09/01/2023 6:21 pm
‘సగం వాన’ శీర్షికతోపాటు, కవితా ఆసాంతం అలరించింది. చాలా బాగా వ్యక్తీకరించారు. అభినందనలు ✍️✍️✍️💐💐💐
నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం గురించి NS Murty గారి అభిప్రాయం:
09/01/2023 1:35 pm
శ్రీరామనాథ్‌గారూ,
మంచి కవి, భావుకుడూ అయిన కవిని పరిచయం చేశారు. ధన్యవాదాలు. చల్లా సీతారామాంజనేయులుగారు, గురుమిత్రులు శ్రీ యెరికలపూడి సుబ్రహ్మణ్యశర్మగారు దగ్గర దగ్గర ఇళ్ళలో ఉండేవారు. వారు హిందీ పండిట్. ఒకప్పటి సత్యనారాయణపురం రైల్వేస్టేషను దగ్గర నల్లగేటు నుండి బాబూరావు మేడ దగ్గరికి వెళ్ళే దారిలో ఒక ట్యుటోరియల్ కాలేజీ కొంత కాలం నడిపేరు. తర్వాత ఆయనకి ఉద్యోగం రావటంతో దానిని మూసేసి వెళ్ళిపోయారు. 1975లో కాకతాళీయంగా వారితో శ్రీ శర్మగారి ద్వారా పరిచయం అయింది. మాటల సందర్భంలో ఒకసారి ఆయన చెప్పిన ఈ పద్యం ఇప్పటికీ గుర్తుండిపోయింది:
శ్యామల కోమలోన్మిష వసంత వనాగ్రము లెక్కి, గైరికా
క్రామిత తీక్ష్ణ శైల శిఖరమ్ములనెక్కి, సుశీత వర్షధా
రా మృదు కాలమేఘ విసరమ్ముల నెక్కి, క్రమింతురా శర
చ్ఛ్రీ మకుటోజ్జ్వలార్ద్ర విధురేఖకు నేను కళాత్మనై, శివా!
మీరు పరిచయం చేసినదీ, ఈ పద్యమూ, రెండూ మంచి భావుకత కలిగినవని వేరే చెప్పనక్కరలేదు.
అభివాదములు.
సోల్జర్ చెప్పిన కథలు: ఒంటరి పాట గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
09/01/2023 11:25 am
బావుంది. ఒక్కసారిగా సోల్జర్ కథలు రాగభరితమైపోయాయి. మరి ఒకటి రెండు ఎపిసోడ్లు సంగీతం చుట్టూ అల్లితే బావుంటుంది.
తెలుగులో సైన్యపు జీవితాల చిత్రణ అరుదు. ఈ కథలన్నీ పుస్తకంగా వస్తే బావుంటుంది.
నిండు వేసవి గురించి పి.వి.రమణరావు గారి అభిప్రాయం:
09/01/2023 10:56 am
గతస్మృతులతో కథని నడిపించి ఓ పరిష్కారం చూపించారు. రచయిత్రికి అభినందనలు.
నిండు వేసవి గురించి Seshu Chebolu గారి అభిప్రాయం:
09/01/2023 10:37 am
Simple story, expressed in lucid language! Felt refreshed reading it. Keep it up Anuradha garu.