మనసు పడే వేదనలు ప్రశ్నలు అన్నీ గొంతు దాటడానికి పడే వేదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రతి మనిషిలో ఈ డిబేట్ నిరంతరం నడుస్తూనే వుంటుంది. సగటు మనిషి ఈ నిరంతర ఘోషని చక్కగా ఆవిష్కరించారు.
ఎన్ని ముందుమాటలు చదువుకుంటే మీ అభిప్రాయం అర్థమవుతుంది, ఒకవేళ ఇంతకుమునుపు అర్థం కాకపోతే! విస్మృత వివాదాన్ని మళ్ళీ ఎందుకు తెరముందుకు తెచ్చేరో అర్థం కాలేదు. అభిప్రాయాలని రుద్దలేము, వదిలించలేము ఏ సబ్బుతోటీ కూడా. మనకి నచ్చినవే నచ్చుతాయి, నచ్చనివి నచ్చవు, ఎంత వివరించినా, ఎంత ప్రేమగా చెప్పినా కూడా. మీ వివరణలు, బహుశా clearing the air ఉద్దేశ్యంతో రాసినా, అవి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుతాయని నమ్మకం లేదు. నా బోటిగాళ్ళకి కాస్త విజ్ఞానం దక్కడం తప్ప. పీఠాధిపత్యాలు తప్పు అనుకునే జ్ఞాన కక్ష్యలో ఉన్నప్పుడు ప్రవచనాలు, హితబోధలు శుద్ధ విషాదం.
నేటి ద్రావిడవాద, నీలి, నయానీలి, వామ, అతివామ, మహావామ, అభ్యుదయ, ప్రగతిశీల, హేతువాద, మానవవాద, మూలవాస, మారమూలవాస భావజాలాలు విశ్వసించే చారిత్రక ఆవిష్కరణల ప్రకారంగా “బ్రాహ్మణులు అనగా ఆర్యులు, వారు నిజమైన భారతీయతపై దురాక్రమణ చేసినవారు. వేదాలు ఆర్యులవి. ఇతిహాసాలు ఆర్య రాజుల గురించి బ్రాహ్మణ లిఖితాలు పురాణాలు ఆర్యకల్పనలు.”
కాబట్టి, పై వ్యాసంలో చెప్పిన బ్రాహ్మణ శాస్త్ర ఆవిష్కరణలన్నీ ఆర్యులవే. అందుచేత, ఆర్యవలస సిద్ధాంతాన్ని విశ్వసించేవారంతా వ్యాసంలో ’బ్రాహ్మణ‘ అనే పదం ఉన్నచోట ‘ఆర్య’ అని మార్చి చదువుకోవలెను.
ఉదా. ఇంతకీ భారతీయులు, భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?
దీనిని “ఆర్యులు, ఆర్య బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశానికి మూలమా?” అని చదువుకొనవలెను.
నాకు ఆశ్చర్యం అనిపించినదేమిటంటే పైన పేర్కొన్న మేధావులు, చరిత్రకారులు అందరూ ఆర్య దురాక్రమణ లేదా వలస సిద్దాంతాన్ని విశ్వసించినవారే. మరి, భారతీయతను నిర్వచిస్తూ ‘బ్రాహ్మణ’ అనే పదం ఎందుకు వాడారు అన్నది నాకు అర్థం కాలేదు.
’బ్రాహ్మణ = ఆర్య’ అనే సిద్ధాంతం సరియైనదే అయినట్లయితే ఆర్య విజ్ఞానం కాని భారతీయ మూలవాస, మారుమూలవాస విజ్ఞానం ఏదైనా ఉన్నదా? ఉంటే, దానిని వెలికితేసే ప్రయత్నం ఎవరైనా చేసారా? కనీసం, దాని ప్రస్తావన అయినా ఆర్యవలస సిద్ధాంతాన్ని నమ్మే ఏ చరిత్రకారుడూ ఎందుకు చేయలేదు?
(నేను ఆర్యవలస లేదా ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని విశ్వసించను. అది అశాస్త్రీయం అని నా భావన)
కథాశైలి, వాక్యనిర్మాణం ప్రోటోగానిస్ట్ ప్రస్ట్రేషన్ , అసహాయతలని బలంగా చిత్రీకరించాయి. ఫుల్ టైమ్ సినీరచయిత అయితే తప్ప ప్రస్తుత సమాజంలో జీవనోపాధికి పనికిరాని రచనావ్యాసాంగంలో ఈ బ్లాక్ అవుట్ అన్నది అంత వేదన కలిగించదేమో! అతడు రాజీపడి బ్రతుకుతున్న జీవితం, తెలిసి త్రోసిపుచ్చలేని బలహీనతలు అంతకు మించిన కారణాలేమో అనిపించింది!
తెలుగు జీవిత చరిత్రలు: కె.ఎన్. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు” గురించి Ramesh అభిప్రాయం:
12/02/2024 7:56 pm
“ఇంత జనాదరణ ఉన్న పుస్తకం ఏభై ఏళ్ళలో రెండే ముద్రణలు పొందటం (రెండు వేల కాపీలు) పుస్తకప్రచురణలో మన వెనుకబాటుతనం తెలియజేస్తోంది.”
ఇది నిఝంగా నిజం, తెలుగువారి దౌర్భాగ్యం.
కవిత్వం అమృతమవ్వాలి గురించి v r. veluri అభిప్రాయం:
12/02/2024 6:54 pm
మీ చిన్న కవిత చాలా బాగుంది.
కుర్చీలు విరిగిపోతే కూర్చోడం మాననట్టు
కూర్చెడి శక్తి నశిస్తే
చేర్చెదనొక ఇంత చెత్త సిరిసిరి మువ్వా. అన్నాడు మహాకవి.
మీ మొదటి చరణం చదిన తరువాత నాకు గుర్తుకొచ్చిన పాత కవిత.
వేవేరా.
చదవాలి గురించి Sailaja అభిప్రాయం:
12/02/2024 2:43 pm
పద్మావతి గారు,
మీ కవిత్వం చాల చాల బాగుంది. ప్రతి వరుసలో చాలా లోతైన అర్ధం ఉంది. మీరు ఇంకా ఇలా అద్భుతమైన రచనలు మరి ఎన్నో చేయాలి అని కోరుకుంటున్నాం.
రైటర్స్ బ్లాక్ గురించి Ananth Mallavarapu అభిప్రాయం:
12/02/2024 2:14 pm
Panini garu,
Great story. I enjoyed reading it and very engaging.
“Writers Block is a true Catharsis”
2-2. సంయమనం ఈమాటకేనా? గురించి Satyanarayana Boda అభిప్రాయం:
12/02/2024 1:34 pm
సంపాదకులకు నమస్కారం
మీ జవాబు/ వివరణ క్లుప్తంగా ఉంటే సరిపోతుంది. సుదీర్ఘ జవాబు వలన, ప్రధాన విషయం, ప్రక్కకు వెళ్ళిందనిపించింది.
భాగఫలము గురించి Vijayakumari అభిప్రాయం:
12/02/2024 12:41 pm
మనసు పడే వేదనలు ప్రశ్నలు అన్నీ గొంతు దాటడానికి పడే వేదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రతి మనిషిలో ఈ డిబేట్ నిరంతరం నడుస్తూనే వుంటుంది. సగటు మనిషి ఈ నిరంతర ఘోషని చక్కగా ఆవిష్కరించారు.
1-1. సంయమనం ఈమాటకూనా? గురించి Indra Prasad అభిప్రాయం:
12/02/2024 8:03 am
ఎన్ని ముందుమాటలు చదువుకుంటే మీ అభిప్రాయం అర్థమవుతుంది, ఒకవేళ ఇంతకుమునుపు అర్థం కాకపోతే! విస్మృత వివాదాన్ని మళ్ళీ ఎందుకు తెరముందుకు తెచ్చేరో అర్థం కాలేదు. అభిప్రాయాలని రుద్దలేము, వదిలించలేము ఏ సబ్బుతోటీ కూడా. మనకి నచ్చినవే నచ్చుతాయి, నచ్చనివి నచ్చవు, ఎంత వివరించినా, ఎంత ప్రేమగా చెప్పినా కూడా. మీ వివరణలు, బహుశా clearing the air ఉద్దేశ్యంతో రాసినా, అవి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుతాయని నమ్మకం లేదు. నా బోటిగాళ్ళకి కాస్త విజ్ఞానం దక్కడం తప్ప. పీఠాధిపత్యాలు తప్పు అనుకునే జ్ఞాన కక్ష్యలో ఉన్నప్పుడు ప్రవచనాలు, హితబోధలు శుద్ధ విషాదం.
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:
12/02/2024 7:36 am
నేటి ద్రావిడవాద, నీలి, నయానీలి, వామ, అతివామ, మహావామ, అభ్యుదయ, ప్రగతిశీల, హేతువాద, మానవవాద, మూలవాస, మారమూలవాస భావజాలాలు విశ్వసించే చారిత్రక ఆవిష్కరణల ప్రకారంగా “బ్రాహ్మణులు అనగా ఆర్యులు, వారు నిజమైన భారతీయతపై దురాక్రమణ చేసినవారు. వేదాలు ఆర్యులవి. ఇతిహాసాలు ఆర్య రాజుల గురించి బ్రాహ్మణ లిఖితాలు పురాణాలు ఆర్యకల్పనలు.”
కాబట్టి, పై వ్యాసంలో చెప్పిన బ్రాహ్మణ శాస్త్ర ఆవిష్కరణలన్నీ ఆర్యులవే. అందుచేత, ఆర్యవలస సిద్ధాంతాన్ని విశ్వసించేవారంతా వ్యాసంలో ’బ్రాహ్మణ‘ అనే పదం ఉన్నచోట ‘ఆర్య’ అని మార్చి చదువుకోవలెను.
ఉదా. ఇంతకీ భారతీయులు, భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?
దీనిని “ఆర్యులు, ఆర్య బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశానికి మూలమా?” అని చదువుకొనవలెను.
నాకు ఆశ్చర్యం అనిపించినదేమిటంటే పైన పేర్కొన్న మేధావులు, చరిత్రకారులు అందరూ ఆర్య దురాక్రమణ లేదా వలస సిద్దాంతాన్ని విశ్వసించినవారే. మరి, భారతీయతను నిర్వచిస్తూ ‘బ్రాహ్మణ’ అనే పదం ఎందుకు వాడారు అన్నది నాకు అర్థం కాలేదు.
’బ్రాహ్మణ = ఆర్య’ అనే సిద్ధాంతం సరియైనదే అయినట్లయితే ఆర్య విజ్ఞానం కాని భారతీయ మూలవాస, మారుమూలవాస విజ్ఞానం ఏదైనా ఉన్నదా? ఉంటే, దానిని వెలికితేసే ప్రయత్నం ఎవరైనా చేసారా? కనీసం, దాని ప్రస్తావన అయినా ఆర్యవలస సిద్ధాంతాన్ని నమ్మే ఏ చరిత్రకారుడూ ఎందుకు చేయలేదు?
(నేను ఆర్యవలస లేదా ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని విశ్వసించను. అది అశాస్త్రీయం అని నా భావన)
భాగఫలము గురించి Devi prasad అభిప్రాయం:
12/01/2024 7:41 pm
చాలా బాధ వుంది కథలో.
రైటర్స్ బ్లాక్ గురించి Vijaya Karra అభిప్రాయం:
12/01/2024 5:53 pm