పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి గురించి Girish Karnala అభిప్రాయం:

    08/05/2025 8:40 am

    Ramesh Kumar ఇలా అన్నారు:

    M. కల్బుర్గిగారు మత విషయాలలో- హిందూ మతం పట్ల – కొంత విశృంఖలంగా, దారుణమైన వ్యాఖ్యలు- ఉదా: శివలింగపైన మూత్ర విసర్జన చేసినా తప్పులేదు (అది కూడా అభిషేకం లాంటిదే అన్నట్లుగా) చేసేవారు

    రమేష్ కుమార్ గారు,

    కల్బుర్గి చేసిన వ్యాఖ్యల గురించి మీరు పూర్తిగా అపోహ పడ్డట్టు కనిపిస్తుంది. శివలింగంపై మూత్రవిసర్జన గురించి రాసింది ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రచయిత అయిన యు.ఆర్. అనంతమూర్తి. కల్బుర్గి ఈ అనంతమూర్తి కథను ఆయన పేరు స్పష్టంగా ప్రస్తావిస్తూ ఒక సెమినార్‌లో చెప్పాడు, అంతే. అయితే, కల్బుర్గి గురించి ఈ రకంగా వక్రీకరింపబడిన అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి, అసలు వాస్తవాలు వివరించడం ప్రధానం:

    1. “శివలింగంపై మూత్ర విసర్జన” వ్యాఖ్య — అసలు నిజం ఏమిటి?
    అది కల్బుర్గి సొంత మాట కాదు: ఆ వ్యాఖ్య ఆయన సొంత అనుభవమూ, అభిప్రాయమూ కూడా కాదు. ఆయన ఒక అకడమిక్ సెమినార్‌లో ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యు.ఆర్. అనంతమూర్తి తన పుస్తకం “బెట్టలే పూజె యాకె మాడబారదు” (నగ్న పూజ ఎందుకు చేయకూడదు?) అన్న పుస్తకంలో రాసుకున్న ఒక చిన్ననాటి అనుభవాన్ని ఉటంకించారు.

    2. అనంతమూర్తి చెప్పిన అసలు కథ: చిన్నప్పుడు, విగ్రహాలకు దైవశక్తి ఉంటుందని, వాటిని అపవిత్రం చేస్తే కళ్లుపోతాయని లేదా దేవుడు శిక్షిస్తాడని పెద్దలు చెప్పిన మాటలను పరీక్షించడానికి, అనంతమూర్తి ఒక పొలంలోని విగ్రహంపై మూత్ర విసర్జన చేశాడు. ఆ రాత్రి ఆయనకు కలిగిన భయం ఇప్పటికీ గుర్తుందని రాస్తూ, చిన్నప్పుడు పెద్దలు చెప్పే మూఢనమ్మకాలను ఎదిరించడంలో చేసిన పిచ్చిపనులు, ఆ తరువాత ఎదురయ్యే సంఘర్షణల గురించి వివరిస్తూ రాసిన ఉదంతం అది.

    కర్ణాటకలో ‘బెట్టలెసేవ’ అంటూ నిమ్నకులాల స్త్రీలు నగ్నంగా రేణుకమ్మ జాతరలో తిరిగే(తిప్పే) ఆచారం ఉండేది. ఈ ఆచారాన్ని నిషేధించాలని కోరుతూ అనంతమూర్తి రాసిన పుస్తకమే “బెట్టలే పూజె యాకె మాడబారదు” (నగ్న పూజలు ఎందుకు చేయకూడదు?). ఇటువంటి సంస్కర్తల ఉద్యమాల వల్లనే కర్ణాటక ప్రభుత్వం 1980-90లలో దళితస్త్రీలతో చేయించే నగ్నపూజలను నిషేధించే చట్టాన్ని తీసుకువచ్చింది.
    https://www.epw.in/journal/2012/44/insight/nude-worship-karnataka.html

    3. కల్బుర్గి ఈ వ్యాఖ్య చేసిన నేపథ్యం: కల్బుర్గి ఈ కథను ప్రస్తావిస్తూ చెప్పిన సందర్భం ఒక అకడమిక్ సెమినార్. మూఢనమ్మకాల నిషేధచట్టం తీసుకురావాలని జరుపుతున్న ఈ సెమినార్‌లో కల్బుర్గి హిందువుల ఆచారాలను అపహాస్యం చేయాలనో, వ్యంగ్యంగానో చేసిన వ్యాఖ్య కాదు. ఆయన ఉద్దేశం హిందువులను కించపరచడం కాదు. ఆయన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రెచ్చగొట్టడానికి చేసినవి కావు. అవి ఒక చట్టంపై జరుగుతున్న అకడమిక్ చర్చలో, హేతువాద దృక్పథాన్ని వివరించడానికి చేసినవి. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం వేరు, ఒక శాస్త్రీయ చర్చలో గట్టిగా వాదనలు వినిపించడం వేరు.

    ఆ రోజుల్లో అనంతమూర్తి, కల్బుర్గిలపై కోర్టులో జరిగిన కేసు విచారణ వివరాలు ఇక్కడ చూడవచ్చు:
    https://www.thenewsminute.com/karnataka/case-against-ananthamurthy-kalburgi-allegedly-offending-religious-sentiments-23003

    3. “మూత్ర విసర్జన కూడా అభిషేకం లాంటిదే” అని ఆయన ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. ఇది పూర్తిగా కల్పిత ఆరోపణ.

    M. కల్బుర్గి లాంటి వారు తమకు వాక్ స్వాతంత్రం వుంది అనుకుని పరిమితులని దాటి అతి తీవ్రమైన, హేయమైన విమర్శలు చేసి సమాజంలో తీవ్ర అశాంతిని కలగచేసారు.

    4. అశాంతికి అసలు కారణం ఎవరు?
    కల్బుర్గి వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి రాలేదు. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, సందర్భం నుండి వేరుచేసి, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం వల్ల అశాంతి సృష్టించబడింది. ఒక పండితుడి మేధోపరమైన విశ్లేషణను, దైవదూషణగా చిత్రీకరించి, ఆయనను శత్రువుగా నిలబెట్టారు. ఈ దుష్ప్రచారమే చివరికి ఆయన హత్యకు దారితీసింది.

    దురదృష్టం ఏంటంటే చాలామంది ఉదారవాదులు హిందూమతం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పులేదు అనుకుంటారు కాని ఇతర మతాలలో వున్న తప్పులను ఎత్తిచూపే ధైర్యం చూపరు.

    4. దురదృష్టం ఏంటంటే చాలామంది హేతువాదులు శాస్త్రీయదృక్పథంతో అన్ని మతాలలోని మూఢాచారాలను విమర్శిస్తారని సాంప్రదాయవాదులు గుర్తెరుగరు. ఎవరైనా వారు పెరిగిన సమాజంలో, వారు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న సమాజాన్ని, ఆచారాలను, మతాన్ని మాత్రమే విమర్శ చేయడం సహజం. క్రిస్టియానిటీలో పుట్టి పెరిగిన బర్‌ట్రండ్ రసల్ “Why I am not a Christian” అన్న పేరుమీద పుస్తకం రాయడం సబబు. సల్‌మాన్ రుష్దీ, తస్లీమా నస్రీన్‌లు వంటివారు వారు పుట్టిపెరిగిన ఇస్లాం మతం గురించి విమర్శలు చేయడం సబబు.

    ఇదే అంశం మీద టివి మనోజ్, మీరా నందాలు రాసిన ఈ పాతవ్యాసం చూడండి:
    Why Should an Indian Rationalist Criticize Hinduism The Most

    ఇతర దేశాల్లో కూడా ఇదే రకమైన విమర్శ వినిపిస్తుంది. ఉదాహరణకు అమెరికాలో పదేపదే వినిపించే వాదన: హేతువాదులు క్రిస్టియానిటీ మాత్రమే ఎందుకు విమర్శిస్తారు? ఇతర మతాలను ఎందుకు విమర్శించరు? ఈ కింది చర్చలు చూడండి:
    Why do many atheists criticize Christianity but not other religions?

    I don’t get why people are ok with criticizing Christianity and Christians but defend other religions

    Why do people criticize Christianity so often but hardly ever Judaism and Islam?

    ప్రొఫెసర్ కల్బుర్గిపై ఉన్న ఆరోపణలు, ముఖ్యంగా శివలింగంపై చేసిన వ్యాఖ్య గురించి కథనాలు పూర్తిగా దురుద్దేశపూర్వకమైన వక్రీకరణలు. ఆయన ఒక పండితునిగా, పరిశోధకునిగా లింగాయత్ మతంలోని వచనాలను సేకరించి, వాటిని విశ్లేషించి, ప్రచురించి, అవి పలుభాషల్లోకి అనువదించే ప్రాజెక్టులను చేపట్టి లింగాయత్ సమాజానికి ఎనలేని సేవచేశాడు. తాను దేవుణ్ణి విశ్వసిస్తాననే చెప్పుకొన్న ఆయన సమాజంలోని కొన్ని దారుణమైన ఆచారాలను సంస్కరించడానికి మూఢనమ్మకాలను ప్రశ్నించారు. ఆయన మాటలను వక్రీకరించి, ఆయనపై ద్వేషాన్ని పెంచి, జరిగిన హింసకు బాధ్యత వహించాల్సింది ఆయన కాదు, ఆయన మాటలను ఆయుధంగా వాడుకున్న శక్తులే. ఏ విషయాన్నైనా నిర్ధారించుకునే ముందు, దాని వెనుక ఉన్న వాస్తవాలను, సందర్భాన్ని పూర్తిగా తెలుసుకోవడం మనందరి బాధ్యత.

  2. గెలుపు గురించి Govinda D అభిప్రాయం:

    08/05/2025 7:02 am

    Dev

    It is simply super 👌

    Unearthing old talent

    Great 👍

  3. కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ గురించి Srinivas అభిప్రాయం:

    08/05/2025 4:02 am

    ఈ రచన (నిజానికి ఈ సిరీస్) చదువుతున్నప్పుడు, నేను టైమ్ మెషీన్‌లో ప్రయాణిస్తున్నట్లు నాకు అనిపించింది. గత సంవత్సరాల్లో నేర్చుకున్న/అధ్యయనం చేసిన వివిధ విభిన్న సంఘటనలు/ఆలొచనలను, ఒక కథకుడు ఒక దండగా తయారు చేసినప్పుడు అద్భుతమైన కథగా మారాయి. ఉత్పత్తులు మరియు ఆలోచనల మధ్య సాంకేతిక యుద్ధాల గురించి చదవాను (బ్లూ రే vs HD DVD, స్మార్ట్ ఫోన్ vs ఐఫోన్ మొదలైనవి). ఉత్తమమైన, ప్రజాదరణ పొందిన వస్తువులు గెలిచినప్పటికీ, పోటీదారుని ఉత్పత్తి, సమానంగా వినూత్నంగా ఉన్నప్పటికీ, ఓడిపోవడాన్ని చూడటం విచారకరం.

  4. నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి గురించి Ramesh kumar అభిప్రాయం:

    08/05/2025 2:49 am

    మీ వ్యాసం చదివానండి.

    ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, M. కల్బుర్గిగారు మత విషయాలలో- హిందూ మతం పట్ల – కొంత విశృంఖలంగా, దారుణమైన వ్యాఖ్యలు- ఉదా: శివలింగపైన మూత్ర విసర్జన చేసినా తప్పులేదు (అది కూడా అభిషేకం లాంటిదే అన్నట్లుగా) చేసేవారు.

    దురదృష్టం ఏంటంటే చాలామంది ఉదారవాదులు హిందూమతం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పులేదు అనుకుంటారు కాని ఇతర మతాలలో వున్న తప్పులను ఎత్తిచూపే ధైర్యం చూపరు. M. కల్బుర్గి లాంటి వారు తమకు వాక్ స్వాతంత్రం వుంది అనుకుని పరిమితులని దాటి అతి తీవ్రమైన, హేయమైన విమర్శలు చేసి సమాజంలో తీవ్ర అశాంతిని కలగచేసారు.

    PS: ఇది కల్బుర్గి గారి పైన చేసిన దారుణకాండకు సమర్థింపు కాదని మనవి.

  5. తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి Allam innnareddy అభిప్రాయం:

    08/05/2025 2:31 am

    Excellent review regarding the glory of our villages.

  6. గెలుపు గురించి Srinivasa Rao Kunapareddy అభిప్రాయం:

    08/05/2025 12:49 am

    Very nice and heart touching story. Right intention will overcome all obstacles and it will be fulfilled.

  7. A Solemn Vedic Wedding గురించి J K Mohana Rao అభిప్రాయం:

    08/04/2025 9:26 am

    సప్తపది ఛందములో సప్తపది
    *
    మొదటి యడుగు నిడుద మిపుడు భూమి యిచ్చు పంటతోడ
    ముదముతో భుజించగ తనుపుష్టికై సదా
    రెండవ యడు గిడుద మిపుడు రిత్తవోని బలము మనకు
    మెండుగాను బ్రదుకునందు నిండగా సదా
    మూడవ యడు గిడుద మిపుడు పూర్ణమౌ విభూతు లెల్ల
    కూడుకొనగ గృహమునందు కొండగా సదా
    నాల్గవ యడు గిడుద మిపుడు నశ్వరమగు భవము శివము
    వెల్గ మనకు జీవితాన వృష్టిగా సదా
    అయిదవ యడు గిడుద మిప్పు డందముగను ముద్దు లొలుకు
    ప్రియ తనూభవుల సుశీల వృత్తికై సదా
    ఆఱవ యడు గిడుద మిప్పు డాయువునకు స్వస్థతకును
    కారు లిచ్చు దివ్యమైన కాంతికై సదా
    ఏడవ యడు గిడుద మిపుడు హృద్యమైన సఖ్యతకయి
    వాడని మమకారముకయి వసుధపై సదా
    *
    (సంస్కృతములో సప్తపది మంత్రము-
    ఓం ఇష ఏకపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం ఊర్జే ద్విపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం రాయస్పోషాయ త్రిపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం మార్యాభవ్యాయ చతుష్పదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం ప్రజాభ్యః పంచపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం ఋతుభ్యః షట్పదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం సఖా సప్తపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః)
    *
    మీకు నచ్చితే వివాహ సమయములో సప్తపదిలో వ్రాసిన సప్తపదిని ఉపయోగించండి.
    *
    విధేయుడు – మోహన

  8. గెలుపు గురించి Jyoti అభిప్రాయం:

    08/04/2025 4:34 am

    Heart touching story

  9. తెలుగువారి సాంస్కృతిక విస్మృతి గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:

    08/03/2025 11:56 pm

    ముస్లిం పాలన మొదలయ్యాక వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావంతో దేశ భాషలు వెల్లివిరిసాయి […]

    ఇదో పెద్ద బూటకం. శంకరాచార్య, నాయనారులు. ఆళ్వారులు ఇస్లాం దండయాత్రలకు కొన్ని వందల ఏళ్లకు ముందే భక్తి ఉద్యమాన్ని ఆరంభించారు. కాబట్టి, భక్తి ఉద్యమ ప్రభావమే దేశ భాషలు వెల్లివిరిసాయనుకుంటే దానిపై ఇస్లాం ప్రభావం ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. (ఈ లెక్కలు ఆధునిక చరిత్రకారుల కాలగణన ప్రకారం. సాంప్రదాయ విశ్వాసాలైతే ఇంకో వేయేళ్ల ముందు మొదలైంది నాయనారులతో భక్తి ఉద్యమం.)

    ఇంకా చెప్పాలంటే, భక్తి ఉద్యమానికి ముందున్న మౌఖిక ప్రజా సాహిత్యం ఏదైనా దొరికితేనే కదా మనం పోల్చి చూసుకోవాల్సింది? దొరకలేదు కాబట్టి భక్తి ఉద్యమానికి ముందు ప్రజల భాషలో ఏ ప్రజా సాహిత్యమూ లేదనడం అశాస్త్రీయం.

    వేదాలలో ఉపయోగించిన స్థాయి భాష అలా పరిణమించడానికి అంతకు ముందు ఎన్ని వేల లేదా వందల ఏళ్ల పాటు స్థానిక భాషలలో ఎంత సాహిత్యం వచ్చి ఉండాలో కదా. అది కచ్చితంగా లిఖితమే అయి ఉండక్కర్లేదు. మౌఖికమైనా కావచ్చు.

  10. గెలుపు గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    08/03/2025 3:09 am

    కథ బాగుంది.

    భాషాదోషాలూ అచ్చుతప్పులూ ఈమాటలో కనపడవని నమ్మేవాళ్లం. ఇప్పుడా నమ్మకాన్ని మార్చుకోవలసి వస్తోంది.

    [అచ్చుతప్పులు, భాషాదోషాలు లేకుండా ఉండడానికే ఈమాట ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. మాకు కనిపించిన దోషాలు సవరించాము. ఇంకా ఇందులో ఉన్న అచ్చుతప్పులు తెలియజేస్తే మాకు సహాయం చేసినవారవుతారు. — సం.]