లైలా గారు నా అభిప్రాయాలకు సమాధానం చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. పాత్రలకు అవసరం లేనప్పుడు పేర్లు పెట్టటం దండగమారి వ్యవహారం. అందుచేత ఆవిషయంలో అభ్యంతరం లేదు నాకు. “ఈ సారు ఎగ్రెసార్? అదీ కథ” అని బాగానే పట్టిచ్చారు. అవును కదా. అలాగే అనిపిస్తుంది. అతని జాలి నాటకం అన్నమాట. “ఈ రచయిత తంపులమారి” అన్నారు. అది ఆలోచనీయాంశమే. అసలు ఈకథలో రచయిత చెప్పదలచుకొన్నది ఏమిటీ అన్నది అనుమానంగా ఉంది.
(As though I don’t show off my name enough) – తాడిగడప శ్యామల రావుగారు, తమ ప్రతి స్పందనలో ఏడుసార్లు ‘లైలా’ పేరు ప్రకాశితము చేశారు.
‘రుచి’ కథలో ఒక్కళ్లకు పేరు లేదు. ఒక్క కృష్ణకు తప్ప. పూసల బక్క అమ్మాయికి పూసలూ, తెల్లచారలు అన్నా ఉన్నయ్. బాసు హీరోకి ఎత్తూ, లావూ, వయసూ, చర్మం రంగూ ఇత్యాదులు లేవు. ఈ కంప్యూటర్ ఎకౌంటెంట్, వర్క్ ప్లేస్‌లో బైటికీ లోపలికీ ముడ్డి తిప్పుకుంటూ తిరిగేప్పుడు, బైటి ఇంజనీర్లు ఇతన్ని చూసి ఉచ్చపోసుకుని, సిగిరెట్లు పారేస్తారు. లోపలకి వచ్చినప్పుడు, సారుగారు అద్దాల కేజ్‌ల్లో ఎంప్లాయీ ఆడవాళ్ల చీరలు గమనిస్తాడు. బక్కమ్మాయి చీర మార్చిందా లేదా అనే రంధి. ఆఫీస్ రూల్స్ వంక పెట్టి ఈ మెయిల్స్ పంపుతాడు. ఆమెనే ఎందుకు సతాయిస్తున్నాడు? అంత ఎఫిషియెంట్ సారుకి ఎందుకో మగవాళ్ల రెస్ట్రూమ్‌కి దారి తెలియదు. ఆడవాళ్ల భోజనాల గదిలోకి వచ్చి అక్కడ సింక్ లోనే చేతులు కడుక్కోవాలి. వాళ్లు స్నేహంగా రండి కలిసి భోంచేద్దాం అంటే, రాడు. అప్పుడే బక్క అమ్మాయిని కూడా కలుపుకుని అందరూ తినచ్చుగా. టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. అబ్బే, అలా కుదరదు. బక్క అమ్మాయి ఇంక్విజిషన్ లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితి బాగా లేదన్న సంగతి పట్టేసాడు. ఆ పూసల అమ్మాయి వంటరిగా ఉన్నప్పుడు గదిలోకి జొరబడతాడు. తన షాన్ చూపించటానికి కృష్ణతో హోటల్ నుండి వచ్చిన కారేజీ విప్పిస్తాడు. గిన్నెలు సర్దిస్తాడు. రోజూ భోజనం తెచ్చే అతన్ని -కృష్ణా, నువ్వు తిన్నావా, నువ్వూ మాతో తిను అనడేం? పైగా కృష్ణా నువ్వు బైటకు వెళ్లు, అంటాడు. ఎందుకు ఆ నోరు లేని అమ్మాయిని ఒంటరిగా గదిలో విడిచి అతను బైటికి వెళ్లటం? కృష్ణ కన్నా ఆ అమ్మాయికి బాసుహీరో క్లోజా? ఎలా? మళ్లీ ఆమెను గద్దించటం, తన అన్నం తినమని ఫోర్స్ చెయ్యటం. దేనికి? ఈ సారు ఎగ్రెసార్? అదీ కథ.
ఈ రచయిత, తన కథల్లో ఒక్క్కోసారి కులం, మతం, జెండర్, ఉద్యోగం, వర్గం అంటూ, ఒకరికీ ఒకరికీ జుట్టు ముడిపెడతాడు, ఒకసారి ఒకళ్ల పైన ద్వేషం, ఒకళ్ల పైన సానుభూతి కలిగిస్తాడు. కధలో ఎవరికీ సుఖముండదు. ద్వేషం, ఏడుపు, అందరూ కొట్టుకు చావటమే. ఈ రచయిత తంపులమారి. ఇతని థీమ్స్ కలహాలు, వైషమ్యాలు.
తా. శ్యామలరావు గారు తమ ప్రతి స్పందనలో ఏమన్నారు?
“సగటు స్త్రీలకు సాటి స్త్రీలపట్ల కనీసపు జాలికూడా ఉండటం లేదన్న సంగతిని ఈకథ వేలెత్తి చూపింది.”
That sentence is subsumed in my sentence below.
“…స్త్రీ ఇతరులను రక్షించే, కాపాడే, సహాయం చేసే స్థానంలో ఉండదు.”
(అంటే -రచయిత అట్టి సందర్భాలు, పాత్రల తలలో అట్టి ఆలోచనలు, ఏ పాత్రల ద్వారా అలాటి సంభాషణలు సృష్టించడు. -అని)
Lakshmi Priya gAru, Thanks for the kind correction! As I mentioned above, my source is the reputed Tamil film historian S. Theodore Baskaran and his book: “The eye of the serpent – An introduction to Tamil Cinema” (East West Books, Madras, 1996). It´s not an excuse though! I should have cross-checked my source material.
I´ll request ఈమాట editors to replace “మార్కుస్ బార్ట్‌లే శ్రీమతి బార్ట్‌లే” with “Baburao Patel, Rita Carlyle”.
Thanks and Regards, Sreenivas
[బార్ట్‌లే పేర్లను తొలగించి సరైన పేర్లను జత చేసినాము – సం. ]
సామానులు గమ్యం చేరకపోవడం కొన్ని దేశాలలో సర్వ సాధారణం అనుకుంటా! దేశాలు అనడంకన్నా విమానయాన సంస్థలదే అనడం సముచితమేమో!
ఇక ఈ యాత్రలలో అనేక మంది మనుషులు, వారి మనస్తత్వాలతో మనం నేర్చుకుంటూ ఎదుగుతాం. అందని సామన్ల మూలంగా నిరాశ చెందకుండా … కానున్నది కాకమానదు అనుకుంటూ ముందుకు సాగడం.
చారిత్రక నేపధ్యం, భౌగోళిక వాతావరణం, జీవన విధానం, సాంస్కృతిక ఆచారాలు, పద్దతులతో ఈ యాత్రాకధనం బాగుంది, శేషగిరిగారు.
అమరేంద్ర గారి తెలుగు నుడికారం బాగుంది.
అద్భుతమైన ఫొటోలని ప్రస్తావించకుండా వుండటం గొప్ప అపరాధం!
ఈకథ బాగుంది. గొప్పగా ఉందని మాత్రం అనిపించలేదు. నాకారణాలు నాకున్నాయి. చర్చనీయాంశం అది కాదు. లైలాగారి స్పందనకు ప్రతిస్పందనగా వ్రాస్తున్నాను నాలుగుముక్కలు.
ఈకథలో ఆపేద అమ్మాయీ ఆమె గురించి చెబుతున్న మగబాసూ ముఖ్యపాత్రలు. బాసు మగవాడైపోవటం ఆపైన ఆమెపైన జాలిపడటం (తద్వారా ద్వారా హీరో ఐపోవటం) లైలా గారికి నచ్చలేదు. ఆడబాసు అయ్యున్నా కథ అచ్చం ఇలాగే ఉండేది. అప్పుడు లైలాగారికి అందులో ఆ హీరోయిజం అనే తప్పు తోచేది కాదు. కానీ ఆ హీరోయిజం కేవలం ఆనుషంగికం.
కోపావేశంలో లైలాగారి దృష్టినుండి తప్పిపోయిన కొన్ని సంగతులున్నాయి. ఆ పేదపిల్లకు ఒక పిన్నీ ముగ్గురు చెల్లెళ్ళూ ఉన్నారు. సగటు పేద/మధ్య తరగతి తండ్రిగా పెద్దనం చెసే ఒక పెద్దమనిషి ఉన్నాడు. నిస్సహాయస్థితిలో ఆమె కండలు వాళ్ళ యింటిపోషణకు కరిగిపోయి బక్కపీచు ఐపోయింది. స్త్రీవాదకోణంలో తగిన స్తోమత లేకుండినా రెండవపెండ్లి చేసుకొని బిడ్డల్ని కని పెద్దపిల్ల నెత్తిన బాధ్యత పెట్టి కనీస ఆప్యాయతను కూడా పంచ(లే)ని ఆమూర్ఖతండ్రి మీద పడాలికదా లైలా గారి కోపదృష్టి? నాకెందుకు అని అనుకోలేక జాలిపడిన ఆబాసు మగవాడైనంత మాత్రాన అందులో ప్రపంచద్రోహం ఉందని గింజుకోవటంలో అర్ధం లేదు.
సగటు స్త్రీలకు సాటి స్త్రీలపట్ల కనీసపు జాలికూడా ఉండటం లేదన్న సంగతిని ఈకథ వేలెత్తి చూపింది. స్త్రీవాదులు ఈసంగతిని – అంటే స్త్రీలలో సానుభూతిరాహిత్యాన్ని – ఒక ఆందోళనకరమైన సంగతిగా ఆలోచించాలి. ఈసంగతి లైలాగారి దృష్టికి రానే లేదు. మగబాసులను తిట్టినంత మాత్రాన స్త్రీవాద దృక్పథం ఐపోతుందా అన్న ఆలోచన ఆవిడకు రాలేదు.
ఎప్పుడూ మగవాళ్ళు రక్షకులూ ఆడవాళ్ళు రక్షితులూ కావటం అనేది దాటి సాహిత్యకారులు ఆలోచించలేరా అన్న లైలాగారి నిలదీత హర్షణీయమే. కాని ఈకథలో అదంత ముఖ్యవిషయం కాదు.
ఈకథ నాకు నచ్చకపోవటానికి ఉన్న అనేకకారణాలలో ఒకటి – ఒక పూట ఆమెకు విందుభోజనం (కించిత్తు బలవంతంగా) తినిపించినంత మాత్రాన ఆపిల్లకు కలిగే ప్రయోజనం ఏముందీ అన్నది.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి Srinivasachary Sirisinahal గారి అభిప్రాయం:
10/27/2023 7:03 am
No reference to Agama and Tantra texts. They may throw more light.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
10/25/2023 11:01 pm
ఈ సైనికుడి జ్ఝాపకాలు బాగున్నాయి! తెలుగులో పదాతి దళం కథలు తక్కువ. ఆ లోటు మీ కథలు కొంత మేరకు పూరిస్తున్నాయి.
రుచి గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
10/25/2023 9:48 am
లైలా గారు నా అభిప్రాయాలకు సమాధానం చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. పాత్రలకు అవసరం లేనప్పుడు పేర్లు పెట్టటం దండగమారి వ్యవహారం. అందుచేత ఆవిషయంలో అభ్యంతరం లేదు నాకు. “ఈ సారు ఎగ్రెసార్? అదీ కథ” అని బాగానే పట్టిచ్చారు. అవును కదా. అలాగే అనిపిస్తుంది. అతని జాలి నాటకం అన్నమాట. “ఈ రచయిత తంపులమారి” అన్నారు. అది ఆలోచనీయాంశమే. అసలు ఈకథలో రచయిత చెప్పదలచుకొన్నది ఏమిటీ అన్నది అనుమానంగా ఉంది.
రుచి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
10/24/2023 5:28 pm
(As though I don’t show off my name enough) – తాడిగడప శ్యామల రావుగారు, తమ ప్రతి స్పందనలో ఏడుసార్లు ‘లైలా’ పేరు ప్రకాశితము చేశారు.
‘రుచి’ కథలో ఒక్కళ్లకు పేరు లేదు. ఒక్క కృష్ణకు తప్ప. పూసల బక్క అమ్మాయికి పూసలూ, తెల్లచారలు అన్నా ఉన్నయ్. బాసు హీరోకి ఎత్తూ, లావూ, వయసూ, చర్మం రంగూ ఇత్యాదులు లేవు. ఈ కంప్యూటర్ ఎకౌంటెంట్, వర్క్ ప్లేస్‌లో బైటికీ లోపలికీ ముడ్డి తిప్పుకుంటూ తిరిగేప్పుడు, బైటి ఇంజనీర్లు ఇతన్ని చూసి ఉచ్చపోసుకుని, సిగిరెట్లు పారేస్తారు. లోపలకి వచ్చినప్పుడు, సారుగారు అద్దాల కేజ్‌ల్లో ఎంప్లాయీ ఆడవాళ్ల చీరలు గమనిస్తాడు. బక్కమ్మాయి చీర మార్చిందా లేదా అనే రంధి. ఆఫీస్ రూల్స్ వంక పెట్టి ఈ మెయిల్స్ పంపుతాడు. ఆమెనే ఎందుకు సతాయిస్తున్నాడు? అంత ఎఫిషియెంట్ సారుకి ఎందుకో మగవాళ్ల రెస్ట్రూమ్‌కి దారి తెలియదు. ఆడవాళ్ల భోజనాల గదిలోకి వచ్చి అక్కడ సింక్ లోనే చేతులు కడుక్కోవాలి. వాళ్లు స్నేహంగా రండి కలిసి భోంచేద్దాం అంటే, రాడు. అప్పుడే బక్క అమ్మాయిని కూడా కలుపుకుని అందరూ తినచ్చుగా. టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. అబ్బే, అలా కుదరదు. బక్క అమ్మాయి ఇంక్విజిషన్ లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితి బాగా లేదన్న సంగతి పట్టేసాడు. ఆ పూసల అమ్మాయి వంటరిగా ఉన్నప్పుడు గదిలోకి జొరబడతాడు. తన షాన్ చూపించటానికి కృష్ణతో హోటల్ నుండి వచ్చిన కారేజీ విప్పిస్తాడు. గిన్నెలు సర్దిస్తాడు. రోజూ భోజనం తెచ్చే అతన్ని -కృష్ణా, నువ్వు తిన్నావా, నువ్వూ మాతో తిను అనడేం? పైగా కృష్ణా నువ్వు బైటకు వెళ్లు, అంటాడు. ఎందుకు ఆ నోరు లేని అమ్మాయిని ఒంటరిగా గదిలో విడిచి అతను బైటికి వెళ్లటం? కృష్ణ కన్నా ఆ అమ్మాయికి బాసుహీరో క్లోజా? ఎలా? మళ్లీ ఆమెను గద్దించటం, తన అన్నం తినమని ఫోర్స్ చెయ్యటం. దేనికి? ఈ సారు ఎగ్రెసార్? అదీ కథ.
ఈ రచయిత, తన కథల్లో ఒక్క్కోసారి కులం, మతం, జెండర్, ఉద్యోగం, వర్గం అంటూ, ఒకరికీ ఒకరికీ జుట్టు ముడిపెడతాడు, ఒకసారి ఒకళ్ల పైన ద్వేషం, ఒకళ్ల పైన సానుభూతి కలిగిస్తాడు. కధలో ఎవరికీ సుఖముండదు. ద్వేషం, ఏడుపు, అందరూ కొట్టుకు చావటమే. ఈ రచయిత తంపులమారి. ఇతని థీమ్స్ కలహాలు, వైషమ్యాలు.
తా. శ్యామలరావు గారు తమ ప్రతి స్పందనలో ఏమన్నారు?
“సగటు స్త్రీలకు సాటి స్త్రీలపట్ల కనీసపు జాలికూడా ఉండటం లేదన్న సంగతిని ఈకథ వేలెత్తి చూపింది.”
That sentence is subsumed in my sentence below.
“…స్త్రీ ఇతరులను రక్షించే, కాపాడే, సహాయం చేసే స్థానంలో ఉండదు.”
(అంటే -రచయిత అట్టి సందర్భాలు, పాత్రల తలలో అట్టి ఆలోచనలు, ఏ పాత్రల ద్వారా అలాటి సంభాషణలు సృష్టించడు. -అని)
Thanks,
-Lyla
Happy Festivities All!
(సినీ)కళాద్రష్ట బి.ఎన్. రెడ్డి గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
10/21/2023 7:43 am
Lakshmi Priya gAru, Thanks for the kind correction! As I mentioned above, my source is the reputed Tamil film historian S. Theodore Baskaran and his book: “The eye of the serpent – An introduction to Tamil Cinema” (East West Books, Madras, 1996). It´s not an excuse though! I should have cross-checked my source material.
I´ll request ఈమాట editors to replace “మార్కుస్ బార్ట్‌లే శ్రీమతి బార్ట్‌లే” with “Baburao Patel, Rita Carlyle”.
Thanks and Regards, Sreenivas
[బార్ట్‌లే పేర్లను తొలగించి సరైన పేర్లను జత చేసినాము – సం. ]
ది గోల్డెన్ టస్క్ గురించి Sudha గారి అభిప్రాయం:
10/19/2023 9:03 am
ధన్యవాదాలు పద్మావతి గారు, ప్రసూన గారు, ఉమ గారు, ఆనంద్ గారు. ..
అక్టోబర్ 2023 గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
10/18/2023 6:28 am
సంపాదకులకి,
సంపాదకీయం బటన్‌ని మీ నావిగేషన్ బార్‌కి ఇస్తే సంపాదకీయాలు మాత్రమే చదవాలనుకునే పాఠకులకి కాస్త సౌకర్యంగా వుంటుంది.
పాత సంచికలలో సంపాదకీయాలు వున్నవని అందరికి తెలియదుకదా!
[ సంచిక ముందుమాటలుగా వస్తున్న సంపాదకీయాలు ముందుమాట అన్న శీర్షిక ద్వారా చూడవచ్చును. – సం ]
మనమెరుగని మధ్య అమెరికా 6 గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
10/18/2023 6:20 am
సామానులు గమ్యం చేరకపోవడం కొన్ని దేశాలలో సర్వ సాధారణం అనుకుంటా! దేశాలు అనడంకన్నా విమానయాన సంస్థలదే అనడం సముచితమేమో!
ఇక ఈ యాత్రలలో అనేక మంది మనుషులు, వారి మనస్తత్వాలతో మనం నేర్చుకుంటూ ఎదుగుతాం. అందని సామన్ల మూలంగా నిరాశ చెందకుండా … కానున్నది కాకమానదు అనుకుంటూ ముందుకు సాగడం.
చారిత్రక నేపధ్యం, భౌగోళిక వాతావరణం, జీవన విధానం, సాంస్కృతిక ఆచారాలు, పద్దతులతో ఈ యాత్రాకధనం బాగుంది, శేషగిరిగారు.
అమరేంద్ర గారి తెలుగు నుడికారం బాగుంది.
అద్భుతమైన ఫొటోలని ప్రస్తావించకుండా వుండటం గొప్ప అపరాధం!
రుచి గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
10/16/2023 2:25 pm
ఈకథ బాగుంది. గొప్పగా ఉందని మాత్రం అనిపించలేదు. నాకారణాలు నాకున్నాయి. చర్చనీయాంశం అది కాదు. లైలాగారి స్పందనకు ప్రతిస్పందనగా వ్రాస్తున్నాను నాలుగుముక్కలు.
ఈకథలో ఆపేద అమ్మాయీ ఆమె గురించి చెబుతున్న మగబాసూ ముఖ్యపాత్రలు. బాసు మగవాడైపోవటం ఆపైన ఆమెపైన జాలిపడటం (తద్వారా ద్వారా హీరో ఐపోవటం) లైలా గారికి నచ్చలేదు. ఆడబాసు అయ్యున్నా కథ అచ్చం ఇలాగే ఉండేది. అప్పుడు లైలాగారికి అందులో ఆ హీరోయిజం అనే తప్పు తోచేది కాదు. కానీ ఆ హీరోయిజం కేవలం ఆనుషంగికం.
కోపావేశంలో లైలాగారి దృష్టినుండి తప్పిపోయిన కొన్ని సంగతులున్నాయి. ఆ పేదపిల్లకు ఒక పిన్నీ ముగ్గురు చెల్లెళ్ళూ ఉన్నారు. సగటు పేద/మధ్య తరగతి తండ్రిగా పెద్దనం చెసే ఒక పెద్దమనిషి ఉన్నాడు. నిస్సహాయస్థితిలో ఆమె కండలు వాళ్ళ యింటిపోషణకు కరిగిపోయి బక్కపీచు ఐపోయింది. స్త్రీవాదకోణంలో తగిన స్తోమత లేకుండినా రెండవపెండ్లి చేసుకొని బిడ్డల్ని కని పెద్దపిల్ల నెత్తిన బాధ్యత పెట్టి కనీస ఆప్యాయతను కూడా పంచ(లే)ని ఆమూర్ఖతండ్రి మీద పడాలికదా లైలా గారి కోపదృష్టి? నాకెందుకు అని అనుకోలేక జాలిపడిన ఆబాసు మగవాడైనంత మాత్రాన అందులో ప్రపంచద్రోహం ఉందని గింజుకోవటంలో అర్ధం లేదు.
సగటు స్త్రీలకు సాటి స్త్రీలపట్ల కనీసపు జాలికూడా ఉండటం లేదన్న సంగతిని ఈకథ వేలెత్తి చూపింది. స్త్రీవాదులు ఈసంగతిని – అంటే స్త్రీలలో సానుభూతిరాహిత్యాన్ని – ఒక ఆందోళనకరమైన సంగతిగా ఆలోచించాలి. ఈసంగతి లైలాగారి దృష్టికి రానే లేదు. మగబాసులను తిట్టినంత మాత్రాన స్త్రీవాద దృక్పథం ఐపోతుందా అన్న ఆలోచన ఆవిడకు రాలేదు.
ఎప్పుడూ మగవాళ్ళు రక్షకులూ ఆడవాళ్ళు రక్షితులూ కావటం అనేది దాటి సాహిత్యకారులు ఆలోచించలేరా అన్న లైలాగారి నిలదీత హర్షణీయమే. కాని ఈకథలో అదంత ముఖ్యవిషయం కాదు.
ఈకథ నాకు నచ్చకపోవటానికి ఉన్న అనేకకారణాలలో ఒకటి – ఒక పూట ఆమెకు విందుభోజనం (కించిత్తు బలవంతంగా) తినిపించినంత మాత్రాన ఆపిల్లకు కలిగే ప్రయోజనం ఏముందీ అన్నది.
(సినీ)కళాద్రష్ట బి.ఎన్. రెడ్డి గురించి Lakshmi Priya గారి అభిప్రాయం:
10/16/2023 8:37 am
That is not Marcus Bartley and his wife. It’s Film India. Baburao Patel and his secretary Rita Carlyle.