పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. నవంబర్ 2025 గురించి Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    11/02/2025 8:40 am

    “… మనకు ఆ ‘సామూహిక సంస్కారం’ ఇంకా అలవడలేదు” … అలా అన్నారా? ఎవరది 😀

  2. లోయ అంచుల్లో… గురించి Shaheen అభిప్రాయం:

    11/02/2025 8:31 am

    చాలా మంది రాతల్లో స్త్రీ కి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా రాస్తారు… సామాజిక మాధ్యమాల్లో కూడా ఎన్నో విషయాలు చెప్తారు తీరా వ్యక్తిగతంగా మాత్రం పురుషాధిక్యత చూపిస్తారు

    అలాంటి ఒక రచన,రచయిత అంతరంగం ఇలా నిలదీస్తే వాళ్ళు ఆచరణ మొదలెడతారు

    చక్కని భావ వ్యక్తీకరణ 👏👏👏👏

  3. తండ్రి గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    11/02/2025 7:13 am

    అనివార్యంగా తెగిపోతున్న బంధాలను నిలుపుకోలేని తనమా… ఉన్న బంధాలను ఆసాంతం అనుభవించాలన్న ఆరాటమా…

    అర్థం ఏమిటో కానీ… ఒక పొద్దుటి పూట “అతడి” సంవేదనల పరంపర ఎక్కడో వణుకు పుట్టించింది. పూడూరి వారి మార్క్ అంటే ఇదీ.

  4. లోయ అంచుల్లో… గురించి రమణమూర్తి అభిప్రాయం:

    11/02/2025 1:00 am

    (ఈ వాక్యం కథను పక్కదోవ పట్టించగలదనుకుంటున్నాను. దీనికి బదులు – ఎందుకలా రాగలిగాను? ఏ ఉద్దేశంతో? – అని చేర్చ వచ్చేమో. బందా)

    కథలో ఎడిటర్ల వ్యాఖ్యని ఎడిట్ చేయడం మర్చిపోయారా? 🙂
    [ఈ పొరపాటును మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. – సం.]

  5. భైరప్పగారి ఆత్మకథ ‘భిత్తి’ గురించి T subrahmanyam అభిప్రాయం:

    10/30/2025 7:48 am

    Tried to purchase one in Telugu or English versions but available nowhere. Can somebody guide me?

    [‘భిత్తి’కి తెలుగు అనువాదం ఇంకా రాలేదు. ఆంగ్లానువాదం, బెంగుళూరులోని పుస్తకాల అంగళ్ళలో దొరకవచ్చును. – సం.]

  6. పద్మవ్యూహం గురించి చిట్టత్తూరుమునిగోపాల్ అభిప్రాయం:

    10/28/2025 8:58 am

    మహాభారత కాలంలోకి… సుభద్ర గర్భశోకంలోకి… తీసుకువెళ్లి పడేసి ఊపిరి ఆడకుండా చేసి… నిజంగా కథ ముగిసినా ఇంకా వెలుపలికి రాలేకపోతున్నాను. జయమోహన్ గారి తమిళ మూలం ఎలా ఉందో కానీ- భాస్కర్ గారూ, మీ శైలి… ధర్మ సూత్రాలలోని డొల్లతనాన్ని ఎండగట్టి, సుభద్ర దుఃఖాన్ని గుండెలో కుప్పపోసింది. గ్రేట్…!

  7. పర్వ మున్నుడి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    10/25/2025 2:23 am

    వ్యాసులవారు దుఃఖపడటం అనేది వింతమాట. మూలంలో వ్యాసులవారు స్వయంగా తన తల్లి సత్యవతీమహాదేవితో గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, కులనాశనం కళ్ళతో చూడవలసిన దుర్యోగం నీకెందుకు వానప్రస్థం చేయమని చెప్పారు. ఆయనకు మనకున్న సకలశోకమోహాదివికారాలనూ అంటించటం అసహ్యం.

    ఆ బహుభర్తృత్వం అనే ఆచారం ఏదో భారతకాలం తరువాత వచ్చి ఉంటుంది.
    కుంతి చేసిన ఆలోచన అన్నమాట మూలభారతవిరుధ్ధం. కేవలం రచయిత కల్పన.

    కల్పన అనేది కథకూ పాత్రలకూ స్వభావవిరుద్ధమైన వికారాలను అంటించి ఆనందించడానికి కాదు. ఈధోరణి తప్పు. అసహ్యం.

    ఈవాముపక్ష జీలకర్రపక్ష మేతావులు భారతీయ వాంగ్మూలాన్ని అగౌరవపరచటనికి చేసె ఈచండాలాలను ఖండించవలసిందే.

  8. పర్వ మున్నుడి గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    10/23/2025 5:24 am

    స్త్రీ అందరికీ వుమ్మడి అనడంలో రచయిత అహంకారం ఏమీలేదు. ఇప్పటికి ఉత్తరభారతంలో ఘడ్వాల్ ప్రాంతంలో ఆ సంప్రదాయం కొనసాగుతూనే వున్నది. స్త్రీమూర్తి ప్రకృతిపరంగా శారీరకంగా మానసికంగా అనేకమందిని (పాండవులలాగా) హ్యాండిల్ చేయగలదు. అప్పటి పరిస్థితుల్లో అన్నదమ్ములను కలిపివుంచడానికి కుంతీ చేసిన ఆలోచన అది. ఏ విషమ స్థితికైనా స్త్రీ మరియు ధనం కారణమవుతాయని వ్యాసులవారు కూడా గ్రహించి వుంటారు. భీముల వారికి వున్న నాసొత్తు అన్న అహంకారం మిగతావారికి అట్టే లేకపోవడం గమనించతగ్గది.

  9. పర్వ మున్నుడి గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    10/23/2025 5:01 am

    పర్వ తెలుగు ట్రాన్సలేషన్ యెంతో బాగా చేశారు. మొదలుపెడితే ఒక పట్టాన వదలలేము. వ్యాసులవారి దుఃఖం (పుత్రుడు శుకుడి వలన) మనమే అనుభవించి చాలా వ్యధ పొందుతాం. చిన్న హెచ్చరిక పుస్తకం కొనేముందు పేజీలు తిరగవేయండి. ఒక పబ్లిషర్ వేసిన ప్రింట్ లో పేజీకి ఏభయి అక్షర దోషాలు వున్నాయి. తస్మాద్ జాగృత.

  10. భైరప్ప నవలలు — భారతీయ దర్శనాలు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    10/23/2025 4:38 am

    మీకు నమస్కృతులు. గొప్ప సాహిత్య౦ గల కన్నడ భాష నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకాలు చదివినపుడు గొప్ప సంతోషం కలుగుతుంది. అనువాదకుల పాత్ర చాలా రుచితో వున్నది. అందువలననే కాబోలు కన్నడ భాష ఎక్కువ సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకొన్నది. శ్రీనివాస్ గారికీ ఈమాట సంపాదకులకు కృతజ్ఞతలు.