మన అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలు మనతో పాటు చివరిదాకా వస్తాయి. ఎన్ని పుస్తకాలు చదివినా ఆ పాత్రలు ఏవీ గుర్తు లేవు. తప్పని సరిగా వాటి ప్రభావం మన మీద ఉండి ఉంటుంది. చాలా బాగా చెప్పారు.
అయ్యా
లింకులు ఇస్తే రిఫెరెన్స్ ఇచ్చినట్టా? కాదని నా పుస్తకాల పబ్లిషర్స్ ఎన్నో నెలలబట్టి చెప్తున్నారు. లింకులో ఇచ్చిన వ్యాసాలకీ, అందులో బొమ్మలకి వేరే కాపీరైట్ ఉంటుంది. రూల్స్ ప్రకారం పుస్తకాల, వ్యాసాల, బొమ్మల కాపీరైట్ రచయిత/ఆర్టిస్ట్ జీవితకాలం ప్లస్ మరో డబ్భై సంవత్సరాలు. వ్యాసం చివర్లో ఆయా బొమ్మలు వేసినవారివి అని చెప్పాల్సి ఉంటుంది. మీరు పబ్లిగ్గా ఊరికే ఇచ్చిన బొమ్మలు వాడినా వ్యాసం చివర్లో ఫలానా వ్యాసం మా రిఫరెన్స్ అని చెప్పడం మర్యాద. లింక్ ఇచ్చేసి అదే రిఫరెన్స్ అనుకోమనడం సరైనది కాదని నాకు పదే పదే చెప్పారు వేరు వేరు సంపాదకులు. ఆఖరికి మీరు మైక్రోసాఫ్ట్ విండోస్, ఆఫీస్ వారి స్క్రీన్ షాట్ వాడినా అవి ఫలానా అని చెప్పాల్సి ఉంటుంది మర్యాద కోసం. అవి అందరికీ తెల్సు, కావాలంటే లింకులో చూసుకుంటారో పోతారో మాకేల అనుకోవడం మంచిది కాదనుకుంటా.
నాకు తెల్సినది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. కాపీ రైట్ రూల్స్ ఇక్కడ.
ఇందులో ఆఖరి పేరా తప్ప మిగతా వన్నీ చదవడానికి అంత గొప్పగా ఏమీ లేవు, దాదాపు అందరికీ తెల్సినవే. ఇచ్చిన టేబుల్, అంకెలూ ఎంతమంది చదువర్లకి అర్ధం అవుతాయన్నది వివాదాంశం. గ్రహణాలు ఎందుకొస్తాయనేది మూడో క్లాస్ కుర్రాడు కూడా చెప్పగలడు ఈ రోజుల్లో. ఈ విషయాలకన్నా గ్రహణ సమయంలో ఎందుకు వంటలు వండరు, తర్వాత స్నానం ఎందుకు చేస్తారు, ఈ సమయంలో చేసే మంత్ర జపం విశేషమైన ఫలితాలు ఇస్తుంది, గుళ్ళూ గోపురాలూ ఎందుకు మూసేస్తారు వగైరా “భారతదేశపు విషయాలు” చెప్తే బాగుండేది. ఈమాట తెలుగు పత్రిక కనక తెలుగు దేశంలో విషయాలు కూడా మరికొన్ని రాస్తే బాగుండేది. వ్యాసం బాగోలేదని అనడం లేదు కానీ చెప్పిన విషయాలు జగద్విదితం/అనవసరం.
ముఖ్యంగా ఈ బొమ్మలు, టేబిల్ ఎక్కడ నుంచి తెచ్చారు? రిఫరెన్స్‌లు ఇవ్వాలని రచయితకీ సంపాదకులకీ తోచకపొవడం శోచనీయం.
[వ్యాసంలోనే ఇచ్చిన లింకులు చూసి ఈ వ్యాఖ్య చేసి ఉండాల్సింది శర్మగారు. – సం.]
అన్నపూర్ణగారు,
వేదుల ఖమ్మంలో పుట్టారు. కాకినాడలో ఉద్యోగం చేశారు. పండితుడు, కవి, వేదాలని మొదటిగా తెలుగులో ప్రచురించిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వితంతు కుమార్తె కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు. ఆయన గురించిన వివరాలు వికీలోను, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన “ఆంధ్ర రచయితలు” (1940) పుస్తకంలోను చూడవచ్చు.
చేరానేగానీ ఆక్సిజన్ పలచబడే ఆ ఉన్నత పరిసరాలు నా శక్తిమీదా నడకవేగం మీదా…
డాక్టర్‌గారూ అమరేంద్రగారూ: కీతో నగరపు పరిసర పట్టణాల్లోనూ ఎందుకు ఆక్సిజన్ పలచగా ఉంటుందో, ఆరోగ్యం చెడడానికి ఆస్కారం ఉందో (ఆస్థ్మా వారికీ వగైరా) కొంచెం వివరంగా చెప్తారనుకున్నా (పాత వ్యాసంలో చెప్పి ఉంటే తప్పునాదే, నేను అవి చదవలేదు). అనేకమంది వలసదారులు వచ్చే ఈ దారిలో చాలామందికి ఇక్కడే కాస్త ఆరోగ్యం చెడుతుంది, వీళ్ళకి ముందు ఈ విషయాలు మధ్యవర్తులూ, ఏజెంట్లూ చెప్పరు, చెప్పినా పట్టించుకోరు అని టైమ్ పత్రికలో రాసారు ఒక వ్యాసంలో. ఈ ఆక్సిజన్ విషయాలు గూగుల్లో దొరుకుతాయనుకోండి కానీ డాక్టర్ గారు చెప్పడం వేరు కదా? 🙂
ఉగాది, ఆ తర్వాత సంవత్సరం ఎలా ఉంటాయో కానీ ఈ వాక్యం మాత్రం, “final nail in the coffin.” గీతాచార్యుడు చెప్పినట్టే “కాల: కలయతామహం.” దీనికి స్వామి ప్రభుపాద గారు ఇచ్చిన అనువాదం – among subduers, I am Time. (విభూతి యోగం 30)
“ఆర్యభటీయం, గోళాధ్యాయంలో, 9-10 శ్లోకాల్లో… పడవలో ముందుకి ప్రయాణిస్తున్న వ్యక్తికి ఒడ్డున ఉన్న వస్తువులు, అవి నిలకడగా ఉన్నప్పటికీ ఎలాగైతే వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తాయో, నక్షత్రాలూ. గ్రహాలూ కూడా ‘లంక’కి (ఆ రోజుల్లో ఆ ప్రదేశాన్ని భూమధ్యరేఖ-సున్నా డిగ్రీల రేఖాంశమూ ఖండించుకునే బిందువు వద్ద ఉన్నట్టుగా భావించేవారు) పడమరగా నడుస్తున్నట్టు కనిపిస్తాయి” అని అన్నాడు. భూమి నిశ్చలంగా ఉంటుందని అప్పటి వరకూ ఉన్న విశ్వాసాలకి వ్యతిరేకంగా, భూమి తన ఇరుసుమీద తిరుగుతుందని చెప్పడం వరకు విప్లవాత్మకమే. అందుకనే అతను వరాహమిహిరుడు, భాస్కరాచార్య-I వంటి వారి విమర్శలకు గురయ్యాడు. కేరళలోని సంగమగ్రామానికి చెందిన మాధవ (1340- 1425) గురుకులానికి చెందిన వారు ఆర్యభట-I అనుయాయులే గనుక అతని మౌలిక భావనని, పరిశీలన, పరిశోధనల ద్వారా ముందుకి తీసుకువెళ్ళి ఉంటారు అని అనుకోవచ్చు. ఆర్యభట-I సూర్య-కేంద్రక వ్యవస్థని ప్రతిపాదించేడనడం వాస్తవం కాకపోవచ్చు. నాలుగు శతాబ్దాలు పైగా కొనసాగిన ఈ గురుపరంపరలో, నీలకంఠసోమయాజి (14 జూన్ 1444 – 1544) కూడా, సూర్య, చంద్రులు భూమి చుట్టూ తిరుగుతుంటే, తక్కిన గ్రహాలు మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతాయని భూ-కేంద్రక వ్యవస్థకీ, సూర్య-కేంద్రక వ్యవస్థకీ మధ్యేమార్గంలో ఉన్న ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అది పూర్తిగా సూర్య-కేంద్రక వ్యవస్థ కాదు. టైకో బ్రాహి కూడా సరిగ్గా ఇదే ప్రతిపాదన చేశాడు. ఆయనకి భూ-కేంద్రక వ్యవస్థపై మక్కువకి మతపరమైన విశ్వాసం ఒక కారణం అయితే, అతని దగ్గర అప్పటి ప్రమాణాలకి సున్నితమైన పరికరాలున్నప్పటికీ stellar parallaxని కనుక్కోలేకపోవడం రెండవ కారణం.
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి డి.యస్.యస్.రామం గారి అభిప్రాయం:
04/05/2024 12:15 am
మన అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలు మనతో పాటు చివరిదాకా వస్తాయి. ఎన్ని పుస్తకాలు చదివినా ఆ పాత్రలు ఏవీ గుర్తు లేవు. తప్పని సరిగా వాటి ప్రభావం మన మీద ఉండి ఉంటుంది. చాలా బాగా చెప్పారు.
మార్ట్ డ్రకర్ గురించి MAD books గారి అభిప్రాయం:
04/04/2024 10:18 pm
అరకొర చూసాను గానీ, ఈ మార్ట్ డ్రకర్ గురించి మొదటిసారి తెలుసుకున్నాను. థాంక్స్ టు అన్వర్ గారు.
గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
04/04/2024 3:52 pm
అయ్యా
లింకులు ఇస్తే రిఫెరెన్స్ ఇచ్చినట్టా? కాదని నా పుస్తకాల పబ్లిషర్స్ ఎన్నో నెలలబట్టి చెప్తున్నారు. లింకులో ఇచ్చిన వ్యాసాలకీ, అందులో బొమ్మలకి వేరే కాపీరైట్ ఉంటుంది. రూల్స్ ప్రకారం పుస్తకాల, వ్యాసాల, బొమ్మల కాపీరైట్ రచయిత/ఆర్టిస్ట్ జీవితకాలం ప్లస్ మరో డబ్భై సంవత్సరాలు. వ్యాసం చివర్లో ఆయా బొమ్మలు వేసినవారివి అని చెప్పాల్సి ఉంటుంది. మీరు పబ్లిగ్గా ఊరికే ఇచ్చిన బొమ్మలు వాడినా వ్యాసం చివర్లో ఫలానా వ్యాసం మా రిఫరెన్స్ అని చెప్పడం మర్యాద. లింక్ ఇచ్చేసి అదే రిఫరెన్స్ అనుకోమనడం సరైనది కాదని నాకు పదే పదే చెప్పారు వేరు వేరు సంపాదకులు. ఆఖరికి మీరు మైక్రోసాఫ్ట్ విండోస్, ఆఫీస్ వారి స్క్రీన్ షాట్ వాడినా అవి ఫలానా అని చెప్పాల్సి ఉంటుంది మర్యాద కోసం. అవి అందరికీ తెల్సు, కావాలంటే లింకులో చూసుకుంటారో పోతారో మాకేల అనుకోవడం మంచిది కాదనుకుంటా.
నాకు తెల్సినది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. కాపీ రైట్ రూల్స్ ఇక్కడ.
https://www.copyright.gov/help/faq/faq-duration.html#:~:text=As%20a%20general%20rule%2C%20for,plus%20an%20additional%2070%20years.
గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
04/04/2024 12:24 pm
ఇందులో ఆఖరి పేరా తప్ప మిగతా వన్నీ చదవడానికి అంత గొప్పగా ఏమీ లేవు, దాదాపు అందరికీ తెల్సినవే. ఇచ్చిన టేబుల్, అంకెలూ ఎంతమంది చదువర్లకి అర్ధం అవుతాయన్నది వివాదాంశం. గ్రహణాలు ఎందుకొస్తాయనేది మూడో క్లాస్ కుర్రాడు కూడా చెప్పగలడు ఈ రోజుల్లో. ఈ విషయాలకన్నా గ్రహణ సమయంలో ఎందుకు వంటలు వండరు, తర్వాత స్నానం ఎందుకు చేస్తారు, ఈ సమయంలో చేసే మంత్ర జపం విశేషమైన ఫలితాలు ఇస్తుంది, గుళ్ళూ గోపురాలూ ఎందుకు మూసేస్తారు వగైరా “భారతదేశపు విషయాలు” చెప్తే బాగుండేది. ఈమాట తెలుగు పత్రిక కనక తెలుగు దేశంలో విషయాలు కూడా మరికొన్ని రాస్తే బాగుండేది. వ్యాసం బాగోలేదని అనడం లేదు కానీ చెప్పిన విషయాలు జగద్విదితం/అనవసరం.
ముఖ్యంగా ఈ బొమ్మలు, టేబిల్ ఎక్కడ నుంచి తెచ్చారు? రిఫరెన్స్‌లు ఇవ్వాలని రచయితకీ సంపాదకులకీ తోచకపొవడం శోచనీయం.
[వ్యాసంలోనే ఇచ్చిన లింకులు చూసి ఈ వ్యాఖ్య చేసి ఉండాల్సింది శర్మగారు. – సం.]
నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
04/04/2024 12:16 pm
అన్నపూర్ణగారు,
వేదుల ఖమ్మంలో పుట్టారు. కాకినాడలో ఉద్యోగం చేశారు. పండితుడు, కవి, వేదాలని మొదటిగా తెలుగులో ప్రచురించిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వితంతు కుమార్తె కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు. ఆయన గురించిన వివరాలు వికీలోను, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన “ఆంధ్ర రచయితలు” (1940) పుస్తకంలోను చూడవచ్చు.
ఆయన గొంతుక ఇక్కడ వినవచ్చు.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
04/04/2024 12:08 pm
డాక్టర్‌గారూ అమరేంద్రగారూ: కీతో నగరపు పరిసర పట్టణాల్లోనూ ఎందుకు ఆక్సిజన్ పలచగా ఉంటుందో, ఆరోగ్యం చెడడానికి ఆస్కారం ఉందో (ఆస్థ్మా వారికీ వగైరా) కొంచెం వివరంగా చెప్తారనుకున్నా (పాత వ్యాసంలో చెప్పి ఉంటే తప్పునాదే, నేను అవి చదవలేదు). అనేకమంది వలసదారులు వచ్చే ఈ దారిలో చాలామందికి ఇక్కడే కాస్త ఆరోగ్యం చెడుతుంది, వీళ్ళకి ముందు ఈ విషయాలు మధ్యవర్తులూ, ఏజెంట్లూ చెప్పరు, చెప్పినా పట్టించుకోరు అని టైమ్ పత్రికలో రాసారు ఒక వ్యాసంలో. ఈ ఆక్సిజన్ విషయాలు గూగుల్లో దొరుకుతాయనుకోండి కానీ డాక్టర్ గారు చెప్పడం వేరు కదా? 🙂
క్రోధి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
04/04/2024 11:56 am
>> కాలకర్మంబులను మీరఁ గాదు తరము
ఉగాది, ఆ తర్వాత సంవత్సరం ఎలా ఉంటాయో కానీ ఈ వాక్యం మాత్రం, “final nail in the coffin.” గీతాచార్యుడు చెప్పినట్టే “కాల: కలయతామహం.” దీనికి స్వామి ప్రభుపాద గారు ఇచ్చిన అనువాదం – among subduers, I am Time. (విభూతి యోగం 30)
నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల గురించి annapurna appadwedula గారి అభిప్రాయం:
04/04/2024 4:57 am
ఈ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిది ఏవూరు? కాకినాడా?
పొంతన గురించి దాసరి అమరేంద్ర గారి అభిప్రాయం:
04/04/2024 4:13 am
ఎక్కడా పదును తగ్గకుండా చకచకా నడిచింది. బావుంది కథ.
గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా గురించి NS Murty గారి అభిప్రాయం:
04/04/2024 12:21 am
శ్రీనివాస్‌గారూ,
“ఆర్యభటీయం, గోళాధ్యాయంలో, 9-10 శ్లోకాల్లో… పడవలో ముందుకి ప్రయాణిస్తున్న వ్యక్తికి ఒడ్డున ఉన్న వస్తువులు, అవి నిలకడగా ఉన్నప్పటికీ ఎలాగైతే వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తాయో, నక్షత్రాలూ. గ్రహాలూ కూడా ‘లంక’కి (ఆ రోజుల్లో ఆ ప్రదేశాన్ని భూమధ్యరేఖ-సున్నా డిగ్రీల రేఖాంశమూ ఖండించుకునే బిందువు వద్ద ఉన్నట్టుగా భావించేవారు) పడమరగా నడుస్తున్నట్టు కనిపిస్తాయి” అని అన్నాడు. భూమి నిశ్చలంగా ఉంటుందని అప్పటి వరకూ ఉన్న విశ్వాసాలకి వ్యతిరేకంగా, భూమి తన ఇరుసుమీద తిరుగుతుందని చెప్పడం వరకు విప్లవాత్మకమే. అందుకనే అతను వరాహమిహిరుడు, భాస్కరాచార్య-I వంటి వారి విమర్శలకు గురయ్యాడు. కేరళలోని సంగమగ్రామానికి చెందిన మాధవ (1340- 1425) గురుకులానికి చెందిన వారు ఆర్యభట-I అనుయాయులే గనుక అతని మౌలిక భావనని, పరిశీలన, పరిశోధనల ద్వారా ముందుకి తీసుకువెళ్ళి ఉంటారు అని అనుకోవచ్చు. ఆర్యభట-I సూర్య-కేంద్రక వ్యవస్థని ప్రతిపాదించేడనడం వాస్తవం కాకపోవచ్చు. నాలుగు శతాబ్దాలు పైగా కొనసాగిన ఈ గురుపరంపరలో, నీలకంఠసోమయాజి (14 జూన్ 1444 – 1544) కూడా, సూర్య, చంద్రులు భూమి చుట్టూ తిరుగుతుంటే, తక్కిన గ్రహాలు మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతాయని భూ-కేంద్రక వ్యవస్థకీ, సూర్య-కేంద్రక వ్యవస్థకీ మధ్యేమార్గంలో ఉన్న ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అది పూర్తిగా సూర్య-కేంద్రక వ్యవస్థ కాదు. టైకో బ్రాహి కూడా సరిగ్గా ఇదే ప్రతిపాదన చేశాడు. ఆయనకి భూ-కేంద్రక వ్యవస్థపై మక్కువకి మతపరమైన విశ్వాసం ఒక కారణం అయితే, అతని దగ్గర అప్పటి ప్రమాణాలకి సున్నితమైన పరికరాలున్నప్పటికీ stellar parallaxని కనుక్కోలేకపోవడం రెండవ కారణం.
అభివాదములతో,
NS మూర్తి.