Comment navigation


15543

« 1 ... 73 74 75 76 77 ... 1555 »

  1. రుచి గురించి తఃతః గారి అభిప్రాయం:

    10/16/2023 7:26 am

    లైలా గారు: మీ తమ్ముడి ‘జానపద కల‘ నాకు నచ్చినట్టుగా తోస్తోంది!(నేనూ ఎప్పుడూ నిజమే చెబుతాను.)

    నమస్కారాలతో – తఃతః

  2. సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:

    10/14/2023 11:39 am

    వంశీగారూ, ధన్యవాదాలు.

  3. అక్టోబర్ 2023 గురించి jeevan babu గారి అభిప్రాయం:

    10/13/2023 4:36 pm

    ఈమాట అక్టోబర్ సంపాదకీయం ఒక సగటు పాఠకుడి బాధకు అద్దం పడుతోంది. (కొంతమంది గొంతుకు అడ్డం పడడం ఊహించిందే గానీ) ఇది చదివి సోషల్ మీడియాలో చాలా మంది తెలుగు సాహితీ పల్లకి మోసే బోయలు, పల్లకిలో ఎక్కి ఊరేగే సాములోర్లు తెగ అలమటించి నిద్రాహారాలూ మాని మాధవా! మాధవా! అని పలవరిస్తున్నారని ఒక రచయిత స్క్రీన్ షాట్లు మరీ పంపించి అనేక వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆనందాన్ని కన్నీరు మున్నీరౌతూ వెళ్లబోసుకున్నారు. అత్యంత నాసిరకంగా తెలుగులో వస్తున్న అనువాదాలు కూడా మనకిప్పుడొస్తున్న కథలు నవలలు కంటే అత్యున్నతంగా ఉన్నట్టు అనిపించడం మన దౌర్భాగ్యం. ఒకటో రెండో పుస్తకాలు తాము చిన్నప్పుడు ముక్కు చీదినప్పుడు జేబులో రుమాలు లేదని బాధపడ్డ రోజుల గురించి, గుండీలూడిపోయిన చొక్కాల గురించి రాసి ప్రాచుర్యం పొందిన రచయితలను కూడా భుజాలనెక్కించుకుని వూరేగించుకోవాల్సి రావడం మన దురదృష్ఠమ్. ఇప్పుడు ప్రచురించే పుస్తకాల్లో తొంభైశాతం పైగా రచయితలు తమ రెండో పుస్తకాన్ని కూడా తమ డబ్బులతో ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం తమ రచనా పటిమ ఏ మాత్రం కారణం కాదు అని వారు అనుకోడం ఒక మహా భావ దారిద్య్రం. ఒక పక్కేమో మమ్మల్ని పాఠకులకి దగ్గరగా తీసుకెళ్లే విమర్శకులు లేరు అంటారు. ఇంకో పక్క ఇలాటి చిన్న విమర్శా వచ్చినా, దాన్ని ఏ మాత్రం కూడా పరిశీలించి ఆత్మ విమర్శ చేసుకోకుండా అస్తిత్వాన్ని అడ్డం పెట్టుకొని తెగనాడతారు. విమర్శను స్వీకరించే విషయంలో, సో కాల్డ్ సాహితీ సంఘాలకీ, ఉపకులాల వారీగా చీలిపోయి కొట్టుకు చస్తున్నా మన సగటు సినీ రాజకీయ అభిమాన సంఘాలకీ ఏ మాత్రం తేడా లేకపోవటం కేవలం మన తెలుగు జాతి ప్రత్యేకం. రచయిత అనేవాడు మొదటి రోజుల్లో తన నొప్పి గురించే రాస్తాడు. బాగా ఆకట్టుకునేలా రాస్తే కొత్త రచయిత అనే ఆసక్తితో పాఠకుడు చదువుతాడు. అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. చాలా మంది రచయితలు అక్కడే ఆగిపోయి పేజీలు నింపేస్తూ, తమకు మహా రచయిత స్థాయిని ఆపాదించలేదని పాఠకుడి మీదా, పత్రికల మీదా పబ్లిషర్ల మీదా నెపాన్ని తోసేస్తున్నారు. నీ నొప్పిని, నువ్వు చూసి చలించినదాన్ని చదివిన ప్రతివాడు (సహా)అనుభూతి చెందేలా చేయడమే ఉత్తమ సాహిత్యం. దీనికి వేరే కొలమానం అక్కర్లేదు. ఇది మన మహా రచయితలు, ఔత్సాహిక రచయితలు గ్రహిస్తే, ఫేస్‌బుక్ అకౌంట్లు మైంటైన్ చేస్తూ, అడిగి లైకులు కొట్టించుకునే నికృష్ట స్థితి నించి బయటపడి, ఈమాట లాంటి పత్రికలకు ఇలాంటి సంపాదకీయాలు రాయాల్సిన అగత్యం తప్పుతుంది. (ఇదంతా చదివి నా కుల ధ్రువీకరణ పత్రం కోసం వెతికే శ్రమ పడొద్దు, ఇమెయిల్ ద్వారా అడగండి. పంపిస్తాను.)

  4. రుచి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    10/10/2023 5:04 pm

    ఈమాటలో – ఏ కవిత చూసినా ఏమున్నది గర్వ కారణం! స్త్రీ కళ్లలోనే ఎప్పుడూ నీళ్లు. మగవాడు మహాద్రష్ట కవి.

    ఈమాటలో – మహా రచయిత జయమోహన్ ఏ కథ చూసినా ఏమున్నది గర్వకారణం! ఈ కథలోనూ స్త్రీ కళ్లలోనే నీళ్లు. ఇతని కథల్లో – ఏనుగు, డాక్టరు, రచయిత ఉంటే – ఏనుగుకి కాదు, ఏనుగుని రక్షించిన డాక్టరుకు కాదు, డాక్టరుని రక్షించే ఏనుగుకి కాదు, కథ రాసిన రచయితకి ఎవార్డు వస్తుంది.

    కథలో ‘హీరోయిజమ్’ మగవాడిది. స్త్రీ రక్షించబడేది. స్త్రీ ఇతరులను రక్షించే, కాపాడే, సహాయం చేసే స్థానంలో ఉండదు.

    అక్కడికి ఈ ‘రుచి’ కథలో బాస్ హీరో ప్రైడ్ ఏమిటి? ఆమె పే-చెక్‌ లోనే కొంత కట్ చేసి ఆమెను చీరలు కొనుక్కోమనటమా? ఆమెతో బలవంతాన తన అన్నం తినమని గొంతు పెంచి తన బాస్ గిరీ చూపటమా? ఆ యువతి ఇంటికి పొయ్యాక మిగతా పే-చెక్ ఎలాగూ నాన్న దొబ్బుతాడు కదా? జరిగిన మాలావు ఘనకార్యం ఏం లేదు. కథలో హీరోకి తన పనికిమాలిన సహృదయత గురించిన తన ఓన్ సంతృప్తి తప్ప.

    నా చిన్నతనంలో ఓ రోజు, నా ఒక తమ్ముడు డ్రీమ్ లేండ్‌లో ఉన్నట్టుంటే – ఏం ఊహిస్తున్నావని అడిగాను. నాకు పెద్ద కష్టం వచ్చినట్టూ, తను డ్రాగన్‌లతోనూ, రాక్షసులతోనూ యుద్ధం చేసి నన్ను రక్షిస్తున్నట్టూ కలగంటున్నట్టు చెప్పాడు. ఎప్పుడూ నిజమే చెప్తాడు, ఆ సుగుణం ఉంది. కాని నేను – ఆహా! నా తమ్ముడు, నాపై ఎంత ప్రేమ! అనుకోలేక పోయాను. నాకన్నా ఎంతో చిన్న బక్క పీచు వెధవ, గాలేస్తే కొట్టుకు పోయే వెధవను, బోలెడుసార్లు నేను చేయి పట్టుకుని రోడ్ మీద నడిపించి రక్షిస్తే ఇదీ ఈ రాస్కెల్ కృతజ్ఞత. నాకు కష్టాలు రావటమెందుకూ? ఈ బొట్టిగాడు నన్ను రక్షించటమెందుకూ. దాని బదులు తనకే కష్టమొచ్చినట్టు, నేను తనను రక్షించినట్టు ఊహించుకోవచ్చుగా.

    అదే హీరోయిజమ్‌లో దాగి ఉన్న ఈగోయిజం. కొందరి రచనల్లో హీరోయిజంకి, విక్టిమిజంకి గల సంపర్కం. అదే! ఈ వెనక బడిన కథలో హీరో వీరత్వం. తన బొచ్చు మగ బతుకులో, తనే ఓ చచ్చు ఇగోయిస్ట్‌నని ఆఖరి సీన్‌లో కూడా గ్రహించుకోలేని మూర్ఖత్వం.

    ఒక స్త్రీ ఎఛీవ్‌మెంట్స్ ఏ సెక్టర్‌లో గాని ఎత్తి చూపగల సాహసం, భారతీయ మగరచయితకు ఎప్పటికైనా వస్తుందా? అలాటి హీరో అతడు కాగలడా? ఐ డౌట్ ఇట్.

    -Lyla

  5. రుచి గురించి MARINGANTI SURENDRA PRASAD గారి అభిప్రాయం:

    10/10/2023 4:29 am

    నాకు బాగా నచ్చింది. కధ ఇంత తొందరగా ముగించడం కొంత నిరాశ కలిగించింది.

  6. సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    10/09/2023 11:58 pm

    చాలా బాగుందండి, శిధిలమైన జ్ఞాపకాలనుండి కాలగతిని వెలికి తీసిన మీ ముగింపు.

  7. అసలు నేను గురించి డా.ఇస్మాయిల్ పెనుకొండ గారి అభిప్రాయం:

    10/09/2023 12:12 am

    ఇందుకు కదా రాయాలి… కవిత!

  8. అక్టోబర్ 2023 గురించి పవన్ సంతోష్ సూరంపూడి గారి అభిప్రాయం:

    10/08/2023 10:53 pm

    ఈమాట చేస్తున్న పని ఇష్టపడేవాడిగా, దశాబ్దం పైగా వాళ్ళ రచనలకు పాఠకునిగా ఇలాంటి ఏకపక్ష సంపాదకీయం వాళ్ళ నుంచి నేనెప్పుడూ ఆశించలేదు.

    కొన్ని పబ్లిషింగ్ హౌస్‌లు రచయితల పుస్తక ప్రచురణాభిలాష మీద మోపుతున్న నిర్దాక్షణ్యమైన భారాన్ని చూశాకా ఈ సంపాదకీయం లో సహానుభూతి లోపించిందని తోస్తోంది. ఈ విమర్శ నలుగురు సంపాదక మిత్రులు కలసి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని “రచయితలెంత వెధవలంటే” అని ప్రారంభించి మాట్లాడుకున్నదాన్ని సారాంశంగా ప్రచురించినట్టుంది తప్పించి సహానుభూతితో అన్నివైపులను గమనించి రాసిన “సంపాదకీయం”లా తోచలేదు. ఇది ఆబ్జెక్టివ్‌గా చూసి తిరగరాసుకుని ఉండొచ్చు. అది జరగలేదని అర్థం అవుతోంది.

    ఇందులో అబద్ధాలు రాయలేదు. కానీ, ఒకే దృక్కోణం నుంచి మొత్తం రాశారు. కనీసంలో కనీసం – ఈ విషయంలో మార్పులు ఎక్కడైనా జరుగుతుంటే వాటిని ప్రస్తావించడమో, బిగ్ పిక్చర్ ఇలా ఉండడానికి జరుగుతున్న కారణాలను మెరుగ్గా విశ్లేషించడమో కూడా లేదు. ఇది విమర్శ కాదు. ఉత్తి Rant.

    ఉదాహరణకు “ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది” అన్న వాక్యం చూడండి. ఈమధ్యకాలంలో ప్రచురణకర్తలకు తామే డబ్బిచ్చి, ప్రచురణసంస్థల పేరిట రచయితలు ప్రచురించుకోవడం బాగా పెరిగింది. ప్రచురణకర్తలు ఇదొక తరహా వ్యాపారంగా చూస్తున్నాయి. ఇంతవరకూ బానే ఉంది. అలాంటప్పుడు డబ్బిచ్చిన రచయిత ఎన్ని అమ్మారో, ఆ డబ్బు ఏమైందో చెప్పకపోతే దానిపై వ్యంగ్యంగా రాసే పనేముంది? పోనీ ఇది వ్యంగ్యం కాదనుకుంటే సంపాదకీయంలో మరోచోట ప్రచురణకర్తలను సమర్థిస్తూ రచయితలను “మీకేం తెలవదు, తెలియనట్టు ఉండరు” అన్న ధోరణిలో ఎందుకు రాయాలి? ఈ రకంగా రాసే సంపాదకీయంలో “మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం.” అని మొదట్లోనే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంది?

    నేను అర్థం చేసుకున్నంతలో ఈ వ్యాసం లక్ష్యం వ్యాసంలో చెప్పినంత విస్తృతమైనది కాదు. సగానికి సగం వ్యాసం – ఈమాట సంపాదకీయ పద్ధతులను వ్యతిరేకించే, అంగీకరించని రచయితల మీద Rantగానే సాగింది. అసలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో రాస్తున్న, పుస్తకాలు వేస్తున్న రచయితల్లో ఎంతమంది ఈమాటకి వ్యాసాలు, కథలు, కవితలు పంపించివుంటారు? ఎంత శాతం? అలాంటప్పుడు, ఆ అంశమే ప్రధానంగా రచయితలను మదింపు వేస్తూ రాసే పనేమిటి? అలాంటప్పుడు దీన్ని విస్తృతమైన రచనల నాణ్యత గురించి, ఈమాట నిర్వాహకవర్గంలో అత్యధికులకు అస్సలు సంబంధం లేని పబ్లిషర్లు-రచయితల డైనమిక్స్ గురించి తోచిన జడ్జిమెంట్లు పాస్ చేయాల్సిన అవసరం ఏమిటి?

    ఇన్ని రాశారు కదా. అసలు ఈనాడు ఉన్న పరిస్థితిలో సగటు రచయితకు తన రచనల గురించి ఏవో కొన్ని చప్పట్లు మినహాయించి ఏం మోటివేషన్ మిగిలింది? “అహాలు, అపోహలు” మినహా ఏమీ లేవని జనరలైజ్ చేయకపోతే ఇన్సెంటివ్, మోటివేషన్ వంటివి అయినా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండకూడదా?

    తమాషా ఏమిటంటే – రచనల్లో నాణ్యత గురించి రాసిన సంపాదకీయమే కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాయడం. బహుశా, తెలుగు సాహిత్యపు తీరుతెన్నుల్ని సంకేతాత్మకంగా ఈమాట సంపాదకులు ఇలా చెప్పాలనుకుని ఉంటారు.

  9. సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    10/08/2023 12:26 pm

    అమరేంద్రగారూ, మీ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లేకుండా సుబేదార్ రావ్ తెర ముందుకు రావడం చాలా కష్టమయ్యేది. మీకు ధన్యవాదాలు.

    ఇందిరగారూ, మీకు ధన్యవాదాలు. ఎంతమాత్రమూ ఊహించని సమయంలో ప్రోత్సాహం అందించినందుకు.

  10. గడినుడి – 84 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:

    10/08/2023 1:57 am

    25 అడ్డం నిడివి తప్పు.

    [సరిచేసాము. ధన్యవాదాలు – సం. ]

« 1 ... 73 74 75 76 77 ... 1555 »