పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. బైరాగితో ప్రయాణం గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    09/05/2025 10:56 am

    ఇటువంటి వ్యాసం లోగడ నేను చదివి ఎరుగను. Your write-up is intensely personal – nearly confessional – and yet impersonal. నన్నడిగితే, మీ gistతో ఏకీభవిస్తూనే, బైరాగిని కవిత్వం కోసమూ చదవమంటాను, మూడు సంపుటుల్నీని. బైరాగిది సందర్భోచితమైన భాష. ఎలియట్‌నీ రిల్కెనీ ముడిపెట్టగలడు, శ్రీశ్రీనీ తిలక్‌నీ అనుసంధించగలడు. ప్రతి పదబంధమూ ఆపాతమధురం కాదు, అందుకు కారణం, బైరాగి భాష వెనుకా, కవితను చెక్కడం వెనుకా ఎక్కువ పడలేదు. ఈ design అంటే ఏదో విముఖత, ఆయనకు. లోనున్న ముడిసరుకు తన్నుకొస్తున్నప్పుడు అన్ని అలంకారాలూ అణిగి నెమ్మదిస్తాయి, బైరాగి కవితలో.
    -వాసు-

  2. బైరాగి కవితాత్మానుభవం గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    09/05/2025 9:09 am

    Excellent write-up, Padmaja gArU.
    -Vasu-

  3. ఒంటరి డేగనై, తప్పిపోయిన లేగనై — బైరాగి గురించి రాఘవ అభిప్రాయం:

    09/05/2025 8:58 am

    చాలా బాగుంది..

  4. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:

    09/05/2025 8:46 am

    ఒక రచనను చదవడమెలాగో నేర్పించారు, ఒక రచనను పరామర్శించడమెలాగో నేర్పించారు, దివంగత రాధాకృష్ణమూర్తిగారు. ఇప్పుడీ ఇరువురూ ఆ పై లోకాల్లో బహుశా ఇవాళ ఈ చర్చే చేస్తున్నారేమో!
    -వాసు-

  5. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    09/05/2025 8:42 am

    సూరపరాజుగారు బైరాగి ఆత్మను పట్టుకున్నారు.

    “బైరాగి ఆధునిక ఆర్షకవి. “నేను ఆధునికులలో ప్రాచీనుణ్ణి, ప్రాచీనులలో ఆధునికుణ్ణి. ” (ఎలియట్) బైరాగి ఉపనిషత్తులు లోతుగా చదివాడు. కేవలం చదవడంకాదు అవి అతడి భావనలో భాగమయిపోయాయి.” గొడవంతా అక్కడే ఉంది, చాలా మంది కవులకు బైరాగికున్న కవిత్వ తత్వ నేపథ్యం లేదు, ఏవో ఎగుడు దిగుడు వాక్యాలు నాలుగు రాసి కవులమైపోయాము అనుకుంటారు. ఆ చెత్త కవిత్వాల మీద పరిశోధనలు — ఎంత దౌర్భాగ్యం!!

    హిందీ కవుల ప్రభావం బైరాగి శైలి మీద ఉన్నదా అన్న అనుమానం నాకు పెక్కు మార్లు కలిగింది కానీ, కానీ పరిశీలించి చూస్తే ఛాయవాద కవుల శైలి తిలక్ ను పోలినదే, బైరాగిది ఒక విస్ఫోటశైలి — మానవ అస్తిత్వపు లోతులను ముట్టే భాషా ప్రౌఢిమగల శైలీగతి అతని స్వంతం, భారతీయ చింతన ఆత్మగతం కానిదే అతని కవిత్వం అంతుపట్టదు.

    ఆ కాలం నాటి హిందీ కవుల్లో దేశభక్తి, పురాణ పాత్రలమీద మక్కువ, తదితర సామాజికాంశాలు కనిపిస్తాయి — వారి భాష అంత్యప్రాసలతో విరుగుతూ — భావనకు అందుతుంది. వారిది బైరాగి తరహా కాదు, భారతీయ ఆత్మ చింతనతో మేళవించిన బహుమితీయ ఆధునికతను (multidimensional modernity) ప్రతిబింబింపచేసే భాష వారికి బహుదూరం.

  6. స్మరణ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    09/05/2025 7:57 am

    archives లో ఉంది:
    https://archive.org/details/sddu_adhunika-telugu-kavita-in-sanskrit-translation-by-bairagi-hyderabad-andhra-pradesh-sahitya-acad/page/n6/mode/1up

    బైరాగి ముందు మాట తర్వాత – ఈ అనువాద సంకలనం శ్రీ శ్రీ కవితలతోనే మొదలవుతుంది. శ్రీ శ్రీ చెప్పిన ఉర్దూ అనువాదం నాకు దొరకలేదు, హిందీ అనువాదం: जगन्नाथ रथ के चक्र ఇందులో కనిపిస్తుంది. ఈ సంకలనం ప్రత్యేకత దేవనాగరి లిపిలో తెలుగు కవితలు, తర్వాత వాటికి హిందీ అనువాదాలు కనిపిస్తాయి.

    ఈ అనువాద గ్రంథాలు – రెండు భాగాలు తెలుగు యూనివర్సిటీ లో 1990 లో నాకు దొరికాయి.

    बदली की रात (आलूरी बैरागी चौधरी) బైరాగి హిందీ సంకలనం గూర్చి, హిందీలో ఆయన వ్యవహృత నామం గురించి నాకు అప్పుడే తెలిసి వచ్చింది.

    Francis Thompson గొప్ప ప్రతిభగల ఆంగ్ల కవి, అతని ప్రసిద్ధ కవితను శ్రీశ్రీ స్వర్గభైరవంగా సమర్థంగా తెనిగించాడు. అతను బైరాగిలాగే చిన్నవయసులో క్షయ వ్యాధితో మరణించాడు.

    మన కవిత్వాలను మనమే ఆంగ్లంలోకి, హిందీలోకి తర్జుమా చేసుకోవలసి రావడం ఒక దౌర్భాగ్యం. ఆ భాషీయులు తెలుగు నేర్చుకొని ఆయా భాషల్లోకి పరివర్తింప చేసుకోవడం ఒక మర్యాద.

  7. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి మార్కొండ సోమశేఖరరావు అభిప్రాయం:

    09/05/2025 5:19 am

    బైరాగి కవితా ప్రయాణం అంతా అస్థిత్వం నుండి అస్తిత్వానికి.

    అమూల్యమైన వ్యాసం వ్రాశారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు.

  8. స్మరణ గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/05/2025 4:18 am

    శ్రీశ్రీ రాసిన ఈ వ్యాసం గత 40 ఏళ్లుగా ఎన్నిసార్లు చదివినా నాకు అసంతృప్తిగానే అనిపిస్తుంది. ఇంగ్లీషులో tongue in cheek అంటారు. అలాగా పూర్తిగా నోరు తెరిచి చెప్పలేని మాటలతో కూడిన వ్యాసం. కానీ, ఇంతకీ బైరాగి చేసిన ఆ ఉర్దూ అనువాదం మనకి ఎక్కడ దొరుకుతుంది!

  9. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/05/2025 4:15 am

    ఎంత అపురూపమైన వ్యాసం ఇది! ఎట్లా సంపాదించారు ఈ వ్యాసం మీరు! ఇందుకు రాధాకృష్ణమూర్తి గారికి మనం ఎంత ఋణపడి ఉండాలి!

  10. బైరాగి గీతాలకు గానరూపం: సాంధ్యగీతిక గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    09/05/2025 4:09 am

    చాలా బావుంది.