పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. బైరాగి కవితాత్మానుభవం గురించి సత్యవతి అభిప్రాయం:

    09/14/2025 2:04 am

    చాలా బాగా రాశారు.మళ్ళీ మళ్లీ చదవాలనిపించేలాగా🌺

  2. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/13/2025 6:48 am

    ఈ పద్యాలు మళ్ళా మళ్ళా విన్నాను. ఈ పద్యాలు చదువుతున్నప్పుడు గాయిక కంఠంలో ఒక అలౌకిక మాధురి వినబడుతున్నది. సిరాజ్ నగరపు గులాబీ తోటల పరిమళాల గాలుల్ని ఆ గానం మోసుకు వస్తున్నట్లుంది.

    మీ మాటలు చాలా సంతోషాన్నిచ్చాయి. పద్యాలు, మిగిలిన గీతాలు మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గానంలోని మాధుర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మీరు చేసిన స్పందనకు అనేక ధన్యవాదాలు. మేము ఈ ప్రత్యేక సంచిక తయారు చేయడానికి వ్యాసాల విషయంలో ఎంత కృషి చేశామో, ప్రశాంతి చోప్రా గారు ఈ పది గీతాలకు స్వరకల్పన కూర్చి, అద్భుతమైన గాత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాటిని వీడియోలుగా తయారుచేసి అందించడంలో అంతకంటే ఎక్కువగా కృషి చేశారు. అటువంటి గాయని ఈమాటకు లభించడం మా అదృష్టం.

    ఈ గీతాల ఎంపిక విషయంలో మాకు కొన్ని శీర్షికలను సూచించిన మీకు కూడా కృతజ్ఞతలు.

  3. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2025 2:33 pm

    భలే. ఆంగ్ల మూలానికి చాలా దగ్గరిగా అద్భుతంగా ఛందస్సులో పద్యాలుగా ప్రకటించగలిగాడు, బైరాగి. ఆయన ఛందస్సులో రాసిన ఇతర పద్యాలేమైనా ఉన్నాయేమో చూడాలి.

    దీనికి హాఫిజ్ రాసిన మూల పారశీక గీతం కూడా నాకు దొరికింది. అది ఆంగ్లంలో కంటే నడకలో, అర్థాల్లో కొంత భిన్నంగా ఉంది. ప్రతి పంక్తి చివర గజల్ పద్ధతిలో కాఫియాగా (అంత్యప్రాసగా) బర్‌ఖీజమ్ “లేచి వత్తును” అని వినిపిస్తుంది.

    మొజ్‌దె-యె వస్ల్-ఎ తొ కూ కజ్ సర్-ఎ జాన్ బర్‌ఖీజమ్
    టాయెర్-ఎ ఖొద్సమ్ ఒ అజ్ దామ్-ఎ జహాన్ బర్‌ఖీజమ్

    బె వలా-యె తొ కె గర్ బందె-యె ఖ్వీషమ్ ఖ్వానీ
    అజ్ సర్-ఎ ఖ్వాజెగీ-యె కౌన్ ఒ మకాన్ బర్‌ఖీజమ్

    యా రబ్ అజ్ అబ్ర్-ఎ హెదాయత్ బెరెస్సాన్ బారానీ
    పీష్తర్ జాన్ కె చొ గర్దీ జె మియాన్ బర్‌ఖీజమ్

    బర్ సర్-ఎ తొర్బత్-ఎ మన్ బా మెయ్ ఒ మొత్రెబ్ బెన్‌షిన్
    తా బె బూయత్ జె లహద్ రఖ్స్-కొనాన్ బర్‌ఖీజమ్

    ఖీజ్ ఒ బాలా బెనమా ఎయ్ బొత్-ఎ షిరీన్ హరకాత్
    కజ్ సర్-ఎ జాన్ ఒ జహాన్ దస్త్-ఫెషాన్ బర్‌ఖీజమ్

    గర్చే పీరమ్ తొ షబీ తంగ్ దర్ ఆఘుషమ్ కష్
    తా సహర్‌గహ్ జె కెనార్-ఎ తొ జవాన్ బర్‌ఖీజమ్

    రూజ్-ఎ మర్గమ్ నఫసీ మొహ్లత్-ఎ దీదార్ బెదెహ్
    తా చొ హాఫెజ్ జె సర్-ఎ జాన్ ఒ జహాన్ బర్‌ఖీజమ్

    ఆయన సమాధిపై కూడా ఈ గీతంలోని పంక్తులలో మొదటి రెండు పాదాలు రాసి ఉంటాయట.

  4. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/12/2025 4:32 am

    ఈ పద్యాలు మళ్ళా మళ్ళా విన్నాను. ఈ పద్యాలు చదువుతున్నప్పుడు గాయిక కంఠంలో ఒక అలౌకిక మాధురి వినబడుతున్నది. సిరాజ్ నగరపు గులాబీ తోటల పరిమళాల గాలుల్ని ఆ గానం మోసుకు వస్తున్నట్లుంది.

  5. బైరాగి సూతాశ్రమం గురించి Sivaramakrisna sakti అభిప్రాయం:

    09/11/2025 11:19 pm

    ‘వెన్నెలకోసం ఏడ్చే వాడిని చుక్కలు ఓదార్చినట్లు, కర్తవ్యం బోధపడని వాడిని కవి ఓదారుస్తాడు ‘

  6. సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక గురించి Cop అభిప్రాయం:

    09/11/2025 1:20 pm

    ఈమాటలో ఆదికవి బైరాగి!
    కవుల జాబితా అక్షరాల క్రమములో,
    బైరాగి ముందొచ్చె—ఒక చిన్న అచ్చు లోపముతో

    బైరాగి స్థానము విశిష్టమని,
    టైపిస్టు చేతిలో తలవంచిన అక్షరాలు!
    వాస్తవమేమిటో వదిలేద్దాం పక్కకు,
    కవిత్వపు కిరీటము వచ్చెను తలపైకి।

    ఔరా! అక్షరాలే తీర్పు చెప్పినవి,
    ఆదికవిగా నిలిపినవి, నవ్వించినవి।

    కాళిదాసు దూరం నుంచీ చూచెను,
    కనిష్ఠికపై నామమును మరచెను!
    భ్రుకుటి పైకెత్తి, మౌనంగా,
    “అక్షరాలా ఆధారం?” అన్నట్టు నవ్వెను!

    [భలే! అచ్చుతప్పు కాదు, కానీ ఆ స్పెల్లింగ్‌తో ఈమాట రచయితల జాబితాలో ముందుకు వచ్చాడని గమనించలేదు. – సం. ]

  7. నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    09/11/2025 10:23 am

    వెన్నెలవంటి వ్యాసం! అయితే ఈ వెన్నెల నిద్రపుచ్చేది కాదు. నిద్ర వదిలించేది. మొత్తం ఆలోచనలన్నిటినీ షేక్ చేసి ఊపేసింది.

  8. అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/10/2025 11:27 pm

    మూడు చోట్లా “When” అన్న పదానికి అర్థచ్ఛాయలలో భేదం ఉంది. మొదటి దానిలో కారణార్థం అంతర్లీనంగా ఉండవచ్చు కానీ ప్రధానం కాలమే. రెండు మూడు సందర్భాలలో నేరుగా అవి causal. దీనికి ఒక ముఖ్యకారణం మొదటి వాక్యం అకర్తృకం, తర్వాత రెండు వాక్యాలూ కర్తృకాలు కావడం. అనువాదంలో అసలు ఇబ్బంది దీనివల్ల కలుగుతోంది. వాక్యం కర్తృకమైనా అకర్తృకమైనా “When I pronounce” అన్న పదసమూహమే ఉపయోగించవచ్చు. ఎందుకంటే pronounce అన్న అసమాపక క్రియాపదంలో ఆ అర్థం ఉండదు కాబట్టి. తెలుగు క్రియలలో అలా కుదరదు. క్రియకి ఉండే అనేకార్థాలను క్రియాపదస్వరూపమే సూచిస్తుంది.

    ఈ తేడావల్ల మూలంలో (ఇంగ్లీషు, పోలిష్) ఉన్న సౌష్ఠవం తెలుగులో రాలేదన్నది కూడా నిజమే. అది సాధ్యమా అంటే… తెలుగు వాక్యాలలో మొదటనున్న “నేను”ను తీసేసి “ఉచ్చరిస్తూనే” అని అంటే సరిపోతుందనుకుంటాను. ఇలా…

    భవిష్యత్తు పదాన్ని ఉచ్చరిస్తూనే,
    అది మొదటి అక్షరానికే భూతకాలానికి చెందిపోతుంది

    నిశ్శబ్దం పదాన్ని ఉచ్చరిస్తూనే,
    దాన్ని నేను ధ్వంసం చేస్తాను

    శూన్యం పదాన్ని ఉచ్చరిస్తూనే,
    ఉనికిలో పట్టుకోలేనిదేదొ నేను తయారుచేస్తాను

    అయితే – రెండూ మూడూ పాదాలలో కర్తృత్వం అంత అవసరమా అని నా సందేహం.

    పోలిష్, ఇంగ్లీషుభాషల స్పర్శలేని తెలుగువాళ్ళకోసం ఇది నా అనుసృజన:

    పదార్థం పదమైతే…
    ———————
    “భవిష్యత్తు” అని అంటూనే
    “భ” భూతంలో కలిసిపోతుంది

    “నిశ్శబ్దం” అని అంటూనే
    అది భళ్ళున బ్రద్దలవుతుంది

    “అభావం” అని అంటూనే
    ఒక లేకపోవడానికి ఉనికి ఏర్పడుతుంది

  9. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/10/2025 2:55 pm

    బైరాగి అనువదించిన పై పద్యాలకు మూలం ఏమై ఉండవచ్చునా అని కొంత ఆలోచించాను. హాఫిజ్ దివాన్ లోని సుప్రసిద్ధమైన గీతానికి ఇంగ్లిషులో వచ్చిన అనువాదం The Tidings of the Union అయి ఉండవచ్చునని అనుకుంటున్నాను. ఆ ఇంగ్లీషు అనువాదం ఇది:

    Where are the tidings of union? that I may arise-
    Forth from the dust I will rise up to welcome thee!
    My soul, like a homing bird, yearning for Paradise,
    Shall arise and soar, from the snares of the world set free.

    When the voice of thy love shall call me to be thy slave,
    I shall rise to a greater far than the mastery
    Of life and the living, time and the mortal span:
    Pour down, oh Lord! from the clouds of thy guiding grace.

    The rain of a mercy that quickeneth on my grave,
    Before, like dust that the wind bears from place to place,
    I arise and flee beyond the knowledge of man.

    When to my grave thou turnest thy blessed feet,
    Wine and the lute thou shalt bring in thine hand to me,
    Thy voice shall ring through the folds of my winding-sheet,
    And I will arise and dance to thy minstrelsy.

  10. బైరాగి సూతాశ్రమం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/09/2025 8:54 pm

    రాణి గారి వ్యాసం నుండి:

    హేతువులోని నిశితత్వాన్ని మాత్రమే కాకుండా దాని వక్రత్వాన్ని ఆర్ద్రత లేనితనాన్ని కూడా ఆయన పసిగట్టాడు. … బైరాగి తన మిత్రుల సన్నిధిలో త్రిపురనేని రామస్వామి చౌదరిని తీవ్రంగా విమర్శించినట్లు రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు రాశారు. ఈ విమర్శ బైరాగికి … హేతువాదం పట్ల కూడా తీవ్ర సందేహాలు ఉండడాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే, “సూతాశ్రమం” అనే కవితలో బైరాగి హేతువాదాన్ని “వంకర కత్తి” అన్నాడు.

    “సూతాశ్రమం” కవితలోని “వంకర” తనానికి రాణి గారు ఇచ్చిన అర్థంలో కొంతయినా పొరబాటు ఉందని నా విశ్వాసం. కనీసం దానికి మరికాస్త వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

    రత్నా టాకీస్ దగ్గర బైరాగి విమర్శించింది కుల నిర్మూలనం ప్రబోధిస్తూ కూడా దానిని ప్రోపు చేసే మేధావులని, హేతువాదాన్ని కాదు. “సూతాశ్రమం” కవిత నిండా తార్కికబుద్ధి మార్గాన్ని కొనియాడాడు:

    సూతాశ్రమ సశ్రమాధ్వం అందరికొరకు కాదు.
    శుభ్ర విద్యుత్ కాంతిలో శస్త్రకారుని శస్త్రం నవ్విన అందం
    స్వస్థ శ్వాసలాగ, ఎర్రని మూసలోన పారే లోహపు అందం
    కనుచూపుల కనుమ దాటి, మింటిని ఒంటరిగా
    పయనించే ఇనుపడేగ తెల్లని రెక్కల అందం.

    ఆర్ద్రత లేకపోవడాన్ని కూడా స్పృశించాడు:

    సహారా ఎడారిలోన పవలు కురిసే సూర్యుని తప్త హేమజ్వాల
    రేయి కురిసే తారకల ప్రఖర ప్రోజ్వల హైమజ్వాల.

    ఇసుకను చూచి బెదరే రసికులకు

    వారికేమి తెలుసు, ఇసుకలోనే దాగి ఉంది.
    మానవాత్మల మహాతీర్థం.

    మరి ఇంతటి అందాన్ని వంకరకత్తి అని బైరాగి ఎందుకన్నాడు? దానికి సమాధానం కూడా కవితలోనే ఉంది:
    డీను స్విఫ్ట్, ఆనటోల్ ఫ్రాన్సుల వంకర వ్యంగపుటందం
    అందరికీ కాదు.

    డీను స్విఫ్ట్ అంటే జానథన్ స్విఫ్ట్ (1667-1745). శుద్ధ హేతువాదాన్ని అనేక వ్యంగ్య (satire) రచనలలో విమర్శించాడు. “A Modest Proposal” లో పేదవాళ్ళు ఆర్థిక బాధలనుండి బయటపడటానికి తమ బిడ్డలని ఉన్నత వర్గాల ప్రజలకు అమ్ముకోవచ్చంటాడు. (రాయల్ సొసైటీ ఆధ్వర్యాన జరుగుతున్న సైన్సు ప్రయోగాల మూలంగా ప్రజలకు ఒరిగిందేమీ లేదని కూడా ఎద్దేవా చేశాడు.)

    మరో రెండు వందల ఏళ్ళ తర్వాత ఆనటోల్ ఫ్రాన్స్ (1844-1924) నిందాస్తుతి (irony) తో శుద్ధ తర్కాన్ని విమర్శించాడు. ఆయన ప్రఖ్యాత ఉల్లేఖనం:

    “ఉత్కృష్టమైన ధర్మశాసనం ప్రకారం సంపన్నులకూ దరిద్రులకూ సమానంగా ఒకే న్యాయం: వంతెనల కింద పడుకోకూడదు, వీధుల్లో యాచించకూడదు, అన్నం దొంగలించకూడదు.”

    స్విఫ్ట్, ఫ్రాన్స్ శుద్ధ తర్కానికి మానవత్వాన్ని జోడించాలని తమ వ్యంగ్య రచనల ద్వారా చెప్పారు. ఆ వ్యంగాన్ని బైరాగి వంకరకత్తితో పోల్చాడు. అదే సూతాశ్రమ మార్గం అంటుందీ కవిత.

    కొడవళ్ళ హనుమంతరావు