చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు పరుచూరి, గొర్తి గార్లకు, ఇచ్చినందుకు వేలూరి గారికి, ప్రచురించినందుకు సంపాదకులకు, కృతజ్ఞతలు. అమూల్యమైన ప్రచురణ అయినా, ఒకటి రెండు నచ్చనివి ప్రస్తావిస్తాను.
“శ్రీశ్రీ అమెరికా వచ్చారా?” అని అడిగి, వెంటనే, “మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా!” అనడం అసంబద్ధంగా ఉంది.
“ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్ మీద నోట్ లాగా రాసిస్తుండేవాడిని. … చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును.”
చిన్నప్పుడే చలసానికి జబ్బు వచ్చి వినికిడి పోయిందని చదివాను; అందుకే నోట్ రాసి చూపెట్టడం, మాట పోయినందుకు అయి ఉండదు. సందర్భం కళ కావున చలసాని దాంట్లో ఏం సాధించారో, చెప్తే, అడిగితే, బావుండేది.
“ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్ రాశాడు దానిమీద. దట్స్ నాట్ క్రిటిసిజమ్. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేదని. పోనీ నువ్వు చెయ్. ఇంతకంటే బెటర్ ట్రాన్స్‌లేషన్ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. … కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ”
ఇక్కడ రచనలని నిర్దిష్టంగా ప్రస్తావించకపోవడం, ఇంకాస్త లోతుకు వెళ్ళి తెలుసుకుందామనుకునే చదువరులలో, గందరగోళం కలిగిస్తుంది. “తామర కొలనులో మందారం,” అంటే వెల్చేరు, “Hibiscus on the Lake,” మనసులో మెదిలింది. దానిని నవీన్ విమర్శించారా? ఎక్కడ? తమ్మినేని, “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” లో “వెల్చేరు… ఏమి తేల్చారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మందారం తేల లేదు … సరికదా,” అన్నారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల, “నేటికాలపు కవిత్వం,” పీఠికలో చేకూరి, “సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతం గారి నిర్ణయాలు ముఖ్యం కాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాస్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు,” అన్నారు.
“నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను.”
వేలూరి గారు “ఈమాట” ని న్యూయార్కర్ పత్రిక స్థాయిలో మలచాలని యత్నించడం చెప్పుకోదగ్గ విషయం. మొన్న నా వ్యాసానికి చివరి మెరుగులు దిద్దుతుండగా, సంపాదకులతో నేను ‘కామా’ ల గురించి తర్జన భర్జన పడాల్సొచ్చింది. విరామ చిహ్నాలవరకైనా, ఈమాట న్యూయార్కర్ పద్ధతిని అవలంబిస్తే బావుండు.
చివరగా, వేలూరి గారితో నాకు ఇరవై ఏళ్ళ క్రితం, డెట్రాయిట్ లో తానా సభల సందర్భంగా పరిచయం. కన్నెగంటి రామారావూ, నేనూ కాలువ పక్కన నడుస్తూ వేలూరి గారితో మాట్లాడుతుంటే, వారన్న ఓ మాట, “శ్రీశ్రీ కవిత్వం లోని మాటల కర్థం తెలియకుండానే పొగిడే వాళ్ళు అనేకం,” నాకిప్పటికీ గుర్తు. “షెల్లీ కవనపు హల్లీసకమూ,” అని తన్మయించడమే కాని, హల్లీసకం అంటే అర్థం తెలియదే అని నేను మనసులో అనుకున్నాను. అప్పటి నుండి, నా చదువు కాస్త కుంటు పడింది – అర్థం తెలియని పదం తగిలితే, నిఘంటువులో వెతక్కుండా ముందుకు పోలేక. అందుకూ, మరెన్నెటికో మార్గదర్శకులుగా ఉన్నందుకూ, శ్లాఘనీయులైన వేలూరి గారికి కృతజ్ఞతలతో,
మీ చిన్ననాటి ముచ్చట్లలో ఎన్ని షేడ్స్ నో అద్భుతంగా చిత్రీకరించి, నాకు బొమ్మ అబ్బలేదు అంటారేమిటో 🙂 కళ్ళు ఆపకుండా అక్షరాల వెంట పరుగులు తీసినా, మనసు మాత్రం తెలీని ఆ సీమలని జనాలని పరిచయం చేసుకొచ్చింది..
1970-80 దశకాల్లో రేడియోల్లోనూ, పత్రికల్లోనూ వచ్చిన ఇంటర్వ్యూలు చదివి, మా నాన్న పెదవి విరిచేవారు.
ఏమైంది? ఇంటర్వ్యూ బాగానే ఉందిగా? అంటే…ఇంటర్వ్యూలు ఎప్పుడూ వృత్తిరీత్యా చెయ్యకూడదురా! ఆసక్తిమీదా, అనురక్తిమీదా చెయ్యాలనేవారు. అసలు ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే, ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తి ‘పెంపు’ ఆధారపడుతుందనేవారు.
అలాగే ఇటు ఇంటర్వ్యూ చేసే వక్తికీ, అటు ఇంటర్వ్యూ చేయబడుతున్నవక్తికీ ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండాలనేవారు. అంతేకాదు, నిజానికి ఇంటర్వ్యూలో బలం అంతా ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే ఆధారపడతుందనేవారు.
ఆనాడు అవి చాదస్తపు మాటలు అని కొట్టిపారేశాను. తర్వాత్తర్వాత అవి గొప్పమాటలని తెలిశాయి. ఇన్నాళ్లకు ‘ఈమాట’ లో వేలూరిగారితో ఓ సంభాషణ చదివి, నాన్న మాటలు నిజమనిపించాయి. మా నాన్నంటే నాకు మరింత గౌరవం పెరిగింది. అలాగే వేలూరిగారిమీదా, వారిని ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్, సాయి బ్రహ్మానందం గొర్తిమీదా కూడా గౌరవం పెరిగింది.
ఇంతటి గొప్ప ఇంటర్వ్యూని ప్రచురించిన ‘ఈమాట’కు అభినందనం. అభివందనం.
శ్రుతకీర్తి, చాలా మంచి విశ్లేషణ అందించావు. ప్రకృతి లోని అందాలు, దానితో పెనవేసుకున్న బంధం, అందులొ పొందే సాంత్వన, మూగప్రాణులతోని అనుబంధం, చదువుతుంటే ప్రతికథా మనసును హత్తుకున్నాయి. వివేక్ గారి కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రచయితకు అభినందనలు.
This is a fascinating and thought-provoking review that will make readers rethink their beliefs about cultural symbols. It is a tour de force into the heart of Siddartha’s poetry.
ఏది ఏమైనా ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ సమర్ధించింది అనేది చారిత్రక వాస్తవం. ఇందిరా గాంధీని దుర్గగా కీర్తించిందెవరు? ఇంకాస్త వెనక్కు వెళితే గాంధీ హత్యకు ప్లానింగ్ చేసిన, A1గా ఉండాల్సినటువంటి సావర్కార్‌ని గాంధీ హత్యకేసు నుంచి ఎలా తప్పించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ, అదే ఇందిరా గాంధీ సావర్కార్‌ని తమ నెత్తికెత్తుకొని స్వాతంత్ర యోధుడు హోదా ఇవ్వడం, సావర్కర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం మరచిపోతగునా? గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం గురించి ప్రపంచమంతా తెలుసు. అలాంటిది ఆర్ఎస్ఎస్‌ను గాంధీ హత్య జరిగిన తర్వాత కేవలం ఒక 15,16 నెలలు మాత్రమే నిషేధించి తర్వాత వదిలేశారు కదా! ఇదేమిటి? నెహ్రూకు, పటేల్‌కు ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్‌తో ఉన్న అక్రమ సంబంధాల్ని ఎవరైనా కాదనగలరా?
ఆర్ఎస్ఎస్‌ను సంతృప్తి పరచడానికి ఇందిరాగాంధీ సిక్కుల స్వర్ణ దేవాలయం ధ్వంసం చేసింది. ఆర్ఎస్ఎస్ కళ్ళలో ఆనందం చూడడానికి రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు తాళాలు తీయించి పాత విషయాన్ని మళ్లీ తిరగదోడడం చరిత్ర ఎలా మరిచిపోతుంది? ఇక పీవీ నరసింహారావు సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. నగ్నంగా ఆర్ఎస్ఎస్‌ను హిందూ తీవ్రవాద సంస్థలను బలపడేలా చేశాడు. చివరగా చెప్పేదేమంటే కాంగ్రెస్ బిజెపి రెండు కూడా ఆర్ఎస్ఎస్‌కు రాజకీయ పనిముట్ల లాంటివి. ఓకే నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి, ఒకే మనిషికి రెండు కళ్ళ లాంటివి, రెండు చేతుల లాంటివి. ఇటీవల రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటి? కాంగ్రెస్లో ఉండి, బిజెపి కోసం పనిచేస్తున్న నాయకుల్ని ఏరివేయాలి అన్నాడు. ఇది దేన్ని సూచిస్తుంది? కాబట్టి ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా చరిత్రను పరిశీలించి ఎవరు రాసిన అది మాత్రమే నిజమైన చరిత్ర అవుతుంది. అంతేకానీ హేతుబద్ధత లేకుండా, మన అభిమానాలు దురభిమానాలు ప్రాతిపదికన చేసే చరిత్ర పరిశీలన వలన అసలు నిజాలు బయటికి రావు !
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. అభిప్రాయం:
04/03/2025 1:20 am
బల్లోజు బాబా గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
04/03/2025 12:52 am

కొడవళ్ళ హనుమంతరావు
శ్లోకము గురించి VSTSayee అభిప్రాయం:
04/02/2025 12:50 pm
https://archive.org/details/in.ernet.dli.2015.553717/page/n3/mode/2up
శ్లోకము గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
04/02/2025 9:01 am
వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం కోసం నేను ఇంటర్నెట్ గాలించి లాభం లేకపోయింది.
వ్యాసకర్త గారు కాని మరెవరైనా కాని ఈవిషయంలో ఏమైనా సహాయం చేయగలరా?
కొన్ని సమయాలలో కొందరు మనుషులు గురించి జ్యోత్స్న అభిప్రాయం:
04/02/2025 8:28 am
మీ చిన్ననాటి ముచ్చట్లలో ఎన్ని షేడ్స్ నో అద్భుతంగా చిత్రీకరించి, నాకు బొమ్మ అబ్బలేదు అంటారేమిటో 🙂 కళ్ళు ఆపకుండా అక్షరాల వెంట పరుగులు తీసినా, మనసు మాత్రం తెలీని ఆ సీమలని జనాలని పరిచయం చేసుకొచ్చింది..
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి ఎ.ఎన్. జగన్నాథశర్మ అభిప్రాయం:
04/02/2025 7:49 am
1970-80 దశకాల్లో రేడియోల్లోనూ, పత్రికల్లోనూ వచ్చిన ఇంటర్వ్యూలు చదివి, మా నాన్న పెదవి విరిచేవారు.
ఏమైంది? ఇంటర్వ్యూ బాగానే ఉందిగా? అంటే…ఇంటర్వ్యూలు ఎప్పుడూ వృత్తిరీత్యా చెయ్యకూడదురా! ఆసక్తిమీదా, అనురక్తిమీదా చెయ్యాలనేవారు. అసలు ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే, ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తి ‘పెంపు’ ఆధారపడుతుందనేవారు.
అలాగే ఇటు ఇంటర్వ్యూ చేసే వక్తికీ, అటు ఇంటర్వ్యూ చేయబడుతున్నవక్తికీ ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండాలనేవారు. అంతేకాదు, నిజానికి ఇంటర్వ్యూలో బలం అంతా ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే ఆధారపడతుందనేవారు.
ఆనాడు అవి చాదస్తపు మాటలు అని కొట్టిపారేశాను. తర్వాత్తర్వాత అవి గొప్పమాటలని తెలిశాయి. ఇన్నాళ్లకు ‘ఈమాట’ లో వేలూరిగారితో ఓ సంభాషణ చదివి, నాన్న మాటలు నిజమనిపించాయి. మా నాన్నంటే నాకు మరింత గౌరవం పెరిగింది. అలాగే వేలూరిగారిమీదా, వారిని ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్, సాయి బ్రహ్మానందం గొర్తిమీదా కూడా గౌరవం పెరిగింది.
ఇంతటి గొప్ప ఇంటర్వ్యూని ప్రచురించిన ‘ఈమాట’కు అభినందనం. అభివందనం.
మౌనంబంతట మాటలాడె… గురించి Vasu అభిప్రాయం:
04/02/2025 6:59 am
భైరవభట్ల కామేశ్వరరావుగారూ,
నమస్తే. నేను వాసుని. ఈ పద్యాలన్నీ ఎంతో తియ్యగా ఉన్నాయి. వాల్మీకిని మొత్తం అనువాదం చేయ సంకల్పించారా, సర్?
-వాసు-
లంకమల దారుల్లో – వలపటెద్దు కథల్లో గురించి C.Suseela అభిప్రాయం:
04/02/2025 6:17 am
శ్రుతకీర్తి, చాలా మంచి విశ్లేషణ అందించావు. ప్రకృతి లోని అందాలు, దానితో పెనవేసుకున్న బంధం, అందులొ పొందే సాంత్వన, మూగప్రాణులతోని అనుబంధం, చదువుతుంటే ప్రతికథా మనసును హత్తుకున్నాయి. వివేక్ గారి కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రచయితకు అభినందనలు.
సిద్ధార్థ ముక్కుపుల్లలు — స్థానీయ సాంస్కృతిక అధివాస్తవ ప్రతీకలు గురించి Rajasekharam Mallipudi అభిప్రాయం:
04/02/2025 2:50 am
This is a fascinating and thought-provoking review that will make readers rethink their beliefs about cultural symbols. It is a tour de force into the heart of Siddartha’s poetry.
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Suraj Sayyed అభిప్రాయం:
04/01/2025 6:41 pm
ఏది అసలు చరిత్ర