Comment navigation


15541

« 1 ... 35 36 37 38 39 ... 1555 »

  1. అద్వైతం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    06/02/2024 9:25 am

    ఇంత నిడివంటూ ఉండాలి
    అని కాదు కానీ
    కవిత పదకొండు పదాలతో
    ఐదు లైన్లు
    భలే !
    “రచయిత గురించి” అనేది
    దాదాపు మూడు రెట్లు ఉంది
    భలే ! భలే !!
    “అస్సలు” అనే పదం తీసేసినా
    అర్ధమేమీ మారదోయ్
    “కొస” అనేది
    తాడు చివర్లు కాదని
    శిఖరాగ్రానికి వాడొచ్చని
    కొత్తగా తెల్సింది
    భలే ! భలే !!

  2. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    06/02/2024 9:17 am

    తః తః గారు
    మీరు:

    1. నేను మీరు వేసిన “ప్రశ్నకి సమాధానం మాత్రమే” చెప్పి, ఉదాహరణ ఇచ్చాను, అని గమనించలేదు.
    2. నన్ను అనవసరంగా ఈ వ్యాసం లో మీ సాహిత్య/లేదా మరో చర్చ/ఆలోచనలోకి లోకి దింపబోయేరు.
    3. నేను బరిలోకి విసిరిన మూడు సెంట్లూ మిమ్మల్ని తీసుకోమని నేను చెప్పలేదని విస్మరించారు.
    4. నేను మిమ్మల్నీ, మిగతా పాఠకులని నవ్వించడానికి చేసిన ప్రయత్నాన్ని పట్టించుకోకుండా మీ ఆవేశాన్ని బయటకి లాగారు.
    5. ఈ వ్యాసం, దీనిమీద ముందు మీర్రాసిన మిగతా వ్యాఖ్యానాలు నేను అప్పటికీ ఇప్పటికీ కూడా చదవలేదని, చదవబోననీ గమనించలేదు. (పైన 2 మరోసారి చూడుడు).

    నమస్కారాలతో
    శర్మ దంతుర్తి

  3. చిన్న చిన్నవి గురించి A.sesharatnam గారి అభిప్రాయం:

    06/02/2024 7:59 am

    బావుంది

  4. Private: అను-రాగం గురించి Sujata M గారి అభిప్రాయం:

    06/01/2024 11:31 am

    చాలా రోజులకి వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ చదివించిన కథ చదివాను. జీవితం చాలా విలువ అయింది. అందరూ ప్రత్యేకమైనవారే. ఆ జ్ఞానం సంగీతమే ఇవ్వగలదేమో.

  5. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః గారి అభిప్రాయం:

    05/31/2024 11:37 pm

    శర్మగారూ, మీరు:

    1. ‘పొరపాటునే అనుకుందాం‘ అన్నదాన్ని విస్మరించారు.
    2. ‘ఆభిప్రాయి’ వ్యక్తిగత జీవితం లోకి దూరబోయారు.
    3. అసలు విషయాన్ని అసలు పట్టించుకోలేదు.

    వెరసి నా ఆలోచనను వదిలేసి ఆవేశాన్ని మాత్రమే చూశారు.

    నమస్కారాలతో
    తః తః

  6. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    05/31/2024 10:42 am

    తన ఇంట్లో కప్పు పొరబాటునే అనుకుందాం పగలకొడితే వాణ్ణి వాడి పెళ్ళాం బూతులు తిట్టొచ్చా?

    తః తః గారు,

    మీరు సమాధానం కోసం తఃతఃలాడుతున్నట్టు కనిపిస్తున్నది కనుక నేను నా మూడూ సెంట్లు విసురుతున్నాను బరిలోకి (అసలు రెండు సెంట్లకి నేను ఇన్‌ఫ్లేషన్ వల్ల మరో సెంటు జేర్చాను, గమనించగలరు).

    మీరు — లేదా ఇతరులు (నాతో సహా) — కప్పులు ముక్కుమీద పెట్టి నిలబెట్టినా, బయట ఎలా ఏడ్చినా, నోబుల్ ప్రైజ్ సంపాదించి వచ్చినా, ఇంట్లో కప్పు పగలగొట్టక్కర్లేదు, పెళ్ళాం చేత బూతులు తిట్టించుకోవడానికి. మీ ఆవిడని ఏమీ అనడం లేదు కానీ (పాపము శమించుగాక) మీకు ఇది జీవితంలో అనుభవం అయిందని నేను అనుకుంటున్నా. 🙂

  7. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః గారి అభిప్రాయం:

    05/30/2024 2:08 pm

    “తెలుగు సాహిత్యాన్ని ప్రపంచసాహిత్య రంగమ్మీద సమున్నత స్థానాన ఉంచటంలో అద్వితీయ కృషి నారాయణరావుది. బహుశ ఆయన రాసిన వందకి పైగా వ్యాసాలు, డజను పైగా పుస్తకాల గురించి ఇండియాలో తెలిసిన వారు, తెలిసినా పట్టించుకున్న వారు బహు అరుదు – అసలంటూ ఉంటే. ఈ రచయిత్రి కూడ ఆయన కవితావిప్లవాలు తప్ప మరే రచననీ (“తెలుగుదారి” వరకు) చదివినట్టు చెప్పలేదు. అది ఆయన రాసి యాభై ఏళ్ల పైగా అయింది.“

    వెల్చేరువారి గురించి పైన చెప్పిన విషయానికీ వారి ‘తెలుగు దారి’ పై అభిప్రాయాన్ని చెప్పటానికీ సంబంధం ఏమిటో నాకు తెలియటం లేదు.

    ముక్కుమీద మూడొందల కప్పులను నిలబెట్టి సర్కస్ డేరా అంతా ఒక్క కప్పూ కదలకుండా తిరిగిన వాడు, తన ఇంట్లో కప్పు పొరబాటునే అనుకుందాం పగలకొడితే వాణ్ణి వాడి పెళ్ళాం బూతులు తిట్టొచ్చా – తిట్ట్గకూడదా? ఎవరైనా తెలుపగలరు.

    తః తః

  8. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తః తః గారి అభిప్రాయం:

    05/30/2024 11:06 am

    “తెలుగుదారి ఒకదారి మాత్రమే” అన్నవారు కనీసం మరొక దారినైనా చూపించినట్టు నాకనిపించలేదు” అన్న వాదన అర్థవంతమైనదేనా? అలా చూపిస్తేనేనా ‘ఒకదారి మాత్రమే’ అనాలా? ఒక కావ్యం లేదా ఒక పద్యం ‘బాగులేదన్న’ వాదనలో పస ఉన్నదా లేదా అన్నది ముఖ్యమా లేక “అలా అన్నవాళ్ళు ఒక కావ్యం/పద్యం రాసి చూపించాలన్న“ నియమాలేవన్నా ఉన్నాయా? ఎవరైనా తెలుపగలరు.

    తః తః

  9. తెలుగు దారి సరే! తెలుగు వారిక్కాదు గురించి తః తః గారి అభిప్రాయం:

    05/28/2024 5:52 pm

    అయ్యా దుర్గెంపూడివారూ, మీరుగూడా ముఖ్యులైన ‘మేనత్త, మేనమామ’ లను మరిచిపోయారండీ!

    నమస్కారాలతో
    తః తః

  10. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:

    05/28/2024 8:01 am

    మీరు అనువాదానికి ఎంచుకున్న ఈ ఉపన్యాసం అద్భుతంగా వుంది. మీ అనువాదం పూర్తి న్యాయం చేకూర్చింది.

« 1 ... 35 36 37 38 39 ... 1555 »