Comment navigation


15541

« 1 ... 33 34 35 36 37 ... 1555 »

  1. భ్రాంతి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    06/15/2024 4:53 pm

    పై వివరణకీ, ఈ కథకీ సంబంధం లేదు 🙁 -సాయి

    మరెందుకిచ్చారైతే?

  2. (నీ)వాళ్ళు గురించి Vijaya Karra గారి అభిప్రాయం:

    06/15/2024 1:01 pm

    హాలివుడ్ బాలివుడ్ సినిమాల ప్రభావం ఏమీ లేదండీ. వెటరన్స్ బెనిఫిట్స్ కోసం నేను పనిచేసే సంస్థ ద్వారా వాళ్ళ జీవితాలు కొంత తెలుసు. అలా అని ఈ రచన పైన వాటి ప్రభావం కూడా లేదు. ఇది నిత్యం వినే చదివే యుద్ధ వార్తల నుండి వచ్చిన – సృజనాత్మక స్వేచ్ఛ నుంచి వచ్చినదే. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కొద్దిగా తెలిసినంత మాత్రాన ఆ నడక నాది కాదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్ బ్యాక్.

  3. నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి కిశోర్ తలపనేని గారి అభిప్రాయం:

    06/15/2024 6:22 am

    ధన్యవాదాలు హనుమంతరావు గారు.

    రాబోయే రస్సెల్ వ్యాసానువాదాలు మరింత సరళంగా ఉండేలా ప్రయత్నిస్తాను.

  4. భ్రాంతి గురించి సాయి గారి అభిప్రాయం:

    06/14/2024 11:50 pm

    భ్రమకీ, భ్రాంతికి మధ్య తేడా వుంది. కానీ, చాలామంది ఈ రెంటినీ ఒకేలా వాడేస్తూ వుంటారు.

    ఉన్నది లేనట్టుగా అనుకోవడం – భ్రాంతి
    లేనిది ఉన్నట్లుగా అనుకోవడం – భ్రమ

    ఉదాహరణ:
    తాడుని చూసి పామనుకోవడం – భ్రమ
    అక్కడ పాములేదు, తాడే పాములా అనిపించి భయపడడం భ్రమ.

    ఇంట్లో తండ్రో, తల్లో పోతే వాళ్ళింకా బ్రతుకున్నట్లుగా అనుకుంటూ మాట్లాడ్డం, ప్రవర్తించడం– భ్రాంతి.
    వ్యక్తులు లేరు, అయినా వారున్నట్లు నమ్మకంగా మసలడం భ్రాంతి.

    పాత దేవదాసు సినిమాలో పాటొకటుంది — అంతా భ్రాంతియేనా, జీవితానా వెలుగింతేనా–అని.
    [ఆ సందర్భానికి ఎంత బాగా రాసారో]

    పై వివరణకీ, ఈ కథకీ సంబంధం లేదు 🙁

  5. రాగలహరి: మోహనం గురించి N రాఘవేంద్రరావు, గారి అభిప్రాయం:

    06/14/2024 1:52 pm

    నాకు ఇప్పుడే ఈమాట గురించి తెలిసింది. లక్ష్మన్న గారికి ధన్యవాదాలు. ఇది ఇంకా వస్తున్నదా?

  6. బొమ్మలగూటిలో ఠాగూరు గురించి చంద్రలత గారి అభిప్రాయం:

    06/13/2024 2:42 am

    రాజేశ్వరి గారు ధన్యవాదాలండి.

  7. భ్రాంతి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    06/12/2024 1:50 pm

    “పాఠకుణ్ణి ఆలోచించేలా చెయ్యాలనుకుంటే కథకు “భ్రాంతి” అని పేరుపెట్టకూడదు.” -శివకుమార శర్మ

    2023 అక్టోబరు, నవంబరు నెలల్లోనేమో, ఈమాట పత్రికలోనే కొన్ని వింత సంఘటనలు జరిగాయి. ఒక రచయిత్రి ఆమెకు డెత్ త్రెట్స్ వచ్చాయని, అందువల్ల తన రచనను పత్రికనుండి తొలగించమని పత్రిక యాజమాన్యాన్ని కోరినందున, ఆమె రాసిన ‘నేత్రోన్మీలనం’ అన్న కథను ‘ఈమాట’ పత్రిక నుండి తొలగించారు. ఆ విషయం పత్రిక ఎడిటర్ చెప్పినందునే పాఠకులకు తెలిసింది. అతి తొందరగా తొలగించినందున, ఆ కథను కొందరు ఫేస్బుక్ సభ్యులు తప్ప, ఆ సభ్యత్వం లేనివారు చదవనే లేదు.

    చూస్తే, కథ శరీరం తొలగించబడింది. కాని కథ తల (శీర్షం) పత్రికలోనే ఉండిపోయింది. కథ రచయిత్రిగారిది కాని శీర్షిక కాదా? మరెవరికి చెందుతుందా హెడ్డింగ్? మొండెం తీసుకు పోటమేంటీ? హెడ్ మిగల్చటమేంటీ? ఏదో నేరస్థుడి తల నరికి పత్రిక కోటగుమ్మానికి వేలాడేసినట్టు ఇదేం చర్య!

    భేతాళ కథలు, ఎందరివో స్పూకీ రచనలు, మస్తుగా చదివిన నాకే ఇది వింతగా అనిపించింది. అందులోనూ నిజప్రపంచంలో అప్పుడది కొంత వింతైన సమయమే. అమెరికాలో ప్రజలు Halloween చేసుకుంటున్నారు. స్పానిష్ ప్రజలు ‘The day of dead’ చేసుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా చెట్ల మీద అస్థిపంజరాలు, ఉరేసిన శవాలు, డీమన్స్, ఏంజెల్స్ నిలువెత్తు బొమ్మలు వేలాడుతున్నయ్యి. నేనున్నఊళ్లో జనాలు రకరకాల కాస్ట్యూమ్స్ లో హోటల్, క్లబ్స్, రోడ్డుల మీదా హుషారుగా తిరుగుతున్నారు. అప్పుడే భారత దేశంలో దీపావళి సమయం అనుకుంటా, ప్రపంచంలో ఇండియన్లు ఎక్కడెక్కడివాళ్లూ కలిసి నరకాసురుడిని నరికి పోగులుపెట్టాలి. జోరుగా పటాసులు కాల్చాలి. ఇంచుమించు అప్పుడే రావణాసురుడి గడ్డిబొమ్మలు తయారుచేసి అతడి తలలు నరికి నిప్పెట్టాలి. అదే సమయంలో రాముడు లంకనుండి అయోధ్యకు తిరిగి రావాలి.

    ఇలాటి Fantasia festivals ఎన్నోదేశాల జనం హేండిల్ చేస్తున్న సమయంలో ‘ఈమాట’ పత్రికలో, ఆ తెలుగు కథ బాడీ రిమూవ్ చేసి తలకాయ ఉంచేశారు. ఆ రావణాసురుడి కుడ్యచిత్రం తలకాయ కింద ఎందరో వీరులు వారి అభిప్రాయాల కత్తులతో వీరోచితంగా పోరాడారు. అక్కడే ఏంటి, బలగాన్ని పోగేసుకుని, ఫేస్బుక్లోనూ, ఇతర పత్రికల్లోనూ పోరాడారు. కొద్దిగా నాకు నరకబడిన మెడూసా హెడ్, కారే రక్తం నుండి ఉద్భవించే వందలాది తేళ్ల, మండ్రగబ్బల భావన కలిగింది. మెడూసా హెడ్ ఎవరూ చూడకూడదే! చూసి ఎవరు శిలలై పోతారో ఏం పాడో! ఈ కథ రావణుడి హెడ్ కళ్లలోకి మామూలు మానవులు చూడొచ్చా లేదా? చూస్తే ఏ భూతం ఎవరికి పూనుతుందో?

    It is one hell of a weird time.

    పుస్తకాల షాపులో నిషేధించబడిన పుస్తకం మొత్తం తీసేస్తారు. ఉత్త అట్టలుంచరు. ఆర్ట్ మ్యూజియంలోనైనా అఫెన్సివ్ పెయింటింగ్ తో పాటు టైటిల్ కూడా తీసేస్తారు. అక్కడ ఇక ఎవరి ఒపీనియన్లు గోడమీద ఉండవు. తెలుగు మేగజీన్లు సిమెటరీలు కావు, పూలగుత్తులు ఉంచిపోటానికి. రోడ్ ఏక్సిడెంట్ సైట్‌లు కావు, రోడ్ సైడ్‌న ఒక సిలవ పాతి, ప్లాస్టిక్ పూలు పెట్టి పోటానికి.

    సో, ఎప్పటికైనా ఆ రచయిత్రి తన అద్భుతకథ మొండాన్ని పత్రికకు తిరిగి ఇస్తుందా? లేకుంటే ఆమె, తన తెలుగుకథ తలకాయను తీసుకుపోతుందా? పత్రికలో ఇప్పటికీ వేలాడే తలకు ఆ బాడీ మళ్లీ అతుక్కుంటుందా? లేదా? అన్నది -అది ఒక పెద్ద సస్పెన్స్ నాకు.

    కథ ప్రచురింపబడిన తరువాతి నెలలలో నేను క్యూరియాసిటీతో Heinrich Zimmer రాసిన ‘King and the corpse’ ఇంగ్లిష్‌లో చదివాను, అందులోని భేతాళ కథలు ఎంతో బాగున్నవి. Thomas Mann ‘The Transposed Heads’ 1940, ఇంగ్లిష్లో, స్పానిష్లో చదివాను. If two men who are friends chop off their own heads in a religious or jealous fervor, in a temple of Kali, and (inspite of the kindness of Kali, to give both men’s lives back,) the wife of one man sticks the heads on to the wrong body, who does the woman then belong to? Who is her husband from then on? అనే పాత భేతాళ ప్రశ్నను దాటి: ఆ స్త్రీ, తన భర్త, స్నేహితుడి తలలు మార్చటం, ఖంగారులో చేసిందా? లేక ఆమె ఆ పొరపాటు కావాలనే చేసిందా (ఆ నవలలో ఆమె పేరు సీత) అసలు ఒక స్త్రీ -ఒక మగవాని తలను/ముఖాన్ని ప్రేమిస్తుందా, లేక అతని శరీరాన్ని ప్రేమిస్తుందా? ఆమె ఎవరితో ఉండ గోరుతుంది? ఎవరితో నిజంగా భోగిస్తున్నది? ఎవరికి తన పిల్లవాడిని కన్నట్టు? మానవ శరీరంలో తల, శరీరాన్ని అదుపు చేస్తుందా, లేక శరీరమే తలను అదుపు చేస్తున్నదా అన్న విషయాలు ఊహిస్తూ – చిన్నదే ఐనా చక్కని నవల రాసి థామస్ మాన్ ఆనందించాడు. తన రచనను తిరిగి జిమ్మర్‌కే అంకితంలో అప్పజెప్పాడు.

    వారందరికి ఆ కథలు ఇండియా నుండి వచ్చినవేనని, చక్కగా తెలుసు. అందరూ శ్రద్థతో Sources ఇచ్చినారు. అందువలన భేతాళపంచవింశతి (50 B.C) ముఖ్యంగా ఐదుగురి పండితుల రచనలు సంస్కృతంలో ఉన్నవనీ, అవి అన్నీ ఏళ్ల మీద భారతీయ భాషల్లో విరివిగా అనువదింపబడినవనీ తెలిసింది. I now also know Thomas Mann’s novella ‘The Transposed Heads,’ 1940, Is based on an earlier version of Zimmer’s essay and that essay appeared in the festival volume in the honor of Dr. C.G. Jung’s sixtieth birthday. Berlin 1935.)

    తెలుగు దేశంలో, ‘దేవదాసు’ సినిమా (1953) విడుదలయ్యాక, నా ముందు తరం యువతులెందరో (including my mom) ఈ కింది పాట తరచుగా పాడగా నేను విన్నాను.
    “మనసున లేని వారి సేవలతో,
    మనసీయగ లేని నీపై మమతలతో,
    వంతలపాలై చింతిలుటే నా వంతా దేవదా!”
    అంటూ ఆ బెంగాలీ బాబు శరత్ -కథ లోని హీరోయిన్ ‘పారూ’ పాటని వారు పాడినారా! లేక వారి మనసులనే తెలియచేస్తున్నారా!

    ఈ కథ, ఆ కథ, ఏ కథైనా; “అంతా భ్రాంతియేనా?”

    ¡Es posible!

    -Lyla

  8. అద్వైతం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    06/09/2024 5:19 pm

    వేమూరి వారి వ్యాఖ్య చదివి:

    “I, too, dislike it: there are things that are important beyond all this fiddle.
    Reading it, however, with a perfect contempt for it, one discovers in
    it after all, a place for the genuine.”
    — “Poetry,” by Marianne Moore.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. భ్రాంతి గురించి శివకుమార శర్మ గారి అభిప్రాయం:

    06/06/2024 5:20 pm

    “భ్రాంతి” అని పేరుపెట్టడంతోనే రచయిత్రి పాఠకుణ్ణి చెయ్యి పట్టుకుని తన దారిలో తీసుకువెళ్లారు. “బిదు మా మధ్య కొత్త వ్యక్తేమి కాదు.”తో ఆపేసివుంటే అసలు బిదు పూర్తిగా సాధు కల్పిత పాత్రేమోనని పాఠకుడు ఆలోచిస్తాడు. కానీ, అదే పేరాలో ఉన్న “ఆంధ్ర యూనివర్సిటీలో పిజి మేమంతా కలిసే చదువుకున్నాం,” తరువాతి పేరాలోని “బిదు వాడి కోసం చాలా ఎంక్వైరీలు చేసి, చివరకు బెంగాల్ వెళ్ళిపోయింది” అన్న వాక్యాలు కథకుడి ద్వారా వెలువడడంవల్ల, ఆ అవకాశం లేదు; ఆమె అతని కల్పన కాదు. “బావా, అది మనిషి కాదురా” అన్న వాక్యం, పోనీ అతని బలాత్కారం, దాని తరువాత అతనే ఆమె శిరఛ్ఛేదం చెయ్యడంవల్ల ఆమె అలా మొండెంలాగా మాత్రమే అతనికి కనిపించి భయపెట్టడాన్ని సూచిస్తోంది అని అనుకుందామని అనుకుంటే, కథకుడు ఆమె బెంగాల్ వెళ్ళిపోవడం గూర్చి చెప్పాడు గనుక ఆమె బతికే ఉంది. బహుశా సాధు చేసిన బలాత్కారం అతన్నే పట్టి పీడిస్తున్నదని అనుకుందామంటే, ఆ పరిస్థితిలో ఈ ప్రపంచంలో మసలుతూ ఊపిరి పీల్చుకునే బిదు అతని గూర్చి ఎంక్వైరీలు చేయదు కదా? ఇది భ్రాంతి మాత్రమే అయితే, కనీసం ఈ పాఠకుడు అతనికి ఆ భ్రాంతి కలగడానికి వెనక కారణాలు కథలో కనిపిస్తాయని ఆశిస్తాడు. పాఠకుణ్ణి ఆలోచించేలా చెయ్యాలనుకుంటే కథకు “భ్రాంతి” అని పేరుపెట్టకూడదు.

  10. (నీ)వాళ్ళు గురించి Sreenivas Bandaa గారి అభిప్రాయం:

    06/05/2024 9:51 pm

    సెలవు నుంచి యూనిట్‌కి తిరిగి వెళ్తున్న సైనికుడి మనస్సులో, యుద్ధంలో తన బుల్లెట్లకి గురైన వాళ్ళ పట్ల ఉద్వేగభరితమైన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నట్లు రాయడం, నిస్సంశయంగా సృజనాత్మక స్వేచ్ఛ తప్ప, వాస్తవం మాత్రం కాదు. ఎన్నో హిందీ సినిమాల్లో ఈ విధంగా, సాయుధ దళాల సైనికులని ‘ఓవర్ డ్రమటైజ్’ చేసి చూపుతుంటే, ఆ నిర్మాతల/దర్శకుల అవగాహనా రాహిత్యానికి నవ్వూ కోపమూ వస్తాయి. పైగా, సైనికుల గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కూదా వీక్షకుల/పాఠకుల మీద రుద్దుతాయి.

    అలా అని సైనికులకి మృదుత్వం ఉండదనుకుంటే పొరపాటే. అది ఎక్కడ ప్రకటితమవాలో అక్కడే ప్రకటితమవుతుంది. ఎక్కడబడితే అక్కడ కాదు. సుశిక్షితుడైన ఒక సైనికుడు ఇలా పశ్చాత్తాపపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే, ఏ సైనికుడైనా యుద్ధంలో నిర్వర్తించేది తనకు అప్పజెప్పిన డ్యూటీ మాత్రమే. అందుకు దోహదపడేలా అతనిని మానసికంగానూ శారీరకంగానూ సిద్ధం చేస్తుంది, సైన్యంలో అందే శిక్షణ. ఆ శిక్షణ గురించీ, సైనికులు ఎదుర్కొనే పరిస్థితుల గురించీ సాధారణంగా బయట తెలియదు.

    వంట చేసేందుకు వంకాయలు తరుగుతూ, ‘అయ్యో, వీటికి నొప్పెడుతుందేమో’ అనుకుంటారా ఎవరైనా? అలా అనుకుని పశ్చాత్తాపపడడంవంటిదే ఈ కథ కూడా. రాయబోతున్న విషయం మీద పూర్తి అవగాహన లేకుంటే ఇటువంటి అవాస్తవికమైన కథనాలే వెలికొస్తాయి. ‘All Quite on The Western Front’ చూడండి వీలయితే.

« 1 ... 33 34 35 36 37 ... 1555 »