క్వాంటమ్ ఫిజిక్స్ కు భారతీయ దర్శనాలతో గల సంబంధాన్ని ఈవ్యాసంలో వివరించాను. ఐతే అత్యాధునిక పరిశోధనలు చైతన్యం కేవలం బ్రెయిన్ కు మాత్రమే చెందదు అని, విశ్వంతో జీవికి గల సహజ ఐక్యతతో కూడినదే చైతన్యం అనే వైపు సాగుతున్నాయి.ఈవిషయాలను మిత్రులు ఫిజిక్స్ అధ్యయన పరులు సుధాకర్ ఇలా వివరించారు ఫిలాసఫీ గ్రూపులో.
క్వాంటం బ్రెయిన్:
మన చైతన్యం విశ్వంతో ఎలా కలుస్తుంది?
కొత్త పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మన మెదడులోని క్వాంటం స్థితులు చైతన్యాన్ని (consciousness) యావత్ విశ్వానికి (universe) లింక్ చేయగలవట! భౌతికశాస్త్రం, న్యూరోసైన్స్ కలిసి సాగిస్తున్న ఈ ప్రయాణంలో, మానవ చైతన్యం ఒక క్వాంటం ఫినామినన్ (quantum phenomenon) లాగా పనిచేస్తుందని, అది మన మనసులను ఈ విశ్వంతో కలుపుతుందని చెబుతోంది.
ఆర్చ్ ఓఆర్ (Orch OR – Orchestrated Objective Reduction) అనే ఒక వివాదాస్పద థియరీ ఉంది. దాని ప్రకారం, మన మెదడు కణాల్లో ఉండే మైక్రోట్యూబుల్స్ (microtubules), మెదడులోని వెచ్చని, తడి వాతావరణంలో కూడా క్వాంటం కొహరెన్స్‌ను (quantum coherence) మెయింటెయిన్ చేయగలవని సైంటిస్టులు ఇప్పుడు ఎక్స్‌పెరిమెంటల్ ఎవిడెన్స్‌తో (experimental evidence) నిరూపిస్తున్నారు.
ఈ క్వాంటం స్థితులు చైతన్యానికి “కీ” లాంటివి కావచ్చని, ఆ కీ సూపర్ పొజిషన్ (superposition), ఎంటాంగిల్‌మెంట్ (entanglement) లాంటి క్వాంటం లక్షణాలున్న వేవ్ (wave) లాగా పనిచేస్తుందని అంటున్నారు. అంటే, మానవ చైతన్యం అంతరిక్షంలోని క్వాంటం సిస్టమ్స్‌తో కనెక్ట్ అయి ఉండొచ్చన్నమాట.
సిమ్యులేషన్స్ (simulations), ఎక్స్‌పెరిమెంట్స్ (experiments) ద్వారా, మైక్రోట్యూబుల్స్ లోపల క్వాంటం రియాక్షన్స్ అనుకున్నదానికంటే ఎక్కువ కాలం నిలబడగలవని తేలడంతో ఈ థియరీకి కొత్త బలం చేకూరింది.
ఇదిలా ఉండగా, థియరిటికల్ ఫిజిసిస్ట్ (theoretical physicist) తిమోతీ పామర్ అనే ఆయన, చైతన్యం అనేది ఒక కాస్మిక్ ఫ్రాక్టల్ “స్టేట్ స్పేస్” (cosmic fractal “state space”) లో ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఫ్రీ విల్ (free will) తో పాటు, మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నామనే ఫీలింగ్‌ను కూడా వివరించగల ఒక షేర్డ్ జియోమెట్రిక్ స్ట్రక్చర్ (shared geometric structure) కావచ్చని ఆయన అభిప్రాయం.
ఇవన్నీ ఇంకా డెఫినిటివ్ (definitive) కాకపోయినా, చైతన్యం కేవలం ఒక న్యూరల్ ఇల్యూషన్ (neural illusion) మాత్రమే కాదు, అది వాస్తవికతలోని ఒక క్వాంటం ఫీచర్ (quantum feature) కావచ్చని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు ఒక ముఖ్యమైన స్టెప్ అని చెప్పొచ్చు.
భారతీయ హేతు దృష్టికి సమన్వయ లక్షణం, ద్వంద్వత — అందునా వ్యతిరేక ద్వంద్వతను పక్కన పెట్టే లక్షణం ఉంది అని నిరూపణ చేసే ప్రయత్నం వ్యాసంలో ప్రధాన అంశం.
కేవలం చార్వాక, బౌద్ధ చింతనలు మాత్రమే ఆధునిక యూరోపియన్ హేతు దృష్టికి దగ్గరివి. అవి కాని చింతనలు అన్నీ ఆధునికతకు, అంటే హేతు దృష్టికి దూరం అయినవి అనే ప్రచారంలో తర్కపద్ధతిని ఈ వ్యాసం సహేతుకంగా ప్రశ్నించింది.
వర్ణ-జాతి వ్యవస్థ అనేది పుట్టుక పునాది, ఉచ్చ నీచ సామాజిక సాంస్కృతిక వ్యవస్థగా మారిన స్థితి ఈ దేశపు పూర్తి వాస్తవం అనీ. ఈ దేశంలో బౌద్ధము, చార్వాకాలు తప్ప మరే తాత్విక భవనాలు ఈ సామాజిక సాంస్కృతిక వ్యవస్థను వ్యతిరేకించలేదు కనక అవి అన్నీ కూడా హేతువు తో సంబంధం లేనివి (వెస్ట్ సైన్స్ దృష్టి) అనే ఒక అతి సులభ సామాజిక శాస్త్ర సూత్రీకరణ మీద కూడా ఈ వ్యాసం ప్రశ్నలు లేవనెత్తినది.
వర్ణ-కుల వ్యవస్థ పుట్టుక పునాది గా మారిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల దీర్ఘ చరిత్రను లోతుగా చూస్తే, శుద్ధ హేతు వాదం తో సంబంధం లేని భక్తి వాదులు, అద్వైత వాదులు కూడా పుట్టుకపునాది వివక్ష దృష్టి మీద యుద్ధం చేశారు అని తెలుస్తుంది. కేవలం చార్వాక, బౌద్ధాలు మాత్రమే హేతు వాద చింతనలు తప్ప, ఈశ్వర(దైవ) సంబంధం, ప్రకృతి పురుషుల ఏకతను ప్రతిపాదించే సాంఖ్యం, బ్రహ్మ భావనను పక్కకు పెట్టిన పూర్వ మీమాంసకుల స్వతసిద్ధ వాదాన్ని, ఈ దేశంలోని ప్రభావశీల ఆధునిక వెస్ట్రన్ కర్టీజియన్ సైన్స్ దృక్పథ వాదులు గుర్తించలేదని అనే ప్రతిపాదన కూడా వ్యాసం చేసింది.
అయితే వ్యాసకర్త రచనా పద్ధతి కొంచం గెంతులు వేస్తూ సాగుతున్నట్టు ఉంటుంది. అది రచనా పర సమస్య అనుకుంటాను. క్వాంటమ్ భౌతిక శాస్త్రము, అది దానికన్నా ముందు ఉండే భౌతిక శాస్త్రంతో ఎట్లా విభేదిస్తుంది అనే వివరణ కొంచం ఉంటే వ్యాసానికి అది మరింత పదును ఇచ్చేది అనిపిస్తుంది.
వ్యాసం రాసిన మనిషి బ్రహ్మణ కులస్తుడు, అతని కోరిక బ్రాహ్మణ తత్వ చింతనను సమర్థించడం మాత్రమే అనే తీరు విమర్శలు ఈ వ్యాసం మీద వస్తాయి. కానీ అవి పెద్దగా హేతుబద్ధం కావు — అవి కేవలం భావజాల ప్రేరిత వాదాలు.
భారతీయ చింతనా జగత్తులో పదార్థ దృష్టి, హేతు దృష్టి ఉండిన తీరును చూపే ఒకానొక ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని చూడాలి. ఆ ప్రతిపాదనలోని గుణదోషాలను విచారించాలి.
హేతు చింతన అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నను మరొకసారి ఈ వ్యాసం చర్చలోకి తెచ్చింది. ఇది బాగా ఆలోచింపజేసే వ్యాసం.
శ్రీనివాస్ గారి కామెంట్ లో ఒక మాట అన్నారు. రచయిత మధ్యలో ఇంకేమైనా రాస్తే త్రెడ్ తెగిపోయింది అని. ఇది సరైన మాట కాదేమో! రచయిత తనలోని భావాలను బయట పెడితే ఒక భారం వదిలినట్లు మనసు తేలికపడుతుంది. హనుమంతరావు గారు చాలా సార్లు చిన్న కథలు రాశారు ఈ వేదిక మీద. మళ్లీ రాయవచ్చు కూడా రిలాక్సేషన్ కోసం. దానివలన ఈ శీర్షిక దారం ఎలా తెగిపోతుంది? ఈ పోగు వేరుగానే వుంటుంది కదా! మధ్యమధ్యలో ఆటవిడుపుగా కథలు రాయడం మానుకోవద్దని హనుమంతరావు గారిని కోరుతున్నాను.
“మూడైదుల కళ్లతో నెటుల నానుదునో భవదీయదృక్కులన్.” You caught me here! ఎంతో కొత్తగా ఉంది. అయితే, ధాతుమంజరికా అన్న మాటకు అంతరార్థమేమై ఉంటుందా అని! నిజానికి ముందే చెప్పాలి, సర్. మీ పద్యాలంటే నాకు ఇష్టం. పద్యంలో balance ఉంటుంది, మందాకినీ ప్రవాహం మాదిరి.
హిందూ మతం అనే పదానికి సంబంధించి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మీరు స్పష్టం చేస్తున్నారు. మీరు అందించిన సమాచారాన్ని బట్టి, కింది ముఖ్య విషయాలు అర్థమవుతున్నాయి:
హిందూ మతం – పదం యొక్క మూలాలు, పండితుల అభిప్రాయాలు
* పదం పుట్టుక: సుమారు పది పన్నెండు వందల సంవత్సరాల క్రితం సింధూ నది ప్రాంతం గుండా భారతదేశంతో సంబంధం ఏర్పరుచుకున్న విదేశీయులు సింధూ నదిని హిందూ నది అని పిలవడం వల్ల ఆ ప్రాంతానికి హిందూ దేశం అని పేరు వచ్చిందని, తదనంతరం ఈ దేశంలోని సనాతన ధర్మానికి పాశ్చాత్య భాషలలో హిందూయిజం అని, హిందీ వంటి భారతీయ భాషలలో హిందూ ధర్మం అని, తెలుగులో హిందూ మతం అని పేర్లు ప్రచారంలోకి వచ్చాయని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు తన ‘హిందూ మతం’ పుస్తకంలో పేర్కొన్నారు. పాఠకుల సౌలభ్యం కోసం తన గ్రంథంలో హిందూ మతం అనే పేరును ఉపయోగించినట్లు ఆయన వివరించారు.
* ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి సందేహం: శ్రీరామచంద్రుడు ఈ పదం భారతీయ పదం కాదని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆయనకు ఈ పదం పట్ల ఉన్న సందేహాన్ని సూచిస్తుంది.
* రాణి శ్రీనివాస శాస్త్రి గారి అభిప్రాయం: రాణి శ్రీనివాస శాస్త్రి గారు పదప్రయోగంతో కూడిన సంస్కృత శ్లోకాలు కల్పితాలు అని పేర్కొన్నారు. ఇది హిందూ అనే పదం యొక్క సంస్కృత మూలాలపై ఆయనకు ఉన్న సందేహాన్ని తెలియజేస్తుంది.
* కరపాత్ర స్వామి వారి అభిప్రాయం: కరపాత్ర స్వామి వారు మాత్రం హిందూ శబ్దానికి సంస్కృత మూలాలు ఉన్నాయని, సంస్కృత గ్రంథాలలో ఈ పదం ఉపయోగించబడిందని వాదించారు. ఇది పై పండితుల అభిప్రాయానికి భిన్నంగా ఉంది.
* పండితులలో ఏకాభిప్రాయ లేకపోవడం: ఈ పదప్రయోగంపై పండితులలో ఏకాభిప్రాయం లేదనేది వాస్తవం.
ప్రతి పద్యమూ కావ్యమే ఎంత గాయత్రీ మంత్ర మహిమ. ఈ పద్యాలను కవి చేత వ్రాయించగలిగిందో? ఇలాంటి కవితలు ఈ కవి కలంనుండి మరెన్నో వచ్చేలా గాయత్రీదేవి దీవించు గాక 🙏🌷
మేలైన మీ కలం నుండి జాలువారిన ఈ వ్యాసం విశ్వనాథ వారి “నీ రథము” కవిత యొక్క ఆత్మను హృద్యంగా బయలుపరచింది. ఆయన వ్రాసిన కొన్ని ముక్తకకవితలలోని భావుకత ఒక్కోసారి వారి పెద్ద రచనల కంటే ఉన్నతంగా కనిపిస్తుంది.
నెలనెలా శ్రీ కామేశ్వరరావుగారి “మౌనంబంతట మాటలాడె” పద్యాలకోసం ఎదురుచూస్తున్నాను. “నీవారశూకవత్” అనే మంత్రపుష్పవాక్యంతో విలక్షణంగా ప్రారంభమైన ఈ కావ్యంలోని ప్రతీభాగమూ మనసును తీయగా స్పృశిస్తూనే ఉంది.
నేటి ఈ పద్యాలు ఎంతో హృదయావర్జకాలుగా ఉన్నాయి. “తలపులే కదలాడెనదే పదేపదే” అనే కూర్పు చంపకమాల పంక్తి చివరన ఎంతో మధురంగా ఉంది. పొల్లుపోబోని పలుకుల ఈ రామకథను శ్రీ కామేశ్వరరావుగారిలా అందిస్తుండగా ఆస్వాదించగలగడం నా వరకూ భాగ్యవిశేషమే.
రామాయణాన్ని పాయసాన్నంతోనూ, గురూపదేశంతోనూ, ధర్మదీక్షాయత్త ధనువుతోనూ, దివ్యసేతువుతోనూ హృద్యంగా పోల్చి, పద్యంగా మలచిన ఈ కవిప్రతిభకు ఎన్ని నమస్సులు చెప్పినా తక్కువే.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి రాణి శివశంకర శర్మ అభిప్రాయం:
06/05/2025 11:13 pm

మరిన్ని వివరాలకు: https://global.oup.com/academic/product/the-primacy-of-doubt-9780192843609?cc=kh&lang=en
From: Hashem Al-Ghaili
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Harathi Vageeshan అభిప్రాయం:
06/04/2025 5:28 am
భారతీయ హేతు దృష్టికి సమన్వయ లక్షణం, ద్వంద్వత — అందునా వ్యతిరేక ద్వంద్వతను పక్కన పెట్టే లక్షణం ఉంది అని నిరూపణ చేసే ప్రయత్నం వ్యాసంలో ప్రధాన అంశం.
కేవలం చార్వాక, బౌద్ధ చింతనలు మాత్రమే ఆధునిక యూరోపియన్ హేతు దృష్టికి దగ్గరివి. అవి కాని చింతనలు అన్నీ ఆధునికతకు, అంటే హేతు దృష్టికి దూరం అయినవి అనే ప్రచారంలో తర్కపద్ధతిని ఈ వ్యాసం సహేతుకంగా ప్రశ్నించింది.
వర్ణ-జాతి వ్యవస్థ అనేది పుట్టుక పునాది, ఉచ్చ నీచ సామాజిక సాంస్కృతిక వ్యవస్థగా మారిన స్థితి ఈ దేశపు పూర్తి వాస్తవం అనీ. ఈ దేశంలో బౌద్ధము, చార్వాకాలు తప్ప మరే తాత్విక భవనాలు ఈ సామాజిక సాంస్కృతిక వ్యవస్థను వ్యతిరేకించలేదు కనక అవి అన్నీ కూడా హేతువు తో సంబంధం లేనివి (వెస్ట్ సైన్స్ దృష్టి) అనే ఒక అతి సులభ సామాజిక శాస్త్ర సూత్రీకరణ మీద కూడా ఈ వ్యాసం ప్రశ్నలు లేవనెత్తినది.
వర్ణ-కుల వ్యవస్థ పుట్టుక పునాది గా మారిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల దీర్ఘ చరిత్రను లోతుగా చూస్తే, శుద్ధ హేతు వాదం తో సంబంధం లేని భక్తి వాదులు, అద్వైత వాదులు కూడా పుట్టుకపునాది వివక్ష దృష్టి మీద యుద్ధం చేశారు అని తెలుస్తుంది. కేవలం చార్వాక, బౌద్ధాలు మాత్రమే హేతు వాద చింతనలు తప్ప, ఈశ్వర(దైవ) సంబంధం, ప్రకృతి పురుషుల ఏకతను ప్రతిపాదించే సాంఖ్యం, బ్రహ్మ భావనను పక్కకు పెట్టిన పూర్వ మీమాంసకుల స్వతసిద్ధ వాదాన్ని, ఈ దేశంలోని ప్రభావశీల ఆధునిక వెస్ట్రన్ కర్టీజియన్ సైన్స్ దృక్పథ వాదులు గుర్తించలేదని అనే ప్రతిపాదన కూడా వ్యాసం చేసింది.
అయితే వ్యాసకర్త రచనా పద్ధతి కొంచం గెంతులు వేస్తూ సాగుతున్నట్టు ఉంటుంది. అది రచనా పర సమస్య అనుకుంటాను. క్వాంటమ్ భౌతిక శాస్త్రము, అది దానికన్నా ముందు ఉండే భౌతిక శాస్త్రంతో ఎట్లా విభేదిస్తుంది అనే వివరణ కొంచం ఉంటే వ్యాసానికి అది మరింత పదును ఇచ్చేది అనిపిస్తుంది.
వ్యాసం రాసిన మనిషి బ్రహ్మణ కులస్తుడు, అతని కోరిక బ్రాహ్మణ తత్వ చింతనను సమర్థించడం మాత్రమే అనే తీరు విమర్శలు ఈ వ్యాసం మీద వస్తాయి. కానీ అవి పెద్దగా హేతుబద్ధం కావు — అవి కేవలం భావజాల ప్రేరిత వాదాలు.
భారతీయ చింతనా జగత్తులో పదార్థ దృష్టి, హేతు దృష్టి ఉండిన తీరును చూపే ఒకానొక ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని చూడాలి. ఆ ప్రతిపాదనలోని గుణదోషాలను విచారించాలి.
హేతు చింతన అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నను మరొకసారి ఈ వ్యాసం చర్చలోకి తెచ్చింది. ఇది బాగా ఆలోచింపజేసే వ్యాసం.
కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు గురించి Rangarao అభిప్రాయం:
06/04/2025 2:18 am
శ్రీనివాస్ గారి కామెంట్ లో ఒక మాట అన్నారు. రచయిత మధ్యలో ఇంకేమైనా రాస్తే త్రెడ్ తెగిపోయింది అని. ఇది సరైన మాట కాదేమో! రచయిత తనలోని భావాలను బయట పెడితే ఒక భారం వదిలినట్లు మనసు తేలికపడుతుంది. హనుమంతరావు గారు చాలా సార్లు చిన్న కథలు రాశారు ఈ వేదిక మీద. మళ్లీ రాయవచ్చు కూడా రిలాక్సేషన్ కోసం. దానివలన ఈ శీర్షిక దారం ఎలా తెగిపోతుంది? ఈ పోగు వేరుగానే వుంటుంది కదా! మధ్యమధ్యలో ఆటవిడుపుగా కథలు రాయడం మానుకోవద్దని హనుమంతరావు గారిని కోరుతున్నాను.
దర్శనము గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:
06/03/2025 6:42 pm
శ్రీరామనాథ్‌గారూ,
“మూడైదుల కళ్లతో నెటుల నానుదునో భవదీయదృక్కులన్.” You caught me here! ఎంతో కొత్తగా ఉంది. అయితే, ధాతుమంజరికా అన్న మాటకు అంతరార్థమేమై ఉంటుందా అని! నిజానికి ముందే చెప్పాలి, సర్. మీ పద్యాలంటే నాకు ఇష్టం. పద్యంలో balance ఉంటుంది, మందాకినీ ప్రవాహం మాదిరి.
-వాసు-
హిందూ మతం అంటే ఏమిటి? గురించి రామానుజ దాస అభిప్రాయం:
06/03/2025 1:50 pm
హిందూ మతం అనే పదానికి సంబంధించి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మీరు స్పష్టం చేస్తున్నారు. మీరు అందించిన సమాచారాన్ని బట్టి, కింది ముఖ్య విషయాలు అర్థమవుతున్నాయి:
హిందూ మతం – పదం యొక్క మూలాలు, పండితుల అభిప్రాయాలు
* పదం పుట్టుక: సుమారు పది పన్నెండు వందల సంవత్సరాల క్రితం సింధూ నది ప్రాంతం గుండా భారతదేశంతో సంబంధం ఏర్పరుచుకున్న విదేశీయులు సింధూ నదిని హిందూ నది అని పిలవడం వల్ల ఆ ప్రాంతానికి హిందూ దేశం అని పేరు వచ్చిందని, తదనంతరం ఈ దేశంలోని సనాతన ధర్మానికి పాశ్చాత్య భాషలలో హిందూయిజం అని, హిందీ వంటి భారతీయ భాషలలో హిందూ ధర్మం అని, తెలుగులో హిందూ మతం అని పేర్లు ప్రచారంలోకి వచ్చాయని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు తన ‘హిందూ మతం’ పుస్తకంలో పేర్కొన్నారు. పాఠకుల సౌలభ్యం కోసం తన గ్రంథంలో హిందూ మతం అనే పేరును ఉపయోగించినట్లు ఆయన వివరించారు.
* ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి సందేహం: శ్రీరామచంద్రుడు ఈ పదం భారతీయ పదం కాదని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆయనకు ఈ పదం పట్ల ఉన్న సందేహాన్ని సూచిస్తుంది.
* రాణి శ్రీనివాస శాస్త్రి గారి అభిప్రాయం: రాణి శ్రీనివాస శాస్త్రి గారు పదప్రయోగంతో కూడిన సంస్కృత శ్లోకాలు కల్పితాలు అని పేర్కొన్నారు. ఇది హిందూ అనే పదం యొక్క సంస్కృత మూలాలపై ఆయనకు ఉన్న సందేహాన్ని తెలియజేస్తుంది.
* కరపాత్ర స్వామి వారి అభిప్రాయం: కరపాత్ర స్వామి వారు మాత్రం హిందూ శబ్దానికి సంస్కృత మూలాలు ఉన్నాయని, సంస్కృత గ్రంథాలలో ఈ పదం ఉపయోగించబడిందని వాదించారు. ఇది పై పండితుల అభిప్రాయానికి భిన్నంగా ఉంది.
* పండితులలో ఏకాభిప్రాయ లేకపోవడం: ఈ పదప్రయోగంపై పండితులలో ఏకాభిప్రాయం లేదనేది వాస్తవం.
మౌనంబంతట మాటలాడె… (3వ భాగం) గురించి శిరీష అభిప్రాయం:
06/03/2025 12:34 pm
మీ రామకావ్యం విజయవంతం కావాలని కోరుకుంటానండీ
సీతయై యొప్పె నీ మనఃక్షేత్రసీమ🙏🙏🌷
నాగేటి చాలు పంట 🙏🙏🌷
ఉత్థితా మేదినీ భిత్వా
అనేకానేక నమస్సులండీ
లీల … కేదార్‌నాథ్ డైరీ గురించి శాస్త్రి అభిప్రాయం:
06/03/2025 9:42 am
చాలా బావుంది. Nice Narration!! 🙂
Congratulations Srinivas!!
దర్శనము గురించి శిరీష అభిప్రాయం:
06/03/2025 7:49 am
ప్రతి పద్యమూ కావ్యమే ఎంత గాయత్రీ మంత్ర మహిమ. ఈ పద్యాలను కవి చేత వ్రాయించగలిగిందో? ఇలాంటి కవితలు ఈ కవి కలంనుండి మరెన్నో వచ్చేలా గాయత్రీదేవి దీవించు గాక 🙏🌷
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము గురించి పరిమి శ్రీరామనాథ్ అభిప్రాయం:
06/03/2025 5:25 am
శ్రీ నౌడూరి మూర్తిగారికి హృదయపూర్వక నమస్కారాలు.
మేలైన మీ కలం నుండి జాలువారిన ఈ వ్యాసం విశ్వనాథ వారి “నీ రథము” కవిత యొక్క ఆత్మను హృద్యంగా బయలుపరచింది. ఆయన వ్రాసిన కొన్ని ముక్తకకవితలలోని భావుకత ఒక్కోసారి వారి పెద్ద రచనల కంటే ఉన్నతంగా కనిపిస్తుంది.
మీకు స్వాగత శుభాకాంక్షలతో,
విధేయుడు,
పరిమి శ్రీరామనాథ్.
మౌనంబంతట మాటలాడె… (3వ భాగం) గురించి పరిమి శ్రీరామనాథ్ అభిప్రాయం:
06/03/2025 4:58 am
నెలనెలా శ్రీ కామేశ్వరరావుగారి “మౌనంబంతట మాటలాడె” పద్యాలకోసం ఎదురుచూస్తున్నాను. “నీవారశూకవత్” అనే మంత్రపుష్పవాక్యంతో విలక్షణంగా ప్రారంభమైన ఈ కావ్యంలోని ప్రతీభాగమూ మనసును తీయగా స్పృశిస్తూనే ఉంది.
నేటి ఈ పద్యాలు ఎంతో హృదయావర్జకాలుగా ఉన్నాయి. “తలపులే కదలాడెనదే పదేపదే” అనే కూర్పు చంపకమాల పంక్తి చివరన ఎంతో మధురంగా ఉంది. పొల్లుపోబోని పలుకుల ఈ రామకథను శ్రీ కామేశ్వరరావుగారిలా అందిస్తుండగా ఆస్వాదించగలగడం నా వరకూ భాగ్యవిశేషమే.
రామాయణాన్ని పాయసాన్నంతోనూ, గురూపదేశంతోనూ, ధర్మదీక్షాయత్త ధనువుతోనూ, దివ్యసేతువుతోనూ హృద్యంగా పోల్చి, పద్యంగా మలచిన ఈ కవిప్రతిభకు ఎన్ని నమస్సులు చెప్పినా తక్కువే.
రాబోయే భాగాలకై వేయికళ్లతో ఎదురుచూస్తాను.
విదాంవిధేయుడు,
పరిమి శ్రీరామనాథ్.