Comment navigation


15547

« 1 ... 78 79 80 81 82 ... 1555 »

  1. గుళిక వేదాంతం గురించి వేలూరి వేంకటేశ్వర రావు. గారి అభిప్రాయం:

    09/12/2023 2:30 pm

    Dear Prof.Vemuri:

    Please do write about David Bohm’s Hidden Variables Theory.

    Thank You.

    Veluri Venkateswara Rao

  2. వెణ్బా (ధవళగీతి) గురించి Rajasekhar Piduri గారి అభిప్రాయం:

    09/12/2023 8:53 am

    సర్, మీరు ఒక విపులీకరణ ఇవ్వవచ్చు అనుకుంటాను. తమిళ వెణ్పా లకు మీరిచ్చిన రెండో ఉదాహరణ – ‘కూట్రమో కణ్ణో పిణైయో’లో పిణైయో-కి IUU ఉండాలి – మనకి అలవాటైన (తెలుగు) గణవిభజన నియమాల ప్రకారం – కానీ మీరు IIU ఇచ్చారు. గణబంధ నియమాల ననుసరించి ఈ రెండింటికీ (య, స లకి) తర్వాత వచ్చే గణం లఘుపూర్వంగా ఉండాలి కాబట్టి ఈ తేడా వల్ల ఈ సందర్భంలో సమస్య ఏమీ లేదనుకోండి. మీరు పిణైయో-కి IIU ఇచ్చిన కారణం బహుశా – నిజానికి తమిళ సంప్రదాయం ప్రకారం ఇది పిణై (నిరైయసై) + యో (నేరిసై) గా విరుగుతుంది. వేరే సందర్భాలలో దీనివల్ల గణబంధానికి సమస్య వస్తుందా అన్న విషయం మీద మీరు వివరణ ఇస్తే బాగుంటుంది.

    మీ కృషికి వందనాలు. నమస్సులు.

  3. వెణ్బా (ధవళగీతి) గురించి Rajasekhar Piduri గారి అభిప్రాయం:

    09/10/2023 11:08 am

    సర్, ఇన్నేళ్ల తర్వాత కామెంట్ పెడుతున్నందుకు మన్నించండి.

    మీ కృషికి వేనవేల ధన్యవాదాలు.

    సూరి నాగమ్మగారి ‘రమణాశ్రమ జీవితం’ పుస్తకంలో భగవాన్ ఇచ్చినట్లుగా చెప్పబడుతున్న వెణ్పా నియమాలలో కొన్ని (బహుశా) అచ్చుతప్పులున్నాయి. శుక్లబంధం నియమాల గురించి మాత్రం సరిగానే ఉంది. ఇంకో చిన్న విశేషం (గుఱ్ఱం సుబ్బరామయ్యగారి ‘రమణ స్మరణామృతం’లో ఉంది):

    ఈ ఏకాత్మ పంచకాన్ని ముద్రించేటప్పుడు, ఈ ఛందస్సు తెలుగులో కొత్తది కాబట్టి గణముల ననుసరించి స్థలవిభజన (spacing between words while printing) ఉండాలని భగవాన్ సూచించారట. తెలుగులో భావము ననుసరించి spacing ఇవ్వడం పాఠకులకు సౌలభ్యం కాబట్టి, అలానే ముద్రిస్తూ, గణవిభజన సూచించడం కోసం చిన్న నిలువుగీటులు పెడదామని సుబ్బరామయ్యగారు భగవాన్‌కి చెబితే, భగవాన్ ఆమోదించారట.

    (ఉదాహరణకి మూడో వెణ్పాలో రెండవ పాదాన్ని “తనువందు|న్నట్టు |తలచు – మనుజుడు” అన్నట్టుగా ముద్రించడం).

    ఈ వెణ్పాలను తరవాత, బహుశా కలివెణ్పా – వెణ్పా మాలికగా మార్చడానికి అయిదింటి చివరి పాదాల చివరి పదాలకు ఈ క్రింది పదాలను కలిపారట భగవాన్.

    1) కను. —> కనుము|| చలింపక
    2) పలుకు —> పలుకు చి|| త్తైన
    3) వాడు —> వాడగున్ – వస్తువౌ
    4) ధరించు —> ధరించు – తనమహిమ
    5) చెప్పు —-> చెప్పుమని || ఇప్పుడా

    జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, మీరు వ్రాసిన వెణ్పాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా, మనసా ఒకరోజు…, ఆకసము భూమిని అనేవి బాగా నచ్చాయి.

    Thanks very very much for such an informative article.

  4. నా జానపద కల గురించి తః తః గారి అభిప్రాయం:

    09/10/2023 5:58 am

    లైలా గారూ మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇది ‘చందమామ’ కల అని సూచించానేమో! ‘Inscrutable’ మీ చమత్కారాన్నంతా తన పేరులో దాచుకుని – అచ్చంగా, స్పష్టంగా బాహ్యాంతరాలని ఏకం చేస్తోంది.

    నమస్కారాలతో- తః తః

  5. స్వప్నవాసవదత్తం గురించి పొర్ల వేణుగోపాల రావు గారి అభిప్రాయం:

    09/09/2023 8:00 am

    చాలా వివరంగా కథను తెలిపారు సర్. చాలా బాగుంది. పాత్రల చిత్రీకరణ. తెలుగు భాసుడు భాస్కర్ గారు. హృదయ పూర్వక అభినందనలు సర్👌👌👌🤝🤝🤝🙏🙏🙏

  6. కేశం గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:

    09/08/2023 8:47 pm

    ‘కేశం’ అంటే అంటే తమిళంలో ‘కురులు’ అనుకుంటాను. అత్తియప్పన్ – తంగంల అనుబంధం ఊహించినట్టే జరిగింది. ఆ ఇద్దరూ చనిపోవడం ఒక విధంగా సుఖాంతమే! అనువాదం ఇంకొంచెం సరళంగా వుండవలసింది అనిపించింది.

    యాస, మాండలికం మీద తెలుగులోసాహిత్య రంగంలో చాలా చర్చ జరుగుతూనే వుంది. ఉనికిని చాటి చెప్పేది కాబట్టి దానిని మేము వాడుతున్నాము అనే వర్గం ఒక వైపు. ఇతరులకి అర్ధం కావాలి కదా చెప్పదలుచుకున్నది అని మరో వైపు.

    వుండేది – సరి కాదేమో. వున్నది. కధా కాలానికి వుంది. కథ ముగిసే నాటికి కూడా వుంది. కాబట్టి ‘వుంది’ సరైన వాడుక అనుకుంటాను.

    అలాగే ‘అండా’ అన్న పదం. సందర్భాని బట్టి అది నీరు నిల్వ వుంచే పాత్ర అని ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాని అండా అన్నది తెలుగు ‘బిందే’ కన్నా పెద్దది అని అనుకోలు. ఆ రెండింటి మధ్య తేడా చాల సున్నితమైనది. అంతర్జాతీయ అనువాదాలలో కూడా ఇటీవల ఒక వాదన వినపడుతోంది. మూలంలో ఉన్న పదాలకు (పర భాషలోని) అర్ధాలు, వివరణ, పాదసూచికలు ఇవ్వాల్సిన అవసరం లేదని. ఆలోచించదగ్గ విషయమనిపించి ఇక్కడ ప్రస్తావించడం.

  7. ఊహల ఊట 28 గురించి Rama Rao Mallapragada గారి అభిప్రాయం:

    09/07/2023 7:40 am

    కథ మధ్యలో అడ్డం తిరిగింది. అయినా బాగుంది.

  8. నిండు వేసవి గురించి Suryanarayana గారి అభిప్రాయం:

    09/06/2023 1:28 am

    Writer has narrated the above story very nicely. This story has has taken me to my childhood days. It is worth to share such stories to our children.

  9. వికసితం గురించి దివాకర్ గారి అభిప్రాయం:

    09/05/2023 7:14 pm

    చాలా బావుంది కవిత.
    ముఖ్యంగా…
    “వెలిసిపోతున్న నీడలను
    కొలుచుకుంటూ”
    బాగా నచ్చింది.

  10. అనాదిగా గురించి రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్ గారి అభిప్రాయం:

    09/05/2023 2:25 pm

    ప్రకృతి లోని ద్వందాలను చక్కటి భావ చిత్రాలతో వివరిస్తూ జీవన్మరణాలను కూడా జంటగా చూపడం బాగుంది.

« 1 ... 78 79 80 81 82 ... 1555 »