That is not a bedroom dream తః తః గారు!
That’s a girl’s classroom dream. You (me) develop it in the head ever so slowly. Savoring it. I use it to this day.
This one below, from my love potion collection, is a bedroom dream. This works like a charm too. I gave it the name,
‘Inscrutable’
అసలుకి;
నీ పక్కలోనే ఉంటా నేను.
నువ్వు నా చెంప మీద ముద్దిస్తూనే ఉంటావు
నే నవ్వుతూ థాంక్యూ స్వీటీ! అంటూనే ఉంటా.
ముక్కుమీద కళ్లజోడు జారుతుండగా
కలువల నా కళ్లతో
లేప్టాప్ మీద ఎక్కడో వెబ్సైట్ లో నీ రాతలే చదువుతూ
“ఏమిటీ చచ్చు ఎనాలిసిస్?” అని ఒపీనియన్ కొట్టి
అక్కడ రుసరుసలాడుతా.
ఇక్కడ నీ ముద్దులు కురుస్తూనే ఉంటాయి,
నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు.
“సాహిత్యసమాజాలు బలంగా ఎదగడానికి సాహిత్యాభిలాష, సాహిత్య కృషికి తగిన ప్రోత్సాహం మాత్రమే సరిపోవు.”
‘సాహిత్య సమాజం’ అన్న పదానికి ప్రమాణాలు స్ఫురించటం లేదు. సాహిత్యసమాజం ఎందుకు, ఏ ఆశయంతో ఎదగాలి? అందునా బలంగా? చారిత్రాత్మకంగా ఎన్ని సమాజాలు, ఏదేశాల్లో, ఏ కాలాల్లో సాహిత్యపరంగా ఎదిగాయి? బలంగా? ఆ ఎదుగుదల ఎటువంటి పరిగణనీయమైన ప్రయోజనాలు సమాజానికి ఒనగూర్చింది?
సాహిత్యాభిలాష పైన పేర్కొనబడ్డ ఎదుగుదలకి ముఖ్య ప్రేరణాంశం అనుకుందాం. సాహిత్యాభిలాష రచయితలో ఉండాలా, పాఠకుడిలో ఉండాలా? ఇరువురులోనూ సమపాళ్ళలో ఉండాలా?
సాహిత్యాభిలాష కొరవడితే బాధ్యత రాసేవాడిదా, చదివేవాడిదా, ఇద్దరిదీనా?
ఈ అంశాల తర్వాతకదా, ఇవి సరిపొయాయా ఇంకా ఏమైనా తక్కువయాయా అనే చర్చ?
నేడు కావ్యాలు రాయించుకుని, అంకింతం చేయించుకుని మాన్యాలిచ్చే రాజులు లేరు, సమీప భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేవు. మాన్యాలే ప్రోత్సాహాలనుకుంటే!
ఆఁ, పిల్లాపెద్దా అతుక్కుపోయి చదివే, పిదప సినిమాలు తీయగలిగే ‘హారీ పాటర్’ శృంఖల రాయి; పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. సాహిత్యం అని కొందర్ననమను, నేను విఠలాచార్య జానపదం అంటాను.
మొన్నీమధ్య (అర్ధశతాబ్దం క్రితం) దాకా విశ్వనాథ వంటి మహామహిన్విత కవులు అనేకమంది దారిద్ర్యంలో మ్రగ్గారు. నేడా పరిస్థితి లేదు. సాంకేతికత పుణ్యమాని, అణాకాని వాళ్ళు కూడా యూట్యూబ్‌ని ఆశ్రయించి కోట్ల లైకులూ, లక్షల డాలర్లు వెనకేసుకుంటున్నారు.
పస ఉన్న, హృదయాన్ని కదిలించగల ఇంకో తిలక్‌ని, మల్లాదిని, కొకుని, చలాన్ని చూపించండి; ప్రశంసలూ, సంపదలూ కోకొల్లలుగా ఎందుకు కురవవో చూద్దాం.
ప్రచురణ సంస్థల రోజులు పోయాయి, రచయితలు వెబ్‌మాగజైన్‌ల మీద ఆధారపడే రోజులూ చరమదశకి వచ్చాయి.
సమాచారం మెరుపు వేగంతో ప్రపంచం అంతా వ్యాపించే రోజు ఇది.
‘ప్రతిభ దాగదు.’ ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నవి డిక్టేషన్ వాక్యాలు కాదు, అక్షర సత్యాలు అని నిరూపించగల సత్తా నేటి సాంకేతికకీ ఉంది, నేటి యువతరానికీ ఉంది.
మూర్తిగారూ: శ్రీ పరిమి వయసులో మాత్రమే చిన్న. ఆన్‌లైన్లో కొంతకాలంక్రితం ఏల్చూరివారికి జరిగిన సన్మాన సభలో పరిమివారి ప్రతిభా ప్రకాశ పరిచయం కనువీనుల విందుగా జరిగింది.
చల్లా వారిని ఈమాటకు ముందుగా పరిచయం చేసింది నేనే* ఈమధ్యనొకపరి ఈమాటలో వచ్చిన డా. యెర్నేని ‘సీత’పై అభిప్రాయాల వేదికపై. అంతకు ముందొకతరి అదే వేదికపై మీరిప్పుడిక్కడ గుర్తుకు తెచ్చుకున్న పద్యంతో.
శ్రీ చల్లా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమాతో ఢిల్లీలో కె.యల్. రావుగారి వద్ద పని చేశారు. గుంటూరు ఏసీ కాలేజ్‌లో కళావాచస్పతి శ్రీ కొం. జగ్గయ్యగారి సహాధ్యాయీ మిత్రుడూనూ. బిల్వ మాల, కదంబ మాల, వ్రజభూమి, మైథిలి (నాటకం) నాకు వారి ద్వారా తెలిసిన వారి రచనలు, అంటే వారి రచనల పేర్లు. వాటి అచ్చు ప్రతులు వారిదగ్గర గూడా లేనట్టే గుర్తు. వ్రజభూమి, మైథిలి ముద్రింబబడలేదేమో గూడా. మైథిలిలో లోపాముద్ర సీతమ్మకు వనదుర్గా మంత్రాన్ని ఉపదేశించినట్టుగా వ్రాశానని చెబుతుండేవారు – వారు చెప్పిందే మరొకతూరి చెప్పటమూ చెప్పినప్పుడల్లా నేను మొదటి సారి వింటున్నట్టుగా వినటమూ మా మధ్య సాధారణమైన విషయం.
“గణములు బంధులై యతులఖండులు గుండెలదాపుమిత్రులై గుణము మహాహియైన శరకోవిదు కోమలి దుర్గ తల్లియై…“ అంటూ మొదలుబెట్టి వారిపై నాల్గు పద్యాలు రాసి వారికి చూపే సాహసం చేయగల, చేసిన – పరిచయం దాదాపు రెండు దశాబ్ధాలపాటు మామధ్య – వారు బెజవాడ సత్యనారాయణపురంలో మా ఇంటికి దగ్గరగా ఉన్న ముత్యాలంపాడులో ఉన్న రోజుల్నుంచి తర్వాత విశాఖపట్నానికి వచ్చి పురుషోత్తపురంలో వారి అబ్బాయి దగ్గర గడిపినంతవరకూ.
కాటూరి వెంకటేశ్వర రావుగారి వద్ద పద్యవిద్య నేర్చుకున్నానని చెప్పేవారు. విశ్వనాథవారికి మరీ ఆత్మీయులు. ‘శారదికములు’ అన్న చల్లా ప్రయోగం విని విశ్వనాథ “తద్ధితం మీద తద్ధితం చేస్తావా ఆంజనేయులూ?” అన్నారనీ.
అనంతరకాలంలో వెంపరాల వారికి నివేదించినపుడు వారు తన పదబంధం గ్రాహ్యమేనన్నారనీ చెప్పారు. “నాకేజబ్బూ లేదు. నూట ఇరవై ఏళ్ళు బతుకుతాన”న్న మనిషి చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోయాడు. వారు పద్యం చదివే తీరు విలక్షణమైన సౌందర్యం గలిగినది. వారికి నన్నయ మరీ ఇష్టమైన కవి – పిసరంత ‘సబ్ కాస్ట్ ఫీలింగ్‘ ఉన్న వ్యక్తి – “నా గురువులందరూ మీ నియోగులే“ అనేవారు.
వారి ఋణం ఎప్పటికీ తీరనిది.
నమస్కారాలతో – తః తః
*అదను దొరికినపుడు అందరు వినునట్టు
తప్పుగాదు సొంత డప్పు సుంత
దాననాదమరచి తాళము తప్పకు
రామచంద్ర పుత్ర! రామభద్ర!”
ప్రపంచం నా సౌలభ్యం కోసం, నా ఉనికి నిమిత్తం నేను సృష్టించుకున్నాను. చరాచరవస్తువుల్ని నేనే సృష్టించుకుంటూ పోతున్నాను. నేను సృష్టించినంతమేరకే సృష్టి. జ్ఞానేంద్రియాలనీ, తల్లిదండ్రులనీ, చేతస్సునీ, ఇష్టాయిష్టాలనీ, భాషనీ, గ్రంధాలయాల్నీ లీలావిలాసంగా తయారు చేసుకున్నాను.
నా సృష్టిలో విధ్వంసం ఒక పార్శ్వం. సూర్యుడిని చంపేసినా నా సృష్టి ఆగదు. నా శరీరాన్ని నాలోనే లయింపచేసుకుంటా కూడా. సమయాన్ని సృష్టించింది నేనే కదా!
తెలుగు భాషకు దుర్దశ పడుతుందేమో అని భయపడుతున్న పాఠకాభిమానులకు ‘బీగం’ లాంటి పదాల వాడుకతో తెలియని ఊరట లభించింది. ఆసాంతం చదివించేలా చేస్తూ, రసాస్వాదన కలిగించింది ఈ కవిత.
గుళిక వేదాంతం గురించి v.srinivasa rao గారి అభిప్రాయం:
09/03/2023 10:59 am
చాలా బావుంది, దయచేసి ఇలాంటివి మరికొన్ని వ్యాసాలు వ్రాయండి. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మనసు గురించి తెలిపే అంశాలు మీనుండి తెలుసుకోవాలని ఉంది సర్.
గుళిక వేదాంతం గురించి Kishore Karnam గారి అభిప్రాయం:
09/04/2023 4:07 pm
Beautiful explanation of quantum physics and intersection with philosophy.
నా జానపద కల గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
09/04/2023 2:53 pm
That is not a bedroom dream తః తః గారు!
That’s a girl’s classroom dream. You (me) develop it in the head ever so slowly. Savoring it. I use it to this day.
This one below, from my love potion collection, is a bedroom dream. This works like a charm too. I gave it the name,
‘Inscrutable’
అసలుకి;
నీ పక్కలోనే ఉంటా నేను.
నువ్వు నా చెంప మీద ముద్దిస్తూనే ఉంటావు
నే నవ్వుతూ థాంక్యూ స్వీటీ! అంటూనే ఉంటా.
ముక్కుమీద కళ్లజోడు జారుతుండగా
కలువల నా కళ్లతో
లేప్టాప్ మీద ఎక్కడో వెబ్సైట్ లో నీ రాతలే చదువుతూ
“ఏమిటీ చచ్చు ఎనాలిసిస్?” అని ఒపీనియన్ కొట్టి
అక్కడ రుసరుసలాడుతా.
ఇక్కడ నీ ముద్దులు కురుస్తూనే ఉంటాయి,
నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు.
-Lyla
Happy Labor Day! Friends!
సెప్టెంబర్ 2023 గురించి శామల గారి అభిప్రాయం:
09/04/2023 5:58 am
‘సాహిత్య సమాజం’ అన్న పదానికి ప్రమాణాలు స్ఫురించటం లేదు. సాహిత్యసమాజం ఎందుకు, ఏ ఆశయంతో ఎదగాలి? అందునా బలంగా? చారిత్రాత్మకంగా ఎన్ని సమాజాలు, ఏదేశాల్లో, ఏ కాలాల్లో సాహిత్యపరంగా ఎదిగాయి? బలంగా? ఆ ఎదుగుదల ఎటువంటి పరిగణనీయమైన ప్రయోజనాలు సమాజానికి ఒనగూర్చింది?
సాహిత్యాభిలాష పైన పేర్కొనబడ్డ ఎదుగుదలకి ముఖ్య ప్రేరణాంశం అనుకుందాం. సాహిత్యాభిలాష రచయితలో ఉండాలా, పాఠకుడిలో ఉండాలా? ఇరువురులోనూ సమపాళ్ళలో ఉండాలా?
సాహిత్యాభిలాష కొరవడితే బాధ్యత రాసేవాడిదా, చదివేవాడిదా, ఇద్దరిదీనా?
సాహిత్యకృషికి ప్రోత్సాహం, తగినంత, ఎక్కడినించి వస్తుంది, ఎవరిస్తారు, ఎవరివ్వాలి?
ఈ అంశాల తర్వాతకదా, ఇవి సరిపొయాయా ఇంకా ఏమైనా తక్కువయాయా అనే చర్చ?
నేడు కావ్యాలు రాయించుకుని, అంకింతం చేయించుకుని మాన్యాలిచ్చే రాజులు లేరు, సమీప భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేవు. మాన్యాలే ప్రోత్సాహాలనుకుంటే!
ఆఁ, పిల్లాపెద్దా అతుక్కుపోయి చదివే, పిదప సినిమాలు తీయగలిగే ‘హారీ పాటర్’ శృంఖల రాయి; పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. సాహిత్యం అని కొందర్ననమను, నేను విఠలాచార్య జానపదం అంటాను.
మొన్నీమధ్య (అర్ధశతాబ్దం క్రితం) దాకా విశ్వనాథ వంటి మహామహిన్విత కవులు అనేకమంది దారిద్ర్యంలో మ్రగ్గారు. నేడా పరిస్థితి లేదు. సాంకేతికత పుణ్యమాని, అణాకాని వాళ్ళు కూడా యూట్యూబ్‌ని ఆశ్రయించి కోట్ల లైకులూ, లక్షల డాలర్లు వెనకేసుకుంటున్నారు.
పస ఉన్న, హృదయాన్ని కదిలించగల ఇంకో తిలక్‌ని, మల్లాదిని, కొకుని, చలాన్ని చూపించండి; ప్రశంసలూ, సంపదలూ కోకొల్లలుగా ఎందుకు కురవవో చూద్దాం.
ప్రచురణ సంస్థల రోజులు పోయాయి, రచయితలు వెబ్‌మాగజైన్‌ల మీద ఆధారపడే రోజులూ చరమదశకి వచ్చాయి.
సమాచారం మెరుపు వేగంతో ప్రపంచం అంతా వ్యాపించే రోజు ఇది.
‘ప్రతిభ దాగదు.’ ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నవి డిక్టేషన్ వాక్యాలు కాదు, అక్షర సత్యాలు అని నిరూపించగల సత్తా నేటి సాంకేతికకీ ఉంది, నేటి యువతరానికీ ఉంది.
గీతాచారి గురించి Sasikala గారి అభిప్రాయం:
09/04/2023 3:09 am
👌👌నిజంగా చారి గారి బొమ్మల్లో పల్లె మోటుతనం నిజాయితీగా కనపడేది.చాలా బాగా వ్రాశారు.
నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం గురించి తః తః గారి అభిప్రాయం:
09/04/2023 12:21 am
మూర్తిగారూ: శ్రీ పరిమి వయసులో మాత్రమే చిన్న. ఆన్‌లైన్లో కొంతకాలంక్రితం ఏల్చూరివారికి జరిగిన సన్మాన సభలో పరిమివారి ప్రతిభా ప్రకాశ పరిచయం కనువీనుల విందుగా జరిగింది.
చల్లా వారిని ఈమాటకు ముందుగా పరిచయం చేసింది నేనే* ఈమధ్యనొకపరి ఈమాటలో వచ్చిన డా. యెర్నేని ‘సీత’పై అభిప్రాయాల వేదికపై. అంతకు ముందొకతరి అదే వేదికపై మీరిప్పుడిక్కడ గుర్తుకు తెచ్చుకున్న పద్యంతో.
శ్రీ చల్లా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమాతో ఢిల్లీలో కె.యల్. రావుగారి వద్ద పని చేశారు. గుంటూరు ఏసీ కాలేజ్‌లో కళావాచస్పతి శ్రీ కొం. జగ్గయ్యగారి సహాధ్యాయీ మిత్రుడూనూ. బిల్వ మాల, కదంబ మాల, వ్రజభూమి, మైథిలి (నాటకం) నాకు వారి ద్వారా తెలిసిన వారి రచనలు, అంటే వారి రచనల పేర్లు. వాటి అచ్చు ప్రతులు వారిదగ్గర గూడా లేనట్టే గుర్తు. వ్రజభూమి, మైథిలి ముద్రింబబడలేదేమో గూడా. మైథిలిలో లోపాముద్ర సీతమ్మకు వనదుర్గా మంత్రాన్ని ఉపదేశించినట్టుగా వ్రాశానని చెబుతుండేవారు – వారు చెప్పిందే మరొకతూరి చెప్పటమూ చెప్పినప్పుడల్లా నేను మొదటి సారి వింటున్నట్టుగా వినటమూ మా మధ్య సాధారణమైన విషయం.
“బిల్వలు మాలలల్లి తొలిభిల్లుని జూటము జుట్టె భక్తిమై గొల్వ కదంబ మాలికలు
గౌరమ గాత్ర సరాలు జేసె చెంగల్వలు కన్నులైన వ్రజకాంతలకున్ శిఖిపించమౌళి
శ్రీ చెల్వునిజూపి మైథిలికి సిద్ధవనాంబిక మంత్రమిచ్చెడిన్“ అని,
“గణములు బంధులై యతులఖండులు గుండెలదాపుమిత్రులై గుణము మహాహియైన శరకోవిదు కోమలి దుర్గ తల్లియై…“ అంటూ మొదలుబెట్టి వారిపై నాల్గు పద్యాలు రాసి వారికి చూపే సాహసం చేయగల, చేసిన – పరిచయం దాదాపు రెండు దశాబ్ధాలపాటు మామధ్య – వారు బెజవాడ సత్యనారాయణపురంలో మా ఇంటికి దగ్గరగా ఉన్న ముత్యాలంపాడులో ఉన్న రోజుల్నుంచి తర్వాత విశాఖపట్నానికి వచ్చి పురుషోత్తపురంలో వారి అబ్బాయి దగ్గర గడిపినంతవరకూ.
కాటూరి వెంకటేశ్వర రావుగారి వద్ద పద్యవిద్య నేర్చుకున్నానని చెప్పేవారు. విశ్వనాథవారికి మరీ ఆత్మీయులు. ‘శారదికములు’ అన్న చల్లా ప్రయోగం విని విశ్వనాథ “తద్ధితం మీద తద్ధితం చేస్తావా ఆంజనేయులూ?” అన్నారనీ.
అనంతరకాలంలో వెంపరాల వారికి నివేదించినపుడు వారు తన పదబంధం గ్రాహ్యమేనన్నారనీ చెప్పారు. “నాకేజబ్బూ లేదు. నూట ఇరవై ఏళ్ళు బతుకుతాన”న్న మనిషి చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోయాడు. వారు పద్యం చదివే తీరు విలక్షణమైన సౌందర్యం గలిగినది. వారికి నన్నయ మరీ ఇష్టమైన కవి – పిసరంత ‘సబ్ కాస్ట్ ఫీలింగ్‘ ఉన్న వ్యక్తి – “నా గురువులందరూ మీ నియోగులే“ అనేవారు.
వారి ఋణం ఎప్పటికీ తీరనిది.
నమస్కారాలతో – తః తః
*అదను దొరికినపుడు అందరు వినునట్టు
తప్పుగాదు సొంత డప్పు సుంత
దాననాదమరచి తాళము తప్పకు
రామచంద్ర పుత్ర! రామభద్ర!”
గుళిక వేదాంతం గురించి శామల గారి అభిప్రాయం:
09/03/2023 5:39 pm
ప్రపంచం నా సౌలభ్యం కోసం, నా ఉనికి నిమిత్తం నేను సృష్టించుకున్నాను. చరాచరవస్తువుల్ని నేనే సృష్టించుకుంటూ పోతున్నాను. నేను సృష్టించినంతమేరకే సృష్టి. జ్ఞానేంద్రియాలనీ, తల్లిదండ్రులనీ, చేతస్సునీ, ఇష్టాయిష్టాలనీ, భాషనీ, గ్రంధాలయాల్నీ లీలావిలాసంగా తయారు చేసుకున్నాను.
నా సృష్టిలో విధ్వంసం ఒక పార్శ్వం. సూర్యుడిని చంపేసినా నా సృష్టి ఆగదు. నా శరీరాన్ని నాలోనే లయింపచేసుకుంటా కూడా. సమయాన్ని సృష్టించింది నేనే కదా!
ఉన్నది నేను. నేనే ఉన్నాను.
సగం వాన గురించి Sudha Rani గారి అభిప్రాయం:
09/03/2023 11:26 am
తెలుగు భాషకు దుర్దశ పడుతుందేమో అని భయపడుతున్న పాఠకాభిమానులకు ‘బీగం’ లాంటి పదాల వాడుకతో తెలియని ఊరట లభించింది. ఆసాంతం చదివించేలా చేస్తూ, రసాస్వాదన కలిగించింది ఈ కవిత.
గుళిక వేదాంతం గురించి v.srinivasa rao గారి అభిప్రాయం:
09/03/2023 10:59 am
చాలా బావుంది, దయచేసి ఇలాంటివి మరికొన్ని వ్యాసాలు వ్రాయండి. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మనసు గురించి తెలిపే అంశాలు మీనుండి తెలుసుకోవాలని ఉంది సర్.
అనాదిగా గురించి Sanjay గారి అభిప్రాయం:
09/02/2023 2:17 pm
The nature – poetically presented well.
వికసితం గురించి శ్రీరామ్ గారి అభిప్రాయం:
09/02/2023 3:08 am
మీ కవిత చదువుతూ మైమరచిపోతూ మధ్య మధ్యలో ముసిముసిగా నవ్వుతూ — కవిత బాగుంది పద్మగారు.