Comment navigation


15546

« 1 ... 74 75 76 77 78 ... 1555 »

  1. అక్టోబర్ 2023 గురించి పవన్ సంతోష్ సూరంపూడి గారి అభిప్రాయం:

    10/08/2023 10:53 pm

    ఈమాట చేస్తున్న పని ఇష్టపడేవాడిగా, దశాబ్దం పైగా వాళ్ళ రచనలకు పాఠకునిగా ఇలాంటి ఏకపక్ష సంపాదకీయం వాళ్ళ నుంచి నేనెప్పుడూ ఆశించలేదు.

    కొన్ని పబ్లిషింగ్ హౌస్‌లు రచయితల పుస్తక ప్రచురణాభిలాష మీద మోపుతున్న నిర్దాక్షణ్యమైన భారాన్ని చూశాకా ఈ సంపాదకీయం లో సహానుభూతి లోపించిందని తోస్తోంది. ఈ విమర్శ నలుగురు సంపాదక మిత్రులు కలసి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని “రచయితలెంత వెధవలంటే” అని ప్రారంభించి మాట్లాడుకున్నదాన్ని సారాంశంగా ప్రచురించినట్టుంది తప్పించి సహానుభూతితో అన్నివైపులను గమనించి రాసిన “సంపాదకీయం”లా తోచలేదు. ఇది ఆబ్జెక్టివ్‌గా చూసి తిరగరాసుకుని ఉండొచ్చు. అది జరగలేదని అర్థం అవుతోంది.

    ఇందులో అబద్ధాలు రాయలేదు. కానీ, ఒకే దృక్కోణం నుంచి మొత్తం రాశారు. కనీసంలో కనీసం – ఈ విషయంలో మార్పులు ఎక్కడైనా జరుగుతుంటే వాటిని ప్రస్తావించడమో, బిగ్ పిక్చర్ ఇలా ఉండడానికి జరుగుతున్న కారణాలను మెరుగ్గా విశ్లేషించడమో కూడా లేదు. ఇది విమర్శ కాదు. ఉత్తి Rant.

    ఉదాహరణకు “ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది” అన్న వాక్యం చూడండి. ఈమధ్యకాలంలో ప్రచురణకర్తలకు తామే డబ్బిచ్చి, ప్రచురణసంస్థల పేరిట రచయితలు ప్రచురించుకోవడం బాగా పెరిగింది. ప్రచురణకర్తలు ఇదొక తరహా వ్యాపారంగా చూస్తున్నాయి. ఇంతవరకూ బానే ఉంది. అలాంటప్పుడు డబ్బిచ్చిన రచయిత ఎన్ని అమ్మారో, ఆ డబ్బు ఏమైందో చెప్పకపోతే దానిపై వ్యంగ్యంగా రాసే పనేముంది? పోనీ ఇది వ్యంగ్యం కాదనుకుంటే సంపాదకీయంలో మరోచోట ప్రచురణకర్తలను సమర్థిస్తూ రచయితలను “మీకేం తెలవదు, తెలియనట్టు ఉండరు” అన్న ధోరణిలో ఎందుకు రాయాలి? ఈ రకంగా రాసే సంపాదకీయంలో “మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం.” అని మొదట్లోనే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంది?

    నేను అర్థం చేసుకున్నంతలో ఈ వ్యాసం లక్ష్యం వ్యాసంలో చెప్పినంత విస్తృతమైనది కాదు. సగానికి సగం వ్యాసం – ఈమాట సంపాదకీయ పద్ధతులను వ్యతిరేకించే, అంగీకరించని రచయితల మీద Rantగానే సాగింది. అసలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో రాస్తున్న, పుస్తకాలు వేస్తున్న రచయితల్లో ఎంతమంది ఈమాటకి వ్యాసాలు, కథలు, కవితలు పంపించివుంటారు? ఎంత శాతం? అలాంటప్పుడు, ఆ అంశమే ప్రధానంగా రచయితలను మదింపు వేస్తూ రాసే పనేమిటి? అలాంటప్పుడు దీన్ని విస్తృతమైన రచనల నాణ్యత గురించి, ఈమాట నిర్వాహకవర్గంలో అత్యధికులకు అస్సలు సంబంధం లేని పబ్లిషర్లు-రచయితల డైనమిక్స్ గురించి తోచిన జడ్జిమెంట్లు పాస్ చేయాల్సిన అవసరం ఏమిటి?

    ఇన్ని రాశారు కదా. అసలు ఈనాడు ఉన్న పరిస్థితిలో సగటు రచయితకు తన రచనల గురించి ఏవో కొన్ని చప్పట్లు మినహాయించి ఏం మోటివేషన్ మిగిలింది? “అహాలు, అపోహలు” మినహా ఏమీ లేవని జనరలైజ్ చేయకపోతే ఇన్సెంటివ్, మోటివేషన్ వంటివి అయినా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండకూడదా?

    తమాషా ఏమిటంటే – రచనల్లో నాణ్యత గురించి రాసిన సంపాదకీయమే కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాయడం. బహుశా, తెలుగు సాహిత్యపు తీరుతెన్నుల్ని సంకేతాత్మకంగా ఈమాట సంపాదకులు ఇలా చెప్పాలనుకుని ఉంటారు.

  2. సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    10/08/2023 12:26 pm

    అమరేంద్రగారూ, మీ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లేకుండా సుబేదార్ రావ్ తెర ముందుకు రావడం చాలా కష్టమయ్యేది. మీకు ధన్యవాదాలు.

    ఇందిరగారూ, మీకు ధన్యవాదాలు. ఎంతమాత్రమూ ఊహించని సమయంలో ప్రోత్సాహం అందించినందుకు.

  3. గడినుడి – 84 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:

    10/08/2023 1:57 am

    25 అడ్డం నిడివి తప్పు.

    [సరిచేసాము. ధన్యవాదాలు – సం. ]

  4. జాషువా పిరదౌసి గురించి వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:

    10/07/2023 10:35 pm

    అయ్యా,
    దీన్ని రాసిన వ్యాసకర్త పేరు పేర్కొనండి. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ గురించి చర్చించాల్సి ఉంది.

  5. సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి P.Indira గారి అభిప్రాయం:

    10/07/2023 7:43 am

    శ్రీనివాస్ గారు, చాలా బాగున్నాయి మీరు వ్రాసిన Soldier కధలు. పుస్తక రూపంలో వచ్చాక అందరితో చదివింపచేయాలని నా కోరిక.

  6. అక్టోబర్ 2023 గురించి Indra Prasad గారి అభిప్రాయం:

    10/06/2023 12:31 pm

    మీ సంపాదకీయం నాకు నచ్చింది. ఇటీవలి నా రెండో పుస్తకం.”కాలం సైకత తీరం” తుది రూపం ఇచ్చే ముందు కవితల ఎంపిక, ఎడిటింగ్, విభజన, విశ్లేషణ, ముగ్గురు స్నేహితులు చేసేరు. ప్రచురణ బాధ్యత ఛాయా తీసుకున్నా, మూడు, నాలుగు సార్లు ప్రతిని సరిచూసి విడుదల చేసేం. మొదటి పుస్తకానికి కూడా ఇలాగే పని చేసేం. స్వంత ప్రచురణ అంటే మనకి తోచింది ప్రచురించడం కాదు అని నాకూ అనిపిస్తుంది.

  7. నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:

    10/06/2023 4:18 am

    మోహన్ సార్. కవికీ, గొల్లవానికి ఉండే పోలికలున్న పద్యాన్ని, భావాన్ని అందించగలరు.
    ఇట్లు
    డా. బోలుగద్దె అనిల్ కుమార్

  8. ది గోల్డెన్ టస్క్ గురించి Anand Kumar P గారి అభిప్రాయం:

    10/05/2023 11:15 am

    శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనుషులకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో నక్షత్రాల కింద. చేవా శాంతికి చిహ్నంగా… ఏమో… కథనం అద్భుతంగా ఉంది.

  9. ది గోల్డెన్ టస్క్ గురించి Uma గారి అభిప్రాయం:

    10/04/2023 7:44 pm

    చాల బావుంది కథ సుధా, నీతో పాటు లోయలోకి రావాలనిపించింది…

  10. అసలు నేను గురించి శ్రీరామ్ గారి అభిప్రాయం:

    10/04/2023 11:37 am

    కవిత బాగుంది. మరీ ముఖ్యంగా మీ వాక్య నిర్మాణం. ఎంతో లోతైన అర్ధాన్ని కలిగి ఉండటం ఈ కవితలో చెప్పుకోదగ్గ విషయం. మీకు అభినందనలు.

« 1 ... 74 75 76 77 78 ... 1555 »