పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. లీల … కేదార్‌నాథ్ డైరీ గురించి Srinivas అభిప్రాయం:

    06/02/2025 2:08 am

    కథా?
    వాస్తవమా?
    వాస్తవాన్ని కథలా చెప్పారా?
    కథను ఇంత వాస్తవికంగా వివరించారా?
    ఏదైనా కావచ్చు, చదవడం బాగుంది. 18 సంవత్సరాల క్రితం జరిగిన యాత్రను గుర్తు చేసింది. ప్రయాణంలోని ప్రతి దశను జీవితానికి అన్వయించడం చాలా ఆసక్తికరంగా ఉంది. జీవితంలో క్రమంగా వచ్చే పరిపక్వత, రచయిత చర్యలలో బాగా ప్రతిబింబిస్తుంది.
    అదేవిధంగా ప్రతి దశలోనూ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం నాకు నా గత పర్యటనలను గుర్తుకు తెచ్చింది. (చిత్రణతో పోలిస్తే ప్రకృతి కఠినంగా ఉంటుందని నేను అనుభవించాను).
    ఇలాంటి చక్కటి రచనలను మరిన్ని రచించాలని కోరుతూ
    ధన్యవాదాలు శ్రీనివాస్.

  2. హిందూ మతం అంటే ఏమిటి? గురించి రఘు కుమార్ అభిప్రాయం:

    06/01/2025 9:33 pm

    ఆధునిక హిందూత్వ తనను తాను ఒక మెగా మతంగా, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ మతాలలా ఎలా మారుతూ ఉందో చెప్పే ప్రయత్నం చేశారు.

    కానీ ఏ ఒక్క భావన – మతం, రాజకీయం, సామాజికం, ఆర్థికం – ఏదీ ఒకే స్థిరీకృత రూపంలో ఉండవు కదా? ఒక వేళ ఈ ఆధునిక హిందూత్వ కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితం ఉన్న బహుళత రూపాన్ని కోల్పోయింది. తనను తాను క్రిస్టియానిటి, ఇస్లాం, బౌద్ధ మెగా మతంగా మార్చుకుంటోంది అని అనుకున్నా దానికి కూడా కొన్ని చారిత్రక, ఆర్థిక కారణాలు, ఆధునికత తెచ్చిన సవాళ్లు ఉంటాయేమో కదా?

    మీరు ఈ వ్యాసంలో ప్రస్తావించిన వారు – మార్క్స్, ఇతరులు ఈ మతం అనే విషయాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు కాదు. నిఘంటువులు ఎటిమాలజీ పరంగా, భాషా శాస్త్ర పరంగా ఇండియాలో అభివృద్ధి చెందినట్టు కనబడదు.

  3. చలం గురించి… గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/01/2025 7:50 pm

    “స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలని మీరు పది కారణాలు చెబితే ఇవ్వకూడదు అని చెప్పి వంద కారణాలు చెప్పగలను. అది హృదయానికి తోచాలి. స్త్రీలు పురుషులు సమానులు, జనమంతా సమానులు అని హృదయానికి తోస్తుంది. అంతే కానీ హేతువుకి తోచదు.”

    ఎందుకు తోచదు?

    “But, if women are to be excluded, without having a voice, from a participation of the natural rights of mankind, prove first, to ward off the charge of injustice and inconsistency, that they want reason, else this flaw in your NEW CONSTITUTION, the first constitution founded on reason, will ever show that man must, in some shape, act like a tyrant, and tyranny, in whatever part of society it rears its brazen front, will ever undermine morality.”
    — Mary Wollstonecraft. Vindication of the Rights of Woman. 1792.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. మౌనంబంతట మాటలాడె… (3వ భాగం) గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    06/01/2025 2:36 pm

    కామేశ్వరరావుగారూ,

    I enjoyed reading this 3rd installment.

    1. మీరన్న “శ్లోకంబునకుఁ బ్రథమశ్రోతయునైన భరద్వాజుండు తన నామంబు సార్థకంబగు రీతి” నన్ను etymology లోకి తీసుకెళ్ళింది. పూర్తిగా నప్పిందనలేను గానీ “జలపూర్ణకలశం” అన్నారు కనుక నప్పిందేమో!
    2. మీరు ప్రయోగించిన కల్మలి అన్న మాటకు అర్థం నాకు ఆంధ్రభారతిలోనూ దొరకలేదు. Google AI చెప్పింది. చక్కటి మాట.
    3. ఆసనాసీనుఁడు అన్నమాట తొలిసారి చూస్తున్నాను. ఆసీనుడు అంటే సరిపోయేదేమో! అయినా, I am not sureఅండీ. I cannot stake any claim to having read all classical poets thoroughly.
    4. ఇంకా, (వ. 64లో ఇలా ఉంది. “రామకథాస్వరూపసౌందర్యచింతనాకృషి”) చింతనా అన్న మాట Monier-Williamsలోనూ లేదండీ. మీరే ఇంకో చోట (పద్యం 77)లో చింతన, చింతనం అన్నారు. ఇదే కరక్టేమో!
    5. 78వ పద్యం మీ యీ రచనకు అందం తెచ్చింది. ఎంత బాగుందో!

    -వాసు-

  5. పంచేంద్రియాలు: 4 రుచి గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/01/2025 12:33 pm

    Wikibooks లో ఉన్న నా నిఘంటువులో:
    inflammation, n. వాపు; శోఫ; ఉబ్బు; ఉలుపు;
    * inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;

  6. పునః గురించి పల్లిపట్టు అభిప్రాయం:

    06/01/2025 11:58 am

    కవిత చాలా బావుంది అన్న💐💐

  7. పంచేంద్రియాలు: 4 రుచి గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/01/2025 11:57 am

    ఆంధ్ర భారతి నిఘంటువులో — https://andhrabharati.com/dictionary/
    Inflammation : శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934 Report error(s)
    వాపు; కందుట; నొప్పి; మంటతోగూడిన వాపు; శోఫ; దాహము.

  8. కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్ గురించి Suresh Krishna అభిప్రాయం:

    06/01/2025 11:23 am

    చాలా బాగుంది మీ రివ్యూ

  9. పంచేంద్రియాలు: 4 రుచి గురించి Krishnarao Maddipati అభిప్రాయం:

    06/01/2025 11:21 am

    మీరు inflammation కి శోఫ అనే పదం వాడారు. అది మీసృష్టా లేక ఆయుర్వేద గ్రంధాల్లో ఉందా?

    నేను చరక సంహిత లో inflammation లక్షణాలు ఎలా వివరించారా అని వెతకడానికి ప్రయత్నించి విఫలమయ్యాను.

  10. పునః గురించి డా. రాధేయ అభిప్రాయం:

    06/01/2025 11:04 am

    మహా శబ్దాన్ని నిర్మించుకొని పాత మట్టిలోకి కన్నీళ్లను జారవిడువడం..మీ కవితానుభవం బాగుంది నవీన్..డా.రాధేయ