పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి Parthasarathy Chaganty అభిప్రాయం:

    09/07/2025 4:47 am

    సమగ్రమైన సమీక్ష. సిద్ధాంత వ్యాసం స్థాయిలో ఉన్న సమీక్ష. పూర్తిగా అర్థమైందని చెప్పలేను. అర్థమైనంత మేరకు వ్యాసారంభంలో ఉదాహరించిన “ధిక్కార కవి” (iconoclast) అన్న వర్గీకరణ బైరాగి విషయంలో యుక్తమే అయుండవచ్చు అనిపిస్తోంది. రచయితకు ధన్యవాద సహిత అభినందనలు.

  2. అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    09/07/2025 4:27 am

    ధన్యవాదాలు రామమోహనరావుగారూ
    -వాసు-

  3. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి Sanjay Khan అభిప్రాయం:

    09/07/2025 3:32 am

    అద్భుతమైన వ్యాసం. ఎన్నో వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను, నోట్స్ లోకి తీసుకున్నాను. ఈ వ్యాసం చదివాక బైరాగి కవిత్వం ఆర్డర్ చేసుకోవాలి, దానితో పాటు వాడ్రేవు చినవీరభద్రుడు గారి రచనలు కూడా.

    వాడ్రేవు చినవీరభద్రుడు ధన్యవాదాలు సార్. ఎంత ఇష్టంగా, ఎంత మృదువుగా రాసారో… ప్రతి పదం, ప్రతి వాక్యం చదువుంటున్నంత సేపు మనస్సంతా ఎదో తెలియని ఒక తియ్యని అనుభూతి.

  4. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:

    09/06/2025 9:34 pm

    I wish I could make margin notes for this essay. Here are some immediate thoughts:

    “We have met the enemy and he is us”. We end up becoming what we hate and fight. That is what happened to all the movements that started in hate. Eliot says:

    We think of the key, each in his prison
    Thinking of the key, each confirms a prison

    My problem is the labels they use for Bairagi — and funny thing is that the label itself talk about how complex a poet he is, and yet apply simple monikers to his poetry!

    Will read again, in the next round 🙂

  5. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Srini అభిప్రాయం:

    09/06/2025 6:40 pm

    చాలా బాగా రాసారు. ఆలాగే ఇంకా మంచి వ్యాసాలు రాయండి.

  6. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి Chowdary Jampala అభిప్రాయం:

    09/06/2025 3:39 pm

    ఎవరి కవీ కాని మీ కవి తత్వాన్ని చక్కగా పరిచయం చేశారు. ధన్యవాదాలు.

  7. బైరాగితో ప్రయాణం గురించి Chowdary Jampala అభిప్రాయం:

    09/06/2025 3:25 pm

    ఈ విశ్లేషణ కొత్తగా ఉంది. ఆలోచనలు రేకెత్తిచ్చింది.

  8. దివ్యభవనంలో బీజాక్షరి గురించి Chowdary Jampala అభిప్రాయం:

    09/06/2025 3:09 pm

    ఆశ, దయ, పునరుజ్జీవనం ఈ కథలలో మళ్ళీ మళ్ళీ కనిపించే అంశాలు. బైబిల్లో క్రీస్తు లాజరస్‌ను పునరుద్ధరించిన ఘట్టాన్ని చదవటం ఒక కథలో ముఖ్యాంశం.

  9. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి చింతలపాటి శ్రీధరుడు అభిప్రాయం:

    09/06/2025 2:57 pm

    చదివీ చదివీ ఆకళించుకోవలసిన వ్యాసం. కృతికర్త రాధాకృష్ణమూర్తి గారికి, కృతిభర్త సురేశ్ గారికీ కృతజ్ఞతార్థక నమస్సులు. 🙏🏼

  10. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి తుమ్మూరి రాంమోహన్ రావు అభిప్రాయం:

    09/06/2025 1:49 pm

    తొలుదొల్తనే ఒక మహానుభావుడి వ్యాసం చదవటంతో ఈ సంచిక ఎంత విశిష్టమైనదో తెలియవస్తున్మది. భగవదనుగ్రహం వల్ల సూరపరాజుగారి ప్రాపు కొంతకాలం కలిగింది. ఇటు ఉపనిషత్తులను, అటు పాశ్చాత్య సాహిత్యాన్ని మథనాన్ని చేసిన మహనీయులు రాధాకృష్ణమూర్తిగారు. బైరాగి కూడా అంతే పట్టు గలిగిన వారని వ్యాసం చదివితే తెలుస్తున్నది.

    బైరాగి కవిత్వానికి భాష్యం చెప్పగలిగిన సమర్థ సాహితీ ప్రకాండులు సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. వారి వ్యాసం సేకరించి ప్రచురించిన ఈమాట సంపాదకులకు అభినందనలు.