అద్భుతమైన అనువాదం. మరికొంత వివరణ వుంటే బాగుంటుందని మనవి. తప్పక కొనసాగించగలరు🙏🙏
మోహన రాగ మహా! గురించి srinivasarao.v గారి అభిప్రాయం:
11/01/2023 5:46 am
ఒక వంక బొమ్మల గొప్పతనమూ, మరో ప్రక్క ఆ చిత్రకారుడి ఫీలింగ్స్, తోటి చిత్రకారుల ఫీలింగ్స్, ఆ చిత్రాలూ, ఆ పేజీలూ ఏమై పోయాయో అన్న ఆవేదనా, ఆ పెన్సిల్, ఆ బొమ్మలు – అన్నీ పంచిన మీకు థాంక్స్ మాత్రమే చెప్పగలము.
ఈ శీర్షికలో విన్న అన్ని కవి పరిచయాలు, కవిత్వము ఎంతో బాగున్నవి. వీరందరి పొయటిక్ జీనియాలజీ ఇంచుమించు ఒకటే కదా! వీరి పాండిత్యము, వ్యాకరణ జ్ఞానము, ఊహాశక్తి శబలము. ఆకర్షణీయము. వీరు తమకన్నా ముందు తరాల భారతీయ సాహిత్యం చక్కగా చదివిన వారు.
(“…For greatest poets have aspects which do not come to light at once: and by exercising a direct influence on other poets centuries later, they continue to affect the living language…” — In the essay -The Social Function of Poetry, page 11. (T.S. Eliot on Poetry and Poets, Publication 1954 –Farrar, Straus and Giroux, New York.)
ఐతే, ఈ కవులు వీరెవరివీ distinct voices కావు. కవి పేరు ఇవ్వకుండా కొన్ని పంక్తులనో ఒక పద్యాన్నో ఇచ్చినప్పుడు, అది ఎవరు రచించినదీ చెప్పటం ఇతర శ్రోతలకు సాధ్యం కాదు.
“In Swinburne an Estimate” (Archon books 1969) another poet John Drinkwater in the first chapter – Lyric technique says: The most immediate impression gathered from a close acquaintance with Swinburne’s lyric poetry is its curious distinctiveness from all other poetry.”
అది నిజమే. అంతమాత్రాన అతడు కీట్స్, టెనిసన్, వర్డ్స్‌వర్త్ వీరందరికన్నా గొప్ప కవిత్వం చెప్పాడని కాదు. Lyric technique, Lyric thought, Lyric art… అంటూ స్విన్‌బర్న్ గురించి ఇందులోని ఛాప్టర్లన్నీ నేను చదువుకున్నాను. ఎలియట్ – స్విన్‌బర్న్ యాజ్ ఎ పొయెట్, యాజ్ ఎ క్రిటిక్ – కూడా ఎన్నిసార్లో చదివాను.
Meera, the Indian woman poet, is direct and intense in expressing emotion. She, in her simple sentences, is so musical.
జో తుమ్ తోడో పియా మై నాహి తోడూ రే
తోస్ ప్రీత్ తోడ్ కృష్ణ, కౌన్ సంగ్ జోడూ రే!
So is Telugu Annamayya. This is a super-duper dream!
They have distinct beautiful voices, yet, they too must have had their ancestral poets. In this Telugu poetry of mine(?) below, obviously, the person’s -Silsila, the spiritual ancestry- goes back to some of Meera’s and Potana’s Krishna poetry. These days when I recall-sing it to myself, in Biltmore or Vizcaya gardens, where peacocks dance and parrots fly -all I see and hear is lush, lust, luxury, happiness. There is no devotion. No submission. No Nada. Only pure self-indulgence. Here are the words:
ఏ లలనామణులారటంబున మురారీ! కనరారా ప్రియా! యం
చే మల్లెనికుంజముల నీకై గాలించిరో!
ఏ కాంతారమున ఆ కాంత లేకాంతమున నీతో భోగించిరో!
ఏ వనసీమల మ్రోగె నీ మురళి! ఆ కానలలో
నే మోదుగ పూవుగ పూచి యుందునుర, కృష్ణా! వనమాలీ, శౌరీ!
హాస్యాస్పదంగా కొందరు ఈమాటను, ఈమాట రచయితలను బాయ్‍కాట్ చేయాలని కూడా ప్రతిపాదించారు. అట్లాంటిది ఏదన్నా జరిగితే మాత్రం నేను ఆ banని badge of honourలా ధరిస్తాను.
నాలా అందరూ ఈమాట నుంచి లాభపడే ఉంటారు, లాభపడని వాళ్ళదే ఏదో తప్పై ఉంటుందనే సంకుచితత్వం నాకు లేదు. ఇరుపక్షాలకూ ఎంత మంచి ఉద్దేశ్యాలున్నా ఒక్కోసారి పనులు బెడిసికొడతాయి. నెగిటివిటి పుట్టుకొస్తుంది. అలాంటి చేదు అనుభవాలను invalidate చేయబోను.
కానీ ఈమాట వల్ల నేను నేర్చుకున్నది, లేదా నాకీ పత్రిక ఇచ్చింది: నిర్భయంగా, నిస్సంకోచంగా నేను అనుకున్నది నేను అనుకున్న విధాన వ్యక్తీకరించడం. ఎడిటింగ్ విషయంలో విపరీతమైన వాదోపవాదాలు అయినా కూడా వాటిని ప్రొఫెషనల్ బౌండరీలు దాటనివ్వకుండా ఉంచడం. ఆరెక్స్-మారేజ్, ఎడిట్ వార్స్ లాంటి కథను నా పేరుతో బయటకు పంపలేని సంకోచం నాది, అలాంటి బెరుకు, బెదురులని ఎప్పటికప్పుడు పోగట్టడం.
ఇవ్వన్నీ “మేమే నిన్ను రచయితగా ఉలితో చెక్కాం”, “మమ్మల్ని గాడ్‌ఫాదర్‍గా ఒప్పుకో”, “మా ఇగోలకు స్థొమతకు మించి ధూపదీపనైవేద్యాలు సమర్పించుకో” లాంటి తలనొప్పులేం లేకుండా. కథ పంపినప్పటి మాటలు తర్వాత, ఏళ్ళకేళ్ళు పలకరించకుండా పోయినా ఫర్వాలేదన్నంత ప్రొఫెషనల్‍గా ఉంచుతూ, ఎడిటింగ్ ప్రాసెస్ మరీ stressful అవుతున్నప్పుడు విసుగు-చిరాకులు తారాస్థాయి చేరక ముందే కాస్త వెనక్కి తగ్గి, మళ్ళీ కుదురుకున్నాక పనిచేసే వీలు కల్పించడం…
ఈ మధ్య నా రచనలకు కాస్తో కూస్తో అటెన్షన్ వస్తుందని గమనిస్తున్న కొందరు, ఆ పొగడ్తలన్నీ తలకెక్కించేసుకుని నేను విర్రవీగిపోతానేమోనని తెగ గాభరా పడుతున్నారు. ఆ అవకాశమే లేదు. ఈమాట, బెంగళూరు రైటర్స్ వర్క్‌షాప్ — ఈ రెండూ నన్ను రచయితగానే కాదు, మనిషిగా కూడా మెరుగుపరిచాయి. వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగినా లేకున్నా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు నాతో ఎప్పుడూ ఉంటాయి.
నేను అతి-తెలివి కథలు రాస్తానని ఎంత అపప్రథ ఉన్నా, I’m grounded in my realities. Writing isn’t a vanity exercise for me. అలాంటి వేదిక నాకు ఈమాట ఇచ్చింది. దాన్ని బాన్ చేస్తే హాయిగా దానితో పాటు బాన్ అవ్వడమే!
ఈ సంపాదకీయం ఫేస్బుక్‌లో కనిపించి హడావిడిగా చదివిన మొదటిసారి, నాకు చాలా విసుగ్గా అనిపించింది. తర్వాత అయిన రాద్ధాంతం, దానికి మీరిచ్చిన వివరణలు అన్నీ చదివాను. అయినా నావో రెండు మాటలు:
1. పైన పవన్‌గారు అన్నట్టు ఇక్కడ మీరేమీ అబద్ధాలు రాయలేదు. పైగా మన ఎవ్వరి దగ్గర గణాంకాలు/qualifiers/quantifiers లేవు. అప్పుడు ఇలాంటి వ్యక్తీకరణల వెనుక ఆలోచన, అక్కర కన్నా భావోద్వేగమే ఎక్కువ కనిపిస్తుంది.
2. తెలుగులో ఏది “అల్లిబిల్లి రచన” అనేదానిపై ఒక baseline లేదు. ఇక్కడ “ఎవరు రాశారు” †>>> “ఏం రాశారు” >>> “ఎలా రాశారు” – విమర్శలు తీసుకోడానికి రచయితలు ఎందుకు సిద్ధంగా లేరు అంటే, వాళ్ళకి పళ్ళెంలో పెట్టి పొగడ్తలు అందిస్తుంటే, పిలిచారు కదా అని స్టేజీలెక్కి ఏ మాత్రం నిబద్ధత లేకుండా వాళ్ళది ఎందుకు అత్యుత్తమ రచనో నోటికొచ్చింది అతిథులు వాగుతుంటే, ఆ వీడియోలు గట్రాలు యూట్యూబుల్లో పెట్టినప్పుడు, ఇంకో పది మంది వచ్చి “మీరెంత గొప్ప కాకపోతే ఇందులో గొప్పతనం చూడగలరు?” అని మోస్తుంటే… ఆత్మవిమర్శలు, ఆత్మపరిశీలన — ఇవ్వన్నీ అత్యాశలు కావా?
3. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుని, ఇక్కడికే వచ్చి “అయ్యా, మీది privilege. మీకు డబ్బు, ఇంగ్లీషుపై పట్టు, ప్రపంచ జ్ఞానం అన్నీ ఉన్నాయి. మాకు లేవు. మీ తూకంలో మమల్ని తూగమంటే ఎట్టా? మా పాట్లు చెప్పుకుంటే మీరేం సాయం చేయగలరు? చేయలేనప్పుడు ఈ నీతి బోధలు ఎందుకు?” అని కూడా అడుగుండచ్చు. కానీ వాళ్ళు మీమ్స్/ట్రోలింగుతో సమాధానాలు ఇచ్చామనుకున్నారు. అక్కడితో వాళ్ళది పై చేయి అయి (అని వాళ్ళు అనుకుని) చర్చ ముగించారు.
4. ఈమాట సంపాదకీయాన్ని పాజిటివ్‍గా పంచుకున్నవాళ్ళలో కూడా కొందరు పరిశుద్ధాత్ములేం కారు. అదేదో మీ భుజం మీద తుపాకి ఉంచి పేల్చడమే. “నువ్వు రాసిన కవితలో సవాలక్ష సమస్యలున్నాయి” అని హింట్ ఇచ్చినా వాళ్ళు 3వ పాయింట్ వాళ్ళతో కలిసిపోతారు.
5. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి lash-out సంపాదకీయాల వల్ల లాభమేమిటి? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎవరికైతే ఉందని మీ ఊహో, వాళ్ళెటూ ఈ సంపాదకీయం చదవరు, చదివినా మీమ్స్‌కు మించి వాళ్ళు మీతో చర్చకు కూడా దిగరు.
కాకపోతే, రాయాలన్న తపనతో పాటు సరిగ్గా రాయాలన్న పట్టుదల ఉన్నవాళ్ళని ఇలాంటి సంపాదకీయాలు ఇంకా ఊబిలోకి కూర్చేస్తాయి. Imposter Syndrome ఒక నిజం. ముఖ్యంగా మహిళల్లో. మంచి రచన అంటే ఏంటి అనేదానికి వ్యక్తిగత అభిప్రాయాలు, biases తప్పించి ఎలాంటి కొలమానాలూ, ఎలాంటి ఫీడ్బాక్ లేని తెలుగు సాహిత్య లోకంలో ఇలాంటి ముసుగులో గుద్దులాట వల్ల సున్నితంగా ఉన్నవాళ్ళకే దెబ్బలు తగులుతాయి కదా!
6. అవును, తెలుగు సాహిత్యంలో సవాలక్ష సమస్యలున్నాయి. కానీ ఎంతసేపూ వాటిని ఒక superficial levelలో మాట్లాడతారే తప్పించి అంతకన్నా లోతుగా వెళ్ళరు. ఇలా ఈ పైపై చర్చలు ఎంత కాలం? మొత్తం రభస అంతా అయ్యాక మీ వివరణలో “జ్యోతి వలబోజు”గారి పేరుని ప్రస్తావించారు, మంచి పనికి ఉదాహరణగా. ఒక నెల సంపాదకీయంలో చెడమడా తిట్టేసినా, ఇంకో దాంట్లో ఇట్లా మంచిగా చేస్తున్నవారిని, (లేదా సంపాదకీయాల్లో వ్యక్తుల పేర్లు వాడకూడదంటే) జరుగుతున్న మంచి పనులు చెప్పడానికి కూడా ప్రయత్నించండి.
వాస్తవాలను విస్మరించేంతటి గుడ్డి పాజిటివిటి కాకుండా, గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక చిన్న దివ్వెను వెతుక్కునేలా కూడా మీ సంపాదకీయాలు ఉండచ్చు. పరిగణించండి.
†>>> — అంటే ఇంటర్నెట్ లింగోలో one is far greater/far more important than the other అని అర్థం.
మైసూరు ఆస్దానంలో ఎంతోమంది విదేశీయులు ముఖ్యంగా ప్రెంచ్ కళాకారులు సంగీత ప్రదర్శనలు ఇచ్చేవారు. కొంత వరకూ ఈ రాగంలో ఆ ఛాయలు కనిపిస్తాయి. ఆ దిశగా కొంత పరిశోధన జరగవలసిన అవసరం ఉందని భావిస్తాను.
మోహన రాగ మహా! గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
11/01/2023 9:51 am
కళని చూడగల కళ్లకి ఏ వొంపుగల బొమ్మైనా చిత్రమే! వీటిలో కళాకారుడు మాత్రమే కనిపించడం కళ్లు చేసుకున్న అదృష్టం! మీ నిబధ్ధతకి, లోతుకి జోహార్లు అన్వర్ గారూ!
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి ఎన్నెలమ్మ గారి అభిప్రాయం:
11/01/2023 7:22 am
చాలా బాగుంది సురేష్ గారూ. తదుపరి భాగం కోసం వేచి ఉన్నా.
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి PRABHAKARA SASTRI NANDULA గారి అభిప్రాయం:
11/01/2023 6:40 am
అద్భుతమైన అనువాదం. మరికొంత వివరణ వుంటే బాగుంటుందని మనవి. తప్పక కొనసాగించగలరు🙏🙏
మోహన రాగ మహా! గురించి srinivasarao.v గారి అభిప్రాయం:
11/01/2023 5:46 am
ఒక వంక బొమ్మల గొప్పతనమూ, మరో ప్రక్క ఆ చిత్రకారుడి ఫీలింగ్స్, తోటి చిత్రకారుల ఫీలింగ్స్, ఆ చిత్రాలూ, ఆ పేజీలూ ఏమై పోయాయో అన్న ఆవేదనా, ఆ పెన్సిల్, ఆ బొమ్మలు – అన్నీ పంచిన మీకు థాంక్స్ మాత్రమే చెప్పగలము.
మనమెరుగని మధ్య అమెరికా 6 గురించి Seshagiri Nimmagadda గారి అభిప్రాయం:
10/31/2023 5:20 pm
Thank you for your comments and feedback, Anil Garu.
మనమెరుగని మధ్య అమెరికా 6 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
10/31/2023 1:45 am
Thank you Anil
నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
10/30/2023 12:41 pm
ఈ శీర్షికలో విన్న అన్ని కవి పరిచయాలు, కవిత్వము ఎంతో బాగున్నవి. వీరందరి పొయటిక్ జీనియాలజీ ఇంచుమించు ఒకటే కదా! వీరి పాండిత్యము, వ్యాకరణ జ్ఞానము, ఊహాశక్తి శబలము. ఆకర్షణీయము. వీరు తమకన్నా ముందు తరాల భారతీయ సాహిత్యం చక్కగా చదివిన వారు.
(“…For greatest poets have aspects which do not come to light at once: and by exercising a direct influence on other poets centuries later, they continue to affect the living language…” — In the essay -The Social Function of Poetry, page 11. (T.S. Eliot on Poetry and Poets, Publication 1954 –Farrar, Straus and Giroux, New York.)
ఐతే, ఈ కవులు వీరెవరివీ distinct voices కావు. కవి పేరు ఇవ్వకుండా కొన్ని పంక్తులనో ఒక పద్యాన్నో ఇచ్చినప్పుడు, అది ఎవరు రచించినదీ చెప్పటం ఇతర శ్రోతలకు సాధ్యం కాదు.
“In Swinburne an Estimate” (Archon books 1969) another poet John Drinkwater in the first chapter – Lyric technique says: The most immediate impression gathered from a close acquaintance with Swinburne’s lyric poetry is its curious distinctiveness from all other poetry.”
అది నిజమే. అంతమాత్రాన అతడు కీట్స్, టెనిసన్, వర్డ్స్‌వర్త్ వీరందరికన్నా గొప్ప కవిత్వం చెప్పాడని కాదు. Lyric technique, Lyric thought, Lyric art… అంటూ స్విన్‌బర్న్ గురించి ఇందులోని ఛాప్టర్లన్నీ నేను చదువుకున్నాను. ఎలియట్ – స్విన్‌బర్న్ యాజ్ ఎ పొయెట్, యాజ్ ఎ క్రిటిక్ – కూడా ఎన్నిసార్లో చదివాను.
Meera, the Indian woman poet, is direct and intense in expressing emotion. She, in her simple sentences, is so musical.
జో తుమ్ తోడో పియా మై నాహి తోడూ రే
తోస్ ప్రీత్ తోడ్ కృష్ణ, కౌన్ సంగ్ జోడూ రే!
So is Telugu Annamayya. This is a super-duper dream!
కలగంటి కలగంటి, ఇప్పుడిటు కలగంటి
ఎల్ల లోకంబులకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి!
They have distinct beautiful voices, yet, they too must have had their ancestral poets. In this Telugu poetry of mine(?) below, obviously, the person’s -Silsila, the spiritual ancestry- goes back to some of Meera’s and Potana’s Krishna poetry. These days when I recall-sing it to myself, in Biltmore or Vizcaya gardens, where peacocks dance and parrots fly -all I see and hear is lush, lust, luxury, happiness. There is no devotion. No submission. No Nada. Only pure self-indulgence. Here are the words:
ఏ లలనామణులారటంబున మురారీ! కనరారా ప్రియా! యం
చే మల్లెనికుంజముల నీకై గాలించిరో!
ఏ కాంతారమున ఆ కాంత లేకాంతమున నీతో భోగించిరో!
ఏ వనసీమల మ్రోగె నీ మురళి! ఆ కానలలో
నే మోదుగ పూవుగ పూచి యుందునుర, కృష్ణా! వనమాలీ, శౌరీ!
Es la verdad.
-Lyla
అక్టోబర్ 2023 గురించి Purnima గారి అభిప్రాయం:
10/29/2023 1:36 am
చివరిగా ఒక మాట:
హాస్యాస్పదంగా కొందరు ఈమాటను, ఈమాట రచయితలను బాయ్‍కాట్ చేయాలని కూడా ప్రతిపాదించారు. అట్లాంటిది ఏదన్నా జరిగితే మాత్రం నేను ఆ banని badge of honourలా ధరిస్తాను.
నాలా అందరూ ఈమాట నుంచి లాభపడే ఉంటారు, లాభపడని వాళ్ళదే ఏదో తప్పై ఉంటుందనే సంకుచితత్వం నాకు లేదు. ఇరుపక్షాలకూ ఎంత మంచి ఉద్దేశ్యాలున్నా ఒక్కోసారి పనులు బెడిసికొడతాయి. నెగిటివిటి పుట్టుకొస్తుంది. అలాంటి చేదు అనుభవాలను invalidate చేయబోను.
కానీ ఈమాట వల్ల నేను నేర్చుకున్నది, లేదా నాకీ పత్రిక ఇచ్చింది: నిర్భయంగా, నిస్సంకోచంగా నేను అనుకున్నది నేను అనుకున్న విధాన వ్యక్తీకరించడం. ఎడిటింగ్ విషయంలో విపరీతమైన వాదోపవాదాలు అయినా కూడా వాటిని ప్రొఫెషనల్ బౌండరీలు దాటనివ్వకుండా ఉంచడం. ఆరెక్స్-మారేజ్, ఎడిట్ వార్స్ లాంటి కథను నా పేరుతో బయటకు పంపలేని సంకోచం నాది, అలాంటి బెరుకు, బెదురులని ఎప్పటికప్పుడు పోగట్టడం.
ఇవ్వన్నీ “మేమే నిన్ను రచయితగా ఉలితో చెక్కాం”, “మమ్మల్ని గాడ్‌ఫాదర్‍గా ఒప్పుకో”, “మా ఇగోలకు స్థొమతకు మించి ధూపదీపనైవేద్యాలు సమర్పించుకో” లాంటి తలనొప్పులేం లేకుండా. కథ పంపినప్పటి మాటలు తర్వాత, ఏళ్ళకేళ్ళు పలకరించకుండా పోయినా ఫర్వాలేదన్నంత ప్రొఫెషనల్‍గా ఉంచుతూ, ఎడిటింగ్ ప్రాసెస్ మరీ stressful అవుతున్నప్పుడు విసుగు-చిరాకులు తారాస్థాయి చేరక ముందే కాస్త వెనక్కి తగ్గి, మళ్ళీ కుదురుకున్నాక పనిచేసే వీలు కల్పించడం…
ఈ మధ్య నా రచనలకు కాస్తో కూస్తో అటెన్షన్ వస్తుందని గమనిస్తున్న కొందరు, ఆ పొగడ్తలన్నీ తలకెక్కించేసుకుని నేను విర్రవీగిపోతానేమోనని తెగ గాభరా పడుతున్నారు. ఆ అవకాశమే లేదు. ఈమాట, బెంగళూరు రైటర్స్ వర్క్‌షాప్ — ఈ రెండూ నన్ను రచయితగానే కాదు, మనిషిగా కూడా మెరుగుపరిచాయి. వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగినా లేకున్నా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు నాతో ఎప్పుడూ ఉంటాయి.
నేను అతి-తెలివి కథలు రాస్తానని ఎంత అపప్రథ ఉన్నా, I’m grounded in my realities. Writing isn’t a vanity exercise for me. అలాంటి వేదిక నాకు ఈమాట ఇచ్చింది. దాన్ని బాన్ చేస్తే హాయిగా దానితో పాటు బాన్ అవ్వడమే!
అక్టోబర్ 2023 గురించి Purnima గారి అభిప్రాయం:
10/29/2023 1:34 am
ఈ సంపాదకీయం ఫేస్బుక్‌లో కనిపించి హడావిడిగా చదివిన మొదటిసారి, నాకు చాలా విసుగ్గా అనిపించింది. తర్వాత అయిన రాద్ధాంతం, దానికి మీరిచ్చిన వివరణలు అన్నీ చదివాను. అయినా నావో రెండు మాటలు:
1. పైన పవన్‌గారు అన్నట్టు ఇక్కడ మీరేమీ అబద్ధాలు రాయలేదు. పైగా మన ఎవ్వరి దగ్గర గణాంకాలు/qualifiers/quantifiers లేవు. అప్పుడు ఇలాంటి వ్యక్తీకరణల వెనుక ఆలోచన, అక్కర కన్నా భావోద్వేగమే ఎక్కువ కనిపిస్తుంది.
2. తెలుగులో ఏది “అల్లిబిల్లి రచన” అనేదానిపై ఒక baseline లేదు. ఇక్కడ “ఎవరు రాశారు” †>>> “ఏం రాశారు” >>> “ఎలా రాశారు” – విమర్శలు తీసుకోడానికి రచయితలు ఎందుకు సిద్ధంగా లేరు అంటే, వాళ్ళకి పళ్ళెంలో పెట్టి పొగడ్తలు అందిస్తుంటే, పిలిచారు కదా అని స్టేజీలెక్కి ఏ మాత్రం నిబద్ధత లేకుండా వాళ్ళది ఎందుకు అత్యుత్తమ రచనో నోటికొచ్చింది అతిథులు వాగుతుంటే, ఆ వీడియోలు గట్రాలు యూట్యూబుల్లో పెట్టినప్పుడు, ఇంకో పది మంది వచ్చి “మీరెంత గొప్ప కాకపోతే ఇందులో గొప్పతనం చూడగలరు?” అని మోస్తుంటే… ఆత్మవిమర్శలు, ఆత్మపరిశీలన — ఇవ్వన్నీ అత్యాశలు కావా?
3. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుని, ఇక్కడికే వచ్చి “అయ్యా, మీది privilege. మీకు డబ్బు, ఇంగ్లీషుపై పట్టు, ప్రపంచ జ్ఞానం అన్నీ ఉన్నాయి. మాకు లేవు. మీ తూకంలో మమల్ని తూగమంటే ఎట్టా? మా పాట్లు చెప్పుకుంటే మీరేం సాయం చేయగలరు? చేయలేనప్పుడు ఈ నీతి బోధలు ఎందుకు?” అని కూడా అడుగుండచ్చు. కానీ వాళ్ళు మీమ్స్/ట్రోలింగుతో సమాధానాలు ఇచ్చామనుకున్నారు. అక్కడితో వాళ్ళది పై చేయి అయి (అని వాళ్ళు అనుకుని) చర్చ ముగించారు.
4. ఈమాట సంపాదకీయాన్ని పాజిటివ్‍గా పంచుకున్నవాళ్ళలో కూడా కొందరు పరిశుద్ధాత్ములేం కారు. అదేదో మీ భుజం మీద తుపాకి ఉంచి పేల్చడమే. “నువ్వు రాసిన కవితలో సవాలక్ష సమస్యలున్నాయి” అని హింట్ ఇచ్చినా వాళ్ళు 3వ పాయింట్ వాళ్ళతో కలిసిపోతారు.
5. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి lash-out సంపాదకీయాల వల్ల లాభమేమిటి? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎవరికైతే ఉందని మీ ఊహో, వాళ్ళెటూ ఈ సంపాదకీయం చదవరు, చదివినా మీమ్స్‌కు మించి వాళ్ళు మీతో చర్చకు కూడా దిగరు.
కాకపోతే, రాయాలన్న తపనతో పాటు సరిగ్గా రాయాలన్న పట్టుదల ఉన్నవాళ్ళని ఇలాంటి సంపాదకీయాలు ఇంకా ఊబిలోకి కూర్చేస్తాయి. Imposter Syndrome ఒక నిజం. ముఖ్యంగా మహిళల్లో. మంచి రచన అంటే ఏంటి అనేదానికి వ్యక్తిగత అభిప్రాయాలు, biases తప్పించి ఎలాంటి కొలమానాలూ, ఎలాంటి ఫీడ్బాక్ లేని తెలుగు సాహిత్య లోకంలో ఇలాంటి ముసుగులో గుద్దులాట వల్ల సున్నితంగా ఉన్నవాళ్ళకే దెబ్బలు తగులుతాయి కదా!
6. అవును, తెలుగు సాహిత్యంలో సవాలక్ష సమస్యలున్నాయి. కానీ ఎంతసేపూ వాటిని ఒక superficial levelలో మాట్లాడతారే తప్పించి అంతకన్నా లోతుగా వెళ్ళరు. ఇలా ఈ పైపై చర్చలు ఎంత కాలం? మొత్తం రభస అంతా అయ్యాక మీ వివరణలో “జ్యోతి వలబోజు”గారి పేరుని ప్రస్తావించారు, మంచి పనికి ఉదాహరణగా. ఒక నెల సంపాదకీయంలో చెడమడా తిట్టేసినా, ఇంకో దాంట్లో ఇట్లా మంచిగా చేస్తున్నవారిని, (లేదా సంపాదకీయాల్లో వ్యక్తుల పేర్లు వాడకూడదంటే) జరుగుతున్న మంచి పనులు చెప్పడానికి కూడా ప్రయత్నించండి.
వాస్తవాలను విస్మరించేంతటి గుడ్డి పాజిటివిటి కాకుండా, గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక చిన్న దివ్వెను వెతుక్కునేలా కూడా మీ సంపాదకీయాలు ఉండచ్చు. పరిగణించండి.
†>>> — అంటే ఇంటర్నెట్ లింగోలో one is far greater/far more important than the other అని అర్థం.
సంగీత పట్నం – కదనకుతూహలం గురించి m.vk.rao గారి అభిప్రాయం:
10/27/2023 10:41 pm