పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. సరిహద్దులు కలవరపరచని కవి గురించి Ramesh అభిప్రాయం:

    08/10/2025 1:48 am

    విద్యార్థి గారికి జన్మదిన శుభాకాంక్షలు!

  2. ‘తెల్ల ఏనుగు’ అనువాద నవల గురించి రచయిత జయమోహన్‌తో సంభాషణ గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    08/09/2025 9:26 am

    “సత్యాన్ని శోధించేందుకు కల్పన ఒక పెద్ద ఆయుధం”… ఈ వాక్యం చాలు, జయమోహన్ గారి రచనా దృక్పధాన్ని పట్టివ్వడానికి. ఆయన రచనలు నేను ఇంకా ఏవీ చదవలేదు. కానీ కచ్చితంగా చదివి తీరాలన్న గట్టి సంకల్పం కలిగించింది ఈ సంభాషణ.

  3. గెలుపు గురించి సురేష్ బాబు అభిప్రాయం:

    08/08/2025 5:58 am

    చక్కటి కథ మరియు కథనం నేటి దినాలలో ఒక కూలీ తన మనమరాలి చిన్న కోరిక (బిర్యాని తినాలనిపించే ఆశ) తీర్చడానికి తన ఒక రోజు సంపాదనలో సగం ఖర్చు చేయడానికైన వెనకాడని ప్రేమ, తపన చాలా చక్కగా పొందుపరిచారు.

    సమాజంలో తారతమ్యాలు అనగా ఒక వస్తువు విలువ (ఇక్కడ బిర్యాని) కొంతమందికి చాలా సులభంగా దొరుకుతుంది, కొంతమందికి మామూలు ఖర్చు, మరికొంతమందికి భారం, మరి కొంతమందికి భరించలేనిది ఇలా వివిధ రకాల జీవనవిధానాలు ఉంటాయని గ్రవించగలిగే విధంగా రచయిత రచించారు అని నా అభిప్రాయం.

    చాలా మంచి కథ అందరూ చదవ వలసిన కథ.

  4. గెలుపు గురించి Rama Sarma అభిప్రాయం:

    08/08/2025 12:56 am

    Good story — well written.

  5. సరిహద్దులు కలవరపరచని కవి గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    08/07/2025 6:42 pm

    రెండు పుష్కరాల క్రితం తానా సభల్లో విద్యార్ధి గారిని కలిశాము, వారెంతో స్నేహశీలి. ఎనిమిది పదులు పూర్తయిన సందర్భంగా వారికి హార్దిక అభినందనలు. విన్నకోట రవిశంకర్ చక్కని వ్యాసంతో పాత విషయాలను గుర్తు చేయడం సంతోషాన్ని కలిగించింది.

  6. కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:

    08/06/2025 12:15 pm

    ఈ వ్యాసంలో బ్యాటరీ గురించి చదివినప్పుడు నేను యాభై ఏళ్లు వెనక్కి వెళ్ళాను. అది 1970 కి ముందు కాలం. అప్పటికి మన గ్రామాలకు విద్యుత్ రాలేదు. అయినా విద్యుత్ తో నడిచే పరికరాలు గ్రామాలకు వచ్చేవి. ఉదాహరణకు రేడియో. అప్పట్లో డబ్బా టీవీ అంత సైజు వుండేది రేడియో. టీవీలాగే అటు ఇటు కదిలించటానికి వీలులేకుండా ఒకేచోట స్థిరంగా వుండేది రేడియో. అది బ్యాటరీ మీద నడిచేది. దాని బ్యాటరీ సైజు కూడా వేరుగా వుండేది. పెళ్లిళ్లప్పుడు మైకు పెట్టేవారు. గ్రామఫోన్ రికార్డు ద్వారా ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని హిట్ పాటలు వేసేవారు. అది కూడా బ్యాటరీ మీదే నడిచేది. కొందరి ఇళ్లలో బ్యాటరీ లైట్ వుండేది. టార్చ్ లైట్ కి అది మరో పేరు. డి సైజ్ బ్యాటరీలు నాలుగు లేక ఆరుటితో వెలిగేటంతటి పెద్దపెద్ద టార్చ్ లేట్లు వుండేవి. రేడియో స్థానంలో ట్రాన్సిస్టర్ వచ్చాక డి సైజు బ్యాటరీలు రెండిటితో నడిచేవి బుష్, మర్ఫి, ఫిలిప్స్ కంపెనీల ట్రాన్స్సిస్టర్లు. వాటిని కూడా సామాన్య జనం రేడియో అనే పిలిచేవారు. ట్రాన్స్సిస్టర్ అనటం చాలా మందికి కష్టం కదా. ఆ రోజుల్లో బ్యాటరీ మరియు కిరోసిన్ అనేవి జీవితంలో విడదీయరాని వస్తువులుగా వుండేవి. బ్యాటరీ పని అయిపోతే టార్చ్ లైట్ లైట్ గా వెలిగేది. రేడియోలో మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. పని అయిపోయిన బ్యాటరీని తీసివెయ్యకపోతే వస్తువులు పాడయ్యేవి. అవి ప్రమాదకరమైనవని నయ్యిదిబ్బలో పారేసేవాళ్లు. ఆరోజుల్లో ఏ2, ఏ3,ఏ4 బ్యాటరీలు లేవు. అంతటా డి సైజే!

    విద్యుత్తు గ్రామాల్లోకి వచ్చాక బ్యాటరీ ప్రమేయం బాగా తగ్గిపోయింది చాలా కాలం. ఆ తర్వాత క్వాడ్జ్ గోడగడియారాలు బ్యాటరీతో నడిచేవి వచ్చాక మళ్లీ బ్యాటరీ తెరమీదకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏఏ, ఏఏఏ బ్యాటరీలు లేనిదే రోజులు ముందుకు సాగవు. గోడగడియారంలో ఏఏ, టీవీ ఏసీ రిమోట్ లో ఏఏఏ సైజు బ్యాటరీలు తప్పనిసరి. సెల్ ఫోన్ వచ్చాక లో బ్యాటరీ అనేది ఊతపదం అయ్యింది. 2000 సంవత్సరం ప్రాంతంలో విద్యుత్ కోత అధికంగా వుండటం వలన ఇన్వర్టర్ అనే పరికరం మార్కెట్లోకి వచ్చింది. పెద్ద బ్యాటరీలో విద్యుత్ ని స్టోర్ చేసి పవర్ కట్ అయినప్పుడు ఇన్వర్టర్ ద్వారా పరిమితంగా లైట్లు, పంఖాలు పనిచేసేవి. ఆ బ్యాటరీలోకి డిస్టిల్డ్ నీరు పోస్తూవుండాలి నెలకో రెండు నెలలకో.

    నేడు కరెంటు కోత అంతగా లేకపోయినా, కరెంటు ఎప్పుడు పోతుందో చెప్పలేం. అందువలన చాలామంది ఇళ్లలో ఇన్వర్టర్ లు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి వారు ఇన్వర్టర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని గమనించటం అలవాటు అయింది. బ్యాటరీ మీద వుండే పుల్లలో ఎరుపు రంగు కిందకు దిగింది అంటే బ్యాటరీ కి దాహం అయ్యిందని అర్ధం. డిస్టిల్డ్ వాటరు నాలుగైదు సీసాలు ప్రతి ఇంట్లో వుంటున్నాయి ఇటీవలి కాలంలో. హనుమంతరావు గారి వ్యాసంలో బ్యాటరీ గురించి చదువుతుంటే యాభై సంవత్సరాల క్రితం రోజులు మదిలో మెదిలినవి. స్విచ్ స్టేజ్ లో మరికొన్ని మరిచిపోయిన, మరికొన్ని మరిచిపోలేని స్మృతులు మదిలో మెదలటానికి వెంపర్లాడుతున్నవి. అవి ఒక ట్రిగ్గర్ కోసం వేచిచూస్తున్నవి. అదే తీగద్వారా ఇంటికి సరఫరా అయ్యే కరెంటు!

    జ్ఞాపకాలను యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినందుకు హనుమంతరావు గారికి ధన్యవాదములు.

  7. గెలుపు గురించి Victoria Nallamothu అభిప్రాయం:

    08/06/2025 3:43 am

    Excellent narration with a gripping story line. Yadayya’s character made me to experience all kinds of emotions.
    Narrator has kept the reader hooked on to the story till the end.

  8. సరిహద్దులు కలవరపరచని కవి గురించి C.V.Syamala అభిప్రాయం:

    08/05/2025 11:46 am

    విద్యార్ధి గారి వ్యక్తిత్వాన్ని,ఆయన కవితలని రవిశంకర్ గారు చాలా చక్కగా పరిచయం చేసేరు. విద్యార్ధి గారి జీవన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది. రవిశంకర్ గారికి, ఈమాట సంపాదకులకు ధన్యవాదాలు.

  9. గెలుపు గురించి Rama mohana rao, sista Dilsukhnagar. అభిప్రాయం:

    08/05/2025 10:05 am

    తెలంగాణ యాసలో దినసరి కూలీ బ్రతుకుల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది మీరు రాసిన చిన్న కథ. అభినందనలు దేవ్. మీ ప్రతిభను ఇలాగే కొనసాగించండి. అద్భుతం.

  10. గెలుపు గురించి Grandhi Venkata Swamy అభిప్రాయం:

    08/05/2025 9:47 am

    చాలా బాగా వ్రాశారు. కష్టజీవికి భగవంతుడు తన వంతు సహాయం చేశాడని నాకు అనిపించింది.