పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. దివ్యభవనంలో బీజాక్షరి గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:

    09/06/2025 11:23 am

    ఈ కథలు నేను ఇంతవరకూ చదవలేదు. కవితలు మాత్రమే చదివాను. అయినా అలవాటు చొప్పున సాహసించి ఒక వాఖ్య పడేస్తున్నాను 🙂 . అంటే, కథల్లో మర్మం బాగా చెప్పారు — abstraction సరిగ్గా చూపించారు.

    కవిత్వం లోని కొన్ని అంశాలు ఈ కథల్లో కూడా కనబడుతున్నాయి. బైరాగి మీద “పునరుజ్జీవనం” అన్న మార్మికాంశం బాగానే ముద్ర వేసింది. అది కొంచెం హైందవ మతం లోని పునర్జన్మ లాగ కనిపించినా, అది క్రైస్తవ మతం లోని భావన. “మృత్యు తంద్రను వీడి వస్తాడు లాజరస్”. ఇక్కడ లాజరస్ చచ్చి బ్రతికిన మనిషి. దైవదయలో పునరుజ్జీవనం పొందిన మనిషి.

    కరుణ అనే పదానికి గ్రేస్ (grace) అని కూడా వాడవచ్చు అనుకుంటాను. అప్పుడు బైరాగిమీద ఎలియట్ (Eliot) ప్రభావం బాగా కనబడుతుంది అని తెలుస్తుంది. ఇది కాథలిక్ పునరుజ్జీవనం (Catholic Renaissance) లో మనిషిని దేవుడికి దగ్గరకి తీసుకొచ్చిన గానం, వాదం, ఆలోచన. ఇది విశ్వాసం (faith) యొక్క ప్రాముఖ్యం చూపుతుంది. It gave hope to many oppressed people, one thing they needed: hope.

  2. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    09/06/2025 9:45 am

    బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.

    క్రికెట్ చూసే, కామెంటే వారిలో ఒక రకమైన సరదా ఉంది — ఒకప్పటి ఆటగాళ్ళు, ఇప్పటివారు, ఎప్పుడో బతికి ఆడిన విక్టర్ ట్రంపర్ వంటివాళ్ళనీ గుత్తగా కట్టి ఓ టీమ్ తయారు చేసి వార్తల్లో వదుల్తారు. ఆ టీమ్ ఎందుకూ పనికిరాదూ, ఆడలేరు. ఉదా: టెండుల్కార్ ఓపెనర్, సోబర్స్ కెప్టెన్, బ్రాడ్మాన్ మధ్యలో, వెస్ హాల్, డెన్నిస్ లిల్లీ, బుమ్రా బౌలర్స్ వగైరా. ఈ పై వాక్యం కూడా అలాగే ఉంది. ఏయే కాలాలలో ఆడేవారు ఆ కాలాలలో మాత్రమే ఆడతారని తెల్సీ ఇటువంటి వార్తలు చదివినప్పుడు నవ్వూ, కొండొకచో ఏవగింపూ కలుగుతుంది.

    With all due respect to Bairagi guru and pOtana in their own times, the comparison seems meaningless.

    ఇంత మంచి వ్యాసం చదివాక చివర్లో ఈ పై వాక్యం పంటి కింద ఇంగువ ముక్కలా తగుల్తోంది.

  3. బైరాగితో ప్రయాణం గురించి Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    09/06/2025 9:40 am

    Finally the user manual I needed for so long to start appreciating Bairagi, the poet. Thanks much.

    But… I am stuck with the following. May be I am drifting from Bairagi here.

    ….ఈ సందిగ్దతనే అనేకమంది సామాజిక శాస్త్రవేత్తలు ప్రయోగరీత్యా పరిశీలించారు. వారు చెప్పిందేమిటంటే, లిబరల్స్, బాగా చదువుకున్నవారు, నాస్తికులు, హేతువాదులు, ఆలోచనాపరులు వీరంతా తొందరగా నిర్ణయాలు తీసుకోరు. తీసుకున్నా ద్వైధీభావంతో సతమతమవుతారు. సమాజం మీద ప్రభావం ఎక్కువగా చూపలేరు అని…

    ఈ థియరీకి మూలం ఏదో చెప్తే చూడాలని ఉంది. లాజిక్ అర్థమవుతోంది స్పష్టంగా. కానీ నమ్మాలని లేదు. నామాట పక్కన పెట్టినా, ప్రపంచమంతా దీనికి భిన్నంగా ఆలోచిస్తారు కదా? (కాదా?).

    God fearing అనో, పాపభీతి అనో, కట్టుబాటు అనో ప్రతిబంధకాలు ఏదో ఒక నమ్మకం ఉన్నవాళ్ళకే కదా ఉండేది? మా చుట్టం ఓ పెద్దాయన లూజ్ గా భారతదేశంలొ బౌద్ధం క్షీణించడానికి కారణాన్ని ఒక వాక్యంలో కుదించి, ‘మనస్సాక్షిని నమ్ముకుని పోండిరా, ఎవణ్ణీ నమ్మద్దూ అని బుద్ధుడు చెప్తే, ఏ పాపభీతీ లేక బౌద్దారామాలన్నీ పాపకూపా లయిపోయాయి’ అన్నాడు. దీంట్లో నిజానిజాలు ఎలావున్నా, పాపభీతి అనేది లేని మనిషికి మరింత స్వేచ్ఛ… అది చెడితే విచ్చలవిడితనందాకా పోగలదని కదా అంతా అనుకునేది?

    (పాపభీతి = god fearing అని వాడు తున్నాను. Literal గా ‘పాపభీతి’ ని కొంచెం సెక్యులర్ థాట్ అనికూడా argue చేయచ్చు అని నాకు తెలుసు).

    ఇప్పటి దాకా నా అనుభవం లేదా అభిప్రాయం ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవడంలోనూ, సమాజం మీద ప్రభావం చూపడంలోనూ ఆస్తికులకూ, నాస్తికులకూ పెద్ద తేడా ఉండక పోవచ్చు. కానీ ఆ పని అయిపోయాక , ఆస్తికులకు ఒక ఓదార్పూ, సేదతీరడానికి ఒక తీరం ఉంటాయి. చేసిన పని పట్ల వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటూ నాస్తికులు సతమతమవుతుంటే, ఆ జడ్జ్ చేసే పనిని outsource చేసే అవకాశం నాస్తికులకు ఉంటుంది. ఓ క్రూరమైన యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఆస్తికుడయిన సైనికుడు బహుశా నాస్తికుడయిన సైనికుడి కన్నా అదృష్టవంతుడు.

    -అక్కిరాజు

  4. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి మథు చిత్తర్వు అభిప్రాయం:

    09/06/2025 8:28 am

    ఏదీ తిరిగి రాదు.కానీ ఏదీ చెరిగి పోదు.

    నిజంగానే నేను బైరాగిని పూర్తిగా చదవలేదు. ఈ అద్భుతమైన వ్యాసం చదువుతుంటే ఒళ్ళు జలదరించింది. నాకు కావాలి బైరాగి అనిపించింది. మా తరం అంతా ఈయన కవిత్వం ఎలా మిస్ అయ్యాం. ఇంత గొప్ప పరిచయం ఇంత హృదయంగమమైన విశ్లేషణ ఇన్ని రోజుల తర్వాత అయినా చదవకపోతే జీవితంలో చాలా మిస్ అయి వుండే వాడిని.
    ఈ మాటకు, వీరభద్రుడు గారికి థన్యవాదాలు.

  5. బైరాగితో ప్రయాణం గురించి Gopal Naganaboyina అభిప్రాయం:

    09/06/2025 1:22 am

    The narration was so good that it felt like I was chatting with a friend, a sophisticated one.

    You touched upon many sound concepts that I thought should be broken down to a dozen mini essays. But then it felt like- all of it should be read in one sitting.

    There are some good points that deserve more detailed discussion. To point a few: “ఆదర్శాలు కాలంతో మనలేవు”. Knowledge vs belief, “సత్యం అనేది తాత్కాలికమే”,” సామాజిక న్యాయాల్లో జ్ఞాన మార్గం”, “ఆలోచించే మనుషులకి ఏం చేసినా తప్పేనని అనిపిస్తుంది”.

    Great blog! Thank you.

  6. అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి గురించి తుమ్మూరి రాంమోదృహన రావు అభిప్రాయం:

    09/05/2025 11:59 pm

    ముందుగా బైరాగి శతజయంతిని పురస్కరించుకొని ప్రత్యేక సంచిక వెలువరించిన ఈ మాట సంపాదకవర్గానికి జేజేలు. ఇక మీరు రాసిన వ్యాసం చదువుతుంటే ఆ మూడు పుస్తకాల సారాంశాన్ని కాచి వడపోసి అందించినట్లుంది. మొదటివాణ్ణి ఎవడు చూడొచ్చాడు అనే ఋగ్వేద అంశాన్ని బైరాగి సంశయాన్ని కవిత్వానికి అనుసంధానించటంలోనే మీ విస్తృత పఠనశీలత తెలియవస్తుంది. చీకటి నీడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి కావ్యాలలోని కవితాపంక్తులను ఉదహరిస్తూ బైరాగి కవిత్వాన్ని బేరీజు వేసిన తీరు బాగుంది. ఇటీవల వీరభద్రుడి గారి బైరాగి గురించిన ప్రసంగాలు విని ఉండకపోతే మో ఉదహరించిన హేమ్లెట్, అర్జున, రాస్కల్నికోవ్‍ల సమాహారం అన్న మాట అర్థం అవటం అంత సులభం కాదు. యుద్ధసమయంలో శాంతికవి, కల్లోల సమయాల్లో అశాంతి కవి అని చెప్పిన వాక్యం మనసుకు పట్టుకుంటుంది. మంచి సమీక్ష రాసిన మీకు అభినందనలు.

  7. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి Ramesh అభిప్రాయం:

    09/05/2025 8:50 pm

    ఈ సంచిక గురించి 31వ తేది నుండి ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఇంకా upload కాలేదా అని నిరాశ కలిగింది. తరువాత ప్రత్యేక సంచిక వేస్తున్నారు అని చదివి సంతోషం కలిగింది. ఇంకా చదవలేదు, కానీ గొప్పవారు ఈ సంచికలో కనిపిస్తున్నారు , అందరికీ ధన్యవాదాలు.

  8. సమాజాన్ని వ్రేలెత్తి చూపిన కవి గురించి T A B PRASAD అభిప్రాయం:

    09/05/2025 2:41 pm

    మిత్రుడు, రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారి సుపుత్రుడు, మా కొలీగ్ రామచంద్ర గారి ద్వారా పరిచయమైన ‘ఈమాట’ వెబ్ పత్రికను మొదటిసారిగా చూస్తున్నాను. ఇంతకుముందు ఇలాంటి పత్రిక తెలుగులో నడపబడుతున్న విషయం కూడా నాకు తెలియదు.

    శ్రీ రెంటాల గారి జన్మదినం రోజున ఆయన వ్రాసిన ఈ వ్యాసం చదవగలగటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో రెంటాలగారు బైరాగిగారి అంతరంగ చిత్రణతో పాటు తన గురించికూడా పరిచయాన్నిచ్చే ప్రయత్నం చేసారు ‘నేను కొంత ఆశావాదిని, భూగోళాన్నే పెకిలించి వేయగలనన్నంత పొగరు, ధీమా నాకు. అంతులేని ఆవేశం నాది ఆరోజుల్లో’ అనే మాటలతో. స్వాతిశయం, అంతులేని ఆత్మవిశ్వాసం, పొగరూ వగరూ ప్రస్ఫుటమయ్యే భాషను ఉపయోగించే సాధికారత ఉన్న రచయితలు తమ శక్తిని గ్రహించినట్లుగానే ఎదుటి కవి, రచయితను, అతని శక్తియుక్తులనూ సులభంగా గుర్తించగలుగుతారు.

    ‘సమాజాన్ని వేలెత్తిచూపిన కవి’గా శ్రీ బైరాగిగారి మనోచిత్రణ, భావాల సంఘర్షణ, నిరంతర అన్వేషిగా గాయపడిన తన ఆత్మ వేదనను విలక్షణమైన కవితలుగా జాలువార్చిన మౌనమునిలా, తన గొంతుకలో బ్రతుకులోని అపశ్రుతులన్నీ ఒక్క శ్రుతిగా పలికించిన ఒక ఉదాత్త దార్శినికునిగా పరిచయం చేసారు. నాలాంటి బైరాగిగారి పరిచయం అంతగాలేని వారికికూడా బైరాగిగారి గూర్చిన మంచి చిత్రణ కలిగించారు.

  9. బైరాగి గీతాలకు గానరూపం: హేజననీ! గురించి కొప్పరపు లక్ష్మీ నరసింహా రావు అభిప్రాయం:

    09/05/2025 12:13 pm

    అద్భుతమైన గీతానికి అత్యద్భుత గానం!

  10. బైరాగితో ప్రయాణం గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/05/2025 12:12 pm

    చాలా వివరంగా చక్కగా రాశారు. అవును. బైరాగి కాలదోషం పట్టని కవి.