ఏదేనా శంఖం లో పోస్తేగాని తీర్థమవదు. అన్ని పోస్టర్లు అనలేను కాని కొన్ని పోస్టర్లు కధ లోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ చాలా బాగుండేవి. పది చూసేసరికి మాకు కధ తెలిసిపోయేది. నాకు వీటి గురించి అవగాహన లేదు గానీ అమెరికన్ స్నేహితుల్లో పాత యింగ్లీషు సినిమాల పోస్టర్లు వేలం పాటల్లో బోలెడు డబ్బు పెట్టి కొనడం చూశాక ఔరా అనుకున్నాను. రూడాల్ఫు వాలంటీనో నటించిన సినిమా తాలూకు కాగితం చాలా విలువైనదట. మాలపిల్ల, వరవిక్రయా లాటి పాత సినిమాల తాలూకువేమేనా దొరికితే వాటి విలువ యెలా వుంటుందో?
చాలా అద్భుతమైన కథ. మానవ సంబంధాల గురించి చక్కటి కథనం. చదివినంతసెపు చాలా ఆనందంగా వుంది.
I find it a bit difficult in using RTS to Telugu, otherwise a wonderful attempt , god bless the author and the publisher.
నేత్రోన్మీలనం గురించి Dr.Y.Kameswari గారి అభిప్రాయం:
11/25/2023 3:38 pm
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సాగుతోంది చర్చ. ఏదో ఒకలాగా బట్టకాల్చి మొహాన పడేసినట్లు, ఎలా ఎదుటివారి కాలు పట్టి లాగుదామా అన్నట్లు ఉన్నది. బతకని బిడ్డ బారెడు అన్నట్లు తీసేసిన కథపై చర్చ ఏల?
విస్తృతమైన సమాచారాన్ని అందించారు. అనేక ధన్యవాములు🙏
నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/24/2023 9:34 pm
ఈ కథ పట్ల శ్రీ శ్యామల రావు గారి అభ్యంతరం “సీతారాములు భగవత్స్వరూపులని, ఈ కథలో వారిగురించి చిత్రీకరించిన ప్రవర్తన భగవత్స్వరూపులకు తగనిదని” ఇంతకుముందు అనుకున్నాను; అలా ఐతే వారి నమ్మకాన్ని ప్రశ్నించటానికి గాని, శంకించటానికి గాని ఎవరికీ అధికారం లేదు. ఐతే, వారి అభ్యంతరం అది కాదని, ఈకథ ఆలంకారికుల సూత్రాలను అనుసరించకపోవటమని వారిప్పుడు అంటున్నారు కనుక కేవలం కుతూహలంతోనే ఒక కోరిక కోరుతున్నాను – వారికి ఇష్టం లేకుంటే చెప్పనక్కర్లేదు – ఈ శతాబ్దంలో, అంటే గత ఇరవైమూడేళ్లలో ఈమాటలో వచ్చిన కథల్లో వారు చదివినవాటిలో, వారిచ్చిన సూత్రాలను అనుసరించిన 2 – 3 కథల పేర్లు చెప్తే వాటిని మళ్లీ చదవాలని వుంది. ముందుగానే వారికి కృతజ్ఞతలు.
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/21/2023 11:50 pm
తెలుగు సాహిత్యంలో ఓనమాలు రాని వారిలో నేనూ ఉన్నాననే అనుకోవచ్చును. ఆంధ్రసాహిత్యసాగరాన్ని ఔపోసనపట్టి తనువున కణకణాన్నా కమ్యూనిష్టుభావజాలాన్ని నింపుకున్నట్టి ఆధునిక కవివిమర్శకశిఖామణుల్లో నేను ఉండనే ఉండను. ఉండలేను కూడా.
నాకు తెలిసి విమర్శ అంటే, సాహిత్యం అంటే హితంతో కూడినది అన్న సంప్రదాయికమైన అర్ధానికి అనుగుణంగా ఒక రచన ఎంతవరకూ న్యాయం చేస్తూ సమాజానికీ సాహిత్యరంగానికీ మంచి చేస్తున్నదీ అని అంచనా వేయటం.
నాకు తెలిసి విమర్శ అంటే కవి యొక్క ప్రతిభావ్యుత్పత్తులను విశ్లేషించటం. కవి యొక్క వస్తుభాషాభావాదులలోని నవ్యతనూ స్పష్టతనూ ఉచితజ్ఞతనూ నిర్వహణానైపుణ్యాన్నీ తదితర శిల్పాది విషయాలనూ పరామర్శించటం.
నాకు తెలిసి విమర్శ అంటే కవి ఎంతటి రసజ్ఞత కలవాడూ, రచనలో రసపోషణ ఎలాగున్నదీ అని తెలుసుకొని చెప్పటం. రసోవై సః అని తెలిసిన ఒక విమర్శకుడు కవికి ఆవిషయంలో ఎంతటి అవగాహన ఉన్నదీ రసనిర్వహణలో ఎంత సమర్ధత ఉన్నదీ బేరీజు వేయటం.
ఇత్యాదులు నాకు తెలిసి విమర్శ లక్షణాలు.
ఆధునిక విమర్శకచక్రవర్తుల విమర్శాలక్షణాలు భిన్నంగానూ అభారతీయంగానూ ఉంటే అది మిక్కిలి చింత్యం నాదృష్టిలో.
రావణుడూ నరకుడూ శూర్పనఖల వంటి దుష్టుల పేర్లూ రామకృష్ణుల పేర్లలాగే కాలానికి నిలిచిపోయాయి. అంతమాత్రాన వాళ్ళంతా రామకృష్ణుల వలె ఆదర్శం అనుకోలేము కదా. అనుకొంటే ఆధునికులూ ఆధునిక కవివిమర్శకులూ అవుతారు కాబోలు!
ఈ రచయిత్రిగారు రామాయణం కనీసం చదవలేదు, ఏ మహానుభావుల ప్రవచనాలు వినలేదు. ఆవిడ బుర్రలో పుట్టిన దానికి గిరీష్ కర్నాడ్ గారి రచన ప్రేరణ అని వ్రాసేశారు. కొంతమంది పిల్లలు బళ్ళో వ్యాస రచనలో టీచర్ని తిడుతూ కూడ వ్రాయగలరు, ఈ రచన కూడ దానికి మించిందేమి కాదు. ఆయన సోదరుడు లక్ష్మణుల వారితో చనిపోయిన వాళ్ళ మీద ద్వేషం తగదు అని చెప్పిన శ్రీరాముడు కాలెత్తి రావణుడి చిత్రపటంలో నాభి మీద కసిగా తన్నాడా? స్వేచ్చా రచన పేరు మీద ఈ పైత్యానికి అంతు లేదా? దానికొక్కటే మార్గం, పిల్లల వ్యాసాలు తల్లితండ్రులు దిద్దినట్లే రచయిత్రికి పెద్దలు సహకరించలేమో??
నేత్రోన్మీలనం గురించి RAGHAVENDRA గారి అభిప్రాయం:
11/28/2023 1:18 am
ఒకోసారి సమీక్ష చదివి, సినిమా చూడటం ఉందికదా. కానీ ఇక్కడ చట్నీ వడ్డించి, ఇడ్లీ తీసేసినట్లు ఉంది నా స్థితి.
దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి కంభంపాటి సుశీల గారి అభిప్రాయం:
11/25/2023 8:34 pm
ఏదేనా శంఖం లో పోస్తేగాని తీర్థమవదు. అన్ని పోస్టర్లు అనలేను కాని కొన్ని పోస్టర్లు కధ లోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ చాలా బాగుండేవి. పది చూసేసరికి మాకు కధ తెలిసిపోయేది. నాకు వీటి గురించి అవగాహన లేదు గానీ అమెరికన్ స్నేహితుల్లో పాత యింగ్లీషు సినిమాల పోస్టర్లు వేలం పాటల్లో బోలెడు డబ్బు పెట్టి కొనడం చూశాక ఔరా అనుకున్నాను. రూడాల్ఫు వాలంటీనో నటించిన సినిమా తాలూకు కాగితం చాలా విలువైనదట. మాలపిల్ల, వరవిక్రయా లాటి పాత సినిమాల తాలూకువేమేనా దొరికితే వాటి విలువ యెలా వుంటుందో?
జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Ramesh గారి అభిప్రాయం:
11/25/2023 8:01 pm
చాలా అద్భుతమైన కథ. మానవ సంబంధాల గురించి చక్కటి కథనం. చదివినంతసెపు చాలా ఆనందంగా వుంది.
I find it a bit difficult in using RTS to Telugu, otherwise a wonderful attempt , god bless the author and the publisher.
నేత్రోన్మీలనం గురించి Dr.Y.Kameswari గారి అభిప్రాయం:
11/25/2023 3:38 pm
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సాగుతోంది చర్చ. ఏదో ఒకలాగా బట్టకాల్చి మొహాన పడేసినట్లు, ఎలా ఎదుటివారి కాలు పట్టి లాగుదామా అన్నట్లు ఉన్నది. బతకని బిడ్డ బారెడు అన్నట్లు తీసేసిన కథపై చర్చ ఏల?
మనమెరుగని మధ్య అమెరికా 2 గురించి Rmamesh గారి అభిప్రాయం:
11/25/2023 8:05 am
It is very beautifully written, the style is picturesque. I wish the author good health and let him travel as far as possible, god bless him.
సా విరహే తవ దీనా గురించి లలితా వర్మ గారి అభిప్రాయం:
11/25/2023 2:07 am
విస్తృతమైన సమాచారాన్ని అందించారు. అనేక ధన్యవాములు🙏
నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/24/2023 9:34 pm
ఈ కథ పట్ల శ్రీ శ్యామల రావు గారి అభ్యంతరం “సీతారాములు భగవత్స్వరూపులని, ఈ కథలో వారిగురించి చిత్రీకరించిన ప్రవర్తన భగవత్స్వరూపులకు తగనిదని” ఇంతకుముందు అనుకున్నాను; అలా ఐతే వారి నమ్మకాన్ని ప్రశ్నించటానికి గాని, శంకించటానికి గాని ఎవరికీ అధికారం లేదు. ఐతే, వారి అభ్యంతరం అది కాదని, ఈకథ ఆలంకారికుల సూత్రాలను అనుసరించకపోవటమని వారిప్పుడు అంటున్నారు కనుక కేవలం కుతూహలంతోనే ఒక కోరిక కోరుతున్నాను – వారికి ఇష్టం లేకుంటే చెప్పనక్కర్లేదు – ఈ శతాబ్దంలో, అంటే గత ఇరవైమూడేళ్లలో ఈమాటలో వచ్చిన కథల్లో వారు చదివినవాటిలో, వారిచ్చిన సూత్రాలను అనుసరించిన 2 – 3 కథల పేర్లు చెప్తే వాటిని మళ్లీ చదవాలని వుంది. ముందుగానే వారికి కృతజ్ఞతలు.
నేత్రోన్మీలనం గురించి జిలేబి గారి అభిప్రాయం:
11/23/2023 12:32 am
తాడిగడపవారి విమర్శ గురించిన విశ్లేషణ అద్భుతం.
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/21/2023 11:50 pm
తెలుగు సాహిత్యంలో ఓనమాలు రాని వారిలో నేనూ ఉన్నాననే అనుకోవచ్చును. ఆంధ్రసాహిత్యసాగరాన్ని ఔపోసనపట్టి తనువున కణకణాన్నా కమ్యూనిష్టుభావజాలాన్ని నింపుకున్నట్టి ఆధునిక కవివిమర్శకశిఖామణుల్లో నేను ఉండనే ఉండను. ఉండలేను కూడా.
నాకు తెలిసి విమర్శ అంటే, సాహిత్యం అంటే హితంతో కూడినది అన్న సంప్రదాయికమైన అర్ధానికి అనుగుణంగా ఒక రచన ఎంతవరకూ న్యాయం చేస్తూ సమాజానికీ సాహిత్యరంగానికీ మంచి చేస్తున్నదీ అని అంచనా వేయటం.
నాకు తెలిసి విమర్శ అంటే కవి యొక్క ప్రతిభావ్యుత్పత్తులను విశ్లేషించటం. కవి యొక్క వస్తుభాషాభావాదులలోని నవ్యతనూ స్పష్టతనూ ఉచితజ్ఞతనూ నిర్వహణానైపుణ్యాన్నీ తదితర శిల్పాది విషయాలనూ పరామర్శించటం.
నాకు తెలిసి విమర్శ అంటే కవి ఎంతటి రసజ్ఞత కలవాడూ, రచనలో రసపోషణ ఎలాగున్నదీ అని తెలుసుకొని చెప్పటం. రసోవై సః అని తెలిసిన ఒక విమర్శకుడు కవికి ఆవిషయంలో ఎంతటి అవగాహన ఉన్నదీ రసనిర్వహణలో ఎంత సమర్ధత ఉన్నదీ బేరీజు వేయటం.
ఇత్యాదులు నాకు తెలిసి విమర్శ లక్షణాలు.
ఆధునిక విమర్శకచక్రవర్తుల విమర్శాలక్షణాలు భిన్నంగానూ అభారతీయంగానూ ఉంటే అది మిక్కిలి చింత్యం నాదృష్టిలో.
రావణుడూ నరకుడూ శూర్పనఖల వంటి దుష్టుల పేర్లూ రామకృష్ణుల పేర్లలాగే కాలానికి నిలిచిపోయాయి. అంతమాత్రాన వాళ్ళంతా రామకృష్ణుల వలె ఆదర్శం అనుకోలేము కదా. అనుకొంటే ఆధునికులూ ఆధునిక కవివిమర్శకులూ అవుతారు కాబోలు!
నేత్రోన్మీలనం గురించి jayaram గారి అభిప్రాయం:
11/21/2023 1:22 pm