“అయితే ఆ రెండు సమీక్షలలో పేర్కొన్న కొన్ని అతిశయోక్తులను సవరించక/సరిచేయక పోతే భాషాశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచనలను మౌనంగా సమర్థించినట్లవుతుంది అనిపించింది”
ఉషాదేవిగారికి: నమస్కారాలమ్మా.
మీరు ఎంతో సహనంతో రాసిన ఈ నిశితమైన పరిశీలనా వ్యాసం చదివి ఆనందించాను. వెల్చేరు వారికి ‘బాస్వెల్’లుగా కొందరు చప్పట్ల చాటింపులు చేయడం నేనెరుగుదును. వారి పాండిత్యాన్ని ఎవరూ చిన్న బుచ్చలేరుగానీ వారి ధోరణి అప్పడప్పుడు నాకు వారు పాత తెలుగు పుస్తకాలకు కొత్త ఇంగ్లిష్ అట్టలు వేసిన వారిగా అనిపింపజేస్తుంది. మీ వ్యాసం మొదటి వాక్యంలో స్పష్టత కరువైనదిగా తోస్తూంది.
ఈ శ్యామ్ గారి మాటలు సభలో విని ఉండాల్సింది. ఆ అదృష్టం లేకపోవడం వల్ల ఆ మాటల్ని చదువుతూ వినాల్సి రావడం, అందులోనూ , ఆ పని ఒక్క తూరులో జరగకపోవడం. ఇలాంటి కారణాలతో ఆ ప్రసంగాన్ని ఒక సీరియల్ మాదిరి విన్నాను. చదివాను అనడం కన్నా విన్నాను అనడమే సబబుగా అనిపిస్తోంది. శ్రీ శ్యామ్ మాటలు సాంతం వారి జ్ఞాపక శక్తికీ, వారి విషయం సేకరణకీ ఒక ఉదాహరణ. అంతమంది రచయితల్నీ రచనల్నీ ఒక్క ఊపులో సోదాహరణలతో వివరిస్తూ మాటాడ్డం ఇప్పుడున్న రచయితల్లో, వక్తల్లో బహుశా ఆయనొక్కరికే సాధ్యం.
ఇంకా, వారి మాటలన్నిటిని అక్షరాల్లో అందించిన వారికి ధన్యవాదాలు.
ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారూ… రబీంద్రనాథ్ టాగోర్ గారి ‘The living and the dead (Jibita o Mrita) short storyను ‘చావు బ్రతుకులు’గా అనుసృజించిన మీకు నెనర్లు. కధాంతంలో నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని నిరూపించిన కాదంబిని పాత్ర పాఠకుల హృదయాలలో సజీవమూర్తిగా నిలిచిఉంటుంది.
19వ శతాబ్దం చివరిరోజుల్లో బెంగాల్ సమాజంలో వితంతువుల దీన స్థితిని… చిన్న వయసూలో వితంతువులు అయ్యి, పిల్లలు లేక, ఆదరించే కుటుంబం అండ లేక, సమాజం నిరాదరణకు గురయ్యిన వితంతువు కాదంబిని అద్భుతంగా చిత్రించారు.
మీరు ఇచ్చిన లింకు నుండి Penguin Books వారు ప్రచురించిన Rabindranath Tagore, Selected Short Stories e-పుస్తకం కూడా పొందగలిగాము. అందుకూ కృతజ్ఞతలు.
సత్య దర్శనం గురించి సి.ఆర్.అన్నపూర్ణ గారి అభిప్రాయం:
05/09/2024 11:57 am
“సత్య దర్శనం” చాలా చాలా బావుంది! ఏకబిగిన చదివించింది. అసలు ధర్మజుని కోణంలో రాసిన ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుని కళ్ళకు కట్టినట్లు ఆ లోకంలో ఉన్నట్లే అనిపించింది. వెంటనే మూల భారతం ఆసాంతం చదవాలన్న కోరిక పెరిగింది. మాకు కూడా కృష్ణ భగవానుని దర్శనం కలిగించావు. ఇటువంటి ఎన్నో అంశాలను విశదీకరిస్తూ రాసి మా లాంటి పాఠకులని మెప్పిస్తావవి కోరుకుంటున్నాను. నువ్వు రాసిన పాతవి అన్నీ వెంటనే చదవాలన్న ఆసక్తి రెట్టింపు అయింది తప్పకుండా చదువుతాం. ప్రవాసంలో ఉంటూ నువ్వు మన పౌరాణిక గాధల్లోని అంశాలను తీసుకుని నువ్వు విశ్లేషించే పద్ధతి నిజంగా అమోఘం. మన పంచారామ క్షేత్రం లోని లక్షపత్రి పూజ స్ఫురింప చేసినందుకు ధన్యవాదాలు.
మమ్మల్ని తొంభైల్లోకి తీసుకెళ్ళి, చదువు పేరుతో మిద్దెనెక్కి చేసే వెధవ పనులన్నీ గుర్తు చేయించి, రాత్రుళ్ళు మలబార్ హోటల్ కెళ్ళి టీ బిస్కట్ పరోఠాలను మరోసారి తినిపించి, జ్ఞాపకాల చిత్రాలన్నీ అటకమీద నుంచి తీసి పరిచారు. ధన్యవాదాలు.
ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే పరిస్థితి ఏఁవిటి అన్న భయమే ఆయన చేత ఇన్నేళ్ళుగా అర్చకత్వాన్ని క్రమపద్ధతిలో చేయిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ భయం మరింత బలపడి తనని వెంటాడసాగింది.
జయమోహన్ మార్కు ఇక్కడుంది. మంచి కథ.
మాటలు ఉండాలి గురించి ఇంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తఃతః గారి అభిప్రాయం:
05/17/2024 4:19 am
ఉషాదేవిగారికి: నమస్కారాలమ్మా.
మీరు ఎంతో సహనంతో రాసిన ఈ నిశితమైన పరిశీలనా వ్యాసం చదివి ఆనందించాను. వెల్చేరు వారికి ‘బాస్వెల్’లుగా కొందరు చప్పట్ల చాటింపులు చేయడం నేనెరుగుదును. వారి పాండిత్యాన్ని ఎవరూ చిన్న బుచ్చలేరుగానీ వారి ధోరణి అప్పడప్పుడు నాకు వారు పాత తెలుగు పుస్తకాలకు కొత్త ఇంగ్లిష్ అట్టలు వేసిన వారిగా అనిపింపజేస్తుంది. మీ వ్యాసం మొదటి వాక్యంలో స్పష్టత కరువైనదిగా తోస్తూంది.
తః తః
కంబైన్డ్ స్టడీ గురించి జి కె యస్ రాజా గారి అభిప్రాయం:
05/15/2024 11:47 pm
అన్వర్! ఈ గతాలు ఆయా తరాల వాళ్ళకు అటూ ఇటూగా ఒకలానే ఉన్నట్టనిపిస్తాయి. ఎవరి సంగతులు వాళ్ళకే ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం మాత్రం ‘బాల్యం’. ఈ బాల్యాన్ని బతిమాలో బామాలో సాగదీసి పొడిగించకుంటే ఎంత బావుణ్ణు. ఏంటో తొందర, ఎవడిమట్టుక్కి వాడికి? రేజర్ వాడేయాలనీ, మీసాలు తిప్పాలనీ, జులపాలు పెంచాలనీ, పొడుగు లాగుల్లో వీదులెక్కయ్యాలనీ… ఎదగడానికెందుకురా తొందరా? అంటే ఇంటామా?
అయినా మీరు పాదాలు ముందుకే పెట్టి, పదాలతో వెనక్కి తోలేరు చూడండి. అబ్బ! తెలుపూ ఎరుపూకి తిరిగిన చీమచింత కాయలోని వగరూ, తీపీ. చాలనివ్వకండి. సాగించండి. అరవైలు దాటినా బాల్యంలో బతకొచ్చని చాటింపు వేస్తూనే ఉండండి.
రాజా
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి Srinath Vadapalli గారి అభిప్రాయం:
05/11/2024 11:40 pm
ఈ శ్యామ్ గారి మాటలు సభలో విని ఉండాల్సింది. ఆ అదృష్టం లేకపోవడం వల్ల ఆ మాటల్ని చదువుతూ వినాల్సి రావడం, అందులోనూ , ఆ పని ఒక్క తూరులో జరగకపోవడం. ఇలాంటి కారణాలతో ఆ ప్రసంగాన్ని ఒక సీరియల్ మాదిరి విన్నాను. చదివాను అనడం కన్నా విన్నాను అనడమే సబబుగా అనిపిస్తోంది. శ్రీ శ్యామ్ మాటలు సాంతం వారి జ్ఞాపక శక్తికీ, వారి విషయం సేకరణకీ ఒక ఉదాహరణ. అంతమంది రచయితల్నీ రచనల్నీ ఒక్క ఊపులో సోదాహరణలతో వివరిస్తూ మాటాడ్డం ఇప్పుడున్న రచయితల్లో, వక్తల్లో బహుశా ఆయనొక్కరికే సాధ్యం.
ఇంకా, వారి మాటలన్నిటిని అక్షరాల్లో అందించిన వారికి ధన్యవాదాలు.
చావు బ్రతుకులు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
05/11/2024 7:29 pm
ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారూ… రబీంద్రనాథ్ టాగోర్ గారి ‘The living and the dead (Jibita o Mrita) short storyను ‘చావు బ్రతుకులు’గా అనుసృజించిన మీకు నెనర్లు. కధాంతంలో నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని నిరూపించిన కాదంబిని పాత్ర పాఠకుల హృదయాలలో సజీవమూర్తిగా నిలిచిఉంటుంది.
19వ శతాబ్దం చివరిరోజుల్లో బెంగాల్ సమాజంలో వితంతువుల దీన స్థితిని… చిన్న వయసూలో వితంతువులు అయ్యి, పిల్లలు లేక, ఆదరించే కుటుంబం అండ లేక, సమాజం నిరాదరణకు గురయ్యిన వితంతువు కాదంబిని అద్భుతంగా చిత్రించారు.
మీరు ఇచ్చిన లింకు నుండి Penguin Books వారు ప్రచురించిన Rabindranath Tagore, Selected Short Stories e-పుస్తకం కూడా పొందగలిగాము. అందుకూ కృతజ్ఞతలు.
సత్య దర్శనం గురించి సి.ఆర్.అన్నపూర్ణ గారి అభిప్రాయం:
05/09/2024 11:57 am
“సత్య దర్శనం” చాలా చాలా బావుంది! ఏకబిగిన చదివించింది. అసలు ధర్మజుని కోణంలో రాసిన ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుని కళ్ళకు కట్టినట్లు ఆ లోకంలో ఉన్నట్లే అనిపించింది. వెంటనే మూల భారతం ఆసాంతం చదవాలన్న కోరిక పెరిగింది. మాకు కూడా కృష్ణ భగవానుని దర్శనం కలిగించావు. ఇటువంటి ఎన్నో అంశాలను విశదీకరిస్తూ రాసి మా లాంటి పాఠకులని మెప్పిస్తావవి కోరుకుంటున్నాను. నువ్వు రాసిన పాతవి అన్నీ వెంటనే చదవాలన్న ఆసక్తి రెట్టింపు అయింది తప్పకుండా చదువుతాం. ప్రవాసంలో ఉంటూ నువ్వు మన పౌరాణిక గాధల్లోని అంశాలను తీసుకుని నువ్వు విశ్లేషించే పద్ధతి నిజంగా అమోఘం. మన పంచారామ క్షేత్రం లోని లక్షపత్రి పూజ స్ఫురింప చేసినందుకు ధన్యవాదాలు.
కంబైన్డ్ స్టడీ గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:
05/09/2024 1:11 am
మమ్మల్ని తొంభైల్లోకి తీసుకెళ్ళి, చదువు పేరుతో మిద్దెనెక్కి చేసే వెధవ పనులన్నీ గుర్తు చేయించి, రాత్రుళ్ళు మలబార్ హోటల్ కెళ్ళి టీ బిస్కట్ పరోఠాలను మరోసారి తినిపించి, జ్ఞాపకాల చిత్రాలన్నీ అటకమీద నుంచి తీసి పరిచారు. ధన్యవాదాలు.
తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి gs rammohan గారి అభిప్రాయం:
05/08/2024 5:36 am
మంచి వ్యాసం. అవసరమైన వ్యాసం. థ్యాంక్యూ.
శివమయం గురించి gs rammohan గారి అభిప్రాయం:
05/08/2024 5:17 am
జయమోహన్ మార్కు ఇక్కడుంది. మంచి కథ.
మాటలు ఉండాలి గురించి ఇంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
05/05/2024 4:08 am
అందరికీ థాంక్స్.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక-3 గురించి Ramesh గారి అభిప్రాయం:
05/04/2024 9:41 pm
ప్రతి సంచికలోను అందమైన అనుభవాలను పంచుతున్నందుకు చాలా సంతోషం. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి.